నాకు చిన్నప్పటినుండి ఒక చెడలవాటు. ఎవరైనా ఏదైనా చేయవద్దంటే నేను దాన్ని చేసి మఱీ ఎందుకు చేయకూడదో నిర్దారించుకుంటా. తెలుగు భాషలో నాకు నచ్చని ఏకైక పదం 'అదంతే'. కాబట్టి ఇవిగో మధ్య జగణం గల మూడు కూనలమ్మ పాదలు నాలుగు మీ కొఱకున్ కైఁ .
ఇప్పుడు చెప్పండి ఎందుకు వ్రాయకూడదోఁ? నాకైతే ఔనేమో నిజంగానే ఇలా వ్రాస్తే బాగుండదేఁవోనని పిస్తుంది. మీకేమనిపిస్తుంది?
హిమశిఖరాల పైన
మహనగరాల లోన
ఇలఁ కొలువైన దాన
ఓ కూనలమ్మ
పంట పొలాల పూత
వాడి హలాల చేత
పైడి వరాల ధాత
ఓ కూనలమ్మా
ఆ జగణంబు తోడి
ఈ జగడంబు లాడి
వ్రాయిఁ పదంబు వేడి
ఓ కూనలమ్మ
త.క - అన్నట్టు పొలాలు, హలాలు అంటే మీకేమైనా గుర్తొచ్చిందా?
Srisri: "polaalanannI halaala dunnI"
ReplyDeleteJust noticed that 'Palleturu' is available on the net. Srisri's song is towards the end of the first part in:
ReplyDeletehttp://www.telugutunnel.com/category/movies/old-movies/palletooru
వేరే పోలిక లేకుండా దానంత దాన్ని చూస్తే బావున్నట్టే ఉంది, అంత అభ్యంతర పెట్టాల్సిన విషయంకాదేమో.
ReplyDeleteపంట పొలాల పూత
వాడి హలాల చేత
దీన్నే .. పంట పొలముల పూత
వాడి హలముల చేత .. అని చదివితే .. మధ్యలో ఆ 'ము' దగ్గర ఒక ఊతం వస్తుంది పలకడంలో. నల యే కాదు, భ, స, గగ ఉపయోగించినా అలాగే వస్తుంది. ఎందుకో చెప్పు చూద్దాం.
ఆరుద్ర ఎందుకు వద్దన్నారనేది - ఆయన దాన్ని స్వయంగా పాడి చూపించిన విధానాన్ని బట్టి మాత్రమే తెలుస్తుంది. ఎక్కడో శ్రుతి తప్పకపోతే అంత పెద్దాయన వద్దనడు గదా ! ఆయన వద్దన్నది మనం రాసి "ఏంటి తప్పు ?" అంటే ఆయన ఎందుకు వద్దన్నాడో తెలిసే అవకాశం లేదు.
ReplyDeleteరెండోది - ఖండికలే తప్ప బృహత్ కథాకావ్యాలు లేని రోజుల్లో ఛందస్సు - అది మాత్రాచ్ఛందస్సైనా, గణచ్ఛందస్సైనా రాణించే అవకాశం లేదు.
తెలుగు కవిత - లయాత్మకత అని సినారే ప్రసంగం పుస్తకం గా వచ్చింది, వీలైతే చదవండి మీకు ఉపకరిస్తుంది. "విశాల" అంటూ మొదలు పేదితే కందం బానే ఉంటుందేమో అంటాడు.
ReplyDeleteమీరు చేసిన చమత్కారం ఏమంటే, జగనణికి ముందు లఘువుని కలుపుకొని పదం వేయటం
అందువల్ల విరుపు మారింది ..( శిఖరాల,నగరాల కొలువైన)
కాని ఇది పాడటానికి అంత సులువు కాదు ..
రానారే ఏమీ మాట్లాడలేదేమిటి?