బెంగుళూరుని నేను గుర్తుపట్టలేదు!
మేడ కాంక్రీట్లారని అందానికి
బట్టలుగా సన్నని రోడ్లు చుట్టి
ఫ్లయ్యోవర్ల ఊక్సులు బిగించింది!
సాంప్రదాయం వదలి
సెక్సీగా తయారయ్యింది!
అద్దాల మేడలలోని చీకటిగదులలో
ఉక్కు సంకెళ్ళతో బందింపబడ్డ ఆత్మలు
నాక కనబడవనుకుంది.
వంతెనల క్రింద గుడిసెలకూ
ముఱికి కాల్వల ప్రక్క మకాఁలకూ
ఋజువులు చూపించమంది.
ఐదువందలకు చిల్లరడిగితే అవతలికి పొమ్మంది.
ఐద్దమ్మిడీల బిళ్ల చూపిస్తే అదేఁవిటనడిగింది.
ఆంగ్లం యాసలో కన్నడమూ
అజంత యాసలో ఆంగ్లమూ మాట్లాడి
అప్పుడే అమెరికా తిఱిగొచ్చిన
అచ్చతెలుగమ్మాయిలా, లేని
ఆత్మ విశ్వాసం నటించింది!
జాబుకీ జావాకీ ముడివేసే తెలుగబ్బాయిలతో,
'చ'కీ 'శ'కీ తేడా తెలియని తమిళ తంబీలతోనూ,
సిరిగన్నడం సిరులకోసం హతమార్చిన కన్నడిగులతోనూ
పబ్లిక్ పార్కులలో పట్టపగలు చెట్టాపట్టాలేసుకు తిరిగింది!
అందేఁవిటని మందలిస్తే
డబ్బుతీసుకొని టికెట్టివ్వని
బె.మ.సా.సం. బస్సామెలా
వినీ విననట్టు వూరుకుంది.
ఉద్యోగఁవిమ్మంటే, "మీ స్థాయికి మేఁతూగగలమా
సింగపురమో సికాగోనో పొమ్మ"ని ఎగతాళి చేసింది.
సరే వెళ్లోస్తానంటూ వెనుతిఱగబోతే,
"నువ్వు చాలా మారిపోయావు బావా" అని
భుజం మీద వాలి బోరున యేడ్చింది.
Wonderful!
ReplyDeleteసానా బాగా రాసారు సార్..:)
ReplyDeletesaaru
ReplyDeletebaavundi bengulooru bhaagotaM
hahaha.. bavundandi....
ReplyDeleteFantastic!
ReplyDeleteWhere's Rakesvara's "మరో అంపశయ్య"? When is it coming??
@ teresa, uday, ashwin, మేధా
ReplyDeleteకృతజ్ఞతలు
@ కో.పా.
ఏఁవుందండి, ఒక రోజు బెంగుళూరు వెళ్లొచ్చి దాన్నే ఒక నవలగా వ్రాసేస్తా అంతే...
అంపశయ్యలో వుండాల్సిన అన్ని అంశాలూ వుంటాయందులో..
కాస్త పేదరికం ఒక్కటే వుండేటట్టు చూడాలి.
పేదరికమే ఉండక్కర్లా .. ఉపమన్యు గారి ఇంగ్లీష్ ఆగస్ట్ చదవలే?? :-)
ReplyDeleteIt is really true and natural..To sum it up ""Amazing One"
ReplyDeleteJ C NAIDU