భాషందం, భువనందం, బ్రతుకందం

Saturday, October 13, 2007

నిరుద్యోగులు

అంతేలే, నిరుద్యోగ రెజ్యుమేలు !
కంచల్లే మ్రోగే ఖాళీ చెంబులు !
మానవ వనరుల భామల బల్లలపై,
పింగుపాంగులాడే కుంటి కుందేళ్లు !

అంతేలే, నిరుద్యోగ ఈమెయిళ్లు !
వ్యాకరణం వాడని తిరస్కారములు !
అసమర్ధ చితులుండే శ్మశానాల్లో
కాలని కళేబరాల పేలని పుఱ్ఱెలు !

అంతేలే, నిరుద్యోగుల అర్హతలు !
సిగ్గువిడిచిన సినిమా హీరోయిన్లు !
నత్తనడకన సాగే ఎకానమీకి,
నివాళులొసగు హారతి కర్పూరాలు !

అంతేలే, నిరుద్యోగ జీవితాలు !
జీతం పెట్టని మహోద్యోగాలు !
శోకమనే సెలయేటిలో కాగిన
పాకంపట్టని గులాబ్జామూఁలు !

అంతేలే, నిరుద్యోగ భోజనాలు!
పూరీలు, పరాటాలు, పులావులు,
పాల పాయసాలు, పెసరపప్పు చార్లు !
పర్సు కాళి గాని పేగు కనలనీరు !


లంకెలుః పేదలు, శ్రీశ్రీ, Les Pauvres, Emile Verhaeren

16 comments:

 1. కంచల్లే మ్రేగే కాళీ చెంబులు !
  "మ్రోగే ఖాళీ చెంబులు" ఏమో ?

  ReplyDelete
 2. సర్ ఎస్స్ సర్.
  కృతజ్ఞతలు !

  ReplyDelete
 3. వావ్! వావ్!! వావ్!!! హెచ్చార్లేడీసుకు తెలుగుసేత , వారి బల్లలపై రెజ్యూమేల గతి - తెలిసినవారికెవరికైనా ఈ పద్యపు లోతు అర్థమైతీరాలి.
  రెండో పద్యంలోని "సెల్లింగ్ వన్‌సెల్ఫ్"కు, దానివెనకున్న ఇబ్బందిని చెప్పడానికీ వాడిన ఉపమానం అతికినట్టుసరిపోయింది. ఉద్యోగం వచ్చాక కూడా అది మాత్రం తప్పదు. ఆమాటకొస్తే జీవితమంతా సెల్లింగ్ వన్‌సెల్ఫే. మిగతా రెండు పద్యాలనుండీ తోడుకున్నంత అర్థం. ఈ టపాకు నేను మార్కులు వేయజాలను.

  ReplyDelete
 4. Surreal .. out of this world.

  A few typos .. jItaM peTTani .. SOkamanE ..
  etc.

  ReplyDelete
 5. బావుంది.

  సిగ్గు విడిచిన సినిమా హీరోయిన్లకి ఉన్న గిరాకి నిరుద్యోగుల అర్హతలకే ఉంటేనా, హాట్ కేకులైపోతాయవి..

  ReplyDelete
 6. "మానవ వనరుల భామల బల్లలపై,"
  ఏం మగాళ్ళెమన్నా తక్కువతిన్నారా?

  "వ్యాకరణం వాడని తిరస్కారములు !"
  నిజమే. చదివితే కదా వ్యాకరణము తెలిసేది.

  ఎక్కువ జీతం తక్కువ పని, ఉచితంగా వచ్హే "డేటింగ్ అలవన్స్", సమాయానికి హాజరైనమ్‌దుకు ప్రోత్సహకాలు, ఉద్యొగమ్‌పట్ల నిజాయితి, నిబద్దత కొరవడుతున్న తరుణమ్‌లో "అంతేలే, నిరుద్యోగ రెజ్యుమేలు!"

  సగటున ఒక రెజ్యుమేలో అనుభవమ్ నేడు ౮ నెలలకి పడిపోయింది.

  చెన్నైలోని నారాయణ రావు గారు,చదివారా ఈ కవితని?

  రాకేశ్వర‌రావు గారు, ఆ చిన్ని చిన్ని దొషాలు సవరించి ఎదేని పత్రికలో ప్రచురణకి ప్రయత్నంచండి. తెలుగు బ్లాగులోకానికి మాత్రమే దినిని పరిమితం చెయ్యడం దారుణమ్! అమానుషమ్!

  ReplyDelete
 7. చాలా బాగుందని నాకనిపిస్తోంది. కానీ
  అసమర్ధ చితులుండే శ్మశానాల్లో
  కాలని కళేబరాల పేలని పుఱ్ఱెలు !
  అంటే అస్సలు అర్ధం కాలేదు..
  పేగులు కనలనీరు అంటే కూడా అర్ధం కాలేదు.
  మొత్తానికి రాకేశ్వరా బ్లాశ్రీ నువ్వే!!

  ReplyDelete
 8. ఊకదంపుడు10:14 am, October 15, 2007

  టోపీలు తీశాం

  ReplyDelete
 9. తరువాత నిలబడాలా???????????

  ReplyDelete
 10. రాకేశ్వరుడి గురించి ఏమి వ్రాసినా తక్కువే, అందుకే ఈ మధ్య వ్యాఖ్యలు వ్రాయడం లేదు.

  తెలుగు వీర గారు, ఊ.దం. గారు ,
  :D

  ReplyDelete
 11. పద్యాలు బాగున్నాయి. నాలుగో పద్యం అర్థం కాలేదు. "కనలనీరు" బాగుంది.

  ఆ ఫ్రెంచి పద్యానికి లింకిచ్చారు, అది కూడా ఈ ధోరణిలోదేనా? మీకు ఫ్రెంచీ వచ్చా?

  ReplyDelete
 12. ఈ పద్యం గురించి నిజానిజాలు
  శ్రీశ్రీ 'పేదలు' పద్యం చదివా, ముందు అర్థం కాలేదు, తరువాత బ్రౌణ్యం సహాయంతో అర్థమయినట్టు అనిపించింది. ఎందుకో నవ్వొచ్చింది. పారడీ రాద్దామనుకున్నా.
  ఆ రోజే, హైదరాబాదులో బస్సులో ఇద్దరు నిరుద్యోగుల సంభాషణ విన్నా. ఇద్దరిలో ఒకరు దేవనిరుద్యోగి, ఇంకొకతను బ్రహ్మనిరుద్యోగి. ఆ బ్రహ్మనిరుద్యోగి వాలకం మాటలూ ఇచ్చిన స్ఫూర్తితో, నాలో నిరుద్యోగి మెరిశాడు, ఇక ఈ కవిత దివ్యతేజస్సుతో ప్రకాశించింది.

  కో.పా గారు 'సఱ్రియల్' అనే సరికి, అప్పటివారకూ మీలాగే అనుమానంతో వున్న నేను నాకు కూడా "ఒహో అయితే కవిత బాగుందన్నమాట" అనుకున్నా!

  ఇక అర్థం కాకపోవటాల మాట కొస్తే,
  "శ్లథశైశిర పలాశరీతులు","వినమ్రములు, వెతల వ్రణమ్ములు" అన్నా ఎఁవ్ అర్థమవుతుంది? అంతే కవిత్వం, అర్థమయ్యే వారికి అర్థమయ్యేది అర్థమయ్యినంత!

  Les Pauvres అంటే ఫ్రెంచిలో పేదలు అని, దానిని శ్రీశ్రీ తెలుగులోనికి అనువదించారు.

  ఇంతకీ
  నా కవితది ఆంటీ క్లైమాక్స్ అని ఎవరికీ అనిపించలేదా ?

  ReplyDelete
 13. ఏమోయ్ ! అంతర్ముఖుడివి అయ్యిపోయావా? పుస్తకాలు చదవడం, ప్రయాణాలు చేయడం , సినిమాలు చూడడం మానేశావా. ఉద్యోగవేట ఎక్కడ వఱకు వచ్చింది.

  ReplyDelete
 14. Anon గారూ
  పేరు ఇవ్వడం మరచారు.
  ఏఁవ్ అంతర్ముఖమో ఏఁవో నండి. అంతర్విహీనమైనప్పుడు ఎంత చూసినా కనిపించేది సూన్యమేగా :)

  వేటంటారా,
  ఈ అడవీ నాదే ఈ వేటా నాదే. :) (చిరుత సినిమాలో డైలాగు). అన్నట్టు చిరుతలకి చాలా తొందరగా అలసట వస్తుందట, కాబట్టి చాలా రోజులు పస్తుండాల్సివస్తుందట. నా పరిస్థితీ అదే :D

  ReplyDelete
 15. మానవ వనరుల భామల బల్లలపై,
  పింగుపాంగులాడే కుంటి కుందేళ్లు !

  How did u get this idea?? huh??

  Too good!!

  ReplyDelete