భాషందం, భువనందం, బ్రతుకందం

Monday, July 21, 2008

తెలుగు బ్లాగర్ల సినిమా కథ యొక్క కథ - రంగము ౧

ఇది టాపా కాదు. ఇది కథ కాదు. ఇది సినిమా కాదు. ఇది ఒక ప్రహసనం!

గమనిక: ఈ కథలో వ్యక్తులూ, సందర్భాలూ, సంభాషణలూ అన్ని కేవలం కల్పితం. వాటిలో వేటితోనైనా మీకు నిజ జీవితంలో పోలికలు కనిపిస్తే అది కేవలం కాకతాళీయం కాకపోయినా అది నా కల్పనా శక్తి యొక్క గొప్పతనం మాత్రమేనని గమనించగలరు.

తెలుగు బ్లాగర్లకు కళాభిమానం ఎక్కువ. వారు అన్ని విషయాలలోనూ గొప్ప తనాన్ని కోరుకుంటారు. ఎంతో నాణ్యత వుంటేనే గానీ ఏ కళాఖండమూ వారి మెప్పు పొందలేదు. ఇప్పుడు వచ్చే మతి లేని సినిమాలకు తట్టుకోలేక, మంచి సినిమాలు కావాలంటే వారే సొంతంగా తీసుకోవాలి అని గ్రహించారు. ఆ ప్రయత్నంలో వారు పడ్డ అపసొపాల సారమే ఈ టపా క్షమించాలి, కథ అయ్యో కాదు కాదు ప్రహసనం!

అది ౨౦౦౮ వ సంవత్సరం, కూడలికి కొత్త లాంఛనాలు కలుపుకుంటూ పోయారు కూడలి కర్త వీవెన్. దానిలో భాగంగా కూడలి కబుర్లు పూర్తిగా వీడియో వెర్చుయల్ రియాలిటీ ఆధారిత చాట్ సౌకర్యంగా మార్చబడ్డది. అలా...

రంగము ౧

కూడలి కబుర్లలో ఒక సాయంత్రం ఒక సూపరు స్టార్ బ్లాగరు, ఒక వంద ఎక్ట్రా బ్లాగర్లూ (జూనియర్ ఆర్టిస్టు స్థాయి వారు) గుమిగూడారు అకారణంగా (అచ్చు మన సినిమాల్లో జరిగినట్లు). కాబట్టి సంభాషణతో తదేక మవ్వాలంటే మీరు, ఎంటీవోడితో పాటు ఒక వంద మంది ముక్కూ మొఖం తెలియని జూనియరు ఆర్టిస్టులను ఊహించుకోండి.

ఇక సంభాషణ ప్రారంభం.

గొప్ప బ్లాగరు: బడా బాబుల కాలం చెల్లిన ఈ రోజుల్లో కూడా ఎవరో పెద్ద పెద్ద నిర్మాతలు సినిమాలూ తీస్తారనుకోవడం, వాటి కోసం ఎదురు చూడడం వట్టి మూర్ఖత్వం. అంతర్జాలం వచ్చింది, దానితో పాటు సామాన్య మానవులకు ఎన్నో సుదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. ఉదాహరణకు, మనమందరం కలసి వికీపీడియా ఏర్పరచుకున్నాం. దాని వెనక పెద్ద వ్యాపార వ్యవస్థలూ లేవు, డబ్బున్నవారూ లేరు. సమాచారం కావలసినవారందరూ తమకి కావలసిన సమాచారాన్ని అక్కడ వ్రాస్తున్నారు, అందరూ అలా వ్రాయబట్టి ఈనాడు వికీపీడియా, శత కోట్లలో నిఖర లాభం వున్న గూగుల్ వంటి గూళ్ళకంటే కూడా ముందుకు దూసుకు పోయింది.

మిగిలిన వారందరూ : అవును నిజం.

గొప్ప బ్లాగరు : ఇక సినిమా గురించి చెప్పుకోవాలంటే...

అది ఒక కళ, దాన్నుండి సొమ్ము చేసుకోవాలనుకోవడం పెద్ద పాపం. కళను అమ్ముకోవడం పాపం అని శాస్త్రం చెబుతుంది. ఆలాంటి కళని స్వప్రయోజనాలకోసం అమ్ముకునేవారిని క్షమించరాదు. వారికి వ్యతిరేకంగా మనం సమ్మె లేపాలి, వారి సినిమాలని బహిష్కరించాలి. పోనీలే చిరంజీవి తనయుడు వున్నాడుగా అనుకుంటూ అలాంటి సినిమాలు చూడడం క్షమించరాని నేరం మఱియూ కళావారసత్వాన్ని పెంపొందించే పాపమే అవుతుంది.

మిగిలిన వారందరూ : అవును నిజం.

గొప్ప బ్లాగరు : దానికి నేనేమి ప్రతిపాదిస్తున్నానంటే...

మన బ్లాగర్లలో అనేక మంది ప్రతిభావంతులు వున్నారు. మనమందరం పూనుకొని కృతజ్ఞతలు అనే పదానికే వాత పెట్టి దాన్ని నెనర్లుగా మార్చేశాం. మనం తలచుకుంటే ఏదైనా చేయగలం. అంతటి ప్రతిభావంతులం కూడా భక్తికీ బక్తికీ తేడా తెలియని అలగా సినిమా జనం నుండి మనోరంజనం ఆశించడం మూర్ఖత్వం. మన బ్లాగర్లలో డబ్బున్నవాళ్లూ వున్నారు.

మిగిలిన వారందరూ : అవును ఉన్నారు

గొప్ప బ్లాగరు : సినిమాలోని సాంకేతిక విషయాలు తెలిసినవారున్నారు

మిగిలిన వారందరూ : అవును ఉన్నారు

గొప్ప బ్లాగరు : అందగాళ్లున్నారు

మిగిలిన వారందరూ : అవును ఉన్నారు

గొప్ప బ్లాగరు : ఇక అందగర్తెల విషయం నాకు తెలియదు. ఏ విషయానికావిషయం చెప్పుకుంటే, మన బ్లాగులోకంలో అందగర్తెలు పెద్దగా లేరనే చెప్పుకోవాలి. ఆ మాట కొస్తే ఆంధ్రాలోనే పెద్దగా అందమైన అమ్మయిలు లేరు.

మిగిలిన వారందరూ : అవును లేరు

గొప్ప బ్లాగరు : అందమైన అమ్మాయిలందర్ని వెనక పరశురాములవారు, తీసుకెళ్లి సముద్రాన్ని వెనక్కి నెట్టి, వారి కోసం పరశురామక్షేత్రమును సృష్టించి వారందరికీ ఆ భూలోక స్వర్గాన నివాసం కల్పించారు. అందుకే ఇప్పటికీ శోభన నుండి గోపిక వరకూ మనము అక్కడ నుండే తెచ్చుకున్నాము. మనఁవే కాదు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆదర్శాంగన (మోడల్) పద్మాలక్షి కూడా మలయాళీ అవ్వడం దీనికి ఋజు౨వు.

మిగిలిన వారందరూ : అవును నిజం.

గొప్ప బ్లాగరు : కానీ అలా అని మనం మలయాళీ అమ్మయిలను ఆశ్రయించలేం. మనమే ఎక్కడునుండైనా నటీమణులను తెచ్చుకోవాలి.

మిగిలిన వారందరూ : ఇప్పుడెలా?? అవును ఇప్పుడెలా??

గొప్ప బ్లాగరు : అది పెద్ద సమస్యకాదు. మన దేశాన నాటికలకున్న అనుపమాన చరిత్రను పరీక్షిస్తే మనకు కొట్టొచ్చేట్టు అర్థమయ్యేదేఁవిటంటే, అందమైన మగవాళ్లు స్త్రీల పాత్రలు కూడా వేయగలరు. స్త్రీల పాతలు స్త్రీల కంటే కొందరు మగవాళ్లకే బాగా నప్పుతాయి. అంతటి జగన్మోహనులు మన బ్లాగర్లలో కూడా వున్నారు .

మిగిలిన వారందరూ : అవును ఉన్నారు

గొప్ప బ్లాగరు : ఎవరు ఉన్నారు?

మిగిలిన వారందరూ : అవును ఎవరు ఉన్నారు ?

గొప్ప బ్లాగరు : మీకూ తెలియాదా? అది పెద్ద సమస్యకాదు. ఒకరి దస్తూరి చూసి వారు అందంగా వుంటారో లేదో ఎలా చెప్పాలనేది మన వేదాలలో వ్రాసి వుంది. వేదాలన్నీ ఆపోసన పట్టినవాడిగా నాకది పెద్ద సమస్యకాదు.

మిగిలిన వారందరూ : అవును మీకది పెద్ద సమస్య కాదు.

గొప్ప బ్లాగరు : నా లెక్కల ప్రకారం, రానేరా బ్లాగులో ఖతీ, కేకేశ్వర బ్లాగులో ఖతీ చూస్తే వారిద్దరూ చాలా అందంగా వుంటారని అనిపిస్తుంది. కాబట్టి వారిద్దరినీ మనము స్త్రీల పాత్రలు వేయమని అడగవచ్చు.

మిగిలిన వారందరూ : అవును అడగవచ్చు

గొప్ప బ్లాగరు : కానీ వారు నిరాకరిస్తేనో..

మిగిలిన వారందరూ : అవును నిరాకరిస్తేనో.

గొప్ప బ్లాగరు : హూఁ.. నిరాకరించకూడదు. ఎందుకు నిరాకరిస్తారు. మనము బ్రతికేదే నలుగురి కోసమూ. ఆ నలుగురూ లేనిదే, మన జీవితాలకు అర్థఁవే వుండదు. మన ఇష్టాయిష్టాలు భ్రమ మాత్రమే, నలుగురికీ కావలసినది చేయడమే మన ధర్మం. నలుగురూ పండించిన తిండి తింటూ, వారు కట్టిన మఱుగుదొడ్లలోనే దాని వికృతంగా మార్చి విసర్జిస్తూ, వారికి సంతృప్తినిచ్చేవి చేయకపోవడం దారుణం.

మిగిలిన వారందరూ : అవును దారుణం

గొప్ప బ్లాగరు : ఇక రచయితలంటారా, బ్లాగులలో కథలు రాసేవారికి కొదవ లేదు. వద్దన్నా కథలు వ్రాసి చదవమంటూ మన మీదకు తోయడం ఎప్పుడూ జరిగేదేగా. కాబట్టి రచయితలుగా మిగలిన వారందరూ పోటీ పడతారు.

మిగిలిన వారందరూ : అవును మిగిలిన వారందరూ!

గొప్ప బ్లాగరు : డబ్బుల విషయానికొస్తే.. ఇందాక మనం అనుకున్నట్టు కళకు డబ్బు వ్యతిరేకం. కాబట్టి ఈ సినిమా తీయడానికీ, నటించడానికీ, చూడడానికీ దేనికీ డబ్బులు తీసుకోకూడదు. డబ్బు తీసుకోవడం మహాపాపం, వారు కళామతల్లి సరస్వతీ దేవి ఆగ్రహానికి లోనవుతారు. వారి సంతతికి లెక్కలూ, అనెలెటికల్ రీజనింగ్ రాకుండా పోతాయ్, అలా అవడం చేత వారు మృదులాంతకకర్తలు కాలేరు! సాఫ్టువేరోడిని లేదా సాఫ్టువేరుదాన్ని కనని పాపానికి వారికి మృదులాంతక నరకం తప్పదు.

మిగిలిన వారందరూ : అవును నిజం. అలాంటి వాళ్లు మట్టికొట్టుకు పాతారు.

గొప్ప బ్లాగరు : ఇంకేఁవిటి ఆలస్యం, వెంటనే మన డబ్బుతో మన దర్శకరచయితలతో మన నటీనటులతో సినిమా తీద్దాం.

మిగిలిన వారందరూ : అవును వెంటనే సినిమా తీద్దాం. పదండి, పదండి.

తెలుగు బ్లాగర్ల సినిమా కథ యొక్క కథ - రంగము ౨

26 comments:

 1. చక్కగా మొదలయింది.

  మీరు వ్రాస్తే తరువాతి భాగాల కోసం ఎదురు చూస్తూ...

  ReplyDelete
 2. మిగిలిన వారందరూ : అవును, కేకే!!!

  ReplyDelete
 3. చాలా రుచికరంగా ఉంది. మిగతా వడ్డనలకై విస్తరి సిద్ధం.

  ReplyDelete
 4. మీరు కాని "గొప్ప బ్లాగరు" ఐతే మీ సినిమాలో హీరో వేషానికి నేను రెడీ. హ్హా హ్హా.
  మిగతా వాటికోసం ఇక్కడ వెయిటింగు..తొందరగా రాసెయ్యండెం..

  ReplyDelete
 5. మీ "గొప్ప బ్లాగరు"తో పోలికలు గల బ్లాగరు మృదులాంతకం, కఠినాంతకం అనే పదాలను వాడరు. :)
  అంతకమంటే మొత్తం అని అర్థం. (చూ: బ్రౌణ్యము)

  ReplyDelete
 6. Grrrrrrrrrrrrrr..

  ఆంధ్రాలొ అందమైన అమ్మాయిలు లేరా?? దారుణం. మీ గొప్ప బ్లాగరు అతని జూనియర్లకు కంటి పరీక్ష చేయించాలి...

  ReplyDelete
 7. idEmI bAlEdu. mIru chUDalEdu kAbaTTi lady bloggers andam gA vunDaru ani anEskunTE eTlA?? andani drAkshapaLLu pullana anukunnaTTu vundi.. :x :x :x :x :x

  ReplyDelete
 8. idEmI bAlEdu. mIru chUDalEdu kAbaTTi lady bloggers andam gA vunDaru ani anEskunTE eTlA?? andani drAkshapaLLu pullana anukunnaTTu vundi.. :x :x :x :x :x

  ReplyDelete
 9. అందం గురించి మీకు తెలీదు అందుకే రానెరా,కేకేశ్వర రావులను వాళ్ళ ఖతిని బట్టి అందంగా ఉంటారని డిసైడ్ ఆయ్యారా.. కానివ్వండి వాళ్ళతోనే సినిమా తిసుకోండి..

  ReplyDelete
 10. బాగు బాగు.
  ఇటువంటి సంభాషణలో ఎక్కడో నేణు పాల్గొన్నట్టు ఉందే???

  ReplyDelete
 11. కృతజ్ఞతలను "నెనర్లు" గా మార్చేశాము కదా.. మరిప్పుడు.. సినిమాకు సంబంధించిన అన్ని పదాలు మార్చేయాలి కదా?? లేకపోతే.. మిగితా సినిమాల ఫ్లోలో ఇదీ ఫాలో అయ్యిపోతుంది. మీరే ఆ పదాలను "కనుగొంటే" బాగుంటుందనిపిస్తుంది. ఏమంటారు??

  ReplyDelete
 12. :) baagu baagu

  ReplyDelete
 13. Andamaina ammaayilu Mumbai lo unTaru. ippuDu andaru sinima vaaLLoo akkaDi nunchea andamaina ammayilanu tecchukuntunnaru.

  ReplyDelete
 14. సుజాతగారు పొరబడ్డరు. ప్రస్తుత తెలుగు వెండి తెరకి అందమైన భామలు పరశురామక్షేత్రములో ఉత్పత్తి చేయబడుతున్నారు :)

  ReplyDelete
 15. మిగిలిన వారందరూ: అవును పరశురామక్షేత్రములో ఉత్పత్తి చేయబడుతున్నారు :)

  ReplyDelete
 16. ఒక "విపరీత" బ్లాగరి: ఈ సో కాల్డ్ అందమైన భామలని పరశురామ క్షేత్రాంగనలు అంటానికి అభ్యంతరం చెబుతున్నాను, పేర్లొద్దుగాని, ముందు తరం సినీ పరశురామ క్షేత్రాంగనల చరిత్ర చూస్తే, ఇప్పటి వారు, వామ భాగానికో , దక్షిణ భాగానికో కూడా సరి పోలరని ఈ చిక్కిశల్యమై యుగం గుర్తించాలి. వీళ్లని ఆ పేరుతో పిలవటం, యావత్తు పరశురామ క్షేత్రానికి, సాక్షాత్తూ పరశురామునికీ అవమానం ..ఖళ్ ఖళ్ ఖళ్ ...
  ఐనా త్రిలింగదేశ చిత్ర నిర్మాతలది చాలపెద్దమనసు .. నాయికది త్రిలింగ దేశం కాకుండా ఉంటే చాలు ..

  ReplyDelete
 17. ఊ.ద. హ హ హ .. మీరనది నిజం నిజం

  ReplyDelete
 18. ఇక్కడ అందరూ ఎవరినో సెటైర్ చేస్తున్నారు. ఆయనెవరో తెలియటం లేదు.
  చాలా నర్మగర్భంగా మాట్లాడుకొంటున్నారు.
  బహుసా నేనేమైనా కోడిగుడ్డుకు ఈకలు పీకుతున్నానా?
  బొల్లోజు బాబా

  ReplyDelete
 19. @ బాబా గారు
  గొప్ప బ్లాగరు అనేది ఒక వ్యక్తి కాదండి. ఒక బిరుదు.
  మీలా పెద్ద stature ఉన్న ఎవరైనా దానికి అర్హులే ;-)

  ReplyDelete
 20. ముందుతరం సినీ పరశురామ క్షేత్రాంగనలా? తెలుగు సినీ జగత్తులో మునుపు ఉన్నారా వీరు? నాకొక్కరూ గుర్తుకురానిదే.

  ReplyDelete
 21. రాకేశ్వర గారు,
  హతోస్మి హతోస్మి
  నా బాణం నాకే గురిపెట్టారా?
  నేనిక్కడకు రాలేదు, ఏకామెంటూ చెయ్యలేదు.
  నాకే పాపం తెలియదు.
  సరదాగా
  బొల్లోజు బాబా

  ReplyDelete
 22. @వికటకవి - నాకు తెలిసినవారు పద్మిని, రాగిణి సోదరీ మణులు, అటుపైన వారి వారసురాలు శోభన, దీప.
  అంబిక, రాధ కూడా అనుకుంటా .. లేక తమిళమో?

  ReplyDelete
 23. తాట వలిచావు బాసూ,
  డూడూ బసవన్నలు మన బ్లాగు లోకంలో తక్కువే, కానీ, సమస్యేమిటంటే ఎవరయినా పొరపాట్న మాటా తూలటం తక్కువ. అందువల్ల ఈ నోరున్న(?) వాళ్ళు చలామణీ అయిపోతున్నారే గానీ మీరన్నట్టు గొప్పబ్లాగరు(గా అనుకునేవాళ్ళల్లో)లలో సరుకేంటో జనాలకి తెలియంది కాదు.

  ReplyDelete
 24. "....సరుకేంటో జనాలకి తెలియంది కాదు."

  ఒక విషయం. తెలుగులో బ్లాగులు పెరగాలని కోరుకునేటప్పుడు, "సరుకు" వగైరా ప్రసక్తి తేకూడదు. మనసులో మాట చెప్పుకోవడానికే న్లాగులు. పాండిత్యాలు ప్రదర్శించడానికి కాదు. అలా ప్రదర్శించగోరేవారు ఏ విశ్వవిద్యాలయానికో వలసపోవడం మంచిది. సరుకు గట్రా నిబంధనలు పెడితే నూటికి 95 మంది ఏదో ఒక కోణం నుంచి disqualify అవుతారు. మనం తెలుగు బ్లాగావరణంలో ఒక Elite dictatorship ని స్థాపించడానికి పూనుకోకూడదు. ఎవరి సరుకు ఎంత అనేది ఆయా బ్లాగరుల అభిమాన పాఠకులకు వదిలేద్దాం. మనకిష్టం లేకపోతే చదవొద్దు. అంతే !

  ReplyDelete
 25. అవును ముమ్మాటికీ నిజం, సరుకు ప్రసక్తి తేకూడదు. తేకూడదంటే, తేవచ్చును కానీ, తెచ్చి ఏం ప్రయోజనంలేదు.
  బ్లాగనేది ఒక స్వాతంత్ర ప్రపంచం. ఇందులో ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు వ్రాసుకోవచ్చు. పాఠకులకూ రచయితకీ మధ్య ఎటుంటి సంపాదకీయ గోడలు లేని నూతన ప్రపంచం. దీనిని ఇలానే వుండనిద్దాం.

  ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం