భాషందం, భువనందం, బ్రతుకందం

Wednesday, June 27, 2007

తెవికీ: ౩౦,౦౦౦ వ్యాసాలు సరే, అసలు వ్యాసాలెన్ని


తెలుగు వికీ ౩౦,౦౦౦ వేల వ్యాస పండుగను వికీపీడియన్లందరూ ఘనంగా జరుపుకుంటున్నారు. అభినందనలు...

ఈ సందర్భం లో ఒక చిన్న ఆట, ఆ ఆట నుండి తెవికీ అసలు సత్తా.

తెలుగు వికీ కి వెళ్ళి పక్క బారులో , యాదృచ్ఛిక పేజీ లంకె ఒత్తండి
మీకు ఖచ్చితంగా ఒక వూరి పేజీ వస్తుంది. మళ్ళీ అదే చోట నొక్కండి , ఇంకో వూరి పేజీ వస్తుంది.
అలా కొంత సేపు చెయ్యండి. మీకు ఊళ్ళ పేజీలు, సినిమాల పేజీలు, ఇతర మొలకలు రానంత వరకూ కొనసాగించండి. మీకు ఎన్ని క్లిక్కుల తరువాత ఒక 'మంచి వ్యాసం' (బాటు చేత నిర్మింపబడ్డ మొలక కానిది) వస్తే మీ స్కోరు అంతనమాట..
నేనిప్పుడే ఆడాను, నాకు ౩౭ వొత్తుల(క్లిక్కుల) తరువాత త్రిమతాలు వ్యాసం వచ్చింది. చాలా మంచి వ్యాసం, మీరు కూడా చదవాలి.

ఈ ప్రక్రియని ఒక మార్కావ్ ప్రాసెస్ గా పరిగణించవచ్చు. అలా పరిగణించి తెవికీ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. (మీకు లెక్కలు రాకపోతే ఇంజనీరింగ్ చదివే మీ అబ్బాయిని సంప్రదించండి, లేక నా మాట నమ్మి తిన్నగా లెక్కల తరువాతి సంగ్రహభాగానికి వెళ్ళండి)

గణితం
ముందుగా తెలుగు అంకెలు ,
౨౩౪౫౬౭౮౯౦ = 1234567890

తెవికిలో మొత్తం వ్యాసాల సంఖ్య = మొ
అందులో మంచి వ్యాసాల సంఖ్య
= మం
కాబట్టి మీకు మంచి వ్యాసం వచ్చే అవకాశం,

= మం/మొ
చెడ్డ వ్యాసం వచ్చే అవకాశం

= (మొ - మం)/ మొ = మం/మొ
కాబట్టి ,

+ =

మీకు మొదటి ఒత్తుడు లోనే మంచి వ్యాసం రావడానికి అవకాశం

అవకాశం
() =

అలానే రెండు ఒత్తులలో మంచి వ్యాసం రావడానికి అవకాశం
() = (౧ ఞ) ఞ = *

అలానే, ౩, ౪, ౫ .... ఒత్తులలో
() = (౧ ఞ) * (౧ ఞ) * = *
() = (౧ ఞ)= *
() = (౧ ఞ)= *
:
:
() = (౧ ఞ)-= - * , ( నవొవ ఒత్తులో మంచి వ్యాసం వచ్చే అవకాసం )
గుర్తుపెట్టుకోండి మంచి వ్యాసం వచ్చే అవకాశం, చెడ్డ వ్యాసం వచ్చే అవకాశం.

దాని బట్టి మన ఆటలో ఎన్ని సార్లు ఒత్తితే మంచి పేజీ వస్తుందో కనుక్కోవచ్చు, న వొత్తుల తరువాత మంచి వ్యాసం వచ్చే అపేక్ష,
(ఇక్కడ శ్ర అంటే ఆంగ్ల గణితంలో
Sigma అన్నమట, ఇది కూడికకు చిహ్నం)
(మరియు, డి/డిఙ derivative w.r.to ఙ )
(మరియు ౧
= 1)

అపేక్ష (న) = *అ(౧) +*అ(౨) + *అ(౩) + *అ(౪) + ….
అపేక్ష (న) = శ్ర(ణ = 0, అనంతం)* అ(ణ)
అపేక్ష (న)
= శ్ర(ణ = 0, అనంతం)*- *
అపేక్ష (న)
= * ( శ్ర(ణ = 0, అనంతం)*- )
అపేక్ష (న)
= * ( శ్ర(ణ = 0, అనంతం) డి/డిఙ ఙ- )
అపేక్ష (న)
= * డి/డిఙ ( శ్ర(ణ = 0, అనంతం) )
అపేక్ష (న)
= * డి/డిఙ ( ౧ / (- ) )
అపేక్ష (న)
= * (-౧) * (- )-2 * (-౧)
అపేక్ష (న) = / 2
అపేక్ష (న) = /
అపేక్ష (న) = మొత్తం / మంచి


సంగ్రహం:
కాబట్టి మీకు న వొవ వొత్తులో మంచి వ్యాసం వచ్చిందంటే , సగటున న వ్యాసాలకి ఒక మంచి వ్యాసం ఉన్నట్టు.

నేనిప్పుడే ఈ ఆట ఆడి చూసాను, నాకు ౩౭ ఒత్తుల తరువాత ఒక మంచి వ్యాసం వచ్చింది. కాబట్టి మన మొదటి అంచనా ప్రతి ముప్పై ఏడు వ్యాసాలకు ఒక మంచి వ్యాసం ఉందని అర్థం !

అంటే మెదటి అంచనా తెవికీ లో మొత్తం
౩౦,౦౦౦
/ ౩౭ = ౮౧౦ మంచి వ్యాసాలున్నాయన మాట...

కాని గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏఁవిటంటే, ఇది మొదటి అంచనా మాత్రమే, కాబట్టి మీరందరూ కూడా ఈ ఆట ఆడి, మీకు వచ్చిన న విలువల నుండి సగటు అపేక్ష(న) కనుక్కోవాలి.

అపేక్ష(న) = సగటు( వచ్చిన(న) ) అనంత ప్రయత్నాల తరువాత
వచ్చినప్రయత్నం అపేక్ష(న) = శ్ర(౧, ప్రయత్నాలు) వచ్చినప్రయత్నం (న)
వచ్చినప్రయత్నం అపేక్ష(న) = అపేక్ష(న) ప్రయత్నం -> అనంతం
వచ్చినప్రయత్నం అపేక్ష(న) - అపేక్ష(న) = ఢం (ఢం quadratic గా ౦ కి చేరుకుంటుంది ప్రయత్నాలు ఎక్కువయ్యేకొద్ది !)

ఇంకేంటి ఐతే మీరందరూ కూడా యాధృచ్చిక పేజీ లంకెని ఒత్తి , ఎన్ని ప్రయత్నాలలో మీకు మంచి పేజీ వచ్చిందో చెప్పండి, దానిని బట్టి మనము తెవికీ లో మంచి వ్యాసాలు ఎన్నున్నాయే లెక్కించవచ్చు.


సంభావనలు
౧) తెవికీ లో వ్యాసాల సంఖ్య ఈ ప్రయేగం జరిగేంత కాలం నికరంగా ఉంటుంది.
౨) ఈ ప్రయేగం జరిగేంత కాలం చెడు వ్యాసాలు మంచివిగా మారవు
౩) వ్యాసాలలో రెండు రాకాలు మాత్రమే, మంచీ చెడూ
౪) ఞ విలువ తక్కువకావడం వలన తక్కవ ప్రయత్నాలలోనే ఉత్తమమైన ఫలితాలు పొందవచ్చు.

విన్నపం
తెవికీ చాలా ఉత్తమమైన కార్యము. దానిలో (౩౦,౦౦౦ * ఙ) వ్యాసాలు ఈనాడు మొలకలైనా ఏనాటికైనా మహా వృక్షాలవుతాయి. ఆనాడు తెవికీ కల్పవనం అవుతుంది. ఈ టపాని ఒక స్వేతపత్రంలా స్వీకరించాలని మనవి. దేశవికీలలో తెవికీ లెస్సయ్యినా, దానికి మీ అవసరం ఇంకా చాలా ఉందని తెలుపడం ఈ టపా ముఖ్యోద్ధేశం.

Friday, June 22, 2007

ఉపగణాలని అర్థంచేసుకోవడం ఎలా ?

నేను ఈ మధ్య తెలుగు కవిత్వాన్ని నేర్చుకుంటున్నాను.

కందసిద్ధాంతం బాగానే అర్థమయ్యింది. దానిలో పద్యాన్ని నాలుగు మాత్రల ముక్కలుగా రాస్తారు, కాబట్టి నాలుగు మాత్రల బరువున్న ఎ గణోపగణాలనైనా వాడొచ్చు. అవేంటో ఎవరైనా చెప్పగలరు,
నల (IIII), భ(UII), జ(IUI), స(IIU), గగ(UU) అని.

కందంలో నియమాలు ఎక్కవైనా అవన్ని చాలా అర్థవంతంగా ఉంటాయి.
ఉదాహరణకు, రెండు, నాలుగు పాదాలలో మధ్య గణం జ లేదా నల అయ్యుండాలి. అది సిమెట్రీ కోసం అలా నిబంధించారిని సర్దిచెప్పుకోవచ్చు.

అందరూ తెలుగు పద్యరీతుల్లో కందం కష్టమన్నా, నాకు మాత్రం కందసిద్ధాంతం బాగా అర్థమయి రెండు వారాలలో నాలుగు వ్రాయగలిగాను, ఇప్పుడు వాటికన్నా తెలికపాటివైన తేటగీతి లాంటివి నేర్చాలని బయలుదేరితే, ఆ సూర్యేంద్ర గణాల వెనకున్న సిధ్ధాతం నాకు పట్టట్లేదు.

సరే సూర్యగణం అంటే మూడు మాత్రల బరువు ఉండాలి అనుకుందాం..
న (III) మరియు హ (UI) బానే ఉన్నాయి. ఐతే అక్కడ వ (IU) కూడా ఉండాలిగా లేదేంటి ?

ఇక ఇంద్రగణాలకి వస్తే నాకు ఇవసలు అర్థం కాలేదు.
ర(UIU), త(UUI) ఉన్నాయిగానీ అక్కడ వాళ్ళ అక్క, య(IUU) గణం లేదు కాని పక్కింటోళ్ళమ్మాయి భ(UII) ఉంది. అన్యాయం (నిజానికి నా అంధకారం అనుకోండి). నగ, సల, నల ఎందుకున్నాయో ?

ఇక చంద్రగణాలకి వస్తే,
నా పేరు పెట్టుకున్నాయి, ఒ పద్నాలు రకాలున్నాయి కాని నాకొక్కముక్క సమజయితల్లేదు బయ్.

కందం మొదలు పెట్టి మంచి పని చేసా,
అక్కడ నుండి క్రిందికి ఉపజాతులకి వెళ్దామంటే సూర్యేంద్ర గణాలు గీఈఈఈఈ అని ఎక్కిరిస్తున్నాయి.
పైకి వృత్తాలలోకి వెళ్దామంటే, ఉత్పలమాల చంపకమాల "మొహం అద్దంలో చూసుకున్నావా?" అన్నట్టున్నాయి.

అందుకే ప్రస్తుతానికి మత్తకోకిల లయ మెదడులోకి ఎక్కిస్తున్నా..
మత్త కోకిల మత్త కోకిల మత్త కోకిల కోకిలా
తాన తానన తాన తానన తాన తానన తాననా
మంచి రామయ చెత్త రావణ మంచి రామయ రామయా
వగైరా వగైరా, పాడుకోవడానికి బాగుంది గాని, వ్రాయడం కో.క.లకి అంత తేలిక కాదనుకుంట..


ఏదేమైనా పెద్దలెవరన్నా వీటిని
intuitive గా చెప్పగలిగితే చాలా సంతోషిస్తాను.
నేను మాత్రల బరువు పరంగా ఆలోచిస్తున్నాను, అది కందం విషయంలోనే వర్తిస్తుందనిపిస్తుంది. అలాంటి ఆలోచనా రీతులు వేరే ఉంటే పరిచయం చెయ్యగలరు. నేను తెలివైన కుర్రాడిని కాబట్టి మీరు చెప్పగానే టపీ మని పట్టేసి, తరువాత చిన్నా చితకా ప్రశ్నలు వెయ్యనని ప్రామిస్. :)

Monday, June 18, 2007

నాకు శివాజీ సినిమా ఎందుకు నచ్చింది

అవును సిగ్గు విడిచి చెబుతున్నా నాకు శివాజీ సినిమా నచ్చింది.
ఈ సినిమా రజినీ వీరాభిమానులకు నచ్చదు. ఎందుకంటే రజినీని దేవుడిలాగా చూపించలేదు. చిల్లరచిల్లర డైలాగులు పెట్టి, ఒకటో రెండో ఉన్నాయంతే. ఇంకా చెప్పాలంటే, "అడ్డమైన డైలాగులు వీధిలో ప్రతీ ఒక్కడూ కొడుతున్నారు" అని డైలాగ్ కూడా ఉంది. ఇకపోతే "ఇకచూడు కమల్ హాసన్ లాగా తెల్లగా అయ్యిపోతా" లాంటి లో-ఇగో డైలాగులు బాగా నచ్చాయి.

స్టోరీ - అన్ని శంకర్ సినిమాల్లాగానే, ఒకడొచ్చి దేశాన్ని, నిజజీవితంలో వీలవని విధానాలలో బాగుచేసేస్తాడు. ఆ విషయంలో ఇది మిగితా రజనీ సినిమాలకంటే పర్లేదు.

ఇంకోవిషయం - నేను ఈ సినిమాకి ముందు చూసిన తెలుగు సినిమాలు యోగి, అన్నవరం, బంగారం, పోకిరి వగైరా .
కాబట్టి అర్థంలేని హింసా ఖాండ, మరియు అదే రసంలేని కథనం ఉన్న సినిమాలు చూసి చూసి ఈ సినిమా చాలా నయమనిపించింది.

మీరు రజనీ వీరాభిమాని అయినా లేదా శంకర్ వీరాభిమాని అయినా అయితే మీకీ సినిమా నచ్చదు, నేను రెండూ కాదు. అలాగే మీకు సినిమా లో లాజిక్ కావాలంటే, మీరసలు తెలుగు సినిమాలే చూడకూడదు.

ఈ సినిమా శంకారాభరణం కానేకాదు, కనీసం భారతీయుడు కుడా కాదు, కానీ నాకైతే సినిమా నచ్చింది.

వేరే రివ్యూలు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

Thursday, June 14, 2007

కందం పై కందం పై కందం

నా బ్లాగుని జెమిని టీవీ సీరియల్ గా తలచి ఫాలో అవ్వని జనుల కోసం చిన్న రీక్యాప్ !
నేను మొన్ననే తెలుగులో పద్యాలు రాయాలని రానారె స్పూర్తితో రాయడం మొదలు పెట్టా. మా గురువు కొత్తపాళీ. మొన్ననే ఒక కందం కూడా రాసా. కాని అది గురువు గారికి నచ్చక మరలా రాయమన్నారు. అది వివరిస్తూ ఒక కందం.

కందము పై కందము నే
అందము వర్ణింప గోరి వ్రాసితి గానీ
అందులెలగెన్సు లేదని
చిందులు దొక్కేను గురువు సింగని వోలే

బైట్ దాట్ మాస్టర్ కోపా ! ఎలగెన్సు తగ్గిందన్నందుకు గానూ, ఎలగెన్సు లేనేలేని పద్యం :)
ఇక్కడ నృసింహుడితో పోల్చడం అతిశయోక్తి అలంకారమనమట :) అలాగే 'వోలే' ఉపమాలంకారము :)
దయచేసి నా మీద ఆశ వదలొద్దు :)
పైన 'వ్రా'ముందు వచ్చిన 'రి' గురువవదని నాకు గట్టిగా అనిపిస్తుంది. కాని నేను తప్పయ్యిండవచ్చు.

అసలు విషయానికి వస్తే, ఇదిగో నా రెండో ప్రయత్నం.

అరవైనాలుగు మాత్రల
అరుదగు నీలారవింద హారము కందం
ఉరకగిది కృష్ణవేణిల
పరమశివునిదైనను మది పరవశమవదా

ఇది గురువుగారిని, పాఠకులని, మెప్పిస్తే సరే సరి లేక పోతే ...
ఎందుకైనా మంచి, ఈ పద్యంలో రెండు రూపకాలున్నాయని గుర్తుచెయనియ్యండి. అలాగే ఇందులో ప్రాసయతి కూడా కుదిరింది. (౨ లో అరు - హార; ౪ లో పర - పర)

నేను కందాల గురించి ఆలోచించీచించీ, రాత్రి నిద్రకూడా తక్కువయ్యింది. ఎంతగా కందాల గురించి ఆలోచిస్తున్నానంటే, నేను వ్రాసిన నాలుగు కందపద్యాలూ కందాల మీదే. ఈ విషయం మీద ఇంకో కందం.

అల్లుతువున్నా కందం <భ గగ గగ>
మెల్లగ మెల్లగను నేను, మేడిన్ చైనా <భ భ జ గగ గగ>
చిల్లర పరికరములవలె <భ నల నల>
అల్లటపెట్టుటకు మిమ్ము యట్లాగైనా <భ భ జ గగ గగ>

కొద్దిగా ఎక్కువైనట్టుంది కందమందు నాకూ మీకూ. ఐతే మీకో సుభవార్త. కందం కష్టమనిపిస్తుంది నేనింకా తెటగీతో, సీమమో నేర్చుకుంటా. కొద్దగా నేర్పరితనము వచ్చాక కందానికి వస్తా.

త.రా : అన్నట్టు కవిత్వం ఆశక్తి ఉన్నవారు ఈ-మాటలో ఈ వ్యాసం తప్పక చదువగలరు.

Monday, June 11, 2007

బిల్లు మాఁవ పాసైపోయాడండోయ్ ...

మనూరి తలుపుల బిల్లయ్య మామ ఆఖరికి హార్వార్డు నుండి పట్టా పొందనే పొందాడు.

నేను ఇప్పుడే MSN లో బిల్ గేట్స్ కి హార్వార్డు ఆనరరీ పట్టా ఇవ్వడం గురించి చదివాను.
ఆయన యువతరానికి ఇచ్చిన సలహా, మార్గదర్శకత్వం నాకు చాలాబాగా నచ్చాయి.

ఎవరైనా అంత లక్షీతనయునుడు అంతటి సరస్వతీతనయులకు ఏమి చెబుతాడని ఊహిస్తాం ?
బాగా డబ్బులెలా సంపాదిచాలా అని కదా ?
ఊహుం,
అతను ప్రపంచ జనాలకి సేవ చేయమని చెప్పాడు !
డబ్బు ఎక్కువ్వయ్యే సరికి జగత్తులోని అసలు నిజం (సోషలిజం) తెలిసొస్తుంది!
నాకైతే అయని మాటలు విన్నాక డబ్బు మీద ఆశ అమితంగా తగ్గిపోయింది.
ఇంకతూ ఎఁవన్నారో ఇక్కడ చదవండి.

"When you consider what those of us here ... have been given - in talent, privilege, and opportunity - there is almost no limit to what the world has a right to expect from us,"
ఎగ్‌జాక్‌ట్‌లీ మై సెంటిమెంట్స్ మాఁవా. వందనం బిల్లు మాఁవ అభివందనం.

అందరూ శిఖరాన్ని అధిరోహించడానికి ప్రయత్నిస్తుంటారు గాని, పర్వతశిఖరాన్ని అదిరోహించిన తరువాత, భూమికి ఎంత దూరమయ్యామో అన్న బాధ ఒంటరితనం మాత్రమే మిగులుతాయనుకుంట!

Internet Explorer కి తెలుగు నేర్పండి.

మీ అంతర్జాల సంచారిణీ, మీ ఇష్టం. మీకేమో తెలుగిష్టం.
కాబట్టి మీ అం.సం. కి మీకు తెలుగులో వలలు చూపించమని చెప్పండి. అప్పుడు మీకు తెలుగు వెర్షన్ ఉన్న సైట్లు తెలుగులో వస్తాయి. గూగుల్ వంటివి.

Internet Explorer 7 తెరవండి.
Tools కి వెళ్ళండి.
Internet Options పై వత్తండి.
అందులో General Tab లో Appearance వర్గంలో Languages పై వత్తండి.
అందు Add... నొక్కండి.
పట్టీలో Telugu [te-IN] మీద వత్తి OK వత్తండి.
వెనక్కి వచ్చిన తరువాత Telugu [te-IN] మీద మూషికం వత్తి Move Up బొత్తాన్ని వత్తండి.
OK వత్తండి. ఆ కిటికీ మూసుకుంటుంది.
దాని మాతృ కిటికీలో కూడా OK వత్తండి.

ఇప్పుడు మన గూగులమ్మ ఇంటికి వెళ్ళండి.
ఠ ఢఁ ....
తెలుగులో గూగండి !

త.రా : హలో.. ఎంటి చదివి టపుక్కున జారుకుంటున్నారు ? వ్రాసింది చదివి ఓహో అనుకుంటానికి కాదు. ఇప్పుడే IE లో సెట్టింగ్సు మార్చండి. లేకపోతే నేను బాధపడతాను !

తత్. త. రా : దీని గురించి వీవెన్ గారు ఎప్పుడో వ్రాసారని ఇప్పుడే గమనించాను! ఆయనైతే బొమ్మలు కూడా పెట్టారు! కానీ నాకెందుకో మంటనక్క గూగుల్ ని తెలుగులో చూపించదు. కాని ఐయ్యి చూపిస్తుంది !

Thursday, June 07, 2007

గురుః దేవో నారాయణః ౨

కం. అరవైనాలుగు మాత్రల
అరుదు అయిన ఒ అరవింద హారం కందం;
నెరయును మదినానందము
నెరగగ నే రాయడమును, నేర్పగ రామా !

నాకెందుకో పద్యం మొదటి రెండు పాదాలు ఎడ్లబండి లాగా, ఆఖరి రెండు పాదాలు రైలు బండిలాగా అని పిస్తున్నాయి. :)
రామా (రానారె) స్ఫుర్తి తో నేను కూడా కంద పద్యం రాద్దామని తలపెట్టా. సంవత్సరం పడుతుందను కున్న దానికి, గురువు గారి సహాయ ప్రోత్సాహాలతో, రెండు రోజులలోనే పూర్తయింది. పద్యం అంత బాగోదనుకోండి, నేను కొక ని కాబట్టి! (కొత్త కవి).
మా గుగ్గురువు కొత్త పాళీ అన్నట్టు..

క. కందాలకేమి భాగ్యము
వందైనా రాయ వచ్చు వడిగా, కానీ
ఛందస్సున వ్రాయుచునే
యందముగా వ్రాయవలెను యర్రపు రామా!

నాకైతే ఛందస్సు, యతిమైత్రి, ప్రాస కుదిరినందుకు మహదానందంగా ఉంది.

Tuesday, June 05, 2007

Inscript వల్ల లాభాలు

ఉపోద్ఘాతం : తెలుగు బ్లాగర్ల గుంపు లో జ్యోతి గారు ఇన్‌స్కిరిప్టు వల్ల ఉపయోగాలగురించి అడిగారు, దానికి నా సమాధానంగా ఈ టపా అక్కడ రాసాను. రానారె సలహా మీద దానిని ఇక్కడ ఒక బ్లాగు టపాగా ప్రచురిస్తున్నా (చిన్న చిన్న మార్పులతో). అన్నట్టు అసలు టపా ముందు ఒక చిన్న ప్రయత్నం.
ఆ కుక్క ప్రయత్నం పని చేసినట్టు లేదు, అసలు టపా చదవండి.

జ్యోతి గారు,

ఈ విషయం మీద "Inscript వల్ల లాభాలు" అని ఒక బ్లాగు రాద్దామని ఎప్పటినుంచో అనుకుంటున్నా . కాని కుదరట్లేదు. మీ ప్రశ్నకు క్లుప్తంగా ఒ నాలుగు కారణాలు రాస్తా..

౧) తెలుగు ను ఆంగ్లం ద్వారా టైప్ చేయడం కొందరికి ఇష్టం ఉండదు.
ఉదాహరణకు మనం, సంతోష్ ని RTS లో SaMtOsh అని టైపు చేయాలి , అది చదవడానికి సమ్తోష్ లాగా అనిపించట్లేదు ?

౨) "ఒకవేళ మనం ఇంగ్లీషు, తెలుగు ఒక దాని తర్వాత రాసుకునే పని ఉంటే తికమకగా ఉంటుంది కదా."
ఇది అస్సలు నిజం కాదు. మనం తెలుగు లో ఆలోచిస్తున్నప్పుడు , టైపు చేస్తున్నప్పుడు తెలుగు కీ బోర్డ్ మన మెదడులో లోడ్ అయి పోతుంది. నేను ఆంగ్లం లోనూ, తెలుగులోనూ, కీబోర్డు చూడకుండా చాలా వేగంగా టైపు చేయగలను. కొన్ని టపాల తరువాత మీరు కూడా అలాగా అవుతారు.

౩) Left Alt + Shift నొక్కితే, భాష మారుతుంది. క్లిక్కుల అవసరంలేదు..

౪) అచ్చులు అన్ని ఒక చోట , హల్లులు ఒక చోట చాలా క్రమబధ్ధంగా అమర్చబడి ఉంటుంది తెలుగు కీ బోర్డు.
ఉదాహరణకు. క పైనే గ , చ పైనే జ ఉంటాయి.

౫) మీకు తెలుగు కీ బోర్డు అలవటైతే , ఎ దేశ బాషలోనేనా రాయవచ్చు.
മീകു തെലുഗു കീ ബോര്ഡു അലവാടൈതേ , എ ദേശ ഭാഷലോനേനാ രായവച്ചു
(ఉదాహరణకు , పై వాఖ్యం మలయాళంలో )

౬) మీకు కీ స్ట్రోక్స్ తగ్గుతాయి. ఉదాహరణకు క్షంత్రైజ్ఞ అనడానికి తెలుగు కీబోర్డులో 5 మీటలు నోక్కాల్సి వస్తే, RTS లో 12 మీటలు నొక్కాలి ! మరీ ఎప్పుడూ ఇంత రాబడి ఉండదు కాని, సగటున తక్కువ మీటలు అవసరమౌతాయి.

౭) నేను gtalk లో తెలుగు వచ్చిన వారితో అచ్చమైన తెలుగులో చాటుతూంటాను. మీరు ఇది చేయొచ్చు. ఒక సారి వీవెన్ తో కూడా చాటు చేసా! ఆయన కూడా ఇన్‌స్కిరిప్టే వడతారు !

౮) కాపీ పేస్టు సుత్తి ఉండదు. వేరే ప్రోగ్రాంలు ఇన్స్టాల్ చేయనక్కరలేదు.

౯) ఇంటర్నెట్ సౌకర్యం లేని మా పల్లెటూర్లలో కంప్యూటర్ వాడాలనుకునేవారు , తెలుగులో వ్రాయెచ్చు. (నేను inscript వాడడం అందు వల్లే మొదలు పెట్టాల్సి వచ్చింది)

౧౦) మీ కంప్యుటర్ లో ఫైళ్ళ పేర్లు తెలుగు లో పెట్టుకోవచ్చు. నేను కంద పద్యాల గురించి నోట్సు రాసుకుని కందం.doc గా దానిని బధ్రపరచుకోవచ్చు.

౧౧) అంకెలని సునాయాసంగా తెలుగులో కొట్టోచ్చు

ఇన్ని చెప్పాక కూడా మీరు మీ మనస్సు మార్చుకోకపోతే నాకు బాధగా ఉంటుంది. (Emotional blackmailing :)

రాకేశ్

Monday, June 04, 2007

మా శ్యాంగాడి ప్రేమ

మా శ్యాంగాడు రెండేళ్ళ క్రితం ఒక అమ్మాయిని ప్రేమించాడు.
ప్రేమించాడు అంటే, ఇప్పుడు ప్రేమించట్లేదా అని అడగవచ్చు మీరు. వాడి మాటల్లో చెప్పాలంటే, ప్రేమ పుట్టడమేగాని, పోవడం ఉండదంటాడు. అలాగైతే, ఇప్పటికీ ప్రేమిస్తున్నాడా? వాడి దృష్టిలో ఐతే అవును. కాని ఆ అమ్మాయి వేరెవరితోనో పెళ్ళికి 'ఊఁ' అనేసింది. అలాంటోళ్ళను ప్రేమించి ఏం లాభం ?

కాని మన వాడు ప్రేమించినదానిని పొందలేక, పొందలేనిదానిని ప్రేమించడం మానలేక, మద్యలో గిల్‌గిల్‌గిల్ కొట్టుకోంటున్నాడు. అలాని 'జాలిపడదాం పాపం' అంటే, మనోడు వేరే చాలా మంది అమ్మాయల మీద మనసు పారేసుకున్నాడు, ఎదో హృకాపీ పేస్టు చేస్తున్నంత తేలికగా! కాని వాడిని నిల దీసి అడిగితే, వేరే ప్రేమలన్ని ఈ అమ్మాయిని మరచిపోవడానికే అంటాడు. కాని అది ఎంత వరకూ నిజమొ ఎవరికీ తెలియదు, వాడికి సైతం !

ఇంతకూ ఇవాళ ఎమైందంటే,
మనోడి పాత ప్రామ నంచి సరికొత్త ఉత్తరం వచ్చింది. ఉత్తరం తెరుస్తూనే వాడి మనసు గిల్‌గిల్‌గిల్ కొట్టుకొని ఆగింది. చూడబోతే, ఆ అమ్మాయి మనోడికి కొన్ని ఫోటోలు కూడా పంపిందండోయ్. మొన్నే ఇంగ్లాండ్‌లో విహారయాత్రకి వెళ్ళిందంట. మనోడు మొదటి రెండు చిత్రాలు చూసి మనసులో, "నాకు నువ్వున్న ఫోటో కావాలి, ఈ పురాతన కోటలు నేనేంచేసుకోను?" అనుకున్నాడు.

చూస్తే నాలుగో చిత్రంలో ఆ అమ్మాయి ఉండనే ఉంది. మనోడు దానిని చూసాడు, మనసు నీరుకారిపోయింది. హృదయం కృంగిపోయింది. పాత భావాలన్ని భూకంపంలా గుండెను కదిపివేసాయి.జీవితంలో ఎంత అందాన్ని మరియు దాని నుండి వచ్చే ఆనందాన్ని కోల్పోయానో అనుకున్నాడు. రెండు క్షణాలు, ఆత్మహత్య చాలా తీయ్యని విముక్తి ద్వారంలా అనిపించింది.

ఈ ఫోటో చూడకుండా ఉండాల్సిందే అనుకున్నాడు. కాని తనకు తెలియకుండానే, దాన్ని తెరచి, మళ్ళి చూస్తున్నాడు. ఇలా ఐతే బ్రతికుండడం కష్టం!

శ్యాంగాడు చచ్చిపోయాడు రెండేళ్ళ క్రితం, ఆ అమ్మాయిని వదులుకున్నప్పుడే! కాని వాడి ఆత్మ ఇవాళ వచ్చినట్టు తిరిగి వస్తూ ఉంటుంది. ప్రస్తుతానికి శ్యాంగాడి ఆత్మ వెళ్ళి పోయినట్టుంది! మళ్ళి సారి మైయిల్ వచ్చినప్పుడు మళ్ళీ తిరిగోస్తా! ఎమో ఎవరికి తెలుసు విధి వంకర్లు తిరిగినప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ నాకు దోరుకుతుందేమొ? ఆ అమ్మయికి కూడా నేనంటే ఇష్టమేనేమో? నా మనస్సులో ఎముందో తెలియక ఆమెంత క్షోభ అనుభవించి, చివరకు ఆశ వదులుకుందో? ఎం జరిగుతుందో ఎవరికి తెలిసు. ఆశ ఉన్నంత వరకూ, అంటే ఎప్పటికీ, నేను ఇక్కడే నీ అంతరంగాల్లోనే తిరుగుతూ ఉంటా...

త.రా. : ఈ కధలో వ్యక్తులు, ఆత్మలు, ఆల్టర్ఈగోలు, మనోభావాలు, ఉత్తరాలు, చిత్రాలు కేవలం కల్పితాలు మాత్రమే. మీ లేదా నా జీవితానికి పోలిక ఉండడం, కేవలం కాకతాళీయం మాత్రమే!