భాషందం, భువనందం, బ్రతుకందం

Friday, April 13, 2007

ఇద్దరు మహానుభావులు, ఓ దురదృష్టవంతుడు

చాలా మంచి పట్టాలో రెండు, చేతిలో పెట్టుకొని, మూడు నెలలుగా ఉద్యోగం లేక, కొత్తగా ఏదో 'వీసా' వ్యనస్థలో ఉన్న లోపాలవల్ల కనీసం ఉద్యోగం వచ్చే అవకాశం కూడా లేనివాడిని దురదృష్టవంతుడనే అనాలి, కాని ఇది అలాంటి చిన్న చిన్న దురదృష్టాల గురించి కాదు లెండి. ఇవి ఇంకా 'పెద్ద' విషయాలు. జన్మానికోసారి లాంటివి.

నేను దక్షిణ 'సంయుక్త అమెరికా రాష్ట్రాల'లోనే అతి మంచిదైన 'గార్జియా ఇన్సటిట్యూట్ ఆఫ్ టెక్నాలెజి' లో చదివా. మొన్ననే క్రిస్మస్ కి అక్కడ నుండి బయటకు వచ్చా. నేను అక్కడ చాలా మంచి అనుభవాలను పొందాను అని అనవచ్చు.

నేనక్కడ ఉన్నప్పుడు గొప్ప వ్యక్తులు కొందరు మాటలాడడానికి వచ్చేవారు. మంచి కళాశాల, చాలా చురుకైన విధ్యార్థులు ఉంటారు కాబట్టి, ఉపన్యాసాలివ్వాలను కునే నాయకులు బాగా ఆకర్షితులయ్యేవారు. కాని నేనక్కడున్నప్పుడు చాలా గొప్పవారైతే ఎవరూ రాలేదు. నేనక్కడ నుంచి వచ్చేసిన తర్వాతి మూడు నెలల్లో ఇద్దరు చాలా గొప్ప వ్యక్తులు అక్కడికి వచ్చారు/రాబోతున్నారు.

అందులో ఒకరు 'ఆల్ గోర్'. గోరు గారు నేను అమితంగా ఆదరించే సమకాలికుల్లో(ఈ పదం జీవితంలో ఎప్పుడూ వాడతాననుకోలేదు చిన్నప్పుడు) ఒకరు. నేనో చిన్న తరహా వాతావరణవాదిని. ఆయన తీసిన 'ఓ కఠువు నిజం' (A bitter truth) సినిమా తట్టుకోలేనని చూడలేదనుకోండి. కాని రాష్ట్రపతి అవగలిగిన వ్యక్తి, ఇలా ఒక మహోత్తమ కార్యం (noble cause) కోసం పాటుపడడం ఎంతైనా గొప్పే. వచ్చే యాభై ఏళ్ళలో అంత అత్యవసరం కాకపోయునా, మన మననువల కాలానికి 'భూగోళ ఉడుకు' (Global warming) అతి పెద్ద సమస్య అవుతుందని నా అంచనా. జీవితంలో ఎప్పుడైనా ఒక సారి వెళ్ళవలసిన ఆయన ప్రసంగానికి వెళ్ళలేక పోతున్నా...

ఇక రెండో వ్యక్తి 'బరక్ ఒబామా'. మా పాఠశాలకు వస్తున్నారని తేలియగానే ఒబామాగారి గురించి వికీపీడియాలో చదివా ఒక సారి. అన్నట్టు ఒబామాగారు 2008 అమేరికా రాష్ట్రపతి ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. చెప్పుకోదగ్గ విషయం - ఈయన నల్లాయన. అలా అంటే ఎప్పుడూ కని పించే 'ఆఫ్రికన్ అమేరికన్' కూడా కాదు. ఈయని నాన్నగరు అచ్చంగా కెనియాలో పుట్టారు. కాని అమ్మ నిండు అమెరికను, అమ్మ-అయ్య అయితే రెండో ప్రపంచ యుధ్ధంలో కూడా పోరాడారంట. ఈయన యుక్త వయస్సులో (adolescence) ఎంత 'స్వజ్ఞాన క్షోభ' (identity crisis) అనుభవించేవరంటే, అది మరచి పోవడానికి మత్తు పదార్థాలు, మద్యం వాడేవారట ! అ స్థితి నుండి ఇప్పుడు రాష్ట్రపతి పోటీలో ఉన్నారంటే సామాన్య విషయం కాదుగా.. ఈయని ప్రచారసభకు కూడా వెళ్ళలేక పోతున్నా.

చెప్పాలంటే గొప్ప వ్యక్తులు ఇచ్చేడట్టు వేరేది స్ఫుర్తినీయలేదు. అసలే నాకు ప్రజాస్వామయం పై అపారమైన విశ్వాసం :)

ఛాలెంజి పదాలు (మీకు వీటి అర్థాలు తెలిసినచో దయచేసి చెప్పగలరు)
noble cause, living people, global warming, adolescence, identity crisis, challengee

Wednesday, April 11, 2007

కొత్త నిర్ణయం

నేనోకొత్త నిర్ణయం తీసుకుంటున్నా.
( అసలు చెప్పాలంటే, అది నిర్ణయం కాదు resolution. మన తెలుగు కొద్దిగా ఈకు. resolution ని తెలుగులో ఏమంటారో తెలియక నిర్ణయం అనేస్తున్నా. కనీసం decision అని ఎక్కువ మంది తెలుగు వారు తెగులులిష్ లోవాడినట్టు వాడ లేదు. ఎ వీవెన్ గారో resolution కి తెలుగు పదం చెప్పి పుణ్యం గట్టుకోవాలి. )

ఇంతకీ ఎప్పుడు చెబుతాడా అని మీరందరు ఎదురు చూస్తున్న ఆ నిర్ణయం ఏమీటంటే..
నేను నా ఆంగ్ల బ్లాగును పక్కన పెట్టి కొన్నాళ్ళు, మీరు ఈ నిమిషాన చదువుతున్న నా తెలుగు బ్లాగును పునరోగిద్దామని (అదే నండి రీడెవలప్పు చేద్దామని) నిర్ణయించు కున్నాను.

దీని వల్ల ఉపయోగాలు
1) నా ఆంగ్ల బ్లాగు ఎలాగూ ఎవరూ చదవట్లేదు :(
2) నా తెలుగు పునరోగిస్తుంది (అదే నండి రీడెవలప్పు అవుతుంది. మా తెలుగు పంతులు గారు
పునరోగం అనే మాట వింటే ఆయన గుండె ఒక్క క్షణం ఆగి మళ్ళి కొట్టుకుంటుంది).
3) కొత్త మిత్రులు పరిచయం అవుతారు.
4) తెలుగు టైపింగు 'రోగిస్తుంది' (అదే నండి డెవలప్పు అవుతుంది). మాటలో మాట (అదే నండి బైదిబై) నేను తెలుగు కీ-బోర్డు లేకపోయినా, డైరెక్ట్ ఇన్పుట్ చేస్తా... మాతృభాషను ఆంగ్ల లిపితో
ఎంగిలి చేయడం ఇష్టంలేక. అలా రాయడం ఎంత కష్టమో అన్నదాని గురించి వేరెప్పుడైనా ఓ టపా వేస్తాలెండి.
5) నా ఆంగ్ల బ్లాగును ఎవరూ ఎక్కడా లింకు చేయక పోయినా, మన తెలుగు సోదరులు కూడలి.ఆర్గ్ లో నాకు ఒ లంకె వేస్తారు.
6) పైన చెప్పిన కూడలి.ఆర్గ్ లో నా ఈ టపా వస్తుందో రాదో పరీక్ష చేయవచ్చు.(పరీక్ష స్పేల్లింగు గుర్తుందని మా తెలుగు మాస్టారు సంతోషిస్తారు :))

కృతజ్ఞతలు
1) సౌమ్యగారు ఆంగ్లంలో బ్లాగగలిగినా తెలుగులోనే బ్లాగి నాకు స్పూర్తినిచ్చారు.
(అరే... 'బ్లాగగలిగినా' కొత్త పదం మా తెలుగు మాస్టారు
చాలా సంతోషిస్తారు :) )
(బ్లాగి - వాగి పదానికి సంభందం లేదు :) agglutinative language కదండి మన్నించాలి)
2) లంకుతున్నందుకు కూడలి వారికి
3) స్పూర్తినిచ్చిన అనేక తెలుగు బ్లాగర్లకు

సహాయం
ఈ క్రింది పదములకు తెలుగు చేప్పగలరు
resolution, redevelop, స్పూర్తి = inspiration?, spellings, acknowledgments (as written in the beginning of books), 'by the by' or 'by the way'

ఆఖరి జోకు (హాస్యం? చతురోక్తి?)
redevelop కి అర్థం తప్పనిసరిగా చెప్పగలరు, ఎందు కంటే నేను రాజకీయాలలో చేరి దేశాన్ని పునరోగిద్దామనుకుంటున్నాను (సిక్/sic). కాబట్టి ఆ పదం శెలవిచ్చుకున్నాక, మీ అమూల్యమైన ఓటు ముద్రను నాకే వేయాలని గుర్తు పెట్టుకోండి.

Tuesday, February 27, 2007

భావ చింతన

"positive thinking" కి తెలుగు "భావ చింతన" అని భావించి ఆ టైటిల్ పెట్టాను.
తప్పైతే సరి చెప్పగలరు. అలానే "టైటిల్ " కి తెలుగు ఉంటే చెప్పగలరు.

వైజాసత్య గారు తమ బ్లాగు లో "మతం - ప్రభుత్వం" గురించి అభావంగా వ్రాసారు.
నేను వారానికి ఓకసారి హోంవర్కు లా భావ చింతన చేస్తూంటాను. అనాదర్శ ప్రపంచం లో భావంగా ఆలోచిస్తే నాలాంటి ఆదర్శ ప్రియులకు జీవనం కోద్దిగా తేలిక అవుతుంది. కాబట్టి అదే అంశం పై నా ఆలోచన ఏమిటంటే

మతం మంచితనాన్ని గుర్తుచేసే ఓ యంత్రం
ప్రభుత్వం మంచికి అవకాసమిచ్చే ఓ యంత్రాంగం


"positive thinking" అను ఘోష లో ఇది నా చిన్న బిందువు. మీ బిందువు మీరు సమర్పంచండి :)

Wednesday, November 22, 2006

సరదాగా

ఇవాళ తెలుగు లో వ్రాయాలని కోరిక పుట్టింది.
ఆంగ్లంలో వ్రాసాతుంటే, చాలా అనాహ్లాదకరంగా ఉంటుంది. తెలుగులో వ్రాసే ఆనందమే వేరు.
కాని వ్రాసేసరికి, తల ప్రాణం తోకకు వస్తుంది. చాలా సహనం, ఏకాగ్రతా అవసరం.
కొత్తలో ఆంగ్లంలో వ్రాయాలన్నా అలానే అనిపించేది. కాని, చెత్త చెత్త సాఫ్టవేరు ఉద్యోగాలు చేసి చేసి, అలవాటు అయి పోయింది. ఇప్పుడసలు మెరుపు వేగంతో టైపు చేస్తానంటే నమ్మండి. ఏదో ఒక రోజు తెలుగులో కూడా అదే వేగం వస్తుందన్న ఆశ. అప్పటి వరకు ఇదిగో ఇలాంటి చిన్నా చితకా పోస్టులతో సరి పెట్టాలి.
ఉద్యోగంలో చేరాక తెలుగు కీ బోర్డు స్టిక్కర్లు కొనుక్కోవాలి.
ఉంటా మరి.

Monday, November 14, 2005

ఒక మంచి అనుభవం

నేను జార్జియ టెక్ లొ స్టూడెంట్ ని.
మొన్నొక రొజు క్లాసుకు నడుచుకుంటూ వెళ్తూ, దారిలో ఒక సిగ్నలు కొసం ఆగాను. ఇంతలో ఒక నల్ల పెద్ద మనిషి వచ్చి ఇలా పలుకరించారు.

"నువ్వు కాలేజికి వెళుతున్నావా ?"
“అవును”
"డాక్టరు చదువుతున్నావా?"
“ఆ.. హూఁ.. అం.. <చూడ్డానికి కాస్త చదువు కున్నవారిలాగానే ఉన్నారు, కాబట్టి టెక్ స్కూల్ లో డాక్టరు చదువు ఉండదని తెలిసే ఉండొచ్చు, కాబట్టి డాక్టరేట్ అని ఉద్దేశమా? లేక పోతే నిజంగా డాక్టరనే ఉద్దెసమా? తెలియక నేను నాలుక చప్పరిచ్చాను> లేదు ఎం ఎస్సె”
<ఆయనకి ఎంఎస్ అంటె అర్ధం అయినట్లులేదు>
"ఆఁ నేను క్లినిక కి వెళ్ళినప్పుడు మీ వాళ్ళు చాలా కనపడతారు, అదే ఆసుపత్రుల్లో".
<హమ్మయ్య అయితే ఆసుపత్రుల్లో డాక్టరు అని ఉద్దేసం అన్నమాట>
“లేదు కంప్యూటర్ సైన్సు చదువుతున్నా”
"అవునా? (కొద్దిగా నిరాశగా... ఎంతయినా అమెరికలో డాక్టలంటె మోజుగా) ఎందు కంటె మీ వాళ్ళు చాలా బాగా చూసుకంటారు"
<మీ వాళ్ళు అంటె భారతీయులనా, పర్వా లేదు చాలా మంచి అభిప్రాయముందే>
“మేము సగం మంది డాక్టర్లు సగం మంది కంప్యూటర్ ఇంజనీర్లగా పనిచేస్తోంటాం”
"మంచిది, రెండు మంచివేగా" <నా సంతృప్తి కోసం అన్నట్టున్నారు>
నేను నవ్వుకున్నాను
"ఎన్ని సంవత్సరాలైనాయి? "
“ఇంకా రెండున్నాయి.”

(గమనించాల్సిన విషయం ఏమిటంటే.. అతను పెద్దగా చదవలేదు కాలేజికి వెళ్ళి ఉండరు.. కాబట్టి ఎం ఎస్ అంటె "కాలేజి" ఒక సారి పూర్తయి పోయిందని తెలిసి ఉండదు, కాబట్టి నాలుగేళ్ళ "కాలేజి" లో ఇన్కా రెండేళ్ళె ఉన్నాయనుకున్నారు)

"అవునా?" (ఉత్సాహంగా)
(పక్కనే ఉన్న వెరే నల్ల పెద్ద మనిషితో..)
"హి కెన మేక ఇట్.. ఐ యామ షూర్"
(ఆఫ్రికన్ అమేరిక్న్లు ఆటలలో రాణిస్తారుగాని పాపం చదువులో మామోలుగ కొద్దిగా వెనుక ఉంటారని గమనించాను, కాలేజి పూర్తి చేస్తె చాలా గర్వ కారణం అనుకుంట)
<వాళ్ళ అభిమానానికి నేను మురిసిపోతుంటె సిగ్నలు పడింది>
“తెంక్యూ సర్... ఐ విల్ మేక్ ఇట్” అంటూ వెనుకకి చూస్తూ రోడ్డు దాటుతుంటే
"జాగ్రత్తగా దాటు.."

అమెరికా లో ఇట్లాంటి సంఘటనలు పెద్దగా జరగవని బాధ పడుతుంటాను, ఎవరి పని వారిదఏ అన్నట్టు వుంటారు. అందుకే ఆ రోజు ఆయన చూపించిన ఆశక్తి చాలా ఆనంద పరిచింది. వారి కొసమయినా ఐ తింక్ ఐ విల్ మేక్ ఇట్ బిగ్.
నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం