భాషందం, భువనందం, బ్రతుకందం

Friday, June 27, 2008

ಮಹಾ ಯೋಗಿ ವೇಮನ ರಸ್ತೆ - ఎందుకు ఏఁవిటీ ఎలా


యోగి వేమన గారి మీద టపా కాబట్టి ఈ టపా చదవడానికి మీకు వేమన ఖతి (ఫాంటు) అవసరం. దాన్ని ఇక్కడ నుండి దింపుకోగలరు.
బెంగుళూరులో మహా యోగి వేమన రస్తె అని ఒక రస్తె వున్నది. అది కోరమంగలం అనే మోస్టు హాపెనింగు ప్లెసులోఁ. అది ఎందుకుంది ఎలావుంది అన్నదాని మీద నా సిద్ధాంతం. మహా యోగి వేమన రస్తె అని చూసి మా బఘరోబ్లాస (బన్నేరుఘట్టా రోడ్డు బ్లాగర్ల సంఘం) మిత్రులు చాలా మంది సంతోషపడడం జరిగింది. అలానే వారు ఆ పేరు ఎలావచ్చింది అని అడగడం కూడా జరిగింది. వారి కోసం ఈ సమాధానం.

ఊరికే నాలుగు లైన్లలో సమాధానం ఇస్తే అది నా టపా ఎదుంకౌతుంది. అసలే, తెలుగు బాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం కౢప్తం దీనికి రెండు కారణాలున్నాయి.
౧) ఇందులో ఌ వుంటుంది. దాన్ని వ్రాయడం చాలా కష్టమవుతుంది కంప్యూటర్లలో. దాన్ని నాలా తాపత్రయ పడి వ్రాసినా అది సరిగా కనబడి చావదు.
౨) నాకెందుకో ఏదైనా కౢప్తంగా చెప్పాలంటే ఇష్టముండదు. నాకూ తెలియదు ఎందుకో.

కానీ మీకు చాదస్తం కాస్త ఎక్కువ అవడఁవో, లేదా మీకు అనుభవాహ్వానాత్మకత తక్కువవడఁవో లేదా తెలుగు భాషలో మీకు నచ్చని ఒకేఒక్క పదం నివిడి అయితేనో, లేదా ఌ మీ ఇష్టాక్షరమైతేనో, మీకు నా కౢప్త సమాధానం.
మహా యోగి వేమన రస్తె కి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, కోరమంగల రెడ్డిజన సంఘ వారు తెవికీ చదవలేదు కాబట్టి.


ఇంతకీ అసలు విషయానికొస్తే,
బెంగుళూరులో ఉత్తరం వైపు వెళితే, మన అనంతపురం వస్తుంది. వీళ్లు దాన్నే అనంతపుర అంటారు సిరిగన్నడంలోఁ. అలానే ఇక్కడి నుండి తూర్పు వేపు వెళితే మన కుప్పాం వస్తుంది. దీన్ని వీరు కుప్పావు, లేదా కుప్ప అని అనాలి సిరిగన్నడంలో, కానీ మామూలు కన్నడం లో దీన్ని కుప్పాం అనే అంటారు, పలకడం మాత్రం కుప్పామ్ అని పలుకుతారు. ఆగ్నేయం వైపు వెళితే, మీకు హోసూరు వస్తుంది. దీన్ని అరవంలో హోసూర్ అంటారు. తెలుగన్నడాల్లో హోసూరు అంటారు. అసలైతే సుందరతెలుఁగులో దీన్ని కొత్తూరు అనాలి. కానీ తెలుగులో హోసూరు అనే అంటారు. హోసూరులో కూడా తెలుగు జనాభా బాగా హెచ్చు. సుందరతెలుఁగులో పెచ్చు అనాలి, ప బదులు హ వస్తుంది సరికన్నడంలో కాబట్టి వారు హెచ్చు అంటారు. కానీ మూములు తెలుఁగులో హెచ్చు అనడం పర్వాలేదు.

అన్నట్టు నేను చాలా నాళ్ళ నుండి హ తెలుగు అక్షరమా లేదా సంస్కృతం నుండి తెచ్చుకున్నదా అని ఆలోచించసాగాను. కన్నడిగులకైతే కచ్చితంగా హ వుంది బాషలోఁ, కనీ నాకింత వఱకూ హ కలిగిన అచ్చ తెలుగు పదం ఒక్కటి కూడా కనబడలేదు. హవ్వ హవ్వ ఎంత అపచారం! హూఁ .. ఆలోచించకుండానే హవ్వ మఱియూ హూఁ అనుకుంటూ హెచ్చు తెలుగు పదాలు తగలనే తగిలాయనుకోండి. మీకు హవ్వ మఱియు హూఁ తప్ప వేరే ఏఁవైనా హ గలిగిన తెలుగుపదాలు కనబడితే చెప్పగలరు.

ఇంతకీ మనం ఎక్కడున్నాం హోసురులో గద. మొత్తానికి ఉత్తరాన అనంతపురం, తూర్పున కుప్పం, ఆగ్నేయాన హోసురు కలగడం వల్ల బెంగుళూరులోని తూర్పు, ఉత్తర, ఆగ్నేయ, దక్షిణ, ఈశాన్య, వాయువ్య దిక్కులలో తెలుగు జనాభా చాలా ఎక్కువ. వెనకటికి రాయలసీమ నుండి ఇక్కడికి చాలా మంది వచ్చి స్థిరపడ్డారు. వారి కిప్పుడు తెలుగు వచ్చుగాని, మాట్లాడితే మీలాంటి వారికి కోపం వస్తుంది. నా మాతృభాషని వీడిట్లా హింసిస్తున్నాడేంటని. కానీ వారిది కూడా అది మాతృభాషని మరువకూడదు మీరు. ఇప్పటికీ ఇక్కడ తెలుగు వారమంటే, రెడ్డవరా, నాయిడవరా అని అడుగుతారు. దానికి మీరు బేరవరం అని సమాధానం చెప్పవచ్చు. లేదా సాఫ్టుబేరవరం అనైనాఁ జెప్పవచ్చుఁ.

అందుకే ఇక్కడ పేర్లు వేంకట రెడ్డి నగర, ఆలపాటి వేంకయ్య రస్తె, రామలింగారావు ఉద్యానవన వంటివి తఱచుగా వినబడతాయి. అలాంటి ఒక రస్తెనే మన మహా యోగి వేమన రస్తె.


ఇక ది మోస్టు హాపనింగ్ ప్లేస్ ఇన్ బెంగుళూరైన మన కోరమంగలకి తిరిగవస్తే, (అన్నట్టు దీన్ని కూడా అచ్చ తెనుగులో కోరమంగలం అనాలని గుర్తుపెట్టుకోగలరు) ఇక్కడ రెడ్లు జాస్తి. మన యోగి వేమన రస్తెలో రెడ్డి జన సంఘ (రెడ్డి జనాల సంఘం) కూడా వుంది. (ఇప్పుడు ఆ భవనం మఱియూ దాని చుట్టు ప్రాంగణం మొత్తం శతకోట్లలో వుంటింది ఖరీదు. కానీ నాలుగు తరాల క్రితం మన రెడ్డి జనరు సంఘ హాకినప్పుడు, ఆ భూఁవి వారికి ఊరకునే వచ్చినా వ్చచియుండవచ్చుఁ. )

ఇప్పటికే మీలో కొందరు పిల్లలు, నాకు తెలిసిపోయింది, నాకు తెలిసిపోయింది, నేను చెబుతా, నేను చెబుతా అని గాలిలో చేతులు ఆడిస్తున్నారు. అందరూ మీ అంత చూఱుకు గాదు గావట్టి నేనే మెల్లగా అందరికీ అర్థఁవయ్యేట్టు చెబుతా ఆ యోగి వేమన రస్తె ఎలా వచ్చిందో. యోగి వేమనగారు భోగిగావున్న నాళ్ళు ఆయన పేరు ... పేరూ... ఒక్క నిమిషం - అక్కడే ఉండడి నేను వెళ్ళి వికీ చూసి వస్తాను.. వెల్ ... హూఁ ... వికీ పెద్దగా ఉపయోగపడలేదు! ఏదో రెడ్డిగారు మొత్తానికి. కాబట్టి కోరమంగలంలోని అంత పెద్ద సంఘం వున్న మన రెడ్డి జనరు. వారు ఉన్న వీధికి తమ వాడైన, మన వాడైన యోగి వేమన గారి పేరు పెట్టుకున్నారు. ఔరా అద్భుతము గదా రాకేశ్వరుండి ప్రతిభ అనుకుంటున్నారా.
ఏదో నా దయా మీ ప్రాప్తం.. అసలే మొహవాటస్తుడని మఱీ పొగిడి వేయవద్దు. (మొహవాటం - ఇది సంస్కృతం నుండి వచ్చింది, లేదా వచ్చిన దానిఁవల్లే వుంది కాబట్టి నా 'హ ప్రశ్న'కు ఈ పదం సూచించరాదు).

మీ యోగి వేమన ప్రశ్నకు జవాబు దొరికిందని ఆశిస్తూ శలవు.
--------------------------------


ఇప్పుడే అందిన తాజా౨ వార్త. కోరమంగలంలోని హోసురు రోడ్డులో నున్న ఫోరం మాల్లో రెడి సినిమా రెండో సారి చూడడానికి వెళ్ళి, "సినిమాకి రెండువందలా నిష్టూరంగానూ" అనుకుంటూ నోరు తెఱుచుకుబెట్టి జనీలీయా పోస్టురుకేసి చూస్తూ సంతృప్తి పడుతున్న మా రిపోర్టర్ రానారె లైవ్ రిపోర్టింగ్... కాస్కోండి!

రానారె బెంగుళూరులో అతిప్రభావవంతులు (influential కి వచ్చిన తిప్పలు) మఱియు అతిసంపన్నులైన నాయిడురెడ్డివారిలో ఒకరిగా ఈ విషయమై మీ అభిప్రాయం ?

అతి సంపన్నులు - ఆ మాతు తుంబ సక్కగా సెప్పి యుండారు సదువరిగారు. మామూల్గా మా అంతవరిగె మనేల్లో (ఇండ్లల్లో) తినేదానికి కూడా సరిగా తిండి సిక్కేదిలేదు. హైహెచ్చు సినిమాకి ఇరడునూరు రూపాయిలంటావుండారు. సెప్పటిదేంటంటే, మన జగనన్నుండలే, ఆయన దగ్గర తుంబా కాసులు ఉండాయ్, కోరమంగలలో తుంబ జమీనూ కూడా ఉండాది అవరిగె, ఒక మాలు కూడా వుండాది అవరిగె ఈకడ. మిక్కిలిన రెడ్డి జనరదంతా కూడగట్టినా ఆయనలో అర్ధ కూడా జేయలేం. కాబట్టి ఆయన ఒక్కవన వల్ల మన రెడ్డవరిక్కడ సగటున ఇందాక మీరు అంటాండారే బాళా కాసవరని, అదన్న మాట. ఇక మన నాయిడురెడ్డి వారి బగ్గె సెప్పాలంటే, ..


రానారె గారు, ఇప్పటికే కార్యక్రమం నివిడి ఎక్కువైపోతుందని ప్రేక్షకులు అంటున్నారు. కాబట్టి మహా యోగి వేమన రస్తె విషయానికి వస్తే..

ఆ రస్తె ఇషయమై, వికీలో సూడంగా గొత్తయ్యిందేంటంటే,
వేమన చరిత్ర అస్పష్టంగా ఉంది. సుమారు 1650 - 1750 మధ్య కాలములో జీవించి ఉండవచ్చు. బహుళ ప్రచారంలో ఉన్న కథనం ప్రకరం వేమన వివరాలు ఇలా ఉన్నాయి. వేమన కొండవీటి రెడ్డిరాజవంశానికి చెందిన వాడు అని, గండి కోట దుర్గాధిపతులకు సంబంధం కలిగినవాడని అంటారు. కానీ ఇది నిజం కాదని పరిశోధకులు తెలియజేస్తున్నారు.కడప మండలంలోని ఒక చిన్న పల్లెలో మధ్య తరగతి కాపు కులస్థులకు జన్మించాడని అంటున్నారు. ఇతని జన్మస్థలం పేరు "మూగచింతపల్లె" కావచ్చును.
అన్నట్టు మీకో ఇషయం గొత్తా సదువుఱ్ఱిగారు మా మనె వుండాది ఆ రస్తె పక్కదల్లే, మేఁవు.. <బీఈఈప్>

విన్నారుగా కోరమంగలం నుండి మా రిపోర్టర్ రాకేశ్వర నాయిడు రెడ్డి లైవ్ రిపోర్ట్. క్లుప్తంగా చెప్పాలంటే,
మహా యోగి వేమన రస్తె కి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, కోరమంగల రెడ్డిజన సంఘ వారు తెవికీ చదవలేదు కాబట్టి.

11 comments:

  1. హహ..చిన్న రస్తే పేరు ఎందుకొచ్చిందో చెబుతూ, ఇంత లావు టపా లాగొచ్చని (అదీ ఆసక్తికరంగా) తెలియజెప్పిందుకు ಧನ್ಯವಾದಗಳು.

    ReplyDelete
  2. :)

    I hope this won't start another wiki edit war!

    ReplyDelete
  3. @ రాకేశ్వర రావు గారు

    అలానే బెంగళూరులో తెలుగు వారి పేర్లు ఉన్న వీధిలన్నిటిని పరిచయం చెయ్యాలని కోరుకుంటున్నాము :-)

    తెలుగు వారి చరిత్రకి సరైన ఆధారాలు లేవు... ఎందుకంటే ఏ ఒక్క రాజు ప్రభావము ఆంధ్ర ప్రదేశ్ అంతటా వ్యాపించి లేదు... దాని వల్ల మనకు మన చరిత్ర చెప్పే శిలాక్షరాలు కరువడ్డాయి.
    ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెప్పేసుకుంటున్నారు. :-)
    ఇంకా రాయలసీమ లోను, తెలంగాణ లోను రెడ్డి ని కాపు అంటారు. కాపు ఎంతటి సాధారణ(generic) పదమో, రెడ్డి కూడా అంతే. తరవాత తరవాత ఆ రెండు పదాలు వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు కులాలకి గుర్తింపుగా తయరయ్యాయి.
    రాయలసీమలో ఇప్పటికీ కాపు అంటే రెడ్డి అనే... ఇప్పటికీ చాలా మంది సెర్టిఫికేట్లలో కాపు అనే రాసుకుంటారు.

    ReplyDelete
  4. @ మహేశ్ గారు,
    ఆ పేరు ఎలా వచ్చిందో అన్నదాని మీద నా అభిప్రాయం అని గమనించగలరు !

    @ కిరణ్ గారు,
    వికీ రెండు పక్కల్నీ తటస్థంగా చెప్పింది కాబట్టి, ఎటువంటి సమస్యా రాకుడదు మఱి లెక్కప్రకారం.

    @ దిలీప్ గారు,
    బాగా చెప్పారు.
    వెనక రెడ్డి, కాపు, గొల్ల వంటి పేర్లని ఒకదానికి బదులు ఒకటి విరివా వాడేవారని నేను కూడా చదివాను. వ్యవసాయం చేసుకునే ఎవరినైనా పై పేర్లలో దేనితోనైనా పిలిచేవారని చదివాను.
    వారే అప్పుడప్పుడు సైన్యాలని పురమాయించి, రాజురికాలు చేశేవారని కూడా చదివాను.

    ReplyDelete
  5. ಕನ್ನಡ ಹೆಸರುಗಳು కన్నడంలోనే 'కొట్టి'వాళ్ళకు ఖుషీ చేస్తున్నట్లున్నారు. సరే ! ఇకముందు నాదీ మీ దారే.

    అసలు, మద్రాసు (చెన్నై)లాగే బెంగళూరు కూడా తెలుగువాళ్లు కట్టిన నగరమేనని చాలామందికి తెలియదు. దాని తొలి నిర్మాత కెంపెగౌడ తెలుగువాడే.

    ReplyDelete
  6. తాలబాసు గారూ .. తెలు"గౌడే"నా? :-)
    రేకేశా .. యువర్ క్రియేటివిటీ రాక్సు.

    ReplyDelete
  7. ఊ కొడుతూ చదువుకోగలిగే టపా (మీరు పక్కన కూర్చుని కథ చెపుతున్నట్టుంది, బావుంది)

    ReplyDelete
  8. కెంపెగౌడ తెలుగు వాడా! అరెరె, బెంగుళూరు రహస్యాలన్నీ బెంగుళూరు ఖాళీ చేసాక తెలుస్తున్నాయే!
    రాకేశ్వర్ గారు,
    బోల్డన్ని సంగతులు చెప్పారు. మీ పుణ్యమా అని బెంగుళూరంతా ఊహల్లో ఒక ట్రిప్పేసాను.(ఫోరమ్మాలుతో సహా)

    ReplyDelete
  9. రాకేశ్వరా,

    మీ తెలుగన్నడం అదిరింది. వేమన రెడ్డా లేక కాపా అన్నది చాలా కాలం నుంచి వున్న డిబేట్. వేమన పద్యాలలో రెండు వాదాల్నీ సమర్ధించగల పద్యాలు కనపడతాయి. వాటిల్లో ఏది ఆయన రాసిందో, ఏది విస్సన్నలు జోడించిందో మనకి తెలీదు. మన వేమనను మనకు పరిచయం చేసిన బ్రౌన్ దొరకే తెలియలేదు. గొప్పవారందరు ఏదో ఒక కులంలో, మతంలో, ప్రాంతంలోనే పుట్టినా, తమ ప్రభావాన్ని వాటికతీతంగా మొత్తం సమాజం పైన చూపుతారు. వేమన తెలుగువారందరు తల వంచి మొక్కాల్సిన మాన్యుడు.

    కెంపెగౌడ తెలుగు వాడా కాదా, అన్నదాంట్లో కూడా రెండు వైపులా సాక్ష్యాలు పెద్దగా లేవు. కాని కెంపెగౌడ విజయనగర చక్రవర్తుల క్రింద సామంతరాజని, వారిచ్చిన ధనంతోనే బెంగుళూరు నిర్మించాడని, బెంగుళూరుకి మొదటి అధికార భాష తెలుగని చాల చోట్ల చదివాను. కొన్ని ముఖ్యమైన శాసనాలు కూడా తెలుగులో ఉన్నట్లున్నాయి. పైగా కెంపెగౌడ స్వయంగా తెలుగులో "గంగా-గౌరీ సల్లాపము" అనే యక్ష గానం కూడా రాసాడు.

    ReplyDelete
  10. విషయము:వ్యంగ్యము :: 50:50. :)
    చాలా కాలం తరువాత మళ్లీ రాకేశ్వర్రావు మార్కు టపా చదివాను!

    ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం