భాగ్యద లక్ష్మీ బారమ్మ నమ్మమ్మ నీ (ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮ ನೀ) భాగ్యపు లక్ష్మీ రావమ్మ మాయమ్మ నూ
సౌభాగ్యద లక్ష్మీ బారమ్మ (ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ) సౌభాగ్యపు లక్ష్మీ రావమ్మ
హెజ్జెయ మేలె హెజ్జెయనిక్కుత (ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆ ಹೆಜ್ಜೆಯನಿಕ್ಕುತ) హజ్జ పైనొక హజ్జ వేస్తు
గెజ్జె కాల్గళ ధ్వనియ తోరుత (ಗೆಜ್ಜೆ ಕಾಲ್ಗಳ ಧ್ವನಿಯ ತೋರುತ) గజ్జెల కాళ్ల ధ్వని వినిపిస్తు
సజ్జన సాధు పూజెయ వేళెగె (ಸಜ್ಜನ ಸಾಧು ಪೂಜೆಯ ವೇಳೆಗೆ) సజ్జన సాధు పూజల వేళకి
మజ్జిగెయొళగిన బెణ్ణెయంతె (ಮಜ್ಜಿಗೆಯೊಳಗಿನ ಬೆಣ್ಣೆಯಂತೆ) మజ్జిగ లోపల వెన్నలాగ
కనకవృష్టియ కరెయుత బారె (ಕನಕವೃಷ್ಟಿಯ ಕರೆಯುತ ಬಾರೆ) కనకవృష్టిని పిలుస్తు రావె
మనకె మానవ సిద్ధియ తోరె (ಮನಕೆ ಮಾನವ ಸಿದ್ಧಿಯ ತೋರೆ) మనసుకు మానము సిద్ధింప రావె
దినకర కోటి తేజది హొళెయువ (ದಿನಕರ ಕೋಟಿ ತೇಜದಿ ಹೊಳೆಯುವ) దినకర కోటి తేజమున మెఱయు
జనకరాయన కుమారి బేగ (ಜನಕರಾಯನ ಕುಮಾರಿ ಬೇಗ) జనకరాయుని కుమారి బేగ
అత్తిత్తగలదె భక్తర మనెయలి (ಅತ್ತಿತ್ತಲಗದೆ ಭಕ್ತರ ಮನೆಯಲಿ) ప్రక్కకు తొలగక భక్తుల యింటన
నిత్య మహోత్సవ నిత్య సుమంగలి (ನಿತ್ಯ ಮಹೋತ್ಸವ ನಿತ್ಯ ಸುಮಂಗಲಿ) నిత్య మహోత్సవ నిత్య సుమంగళి
సత్యవ తోరువ సాధు సజ్జనర (ಸತ್ಯವ ತೋರುವ ಸಾಧು ಸಜ್ಜನರ) సత్యముఁ జూపగ సాదు సజ్జనుల
చిత్తది హొళెయువ పుత్థళి బొంబె (ಚಿತ್ತದಿ ಹೊಳೆಯುವ ಪುತ್ಥಳಿ ಬೊಂಬೆ) చిత్తనఁ మెఱయుచు పుత్థడి బొమ్మ
సంఖ్యెయిల్లద భాగ్యవ కొట్టు (ಸಂಖ್ಯೆಯಿಲ್ಲದ ಭಾಗ್ಯವ ಕೊಟ್ಟು) సంఖ్యలేని భాగ్యమునిచ్చెడి
కంకణ కైయ తిరువుత బారె (ಕಂಕಣ ಕೈಯ ತಿರುವುತ ಬಾರೆ) కంకణము జేతఁ దిప్పుతు రావె
కుంకుమాంకిత పంకజలోచనె (ಕುಂಕುಮಾಂಕಿತ ಪಂಕಜಲೋಚನೆ) కుంకుమాంకిత పంకజలోచన
వెంకటరమణన బింకద రాణి (ವೆಂಕಟರಮಣನ ಬಿಂಕದ ರಾಣಿ) వేంకటకమణుని బింకపు రాణి
సక్కరె తుప్పద కాలువె హరిసి (ಸಕ್ಕರೆ ತುಪ್ಪದ ಕಾಲುವೆ ಹರಿಸಿ) చక్కెర నేతుల కాలువ పాఱగ
శుక్రవారద పూజెయ వేళెగె (ಶುಕ್ರವಾರದ ಪೂಜೆಯ ವೇಳೆಗೆ) శుక్రవారపు పూజల వేళకు
అక్కరెవుళ్ళ అళగిరి రంగన (ಅಕ್ಕರೆವುಳ್ಳ ಅಳಗಿರಿ ರಂಗನ) అక్కర యున్న అళగిరి రంగడు
చొక్క పురందర విఠ్ఠలన రాణి (ಚೊಕ್ಕ ಪುರಂದರ ವಿಠ್ಠಲನ ರಾಣಿ) చక్క పురందర విఠ్ఠలుని రాణి
సుబ్బలక్ష్మి (సీతారాముల కల్యాణము చూతము రారండి చందమునఁ)
భీమ సేన జోషి (హిందుస్థానీ బాణిలోఁ)
సుధా రఘునాథ
ఆడియో మాత్రమే
లంకెలు
౧) కన్నడ వికీ
౨) ఈమాట లిప్యంతరీకరణి
ధ్వనియ -> నాదవ( ఎం.యెస్ గారి పాటలో)
ReplyDeleteకరయుత -కరకొండి - తోడ్కొని?
కంకణకైయ -> కంకణపుజేయి - కంకణము ధరించినచేయి?
తుప్పద? - జేనుతుప్పద?
సంఖ్యె ఇల్లద - మితిలేని?
మనసుకు మానము సిద్ధింప రావె->అన్వయం చెప్పండి
@ ఊదం
ReplyDeleteధ్వనియ -> నాదవ( ఎం.యెస్ గారి పాటలో)
- అన్ని చోట్లా ధ్వనియ అని వుంది ఆవిడ పాటలో మాత్రం నాదవ అన్నారు, అలానే కొన్ని చోట్ల గజ్జెకాల్గళ పాదం హెజ్జయమేలె పాదం ముందు వస్తుంది. నేను ఇక్కడ మెజారిటీ విన్స్ సిద్ధాంతం వాడాను.
కరయుత -కరకొండి - తోడ్కొని?
- కన్నడంలో సాధారణంగా వస్తువులకు తొగొండి బా (తోడ్కొని రా). మనుషులకు కరెకొండిబా (పిలుచుకురా) అని వాడతారు. కరె అంటే పిలు అని. కనకవృష్టిని పిలుచుకుంటా రావే అని.
కంకణకైయ -> కంకణపుజేయి - కంకణము ధరించినచేయి?
- భాగ్యములిచ్చెడి కంకణాన్ని చేత దిప్పుకుంటూ (వయ్యారంగా) రావే. అని. పలకడానికి తేలికగావుంటుందని చ కి జ వాడాను.
తుప్పద? - జేనుతుప్పద?
- జేనుతుప్ప అంటే ఏంటో నాకు తెలియదు. తుప్ప అంటే మాత్రం నెయ్య.
సంఖ్యె ఇల్లద - మితిలేని?
- అవును మితిలేని. నేను ప్రాస పోకూడదని సంఖ వుంచేసాను.
మనసుకు మానము సిద్ధింప రావె->అన్వయం చెప్పండి
- ఈపాటికే మీకు అర్థమయ్యుండాలి నేను చేసింది విభక్తుల మార్పిడి మాత్రమేనని. కాబట్టి మీకు ఎంత అర్థమయ్యిందో నాకూ అంతే అర్థమయ్యింది. నేనుకోవడం మనసుకు గౌరవం లేదా ఆత్మాభిమానం సిద్ధింప రావే అని. దీనికంటే మంచి అన్వయం ఎవరైనా చెప్పగలిగితే బాగుంటుంది.
వీలైనన్ని తక్కువ మార్పులతో (కొన్ని పాదాలైతే యథాతథం) తెలుగులోకి అనువాదించడానికి ప్రయత్నించాను. అలానే గణాలలెక్క ప్రాస కూడా వీలైనంత వరకూ చెడకుండా చూశాను. కాబట్టి కొన్ని చోట్ల పదప్రయోగం వింతగా తోచవచ్చు.
This comment has been removed by the author.
ReplyDeleteరావుగారు,
ReplyDeleteమీరు భాగవతము బ్లాగులోని అరసున్నా సమస్యని కనిపెట్టి దానికి సరి అయిన పరిష్కారమును కూడా చూపినందుకు మిక్కిలి సంతసించితిని. మీరు చెప్పిన విధమిగా అర సున్నాను మార్చితిని. ఇక మీ అందం చూడటానికే కాదు వినటానికి కూడా అందముగా వున్నది.
భవదీయుదు,
మురళీ కృష్ణ
విశ్వామిత్రుల వ్యాఖ్య చూసి నేనూ శ్రద్ధగా విని, కొన్ని తేడాలు గమనించాను.
ReplyDeleteసుబ్బులక్ష్మి పాడిన మొదటి చరణంలో: "గెజ్జె కాల్గళ" బదులు "కాలిన"
మూడోచరణంలో: అత్తిత్తగ'ళ'దె భక్తర మనె'యొళు', ... నిత్యసుమంగ'ళ', ... సత్యవ తోరు'త'
చివరి చరణంలో: వి'ఠ'లన రాణి
భీంసేన్ జోషి పాడిన రెండో చరణంలో: మనకా మనెయ సిద్ధియ తోరె
నాలుగో చరణంలో: కుంకుమాంకి'తె' పంకజలోచనె, ... వెంకటరమణ'నె'
ఇక - 'జేను' అంటే 'తేనె'.
Thanks for sharing MSs' version.
ReplyDeleteగొంబె అంటే బొమ్మ అని అర్ధమా, బొంబె అంటేనా
Jai Bedi Anjaneya!!!!
ReplyDeleteHARE SRINIVASA !!!!
I just remembered some things I was taught about this song. Please accept my humble contribuitions.
Simple songs like this have been filled with tremendous shastra and meanings by the Dasaru’s. Any mistakes are solely mine !
bhAgyada lakShmI bArammA nammamma nI saubhAgyada lakShmI bArammA
Bhagya Lakshmi bArammA – O MahaLaksmi, Goddess of Fortune, Please come O Mother
nammamma nI saubhAgyada lakShmI bArammA – Our mother, you are the Goddess of infinite auspiciousness and fortune, O MahaLakshmi Please Come !
hejjaya mele hhejjeyanikkuta -
There is a lot of Shastra in this : The literal translation is “Keeping one foot on another come forward” Or a more sane translation would appear to be “Come to me putting steps”
But why has Dasa Sreshsta Purandara Dasaru chosen this style of expression; no word of his is futile. To understand this, we need to understand the circumstance of composing the song.
Since Purandara Dasaru is an Aproksha Gynani, the Lord showed him visions of his leelas from time to time. SRI Purandara Dasaru would immidiately burst out with devotion and compose a song.
The vision for this song is, puttu Sri Krishna or a child Sri Krishna is running around the house. Her mother Yashoda is chasing him around. Yashoda has a special amsha of MahaLaxmi else no one can touch Sri Krishna. Dasaru sees this vision and he notices one thing.
Yashoda places her feet or hejje(footstep) only where Sri Krishna’s hejje (footprint) is present. Dasaru immediately connects it with Shastra that Sri Hari and Sri MahaLaxmi are nitya aviyogi, they don’t have even a moment of separation. Sri MahaLaxmi will come only where her husband Sri Hari is honoured and respected. Sri MahaLaxmi is the ultimate wife. She blesses and bestows grace to people only when they worship/respect her husband Sri Krishna.
To view this in another angle; Sri MahaLaxmi is the Abhimani Devata for all the shastras, Vedas, Puranas, Itihasa etc. (Vidya Laxmi). The entire Shastras follow the footsteps of Sri Krishna.
HARI SARVOTHAMMA !!!! VAYU JEEVOTHAMMA !!!!
Dasaru sees Sri Krishna running towards him and sees Sri MahaLaxmi in Yashoda running towards him and composes this song.
So hejjaya mele hhejjeyanikkuta – means Sri MahaLaxmi places her hejje only on Sri Krishna’s hejje
I have a more detailed translation here . Please visit this link
http://srinivasa-kalyana.blogspot.com/2010/11/bhagyada-lakshmi-baraamma.html
Jai Bharateesha,
Hrishikesh
Hi,
ReplyDeleteNice Translation, I've posted a detailed translation at this link. Please visit it.
http://srinivasa-kalyana.blogspot.com/2010/11/bhagyada-lakshmi-baraamma.html
Jai Bharateesha,
Hrishikesh
యీ పాట తెలుగు ట్రాన్స్లేషన్ కూడా ఉందండీ..పాట పూర్తిగా గుర్తు లేదు, చాల చిన్నప్పుడు నేర్చుకున్నాను. గుర్తున్నంత వరకూ ఇలా..
ReplyDeleteసౌభాగ్య లక్ష్మీ రావమ్మా...అమ్మమ్మా నువు సౌ
భాగ్యాల లక్ష్మీ రావమ్మా..
గజ్జల సవ్వడి ఘల్లు ఘల్లు మన
ముజ్జగములను యేలెడి తల్లీ
సజ్జన సాధుల పూజలందుకొన
మజ్జిగ నెగసిన వెన్న విధమున..
లెక్కకు మిక్కిలి భాగ్యములిచ్చెడి
కంకణ కరముల శొభతొ రావే
కుంకుమాంకితె పంకజ లోచని
వెంకట రమణుని పట్టాపు రాణీ..
చక్కెర నెయ్యి కాళి విహారిణి
శుక్కుర వారపు పూజల వెళకె
అక్కర యున్న అళగిరి రాయని
చొక్క పురంధర విఠలుని రాణీ.
చక్కని పాటను గురించి ప్రస్తావించారు. భీంసేన్ గారి పాట విన్నాను. చాలా అద్భుతంగా ఉంది.
ReplyDelete