భాషందం, భువనందం, బ్రతుకందం

Monday, November 17, 2008

బరాకేశ్వర అవతారం

ఉపోద్ఘాతం - చిన్నప్పుడు వినే వుంటారు, what makes a road broad? అని. అప్పటినుండీ మీకు ర ముందు వచ్చే బ యొక్కఁ బవరేఁవిటో అర్థమయ్యేవుంటుంది. నేను కూడా నా సంకుచిత మనస్తత్వం నుండి విశాల దృక్పదం ఏర్పరచుకోవాలని చెప్పి నా ర ముందు ఒక బ చేర్చుకుంటున్నాను. ఇంతకీ పాత రాకేశ్వరానికీ ఈ బరాకేశ్వరానికీ తేడా ఏంటంటారా? రాకేశ్వరం పార్వతీశంలాగా విదేశాలలో ఉన్నత విద్య చదువుకుని వెనక్కి వచ్చి ఇక్కడ ఇంటి కాడా కాళీగా కూర్చునే ఒక సాధారణ పాత్ర పేరు. సగటు కంచు పాత్ర లాగ వీరికి మ్రోత ఎక్కువ. ఇక బరాకేశ్వరమా, బరాకేశ్వరం నారాయణేశ్వరుల అవతారం. అలానే ఇతర మతస్తులు కలియుగంలో వారి కష్టాలు తీర్చడానికి వచ్చే దేవుడని ఎవరిని భావిస్తున్నారో వాడే ఈ బరాకేశ్వరం. నిఞ్జా అప్పులివ్వడం మీకు, వాటిని తీర్చడం ఈ ఆపద మొక్కుల బరాకేశ్వరానికీ అలవాటైపోయింది. ఇక నేను మిమ్మల్ని శిష్యులుగాను భక్తుల గాను చేరమని, మతం మార్చుకోమనీ, బలవంతంగా మతం మార్చడంగానీ చేయను, కనీసం మతం మారితే మీ కష్టాలు తీరతాయనీ చెప్పనూ. ఎందుకంటే నేను సృష్టించిన మీరు, నా వెంట బరాకపోతే, ఇంకవరివెంటఁ బోతారు.

అయితే మీ చెవినీ ఈ కంప్యూటర్ స్క్రీనుకు అంటి పెట్టండి,
మీకు అతి రహస్యమైన బరాఙ్మంత్రము చెబుతా.
ఓం చేఞ్జాయ నమః
క్రీం హోపాయ నమః

చేంజే సర్వస్వం. చేంజనంతం. చేంజమేయం. చేంజచింత్యం.
హోపజేయం. హోపచ్యుతం. హోపప్రమేయం. హోపనునిత్యం.

మారుతున్న కాలానికి
కాలుతున్న వ్యవస్థలుకి
వ్యాపిస్తున్న మార్పే ఈ బరాకేశ్వరం.

కమ్యూనిష్టులూ పోయారు
కాపిటలిష్టులూ పోయారు
పంచి ఇచ్చేవారు పోయారు
ఇచ్చింది మించి లాక్కునేవారు పోయారు

రేసిస్టులూ పోయారు
లిబరలిస్టులూ పోయారు
అల్పసంఖాకులు రాజ్యమేలేరు
విశాల దృక్పదులు ఆవుట్ సోర్సింగు ఆపారు

కంజ్యూమరిస్టుల దగ్గర డబ్బులేదు
ఎన్వియాన్మెంటలిష్టుల దగ్గర ఓపికలేదు
భూమినుండి లాక్కోవడానికి పెట్టుబడిలేదు
ఏసీనుండి బయటకు వచ్చే సత్తువా లేదు.

వసుధైక కుటంబమన్నారు
వీసా పాస్పోర్టు చూపించమన్నారు
ప్రపంచీకరణ నైసర్గికమంట
ప్రాణికి ప్రాణంటే మంట నైకర్గికమ్

మార్పుకోరేవారందఱూ మారిపోయారు.

పాలు విషమించిననాడు
నీరు కలుపుకోవడం సరుచితం
పొదుపు పనిచేయనినాడు
అప్పులు తెచ్చుకోని ఖర్చు పెట్టడం ఆదర్శం

సర్వమతాలు సర్వశాస్త్రాలు
సర్వసాంప్రదాయాలు సర్వవిద్యలూ
ఎందుకూ పనికి రాకుండా పోయనపుడు
సర్వత్రా కావాలి మార్పు

మార్పుకోసం వేడుకున్న మానవులు
మతం మఱచి వేడుకున్నారు
మార్పుకోసం ప్రాణాలిచ్చిన పుణ్యాత్ములు
మతమివ్వలేని స్వర్గాల్ని చేరుకున్నారు
మఱి మార్పేగద మన కొత్త మతం

బానిసత్వం నుండి స్వాతంత్రానికి మారాం
ఆశయం నుండి అసహాయతకూ మారాం
పంటతోటల నుండి ఐటీలకు మారాం
మలయమరుతాల నుండి విషవాయిలకూ మారాం

ఎన్నో మార్పులు వచ్చాయి
ఎన్నో మర్పులు ఆశిస్తున్నాం
వచ్చిన మార్పులు తెచ్చిన స్థితి ఇది
వచ్చే మార్పులు తెచ్చే స్థితి ఏమిటి
ఈ మార్పుల ప్రభావం మారుతుందా ?

మారుతుంది. అంతా మారుతుంది !
ప్రకృతి నియమాలన్నీ మారతాయి.
మీరు నాకు ఓటేస్తే అన్నీ మారతాయి.
నన్ను మీరు దైవంగా కొలుస్తే అన్నీ మారతాయి.

నేను అధికారంలోనికి వస్తే పై విలువ మారుస్తాను ౩.౧౪ నుండి ౩ కి
నేను అధికారంలోనికి వస్తే ఈ విలువ మారుస్తాను ౨.౧౭ నుండి ౨ కి
మీ వూరు చుట్టు తిరగడానికి పట్టే సమయం తగ్గిపోతుంది ఐదు శాతం
మీ ఋణాలకి కట్టాల్సిన వడ్డీ కూడా తగ్గిపోతుంది ఎన్నో రెట్లు

నాకు ఓటు వేసి చూడండి.
తస్సాదియ్యా మిమ్మల్నే ఒక బరాకేశ్వరం తయారు చేసి వదులుతాను.

29 comments:

 1. సంకోచిత మనస్తత్వం ??

  పన్ను పీకారుగా!!

  ReplyDelete
 2. బావుంది పన్ను, ఇక తెలుగు పేపర్లన్నీ ఈ పేరేవాడతాయేమో -
  ఇంతకి - పరుషం సరళమైందా? :)

  ReplyDelete
 3. Salutes Rakeshwara Rao Gaaru,
  I had all these feelings for months now. You have penned them down very well..

  Hats Off..

  ReplyDelete
 4. RaKeRa gaaru,

  I have been following Mr Howard Kurtz for 9 years now. He is not a biased guy. He does a weekly round up at CNN, on Media and it's coverage of contemporary events. He regularly slams Fox News(as we all know it's biased, just like MSNBC is).

  Please read the following: (It's embarassing)

  http://www.washingtonpost.com/wp-dyn/content/article/2008/11/16/AR2008111602374_pf.html

  ReplyDelete
 5. బరాకేశ్వరా .. బహు బరాక్ బహు బరాక్!
  @Kumar .. read the Kurtz story with interest. The Obama name is the hottest brand right now. By the time January 20th rolls around, the reality will settled down with the inevitability of the mid-winter snow. The media are just making a fast buck while they can. That said, I still think Obama can and will some institute some policy changes that will set this country on a better road.

  ReplyDelete
 6. పాళీ గారూ,
  నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తాను.
  ఒబామా పొలిటికల్లీ డివైడింగ్ ఫిగర్ కాదు (హిల్లరీ, బుష్ లాగా). అది తను గెలిచిన స్టేట్స్ ద్వారా ఇంకా నిరూపితమయ్యింది (నార్త్ కారొలినా, ఇండియానా, ఒహయొ, ఫ్లొరిడా, నెవాడా, కొలరాడొ, న్యూ మెక్సికో మొదలగునవి). తద్వారా తనకొచ్చిన పొలిటికల్ కాపిటల్ అపారమైనది, అది తొలకపోసుకునే(squander..forgive me if that is not the appropriate telugu word))తెలివి తక్కువ వాడు కాడు ఒబామా(unlike Bush who had 80+%approval ratings and had the most of the world behind him, in addition to his own nation).

  అలాగే తనని మొదటినుంచి గమనించిన వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది, తను liberal, conservative, red-state, blue-state extreme-left-wing, extreme-right-wingచట్రంలో బిగించబడని వ్యక్తి అని (తన గత ఓటింగ్ రికార్డ్ కాని, తను ఇప్పటివరకూ గడపిన రాజకీయ జీవితం లోని చర్యలు కాని, పై స్టేట్మెంట్ కి సత్య దూరం గా ఉన్నాయన్నది సత్యం అయినప్పటికీ, నా అభిప్రాయం ఏంటంటే, తను కావాలనే సౌత్ సైడ్ చికాగో ని ఎంచుకున్నాడు తన పొలిటికల్ కెరీర్ కోసం. 70% పొలిటికల్లి లిబరల్ డిస్త్రిక్ట్ లో ఉన్నప్పుడు లిబరల్ ఎజెండాని పుష్ చేయడం తప్ప ఆయనకు ఇంకో మార్గం లేదనుకుంటా, అందుకే తను నమ్మక పోయినప్పటికీ, కొంచెం క్రేజీ కారక్టర్స్ ని భరించాడని అనుకుంటున్నా..ఆ భరించడంలో భాగంగా ఆయన చేసినవి/చేయనివి నాకు కోపం తెప్పించే చేష్టలు ఉన్నాయనుకోండి).

  "అడాసిటీ ఆఫ్ హోప్" పుస్తకం తను ప్రసిడెంట్ గా రన్ అవుదామని నిర్ణయించుకున్నాక రాసాడు కాబట్టి, దాని గురించి నేనేమీ చెప్పలేను కాని, "డ్రీంస్ ఫ్రం మై ఫాదర్" చదువుతున్నప్పుడు, ఒక కామన్ సెన్స్ మనిషి కనిపించాడే తప్పితే, ఒక ఎజెండా తో విపరీతంగా ప్రభావితం(influence) కాబడ్డ ఒక ఐడియాలాగ్ కనబడలేదు నాకు.

  ఇప్పుడు తను, హిల్లరీ, మెక్ కెయిన్(ఫార్మర్ రైవల్స్)..(based on talks of Hillary being secratary of state, Today's one-on-one meeting between Obama and McCain)ఇంత తొందరగా కలసి పనిచేయాలని నిర్ణయించుకొని, ఇంత తొందరగా దగ్గరకు రావడం..నాకు సంతోషం కలిగించే విషయమే కాకుండా...నాకీ దేశం మీద ఉన్న అపారమైన భక్తినీ, ప్రేమనీ ఇంకొంచెం ఇనుమడింప చే సే విషయం. అలాగే అమెరికాకి కొంచెం మంచి రోజులు వస్తున్నాయేమోనన్న నా catuious optimism కి ఒక చిహ్నం.

  క్లుప్తంగా చెప్పాలంటే ఒబామా, రీగన్ లాగా 49 స్టేట్స్ గెలవకపోయినప్పటికీ, తను ఒక జెనరేషనల్ లీడర్ అవుతాడని బలంగా నమ్మడమే కాదు..ఆశిస్తున్నాను కూడా.

  Disclaimers: If anyone is suspecting that I am one of those senseless-brain-less cool-aid drinkers of Obama, I like tell them that I voted for Mc Cain. అంతే కాకుండా ఓ వారం రోజుల క్రింద నేను అబ్రకదబ్ర గారికి ఇక్కడ నేనిచ్చిన రెస్పాన్స్ చదివినా తెలుస్తుంది.నేను ఎవరికీ పంకాను కాదని.. అమెరికాకి తప్ప. https://www.blogger.com/comment.g?blogID=18944501&postID=5459596576674400909

  ReplyDelete
 7. @ kumar ..
  మీకు అభ్యంతరం లేకపోతే నాకో మెయిలు కొట్టండి.
  kottapali at gmail dot com

  ReplyDelete
 8. @ Motorolan
  తప్పు సరిచెప్పినందుకు ధన్యవాదాలు.
  మీ స్వామి భక్తి చూస్తే నాకు అపారమైన గౌరవం కలుగుతుంది (కంపెనీ పేరు పెట్టుకున్నందుకు)

  @ పూర్ణిమ గారు
  నెనర్లు

  @ ఊదం.
  కోపం తగ్గిందనా మీ ప్రశ్న. వంద నుండి తొంబైతొమ్మిదికి వచ్చింది.


  @కుమార్ గారు
  నా అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు పరిస్థితి ఎంత చెంఢాలంగా వుందంటే, నన్ను ప్రెసిడెంటును చేసినా పరిస్థితి మెఱుగుపడగలదు.
  భయపడిన జనాలకు, పర్వాలేదు అంత సరే, నేనున్నాను మీ కష్టాలు తీరుస్తాను అనే వాడిని దైవంగా పూజిస్తారు. ఏ మతంకైనా భయం మూలం. ఈ భయపడిన రోజుల్లో బరాకేశ్వరం దేవుఁడు.

  ఇంకో విధంగా చెప్పాలంటే, ఈయని బదులు హిల్లరీ వచ్చినా, మెకేయిన్ వచ్చినా పెద్ద తేడా వుండదు చివరికని. they are as good as their advisers.

  ReplyDelete
 9. రాకేష్, అది టైపోనా... ఇంకా భీకరమైన పన్ను అనుకున్నాను.
  You might have heard the phrase "He who hesitates... XXXXXXXXXXX", అలా అన్నమాట.

  ReplyDelete
 10. road broad అయినట్టు , నా narrow mind broad అయ్యిందని చెప్పనుద్ధేశం. He who hesitates ఎప్పుడూ వినలేదు.

  ReplyDelete
 11. బరాకేశ్వర, పరాకున నుంటిరేమొ! ఊదంగారి దృష్టి మీ కోబంపై కాదేమో!!
  అన్నట్టు ఆ కోబం ఏ విషయమయ్యుంటుందబ్బా!?

  ReplyDelete
 12. "నా అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు పరిస్థితి ఎంత చెంఢాలంగా వుందంటే, నన్ను ప్రెసిడెంటును చేసినా పరిస్థితి మెఱుగుపడగలదు. "
  ఎంత బాగా చెప్పారు. కాకపోతే, ఇప్పటి పరిస్తితులలో, బరాక్ అయినా ఎంతవరకు చేయగలడో, చూడాలి. ముందు ఎమైన చేయాలంటే, అందుకు రెపబ్లికన్స్ ఎంతవరకు సహకరిస్తారో చూడాలి. 1992 లో, health care reform చేద్దామన్న క్లింటన్ను, రెపబ్లికన్స్ ఎలా ఆడుకొన్నారో నాకు ఇంకా గుర్తు ఉంది. ఇప్పటి వరకు నాకు బరాక్ లో నచ్చినది ఏమిటి అంటే, తను election time లో మాట్లాడినవి మర్చిపోయినట్లు మాట్లాడటం లేదు. చూడాలి.

  ReplyDelete
 13. @ ఊదం గారు,
  నాకు భయం వేసింది మీరు పరుషం అని పెద్ద పదాలు వాడేసరికి, నా భయం నిజమైంది. మీ ప్రశ్న మరొక సారి అర్థమయ్యేడట్టు వేస్తే బాగుంటుంది.

  @ చదువరి గారు,
  నాకు బరాకు ఎందుకు వచ్చిందంటే, రోజూ ప్రొద్దుటే దేవుడి మొహం చూసినట్టు పేపర్ల నిండా బరాకొబామా పేరు చూడలేక.

  @ కృష్ణ గారు
  నాకు కూడా పాపం బరాకొబామా నిజంగా మార్పును నమ్మే వ్యక్తేనేమే అని అనిపిస్తుంది. నేను కూడా రాజకీయాల్లోకి వెళ్ళేముందు, ఆశావాదాన్ని నాలో జీర్ణించుకుంటాను (హిప్నాటిజం వాడి) :)

  ReplyDelete
 14. రారా గారు :-)

  మీ సమాధానాలు చూస్తుంటే మీరు నాకు మరీ నచ్చేస్తున్నారు సుమండీ!!

  ReplyDelete
 15. కొత్తపాళీ గారూ, చదువరి గారు క్లూలిచ్చినా .. మీరు మారు పలక లేదంటే అమెరికా ఎన్నికల మత్తు ఇంకా దిగలేదన్నమాట.

  కచటతపలుపరుషములగు
  వచింప గసడదబలగునువళిసరళములే
  రచన పరదేశ్యమౌటమ
  రచిరే,ఈ చిన్న మాట, రాకేశ్వరా!
  -------------------------
  @kumar గారు
  మీరు నాకు మరీ నచ్చేస్తున్నారు సుమండీ!!
  ---> తస్మాత్ జాగ్రత
  http://andam.blogspot.com/2008/04/blog-post.html

  ReplyDelete
 16. @ ఊదం గారు
  మీరు మీ అసలు ఊరూ పేరూ ఎందుకు అంత జాగ్రత్తగా దాచుకుంటున్నారో నాకు ఇప్పుడు అర్థమయ్యింది. మీరు ఇలా లింకులిచ్చి పరువు నష్టం కల్పించే నాలాంటి వారు, మీ మీద దావా వేయకుండా జాగ్రత్త అన్నమట !!
  ఇప్పుడే ప్రకటిస్తున్నాను ఊదం గారి ఊరూ పేరూ చిరునామా తెలియఁజేసిన వారికి ఒక టపా అంకితం ఇవ్వఁబడుతుంది.

  @ కుమార్ గారు,
  నేను మీరు ఇచ్చిన లంకె చదివాను. చాలా బాగా వ్రాసాడు, నేను జన్నంలిష్టు అయితే అచ్చు అదే వ్యాసం వ్రాసేవాణ్ణి, వ్యంగ్య కవినౌటచేఁ గవితలు వ్రాయవలసి వస్తుంది.
  అన్నట్టు నేనంటే ఇష్టమని అందరూ అంటరు, కానీ చాలా మంది నా బ్లాగు చదవడం మనేస్తారు రాను రాను :(

  ReplyDelete
 17. కుమార్ గారూ మీరు దిన్నెల బ్రదరేనా?
  హిల్లరీ, బుష్ లాగా ఒబామా పొలిటికల్లీ డివైడింగ్ ఫిగర్ కాదు ;-) హాహాహా that I would say is perspective. Ya..I certainly think Obama is non-partisan than Nacy Pelosi.
  బరాకేశ్వరా..ఈ మధ్య బరకట్లేదని ఇటు రావట్లేదు. వి స్టిల్ లవ్ యూ.

  ReplyDelete
 18. రవి వైజాసత్య గారూ,
  నేను మీ చేత గుర్తింపబడటం నాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా.

  దిన్నెల బ్రదర్..? అర్ధం కాలా..

  మిగత చోట్ల నా వ్యాఖ్యలు చదివితే, నేను మెక్ కెయిన్ కి వోటు వేసానని తెలిస్తే, మీరు నా గురించి ఏమనేవారో తెలీదు. ప్రైమరీ ల్లో వోటు వేయలేదు కాని, వేస్తే హిల్లరీ కే వెసేవాణ్ణి.

  నేను ..లేని మంగళి లాగా, ఈ సారి ఎలక్షన్స్ ప్రైమరీ ప్రాసెస్ మొదలవ్వక ముందు నుంచీ చాలా క్లోజ్ గా ఫాలో అయ్యా. దాంతో వచ్చిన తలనొప్పి నాకిది.

  Yes, it's a POV I agree, but I am talking about general perspective that has been created in an organized manner, both on Hillary and even Bush to some extent.
  అవును, గత ఇరవై సంవత్సరాలుగా టాక్ రేడియో, ఫార్ రైట్ వింగ్, ఓ పద్దతి ప్రకారం హిల్లరీ ని ఓ భూతం ప్రకారం చూపిస్తే, ఆవిడ పబ్లిక్ ఇమేజ్ డామేజ్ అవ్వక ఏమవుతుంది లెండి. దానికి తోడు, తనెప్పుడూ వార్మ్ గా కనబడాలని ప్రయత్నించలేదు(ద సో-కాల్డ్ హ్యుమనైజింగ్). ఎక్కడ టఫ్ గా లేక, కమాండర్-ఇన్-చీఫ్ గా కనపడకపోతే, అమెరికా వుమన్ కి ఓటు వేయదని ఆవిడ భయం. పైగా ఒబామా కంపెయిన్, ప్రైమరీ ల్లో తెలివిగా వాడిన రేస్ కార్డ్. నా ఉద్దేశంలో మొట్ట మొదట రేస్ కార్డ్ వాడింది, మన బ్రదర్ జెస్సీ జాక్సన్ కుమారుండు..ఆ వెధవ న్యూ హంప్షైర్ లో హిల్లరి కళ్ళ తడి పెట్టుకున్న మరుసటి రోజు, ఒబమా కాంపెయిన్ హెడ్క్వార్టర్స్ అయిన MSNBC లో, హిల్లరీ కత్రినా అప్పుడు ఏడవగా నేను చూడలేదు అంటా కారుకూతలు కూసాడు. అస్సలావిడ కళ్ళు తడి అయిన ప్రశ్నకీ, వీడి కత్రినా కి లింకు ఏంటో వాడికే తెలియాలి. డైరక్ట్ గ రేస్ ని డిస్కషన్ లోకి ఇంజక్ట్ చేయడమంటే క్లాసిక్ ఎగ్జాంపుల్ అది. కరక్టుగా సౌత్ కెరోలినా ప్రైమరీ ముందు..50+% ప్రైమరీ వోటర్స్(Dem) నల్ల వాళ్ళ స్టేట్. Except few journalists, no one picked it up. Most of them are swooning anyway..

  అయినా, Daly Kos, Moveon.Org లాంటి THUGS ప్రైమరీ ప్రాసెస్ ను(in some states-caucus) హైజాక్ చేస్తుంటే నిజమైన డెమొక్రసీ ఎక్కడ ఏడిచి చచ్చింది లెండి? అసలు మనదేశంలో ప్రైమరీ ప్రాసెస్ kinda wacky. I can go on for days, but I better stop here.

  But I have a question for you Ravi gaaru?

  మీరు ఇంకెక్కడో, జిందాల్/పాలిన్ 2012 జిందాబాద్ అన్నారు? సీరియస్ గా అన్నారా?
  అలాగే రిపబ్లికన్ పార్టీలో ఇప్పుడు రెండు వింగులు, ఒకటి పార్టీని మోడరేట్ వైపు(George Will, Peggy Noonan etc.,), Second wing like..రష్ లింబా, షాన్ హానిటీ ఇంకా రైట్ వెళ్ళమనీ.. ఏది కరక్టు అని మీరనుకుంటున్నారు? మీరు మొన్న జరిగిన RGA ఫాలో అయ్యారా? I was very impressed with Jindal. I was surprised with folks like Byron York though, who falls along with the second group I mentioned above.

  If you agree with the second wing..How do you think Republican Party will EVER win presidential elections in America after ceeding 90-95% black vote, 65-70% hispanic vote, 2/3s of young vote, 2/3s of metro-vote, 60%women vote. All they will have is senior vote. They still pray for some kind of re-incarnation of Reagan. I don't get it, when will they get over Reagan. During 70s Reagan impressed all the young folks..for next 30 years, they saved Republican party. Teh party has now lost 2/3-3/4s of 18-29 vote. I am afraid that the party lost a generation.

  It's looking really really gloomy for GOP. I for one, certainly do not want one party rule in America, esp Democrats..

  Later

  ReplyDelete
 19. పెళ్ళైతే ఇంతపెద్దపెద్ద కామెంట్లు రాయొచ్చన్న అంశం రవి వైజాసత్య గారి వల్ల వెలుగులోకి వచ్చినందుకు ఆనందం.:)

  ReplyDelete
 20. ఊ.దం గారి పేరు మధు. గతం లో వీరికి జిల్లా గ్రంధాలయం అనే బ్లాగు ఒకటి ఉన్నట్టు గుర్తు.

  ReplyDelete
 21. రాకేశ్వరా!

  పైన కందం లో రాకేశ్వరా అన్నపుడు గణభంగమైంది.
  మీరు ప్రస్తుతానికి కందాల మత్తులో లేనందు వల్ల పట్టుకోలేదు. :)
  వ్యావహారికం లో మీ పూర్తిపేరు వాడాలి , లేదా, మరిచితిరే అని మార్చి - శ్రీ రాకేశా అనాలి..
  నాకు రెండవదే బావుంది కాని,మరిచితిరే అనరాదేమో...
  సరె అది అలా ఉంచితే ..

  మీ బ్లాగ్ లో మీ బ్లాగ్ కే లంకె ఇచ్చి, మీ చేత పరువు నష్టం దావా వాజ్యానికి పిలిపింపబడటం అంటే ఆలోచించాల్సిన విషయమే.. ఆ రోజు సంభాషణలు ఇచ్చి ఉంటే ఏమి చేసేవారో ఈ పాటికి.

  భవదీయుడు
  ఊదం

  ReplyDelete
 22. మీరు స.హ చట్టపు కార్యకర్త యా? నాకు కాస్త సహాయము, కాస్త దిశానిర్దేశమూ కావాలి

  భవదీయుడు
  ఊదం

  ReplyDelete
 23. దిన్నెల కుమార్ అని ఇంకో పరిచయమున్న వ్యక్తి ఉన్నారు. ఆయననుకున్నాను. నేను ఆ వ్యాఖ్య చేసే ముందే మీరు మెకెయిన్ కు ఓటేశారని చదివాను. I personally think Sean Hannity is kicking himself for running stop hillary express and Rush Limbaugh for mobilizing obama voters during primaries. మనం చర్చించుకోవటానికి ఇది సరైన వేదిక కాదేమో నాకు ఈ మెయిల్ కొట్టండి (వి.వై.జెడ్.ఏ.ఎస్.ఏ.టి.వై.ఏ@జీమెయిల్)

  ReplyDelete
 24. Yes I knew that even before I posted my earlier comment. I wanted to leave an apology note to Rakeshwara Rao gaaru, which I obviously forgot to do.

  Here you go.Ra Ra gaaru..I apologize for using so much of your blog space for these things.

  But, I want you to know that I became a fan of your writing style..although I can't differentiate between Kandalu and Utpalamalalu...

  Looking more from you..

  ReplyDelete
 25. @ ఊదం గారు,
  సహ చట్టపు కార్యకర్త అంటే ఏఁవిటి నాకు అర్థం కాలేదు. మీరు ఎప్పుడు ఏమన్నా అందులో నాకు అర్థంకానిది ఏదోకటి వుంటుంది!

  @కుమార్ గారు,
  ఈ బ్లాగు మీ బ్లాగే అనుకోండి, మీకు తోచినవి ఇక్కడ మీరు మీ బ్లాగులో వ్రాసుకున్నట్టు వ్రాసుకోవచ్చు :)

  రాకేశ్వర

  ReplyDelete
 26. dear sir, please write u r posts in simple understandable languagr , previously i always wait for u r posts iam a great fan of u r post , but now iam simply afrad to see ur posts please resume to u r original posts , we cant under stand ur telugu atleast

  yours fans once upon a time
  sudhir chowdary balla

  ReplyDelete
 27. @ బళ్ళ సుధీర చౌదరి గారు,

  మీరు నా టపాలని ఆధరిస్తారని తెలియదు.
  నాకు సహజంగా మంచి వ్యాఖ్యలు ఎటువంటి వ్యాసాలకు వస్తున్నాయి అని చూసుకొని, లభించిన ప్రోత్సాహం బట్టి అలాంటి టపాలు ఎక్కువ వ్రాయడం చేస్తాను.

  మీరు ఇప్పుడ కొత్త ఫీడ్ బ్యాక్ ఇచ్చారు కాబట్టి, దీన్ని గుర్తుంచుకొని, కవితల-పద్యాల టపాల మోస్తరు కాస్త తగ్గించి, మిగిలినవాటిని కాస్త పెంచుతాను.

  భవదీయుడు
  రాకేశ్వరం

  ReplyDelete
 28. రాకేశ్వర,
  సహ చట్టపు కార్యకర్త = RTI Activist

  ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం