భాషందం, భువనందం, బ్రతుకందం

Sunday, October 07, 2007

బుక్కులు

వైరు లెస్సు,
లిప్పు కిస్సు,
సెక్సి మిస్సు-
కామంగా చూడకు దేన్నీ!
సోది మయమేనోయ్ అన్నీ!

బీరు బుడ్డి,
మఱుగు దొడ్డి,
ఎఱువు చెడ్డి-
నీ వైపే చూస్తూ వుంటాయ్!
తమనింకా ఏస్‌కో మంటాయ్!

ఉచ్చమల్లి,
పచ్చ కిల్లి,
వెచ్చ బుల్లి-
కాదేదీ బ్లాగు కనర్హం!
ఔనౌను టపాలనర్ఘం!

ఉండాలోయ్ బ్లాగావేశం!
కానీవోయ్ నస నిర్దేశం!
దొరకవటోయ్ హిట్లశేషం!
నోరంటూ వుంటే మెక్కి,
బ్లాగుంటే వ్రాసీ!

బ్లాగ్లోకమొక మురికి వరద!
బ్లాగడమొక తీరని దురద!


బ్లాగ్బహిష్కరణ చేసుకోవాలనుకున్నా కానీ, ఆముదము తాగిన వాడికి విరేచనం వచ్చినట్లు సృజన శక్తి పేగుల్లో దట్టిగా నిండి వుంది. 'విసర్జన' చేస్తే కాస్త అంత్రానలము చల్లారుతుంది, తెలుగు సాహిత్యానికి తీరని నష్టమూ తప్పుతుందని ఈ టపా వేస్తున్నాను! ఇంకో సారి చదివి మరీ ఆస్వాదించిండి.

ఈ కవనశిఖరాన్ని అధిరోహించడానికీ, పూర్తిగా ఆస్వాదించడానికీ కొన్ని లంకెలు
మహాప్రస్థానం, శ్రీశ్రీ, హ గణం, బ్రౌణ్యం

11 comments:

  1. వార్నాయనోయ్ .. బాగా ముదిరింది .. కృష్ణదేవరాయలు గారు వింటున్నారా?
    పేరడీ మాత్రం అదిరిందిలే .. శ్రీశ్రీ కవిత్వానికి లాగానే నిఘంటువు చూస్తే గాని అర్ధం కాణి పదాలు బాగానే ఉపయోగించావు. :-))

    ReplyDelete
  2. నేనూ ముదిరిందనే అనుకున్నాను. పేరడీ చూడగానే నవ్వొచ్చింది. ఒకవైపు చలికాలం ప్రవేశిస్తూండగా హృదయభానుడేమిటీ ఇంతగా మండిపోతున్నాడు ... :))

    ReplyDelete
  3. రాకేశ్వరా! పేరడీ అదిరింది.మరిన్ని పేరడీలు వదులు....:)
    -నేనుసైతం

    ReplyDelete
  4. బాగా అందుకున్నారు.మహాప్రస్థానం ఆవేశం అలానే కొనసాగించారు, పేరడీలోనూ... :-)

    ReplyDelete
  5. అదిరింది గురూ..ఆన్‌కోర్..

    ReplyDelete
  6. గురూగారూ ఇరగతీసారు.
    మరీ అలా ఇరగతీసేసేరేటండీ...శ్రీశ్రీ గార్ని

    ReplyDelete
  7. భలే రాశావు :)
    >> ఆముదము తాగిన వాడికి విరేచనం వచ్చినట్లు సృజన శక్తి పేగుల్లో దట్టిగా నిండి వుంది. 'విసర్జన' చేస్తే కాస్త అంత్రానలము చల్లారుతుంది

    మాలాంటోళ్ళకు బ్లాగ్బద్దకం శానా ఎక్కువైపోయింది. ముక్కి ముక్కి నాలుగు ముక్కలు రాద్దం అంటే తీరికా, ఓపికా లేకపాయె. ఏం శేదాం అంటావ్.....(నువ్వేం చెయ్యద్దు బాబు అని సెప్మాక)

    ReplyDelete
  8. బ్లాగుంది! బ్లాగుంది!

    ఈ శ్రీ శ్రీ గేయం మీదా చాలా మంది పేరడి చేసారు.
    అలాండివన్ని ఒక చోట చేరితే బాగుంటుంది కదా?!

    ReplyDelete
  9. ఓవర్ ద టాప్...
    మీరు కానీండి :)

    ReplyDelete
  10. బ్లాద్బద్దకానికి మిల్క్ ఆఫ్ బ్లాగీషియా ఉదయాన్నే లేవగానే ఒక చెంచా పట్టించాలి :-)

    ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం