భాషందం, భువనందం, బ్రతుకందం

Monday, July 02, 2012

Rohtang


As we walk the pass of corpses
in search of worlds grand
The cold bites our bodies
and death lays its icy hand

As we relish the view
our throats are slit open
Rise from the dead we do
to quietly march on

Killing again, bearing again
the pass does not know
The spirit goes on
as bodies melt in snow

Stories have I heard
from innocent folklore
Of the world that lay beyond
where miracles are galore

Valleys full of golden geese
and cranes black and silvery
of Buddhas perfectly wise
Where our lord kisses our lady

Laughs begin in our gut
to shake the pillars of the sky
Envy, the gods know not
as they let our joys fly

All sense of me and mine
is lost in divine timeless bliss
But till then,
As we walk this pass of corpses
they seem but empty promises!

Sunday, July 01, 2012

కోతిసరసం { శ్రీమద్రామాయణమ్ సున్దరకాణ్డ ౭.౧౪.౧౨-౨౦ }

రామాయణములోని సుందరకాండ పారాయణము జోరుగా సాగుతుంది। నేనూ మా అమ్మా కలసి చదువుకొని లంక వైభవం గాలి జనార్ధన రెడ్డి వైభవములా వున్నదని నవ్వుకున్న సందర్భాలు కూడా వున్నాయి। 

కావ్యములో నవరసాలూ పండించాలి, కానీ రసరాజు శృంగారమును బ్రహ్మచారి హనుమంతుఁడు అందునా కోతితో ఎలా పండించాలి అని సమ్మోహపడడం సహజం। ఆ సమస్యను మహాకవి వాల్మీకి ఇదిగో  ఇలా ఛేదించాడు।

సూచిక
సంస్కృతపదము - తెలుఁగుమాట (విభక్తి వచనము లింగము)
ppp - past passive participle
gerund

దిశస్సర్వాః ప్రధావన్తం వృక్షషణ్డగతం కపిమ్ ।
దృష్ట్వా సర్వాణి భూతాని వసన్త ఇతి మేనిరే ॥ ౧౨

దిశః - దిక్కులు      (౨ బ స్త్రీ)
సర్వాః - అన్నిటినీ       (౨ బ స్త్రీ)
ప్రధావన్తమ్ - పరుగెట్టువానిని      (౨ ఏ)
వృక్ష-షణ్డ-గతమ్ - వృక్షసమూహాలపైనుండి వెళుతున్నవాణ్ణి      (౨ ఏ)
కపిమ్ - కోతిని      (౨ ఏ)
దృష్ట్వా - చూచి      (gerund)
సర్వాణి భూతాని - అన్ని ప్రాణులు      (౧ బ నపుం)
వసన్తః - వసంతుఁడు      (౧ ఏ)
ఇతి మేనిరే - అని అనుకొన్నాయి      (दिवादि आत्मनेपदि मन् - लिट् प्रथमपुरुष बहुवचनम्)

దిక్కులన్నీ పరుగులు తీస్తున్న హనుమంతుణ్ణి చూసి, ఆ ఆశోకవనజీవరాశులు సాక్షాత్తూ వసంతుడే వచ్చాడేమే అని అనుకున్నాయఁట॥

---

నిర్ధూతపత్రశిఖరాశ్శీర్ణపుష్పఫలా ద్రుమాః ।
నిక్షిప్తవస్త్రాభరణా ధూర్తా ఇవ పరాజితాః ॥ ౧౫

నిర్ధూత-పత్ర-శిఖరాః - రాల్చబడిన ఆకులుగల శిఖరాలుగలిగినవి (అయిన)      (౧ బ బహువ్రీహి)
శీర్ణ-పుష్ప-ఫలాః - త్రుంచబడ్డ పూపండ్లుగలిగినవి (అయిన)      (౧ బ బహువ్రీహి)
ద్రుమాః - చెట్లు      (౧ బ)
నిక్షిప్త-వస్త్ర-ఆభరణాః - ఓడిన వస్త్రాభరణములుగలవారు (అయిన)      (౧ బ బహువ్రీహి)
పరాజితాః - ఓడిపోయినవారు (అయిన)      (౧ బ ppp)
ధూర్తాః - జూదరులు      (౧ బ)
ఇవ (సన్తి) - వలెఁ (ఉన్నవి)

ఆకులూ పువ్వులూ పండ్లూ రాలిపోయిన ఆ వృక్షాలు జూదంలో వస్త్రాభరణాలు సైతం పోగొట్టుకున్న జూదరులవలెనున్నాయి॥

---

నిర్ధూతకేళీ యువతిర్యథా మృదితవర్ణికా ।
నిష్పీతశుభదన్తోష్ఠీ నఖైర్దన్తైశ్చ విక్షతా ॥ ౧౮
తథా లాఙ్గూలహస్తైశ్చ చరణాభ్యాం చ మర్దితా ।
బభూవాశోకవనికా ప్రభగ్నవరపాదపా ॥ ౧౯

నిర్ధూత-కేళీ - (రతి)కేళిలో బొత్తిగా నలుపఁబడ్డ           (౧ ఏ స్త్రీ)
మృదితవర్ణికా - నలిపి రాల్చబడ్డ వంటిపూతలు గల       (౧ ఏ స్త్రీ బహువ్రీహి)
నిష్పీత-శుభ-దంత-ఓష్ఠీ - దంతక్షతములతో పీల్చివేయఁబడ్డ పెదవలు గల       (౧ ఏ స్త్రీ బహువ్రీహి)
నఖైః-దన్తైః-చ విక్షతా - గోళ్ళతోనూ దంతములతోనూ గాయింపఁబడ్డది (అయిన)       (౧ ఏ  స్త్రీ ppp)
యువతి - పడచు       (౧ ఏ స్త్రీ)
యథా - వలెఁ
లాఙ్గూల-హస్తైః చ - తోకతో హస్తములతో       (౩ బ)
చరణాభ్యాం చ - చరణములతోనూ       (౩ ద్వి)
మర్దితా - మర్దింపఁబడ్డ       (౧ ఏ స్త్రీ ppp)
ప్రభగ్న-వర-పాదపా - దెబ్బదిన్న శ్రేష్టమైన చెట్లు గల       (౧ ఏ  స్త్రీ బహువ్రీహి)అశోకవనికా - అశోకవనము       (౧ ఏ స్త్రీ)
తథా - (పై చెప్పబడ్డ యువతి) వలెనే
బభూవ - అయినది       (भ्वादि परस्मैपदि - भू  - लिट् प्रथमपुरुष एकवचनम्)
(నిర్ధూత, మృదిత, నిష్పీత, విక్షత, భగ్న - ppp)

రతికేళిలో నలిగిపోయిన యువతి, రాలిపోయిన వంటిపూతలతో పీల్చిపిప్పిచేయఁబడ్డ పెదవితో, గోళ్ళతోనూ పళ్ళతోనూ చేయఁబడ్డ గాయాలతోఁ ఎలా వుంటుందో, హనుమంతుని తోకతోనూ కాళ్ళుతోను మఱియు చేతులతోనూ మర్దింపఁబడి కొమ్మలు విరిగిన చెట్లతో అశోకవనము అలా వుంది।

---

మహాలాతానాం దామాని వ్యధమత్తరసా కపిః ।
యథా ప్రావృషి విన్ధ్యస్య మేఘజాలాని మారుతః ॥ ౨౦

మహాలతానాం - గొప్పతీగల      (౬ బ)
దామాని - దండలను      (౨ బ)
కపిః - కోతి      (౧ ఏ)
తరసా - వేగముగా      (తరస్ ౩ ఏ)
వి-అధమత్ - తుత్తునియలు చేసాడు      (दिवादि परस्मैपदि - व्यध् - लङ् प्रथमपुरुष एकवचनम्)
యథా - ఎటులనగా
ప్రావృషి - వానాకాలంలో      (ప్రావృష్ ౭ ఏ)
విన్ధ్యస్య - వింధ్యపర్వతము యొక్క      (౬ ఏ)
మేఘజాలాని - మేఘసమూహాలను      (౨ బ నపుం)
మారుతః - (తండ్రి అయిన) వాయువు (చెల్లాచెదరు చేయునట్లే)      (౧ ఏ)

వర్షర్తువులో వింధ్యశిఖరాలను ఆశ్రయించిన మేఘజాలాలను వాయువు చెల్లాచెదరు చేయునట్లే హనుమంతుఁడు ఈ అశోకవనంలోని దట్టమైన తీవెలగుంపులను వేగంగా తుత్తునియలు చేశాడు।

Monday, March 19, 2012

ఆత్మ ఆటవెలది

అష్టసిద్ధులెంత ఆత్మజ్ఞానముముందు
ఇష్టకామసిద్ధి యెన్నగెంత
కర్మఫలములెంత కైవల్యమెఱుఁగరా
విశ్వదాభిరామ వినుర వేమ

Tuesday, March 06, 2012

పతంజలిమహర్షికృత చరణశృఙ్గరహిత నటరాజస్తోత్రం

వేల్పులకు వేల్పు మహాదేవుని రూపలకు రూపమైన ఆకాశలింగమునకు, యోగులకు యోగియైన పతంజలి మహర్షి కూర్చిన స్తోత్రాలకు స్తోత్రం। దీర్ఘములు కొమ్ములు లేని స్తోత్రము। గురువులకై కేవలము అనునాసికములు, అనుస్వరము వాడారు। ఛందస్సు పేరే చరణశృఙ్గరహితమను కుంట। నాకు పెద్దగా తెలియదు। ఆదీ అంతులేని ఛందోరీతి అనే ద్వీతీయార్థం కూడా వస్తుందనుకుంట। దీన్ని తొలిసారి కొయంబత్తూరు ఈశయోగాశ్రమంలో సద్గురువు జగ్గీ వాసుదేవు గారి ఆధ్వర్యంలో జరిగిన మహాశివరాత్రి వేడుకలో విన్నాను। అక్కడ పాడిన గాయకుని పేరు నాకు గుర్తులేదు।


గణములు - IUII IUII IUII IUII IUII IUII IU
నడక - ననన్నన ననన్నన ననన్నన ననన్నన ననన్నన ననన్నన ననం
కాస్త లయగ్రాహిని పోలియున్నది। ఆంగ్లానువాదము ఇక్కడ లభ్యము।






||అథ-చరణశృఙ్గరహిత-నటరాజస్తోత్రమ్ ||
సదఞ్చిత ముదఞ్చిత నికుఞ్చిత పదం ఝలఝలఞ్చలిత మఞ్జు కటకమ్
పతఞ్జలి దృగఞ్జన మనఞ్జన మచఞ్చలపదం జనన భఞ్జన కరమ్ |
కదమ్బరుచిమమ్బరవసం పరమమ్బుద కదమ్బ కవిడమ్బక కగలమ్
చిదమ్బుధి మణిం బుధ హృదమ్బుజ రవిం పర చిదమ్బర నటం హృది భజ ||౧||

హరం త్రిపుర భఞ్జనం అనన్తకృతకఙ్కణం అఖణ్డదయ మన్తరహితం
విరిఞ్చిసురసంహతిపురన్ధర విచిన్తితపదం తరుణచన్ద్రమకుటమ్ |
పరం పద విఖణ్డితయమం భసిత మణ్డితతనుం మదనవఞ్చన పరం
చిరన్తనమముం ప్రణవసఞ్చితనిధిం పర చిదమ్బర నటం హృది భజ ||౨||

అవన్తమఖిలం జగదభఙ్గ గుణతుఙ్గమమతం ధృతవిధుం సురసరిత్-
తరఙ్గ నికురమ్బ ధృతి లమ్పట జటం శమనదమ్భసుహరం భవహరమ్ |
శివం దశదిగన్తర విజృమ్భితకరం కరలసన్మృగశిశుం పశుపతిం
హరం శశిధనఞ్జయపతఙ్గనయనం పరచిదమ్బర నటం హృది భజ ||౩||

అనన్తనవరత్నవిలసత్కటకకిఙ్కిణిఝలం ఝలఝలం ఝలరవం
ముకున్దవిధి హస్తగతమద్దల లయధ్వనిధిమిద్ధిమిత నర్తన పదమ్ |
శకున్తరథ బర్హిరథ నన్దిముఖ శృఙ్గిరిటిభృఙ్గిగణసఙ్ఘనికటమ్
సనన్దసనక ప్రముఖ వన్దిత పదం పరచిదమ్బర నటం హృది భజ ||౪||

అనన్తమహసం త్రిదశవన్ద్య చరణం ముని హృదన్తర వసన్తమమలమ్
కబన్ధ వియదిన్ద్వవని గన్ధవహ వహ్నిమఖ బన్ధురవిమఞ్జు వపుషమ్ |
అనన్తవిభవం త్రిజగన్తర మణిం త్రినయనం త్రిపుర ఖణ్డన పరమ్
సనన్ద ముని వన్దిత పదం సకరుణం పర చిదమ్బర నటం హృది భజ ||౫||

అచిన్త్యమలివృన్ద రుచి బన్ధురగలం కురిత కున్ద నికురమ్బ ధవలమ్
ముకున్ద సుర వృన్ద బల హన్తృ కృత వన్దన లసన్తమహికుణ్డల ధరమ్ |
అకమ్పమనుకమ్పిత రతిం సుజన మఙ్గలనిధిం గజహరం పశుపతిమ్
ధనఞ్జయ నుతం ప్రణత రఞ్జనపరం పర చిదమ్బర నటం హృది భజ ||౬||

పరం సురవరం పురహరం పశుపతిం జనిత దన్తిముఖ షణ్ముఖమముం
మృడం కనక పిఙ్గల జటం సనకపఙ్కజ రవిం సుమనసం హిమరుచిమ్ |
అసఙ్ఘమనసం జలధి జన్మకరలం కవలయన్త మతులం గుణనిధిమ్
సనన్ద వరదం శమితమిన్దు వదనం పర చిదమ్బర నటం హృది భజ ||౭||


అజం క్షితిరథం భుజగపుఙ్గవగుణం కనక శృఙ్గి ధనుషం కరలసత్
కురఙ్గ పృథు టఙ్క పరశుం రుచిర కుఙ్కుమ రుచిం డమరుకం చ దధతమం |
ముకున్ద విశిఖం నమదవన్ధ్య ఫలదం నిగమ వృన్ద తురగం నిరుపమం
సచణ్డికమముం ఝటితి సంహృతపురం పరచిదమ్బర నటం హృది భజ ||౮||

అనఙ్గపరిపన్థినమజం క్షితి ధురన్ధరమలం కరుణయన్తమఖిలం
జ్వలన్తమనలం దధతమన్తకరిపుం సతతమిన్ద్రముఖవన్దితపదమ్ |
ఉదఞ్చదరవిన్దకుల బన్ధుశత బిమ్బరుచి సంహతి సుగన్ధి వపుషం
పతఞ్జలినుతం ప్రణవపఞ్చర శుకంపర చిదమ్బర నటం హృది భజ ||౯||


ఇతి స్తవమముం భుజగపుఙ్గవ కృతం ప్రతిదినం పఠతి యః కృతముఖః
సదః ప్రభుపద ద్వితయదర్శనపదం సులలితం చరణ శృఙ్గ రహితమ్ |
సరఃప్రభవ సమ్భవ హరిత్పతి హరిప్రముఖ దివ్యనుత శఙ్కరపదం
స గచ్ఛతి పరం న తు జనుర్జలనిధిం పరమదుఃఖజనకం దురితదమ్ ||౧౦||

||ఇతి శ్రీపతఞ్జలిమునిప్రణీతం చరణశృఙ్గరహిత నటరాజస్తోత్రం సంపూర్ణమ్ ||
నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం