రంగము ౫
కూడలిలో చొఱవ బ్లాగరుతో అమెరికా బ్లాగర్ల సంఘం (అబ్లాస) పెద్దలైన హ్యారీ బ్లాగరు, వికీ బ్లాగరు, కొత్త జెర్సీ బ్లాగరు.
చొఱవ బ్లాగరు – నమస్కారం, బ్లాగర్లు సినిమా నిర్మాణ వ్యయాన్ని భరించడానికి ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు. ఆదర్శ నవ’తరం’గ సినిమా కాబట్టి, నిర్మతాలుగా మీరు దర్శకరచయితలకు పూర్తి స్వాతంత్రం ఇస్తారని అనుకున్నాం. కానీ ఒక రకంగా ఆలోచిస్తే, కష్టమొచ్చినా నష్టమోచ్చినా భరించేది మీరే కాబట్టి, కథ వినే హక్కు ఎంతైనా మీకుంది.
వికీ బ్లాగరు – మేము మీరనుకునేలా, కథని ఖూనీ చేసే నిర్మాతలు కామండి. మేము డబ్బు పెడతాము తప్ప, దానినుండి ఏ విధమైన ఆర్థిక లబ్ధినీ ఆశించము. సినిమా ఒక కళండి, దానిని వ్యాపారంగా మార్చి సొమ్ము చేసుకునేంత నీచానికి మేమింకా దిగజార లేదు.
చొఱవ బ్లాగరు – అమోఘం. ప్రవాసులై, మీ పిల్లలకు అఆఇఈ లు రాకపోయినా, మీ అర్ధాంగులు ఋౠఌౡ లు పలుకలేకపోయినా, మీరు మాత్రం తెలుగులోనే బ్లాగుతున్నారంటే, తెలుగు పట్ల మీకు గల అభిమానం, తెలుగు కళామతల్లి పై గౌరవం కొట్టొచ్చినట్లు తెలుస్తూనే వున్నాయి. ఇక కథ చెబుతా వినండి.. మన బ్లాగర్ల గుంపు ఒకటి ఉంటుంది, వారిని అనామిషుడు వేదిస్తూవుంటాడు, కూడలిలో కబుర్లు చెప్పుకుంటుంటే వచ్చి చిల్లర చిల్లర కమెంట్లు పెడుతూంటాడు ౬౬౬, ౯౯౯ వంటి పేర్లతోఁ. ...
...
....
అలా చివరకి ఇఱవై ఏళ్ల తరువత కలసిన మన బ్లాగు హీరోలనిద్దరినీ ఆ అనామిషుడు చంపేస్తాడు(బ్లాగుపరంగా). ఎడారిగా మారిన బ్లాగలోకాన్ని చూసి “ఇక నేనే ఏకైక బ్లాగర్ని” అని వికృతంగా ఒక నవ్వునవ్వుతాడు. అప్పుడే మొదటి సారిగా మనం వేవిన్ని అనామిషుడిగా చూపిస్తాం. ప్రేక్షకులు అఱ్ఱే బ్లాగుల వ్యాప్తికి ఇంత తోడ్పడ్డ వీవేనేనా ఆ అనామిషుడు అని నివ్వెర పోతారు. తెర పైన “ఇంకా వుంది” అని పడుతుంది.
కొత్త జెర్సీ బ్లాగరు – బాగుంది. చాలా బాగుంది కథ. ఈ సినిమాకి ఎంత ఖర్చవుతుందన్నారు.
చొఱవ బ్లాగరు – పది కోట్ల వఱకూ అవ్వొచ్చు.
కొత్త జెర్సీ బ్లాగరు – పది కోట్లంటే రెండున్నర మిలయన్ డాలర్లన్నమట. చిన్నమొత్తం కాదనుకోండి, అలా అని పెద్ద పెద్ద మొత్తం కూడా కాదు. సినిమా అనే ఆదర్శానికని ఆ మాత్రం ఖర్చు పెట్టగలము. కళ మూలమిదం జగత్ అని అననే అన్నారు ఆర్యులు.
చొఱవ బ్లాగరు – చిన్న మనవి... పది కోట్లంటే... పది కోట్ల డాలర్లని మా ఉద్దేశం, మీరు డాలర్లలో ఆలోచిస్తారుగా అందుకని మొత్తాన్ని డాలర్లలోనే చెప్పాను. ఏ హాలీవుడ్ చిత్రం తీసుకున్నా, కనీసం వంద మిలియన్లైనా ఖర్చు వుంటుందిగా. మన తెలుగు వారు ఎవ్వరికీ తీసిపోకూడదని, మనము ఆ స్థాయిలో చిత్రాలు తీయగలమని ప్రపంచానికి చాటి చెప్పడానికి.... అప్పటికీ మన ముగ్గరు హీరోలూ మన బ్లాగుమిత్రుల కోసమని చెప్పి తలా పది మిలియను డాలర్ల నామమాత్ర మొత్తానికే సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారు. ఇంక ఉన్న ఒకే ఒక్క అమ్మాయీ యాభై మిలియన్లు ఇస్తేనే చేస్తానంటుంది. కాబట్టి వ్యయంలో ౮౦ శాతం ముఖ్యతారాగణానికే ...
హ్యారీ బ్లాగరు – మేమన్నట్లు. డబ్బులు పెద్ద విషయం కాదు. అదీ అమెరికాలోని అతి సంపన్న వర్గం అయిన మన తెలుగువారికి అదో లెక్క కాదు. కానీ అంత పెద్ద మొత్తాని పెడుతున్నందుకు గాను, కథకి చిన్న చిన్న సూచనలు చేద్దామని.
చొఱవ బ్లాగరు – కథ ఇప్పటికే ఫ్రీజ్ చేసేసాం.
హ్యారీ బ్లాగరు – కథ ఫ్రీజైతేనేం? ఎండలో పెట్టండి అదే కఱుగుతుంది. అంటే మీకు కథ రాయడం రాదని కాదు. కానీ అమెరికాలో మన సినిమా సరిగా ఆడాలనే తపనతో కొన్ని చిన్న సూచనలంతే.
చొఱవ బ్లాగరు – చెప్పండి
హ్యారీ బ్లాగరు – మొన్న హ్యాపీడేస్ వచ్చింది కాదా. అది పెద్ద హిట్ కాబట్టి, ఇప్పటి ట్రెండ్ అంతా సూడెంట్ గ్యాంగులుగా నడుస్తుంది. కాబట్టి మన కథలో కూడా ఇద్దరు ముఖ్య హీరోల బదులు, ఒక నలుగురు అమ్మాయిలూ, నలుగురు అబ్బాయిలూ ఉన్న గ్యాంగ్ ఒకటి ఉండాలి.
చొఱవ బ్లాగరు – దాని దేఁవుందండి. కథని స్వల్పంగా మారిస్తే సరిపోతుంది.
హ్యారీ బ్లాగరు – అలానే నాలుగు ప్రేమకథలను నడిపించాలి. అందులో ఒకతను రాయలసీమ నుండి వస్తాడు. అతనికి పెద్ద ప్లాష్ బ్యాక్ ఉంటుంది.
చొఱవ బ్లాగరు – దాని దేఁవుంది. మన రానేరా పాత్రకి అది చాలా బాగా నప్పుతుంది.
హ్యారీ బ్లాగరు – తరువాత, ఇంకొకతను, దేశంలో నేడు చెలరేగుతున్న లంచం, బంధుప్రీతి వంటి సంఘవిద్రోహ శక్తులను రూపుమాపడానికి ఒక రహస్య వ్యవస్థ నడుపుతుండాలి.
చొఱవ బ్లాగరు – దానిదేఁవుందండి. మా పురాణ్ పాత్ర దానికి చాలా బాగా నప్పుతుంది.
హ్యారీ బ్లాగరు – ఇక మూడో హీరో చాలా లావుగా చాలా పొట్టిగా అందవిహీనంగా మనిషా గుండ్రాయా అన్నట్టు వుండాలి. చివరకు నిజమైన ప్రేమ గుడ్డిదని తన హీరోయిన్ గ్రహించడంచేత అతని ప్రేమ విజయవంతం అవ్వాలి.
చొఱవ బ్లాగరు – దాని దేఁవుంది. మా కేకేశ్వర పాత్ర దానికి చాలా బాగా నప్పుతుంది.
వికీ బ్లాగరు – కానీ అలాంటి ఆదర్శ ప్రేమను మన మాస్ ప్రేక్షకులు జీర్ణించుకోలేరు, కాబట్టి అతను ఆఖరికి తన మిత్రులను మీరన్న ఆ అనామిషుని దగ్గర నుండి కాపాడు కోవడానికి, ప్రాణాలు వదిలేస్తాడు.
చొఱవ బ్లాగరు – భళి భళి. సరిగ్గా సరిపోతాయి మీ సూచనలు.
వికీ బ్లాగరు – ఇక ఇది బ్లాగర్ల సినిమాలానే కాకుండ. అందరూ వీక్షించి ఆనందించేలా చిన్న చిన్న మార్పులు చేయాలి. బ్లాగర్ల బదులు కాలేజీ విద్యార్థులు ఉంటే చాలా బాగుంటుంది. రోజురోజుకీ దిగజారిపోతున్న ప్రవాసుల పిల్లల్లోని తెలుగు సినిమా పై అభిప్రాయాన్ని ఏమైనా మార్చాలంటే అలాంటి కథలూ అలాంటి సినిమాలూ ఎంతైనా అవసరం.
కొత్త జెర్సీ బ్లాగరు – అవును, ఇప్పటికే హ్యాపీ డేస్ వల్ల ఇక్కడి పిల్లలు, హైదరాబాదులో బీటెక్ చేయడానికి పరుగులు తీస్తున్నారు. తెలుగు నేర్చుకోవల్సిన అవసరమూ లేదు, అలానే ఎప్పుడూ చదవవలసిన అవసరమూ లేదు. నాలుగేళ్ళు అయ్యేసరికి చోకిరీ-నౌకరీ రెండూ వుంటాయి, ఇక్కడైతే అవన్నీ సాధించాడానికి తల ప్రాణం తోక్కు వస్తుంది అని ఆలోచిస్తున్నారు.
హ్యారీ బ్లాగరు – మా అన్నయ్య గారి అబ్బాయి హార్వాడు వదిలేసి ఖమ్మంలోని ఏదోఐటిలో చేరడం వల్ల మా అన్నకు కాలేజీ ఫీజుల రూపంలో లక్ష డాలర్లు అంటే దగ్గర దగ్గర నలభై లక్షల రూపాయలు కలసివచ్చాయి!
చొఱవ బ్లాగరు – మీరన్నది నిజం. యువ తరాల ఆలోచనల్లో మార్పులు తేవలన్నదే మా నవ’తరం’గం సినిమాల ఆశయం కూడాను.
వికీ బ్లాగరు - అయితే కథను ఇలా మారుద్దాం, కాలేజీ విద్యార్థుల గ్యాంగ్ ఒకటి ఉంటుంది. అందులో ఒకరికి రాయలసీమ కక్షలతో కూడుకున్న గతం ఉంటుంది. ఇంకొకతను కాలేజీలో విద్యార్థిగా ఉంటూనే, రహస్యంగా భ్రష్టాచారాలను రూపుమాపే వ్యవస్థను నడుపుతూవుంటాడు. ఇంకొక జంట ప్రేమ కథ వచ్చేసి, చిన్నప్పటి నుండీ మిత్రులైవుంటారు, అబ్బాయి అమ్మాయిని ప్రేమించినా, అమ్మాయి మాత్రం అందవిహీనంగా వున్న అతన్ని ప్రేమించలేక సీనియర్ ఒకతన్ని ప్రేమిస్తుంది, అదీ అబ్బాయి సహాయంతోనే. అబ్బాయి ఆ సీనియర్ తో ఫుట్బాల్ ఆడి గెలిచి, అమ్మయి మనసు చొరగొంటాడు. ఇక నాలుగో జంట కథేమో, వారి ప్రేమకు హైదరాబాదులో పెద్ద మాఫియా అధిపతైన అమ్మాయి తండ్రి ఒప్పుకోడు, కానీ అంతిమ విజయం ప్రేమలదే...
కొత్త జెర్సీ బ్లాగరు – బాగుంది కథ. ఒక్క కథతో మీరు సమరసింహా రెడ్డి వంటి అన్ని బాలకృష్ణ, చిరంజీవి సినిమాలూ, అన్ని శంకర్ సినిమాలూ, నువ్వే కావాలీ, హ్యాపీ డేస్ వంటి అమ్మమ్మలు సైతం చూసే యూత్ సినిమాలూ, పోకిరీ వంటి హింసాత్మక సినిమాలూ కలగలిపేశారు. సినిమా దురద వున్న ఏ తెలుగోడూ మన సినిమా చూడక మానడు.
హ్యారీ బ్లాగరు - కానీ ఈ కథకు వంద మిలయన్లు అవసరం ఉందా? ముందు ఒక మిలియన్ తో తీయండి, అది హిట్టయితే చూద్దాం.
చొఱవ బ్లాగరు– మిలియన్ అంటే నాలుగు కోట్లన్నమట. చిన్నమొత్తం కాదనుకోండి, అలా అని పెద్ద పెద్ద మొత్తం కూడా కాదు. మన భారీ కథకి ...
కొత్త జెర్సీ బ్లాగరు – మిలియన్ అంటే పది లక్షలు. పది లక్షల రూపాయలు చాలని మా ఉద్ధేశం. మీరు రూపయల్లో ఆలోచిస్తారని మొత్తాన్ని రూపాయల్లో చెప్పాము. ప్రస్తుతం అంతటితో తీయండి, అది విజయవంతమైతే చూద్దాం.
హ్యారీ బ్లాగరు – ఇదే మా ఆఖరి మాట.
వికీ బ్లాగరు – అవును. ఇదే మా ఆఖరి మాట.
అందరూ నిష్క్రమింతురు.
చొఱవ బ్లాగరు – డామిట్. కథ అడ్డం తిరిగింది!
కృతజ్ఞతలు
౧) తెలుగు బ్లాగర్ల సినిమా కథ యొక్క కథ - రంగము ౧
౨) తెలుగు బ్లాగర్ల సినిమా కథ యొక్క కథ - రంగము ౨
౩) తెలుగు బ్లాగర్ల సినిమా కథ యొక్క కథ - రంగము ౩
౪) తెలుగు బ్లాగర్ల సినిమా కథ యొక్క కథ - రంగము ౪
౫) తెలుగు బ్లాగర్ల సినిమా కథ యొక్క కథ - రంగము ౫
ప్రముఖ బ్లాగర్ల పేర్లు వాడుకొని వారినోట కోణంగి పులకులు పలికించినా పెద్ద మనసుతో టాపా ప్రచురణ మనఃస్ఫూర్తిగా వారు అంగీకరించినందుకు కృతజ్ఞడను. వీరిని ఈ విధంగా ప్రస్తుతించడం బ్లాగ్లోకంలో వారి ప్రాముఖ్యతకు నిదర్శనము మాత్రమే (ఉదా ఈ నాటకానికి నాయకుడు మఱియు ప్రతినాయకుడూ కూడా అయిన వీవెన్ పాత్ర)
ముఖ్య తారాగణ చదువరి, జ్యోతి, త్రివిక్రమ్, రానారె, ప్రవీణ్, రాకేశ్వర, వేంకట్ సిద్ధరెడ్డి, కొత్త పాళీ, వీవెన్, వైజాసత్య, విహారి, ఇస్మైల్
అలానే పేర్లు స్తుతింప ఇతర తారాగణానికి కూడా నా కృతజ్ఞతలు. రాఘవ, గిరి, బ్లాగేశ్వరుడు, ఊకదంపుడు, శ్రీరాం, స్వాతి, రాధిక, వెంకటరమణ, సీబీరావు, చావా కిరణ్, తాబాసు, పప్పు నాగరాజు
మూల కథ – అప్పుడెప్పుడో కూడలి కబుర్లలోఁ జరిగిన చర్చ.
ప్రత్యేక కృతజ్ఞతలు – బ్లాగులోకాన్ని ఎగతాళి చేసి వ్రాసినా, మమ్మల్ని దూషించకుండా, చాలా బాగుంది అని వ్యాఖ్యలు వదిలిన పాఠకమహాశయులకు సర్వదా ఋణపడివుంటాను.
అవును రాకేశ్.
ReplyDeleteఅప్పుడు అనుకున్న బ్లాగర్ల సినిమా కథ అందరూ మర్చిపోయారనుకున్నా. బావుంది. మూడో హీరోగా నవీన్ ఉంటా అన్నాడు కదా. మర్చిపోయావా.
నాలుగో హీరో నవీన్ :)
ReplyDeleteచాలా బాగుందండీ ప్రహసనం. ఇంకా పొడిగిస్తే బాగుండేది.
ReplyDeleteఅరే ఇది నేననుకొన్న ముగింపు కాదే. నేననుకొందేంటంటే..కథ ఓకే అయిపోయి సెట్స్ మీదకు వెళుతుందనగా ఒక పెద్ద బేంగ్..ఇంకో రెండు పేద్ద బేంగ్ లు. అంతే.. హ్యారీ బ్లాగరు ప్రత్యక్షం.
ReplyDelete"ఏంటి మీరు చేస్తున్న పనేంటి? ఈ కథంతా నాదే. మీరు దీన్ని నా టింగు లోనుండి కాపీ కొట్టుకొచ్చి సినిమా తీస్తారా? మీ మీద దాసరి నారాయణ రావుకు కంప్లైంట్ చేస్తా."
అన్ని భాగాలు బావున్నే. చివరి భాగం తొందరగా ముగించినట్టుంది.
-- విహారి
హేమిటీ.. విహారి గారు... దాసరి నారాయణ రావు గారికి మాత్రమె ఎందుకు complaint చేస్తారు?? అంటే అర్థం.. గతం లో 'కాగడా' అనే పత్రికలో వీరి మీద వచ్చిన టపాలు చదివారు అన్నమాట.. గుడ్
ReplyDeleteసో, అలా సుఖాంతమైందన్న మాట!
ReplyDeleteబాగుంది. ఒకసారి మొదలెట్టినతరువాత అన్ని టపాలూ ఒక్కసారిగా చదివేసాను...లేదు లేదు చదివించావ్!
ReplyDeleteఏదో మీ మంచి తనం కొద్దీ బాగుందంటున్నారు . ధన్యుడను . మున్ముందు ఇంకా బాగా రాయగలనని ఆశిస్తున్నాను.
ReplyDeleteఒక్కోటి ఎందుకులే, అన్ని భాగాలు టోకుగా చదువుదామని చూస్తే, ఒక బ్లాగులో వాడైన బాంబు పేలితే, పేలని బాంబులు diffuse చేసి ఇక్కడకు వచ్చేసరికి ఈ పొద్దు అయింది. ఒక తమిళ్ సినిమా లో, దర్శకుడు, కళాతపస్వి విశ్వనాథ్ ను విలన్ గా ఎంపిక చేశారు గతంలో. నావన్నీ స్వాత్విక వేషాలే కదా, విలన్ పాత్ర ఇస్తున్నారేమిటని, విశ్వనాథ్ అడిగితే, తమిళ్ దర్శకుడు, అవునండీ, మిమ్ములని విలన్ గా ఎవరూ ఊహించలేరు. అదే కథకు గొప్ప ట్విస్త్ అన్నాట్ట. కథ చివరి పార్ట్ లో TV సీరియల్ కు TRP పడిపొతున్నాయి కాబట్టి హడావుడిగా ముగించినట్లు, త్వరగా అవగొట్టేశారనిపించింది.
ReplyDelete@ రావు గారు,
ReplyDeleteనాకు ఈ కథని ప్రేక్షకులు ఎంతగా ఆశ్వాదిస్తారు అన్న దానికి ఒక అంచనా రాలేదు. నాకు వచ్చిన సూచనలన్నీ నివిడి కాస్త ఎక్కువైంది అనే అన్నారు. పైపెచ్చు ఇది నా మొదటి పూర్తిస్థాయి కల్పానిక సాహిత్యం. మరీ పెద్దది వ్రాయాలంటే నాకు సైతం కష్టమయ్యేది.
ఈ ప్రహసనాన్ని ముగించేటప్పుడు కూడా కావాలంటే పొడిగించుకోవటానికి వీలుగా వుండేడట్టు ముగించాను. కానీ ఇప్పుడు అలాంటి వ్రాయదలచుకోలేదు.
ప్రహసనాలు వ్రాస్తే పూర్తిగా కల్పిత పాత్రల మీద, మఱింత ఆరోగ్యకరమైన ప్రహసనాలు వ్రాయాలని ఆశయం.
రాకేశ్వర్లు గారు,కామెంటు మొదలుపెట్టటం,ఆపటం అవుతుంది నాపని...
ReplyDeleteఆశ్వాదిస్తారు....
నివిడి..........
కల్పానిక ....
వుండేడట్టు ...మీరూనా??:)
చదవేస్తే ఉన్న మతి పోతుందన్నట్టు. ఎంత ప్రయత్నిస్తే అన్ని తప్పులు జరుగుతున్నాయి. నా స్పెల్లింగు ఎంతైనా చాలా ఈకు లెండి.
ReplyDeleteచిన్నప్పుడు తెలుగులో తప్పుకో పావు మార్కు కోసేసేవారు. అలా నాకు ఒంద తప్పులుండడంతో డబ్భై ఐదుకు ఎక్కువ వచ్చేవి కావు. ;p
పైపెచ్చు చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తావు. అని మా తెలుగు పంతులు గారు మెచ్చుకునేవారు కూడా.
ReplyDeleteGodavari pulasa history
ReplyDeleteNice blog and nice theme
ReplyDeleteMust read why chiranjeevi became megastar?
Very Nice
ReplyDeleteLeora News