భాషందం, భువనందం, బ్రతుకందం

Thursday, December 11, 2008

మీ ఇంటి పేరు ఎంత తీవ్రమైనది?

మన తెలుగు వారికి మన గతంతో వున్న అది పెద్ద సంబంధం, మన ఇంటిపేర్లు. ఎప్పటినుండో మాఱకుండా వున్న మన ఇంటి పేర్లలో ఎంతో సమాచారం వుంది. వాటిని విశ్లేషిస్తే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటపడతాయి. కానీ దురదృష్టవశాత్తు, అలాంటి పరిశోధనలు ఏమీ జరుగట్లేదు. నా వంతు నేను, మీ ఇంటి పలకడానికి ఎంత తీవ్రంగా వుంటుంది అనేదానికి ఒక పరిమాణం ఏర్పాటు చేసాను. ఈ క్రింద ఇవ్వబడ్డ లెక్క ప్రకారం మీ యింటి పేరుకి ఎన్ని మార్కులు వస్తాయో లెక్కకట్టుకోవచ్చు.


మీ ఇంటి పేరుని అక్షరాలుగా విడదీయండి. ప్రతి అక్షరంలో అచ్చుకీ హల్లుకీ మార్కులు వేయండి.
నలుపు - పాజిటివ్ నెంబరు, ఎఱుపు - నెగటివ్ నెంబరు.

1) అచ్చులకు (చివరి అక్షరం పై వచ్చే అచ్చుకు ప్రత్యేకించి వేఱే చోట మార్కులు వేద్దాం)
  • 01
  • 01
  • 01
  • -10-20
  • -50-100
  • 123
  • 123
  • అఁ 10 అం 3 అః -10

2) హల్లులు
  • అల్పప్రాణులు (క గ, చ జ, త ద, ట డ, ప బ ) 0
  • మహాప్రాణులు (ఖ ఘ, ఛ ఝ, థ ధ, ఠ ఢ, ఫ భ) -10
  • అనునాశికాలు (ఙ ఞ ణ న మ ) 0
  • అవర్గీయములు
  • య ర ల వ స 0
  • -5-10-557

2.2) చ౨ జ౨ (ౘ ౙ)
  • రెండో చ 5 (చారు, చేప మొదలైనవాటిలా)
  • రెండో జ 5 (మోజు, జారు మొదలైనవాటిలా)

3) ద్విత్వాలు 2

4) సంయుక్తాలు
  1. య ర ల వ శ స ష హ కలిగిన సంయుక్తాలు -5 (త్ర, ట్ల వంటివి)
  2. పైవి లేని సంయుక్తాలు -10 (ట్న, క్త వంటివి)

5) అంత్యాక్షరం
మీ ఇంటి పేరులోని ఆఖరి అచ్చు బట్టి మీకు ఇంకొన్ని పాయింట్లు వస్తాయి.
1, ఆ 5, ఇ 0, ఈ 20, 2, ఊ 50, 10, ఏ 10, అం 5
(గమనిక - మీ ఇంటి పేరు గుంతకల్, కుకునూర్, పలాస్ వంటివైతే వాటిని బద్ధిగా గుంతకల్లు, కుకునూరు, పలాస వంటి ముచ్చటైన పేర్లుగా మార్చుకోండి, వర్నా మీరు డిస్క్వాలిపైడ్! హూఁ అంతే!)

ఉదా -
అడివి (aḍivi) 0 0 0 = 0
పుడి (puḍi) 0 0 0 = 0
దండు (daṇḍu) 0 3 2 = 5

పఱిమి (paṟimi) 0 7 0 = 7
గఱగ (gaṟaga) 0 7 1 = 8

కాజా(kāzā) 1 5,5 = 11
చావా (cāvā) 1 0,5 = 6

ఆచంట (āṭsṇṭa) - ఆ1 చం5,3 ట 0,1 = 10
వజ్జల (vazzala) 0 5,5,2 0,1 = 13
జుజ్జవరపు (jujjavarapu) 0 2 0 0 2 = 5

సరిఁగొప్పల (sarĭgoppala) 0 10 1 2 1 = 14
తఱిఁగొండ (taṟĭgoṁḍa) 0 7,10 1,3 1 = 22

తాళ్ళపాక (tāḷḷapāka) 1 5,5,2 1 0,1 = 15
పిల్లలమఱ్ఱి (pillalamaṟṟi) 0 2 0 0 7,7,1 = 17
యఱ్ఱపురెడ్డి (yaṟṟapureḍḍi) 0 7,7,2 0 1 2 = 19
చీమలమఱ్ఱి (ṭsīmalamaṟṟi) 5,1 0 0 0 7,7,2 = 22
జెఱ్ఱులమఱ్ఱి (zeṟṟulamaṟṟi) 5,1 7,7,2 0 0 7,7,2 = 38

ముక్కు (mukku) 0 0 2 2 = 4
బొజ్జా (bozzā) 0,1 5,5,5 = 16
కోలా (kōlā) - 3 5 = 8
పోలం (pōlaṁ) - 2 5 = 7

సూర్యదేవర (sūryadēvara) 1 -5 2 0 1 = -1
కాశీపట్నపు (kāśīpaṭnapu) 1 -10,1 0 -10 2 = -16
ఏలేశ్వరపు (ēlēśvarapu) 2 2 -5,-5 0 2 = -4
భైరవభట్ల (bhairavabhaṭla) -10,3 0 0 -10 -5 1 = -21
శ్రీరంగం (śrīraṅgaṁ) -5,-5,1 0,3 0,5 = -1
ఋగ్వేదం (r̥gvēdaṁ) -10 -5,2 0,5 = -8
ఝంఝూమారుతము(jhañjhūmārutamu) -10,3 -10,1 1 0 0 2 = -13
ఘటశాస్త్రి (ghaṭaśāstri) -10 0 -5,1 -5,-5 = -24
శృంగవృక్షపు (śr̥ṁgavr̥kṣapu) -5,-10,3 0 0,-10 -5,-10, 2 = -35

గద్దె (gadde) 0 0,2,10 = 12
మన్నే(mannē) 0 0,2,10 = 12
తాపీ (tāpī) 1 20 = 21
అమ్మూ(ammū) 0 0,2,20 = 52

0 నుండి 5 మధ్యలో వస్తే మీది పదారణాల.. యఱ్‌ఱ్.. మూడుమార్కుల జానతెనుగు ఇంటిపేరు, అందునా కొత్తా పాతా అందరి నోటా తియ్యగా నలిగేది అని.

5 నుండి 15
మధ్యలో అయితే, పది మార్కుల జానతెనుగు ఇంటి పేరు అచ్చతెలుఁగువారు స్వచ్ఛంగా పలికే పేరు.

-10 నుండి 0
మధ్యలో వుంటే మీది కాస్త సంస్కృత ఇంటి పేరు, మంచి తెలుగువానికి నోరు తిఱిగినా అప్పుడప్పుడూ కొన్ని వర్గాల పాతవారు, కొన్ని అభిమతాల సరిగొత్త కుఱ్ఱకార్లు పలకలేకపోవచ్చు. మీకా ఇంటి పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుంటే ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోగలరు.

15 పైన
వుంటే మీది సరిగా పలికే వారు చాలా తక్కువ, కానీ పలికిన వారి నోట వింటే మీ ఇంటి పేరే వినాలి అన్నట్టుంటుంది! ఉదా - చీ౨మలమఱ్ఱి అనడానికి కూడా చీమలమర్రి అనేస్తారు. చ కాదు చ౨ అని చెప్పే సరికి తల ప్రాణం తోకకువస్తుంది. మూగమనసులు చిత్రంలో "నా పాట నీ నోట పలకాలే చి౨లక" అనే పాటలో ఘంటశాల/నాగేశ్వర రావు , "యహే చి కాదు ట్సి" అని చెబుతాడే ఆ మాదిరి అన్నమట. కానీ అందరమ్మాయిలూ సుశీల/సావిత్రిలా తొందరగా గ్రహించలేరు సుమీ.

-10 కి క్రింద వుంటే, మీ ఇంటి పేరు కాస్త తీవ్రమైనదని భావించగలరు! ఉదా - భైరవభట్ల, శృంగవృక్షపు వంటివి. ఇవి నేటి తెలుగు జీవికి సరిగా పలకటం చాలా కష్టమౌతాయి. శృంగవృక్షం అనడానికి మహా అయితే చాలామంది స్రుంగవ్రుక్షమ్ అని అంటారు. అలానే భైరవభట్ల అనడానికి బైరవబట్ల అని సరిపెడతారు.

వచ్చే వచ్చే రోజుల్లో -8 నుండి +12 బయట వుండే ఇంటి పేర్లకు చాలా గడ్డు కాలం రానుంది. (దీనికి మినహాయింపు అంత్యాక్షరి ప్రత్యేకాలు గద్దె తాపీ అమ్మూ వంటివి - అసలయితే అంత్యక్షరి నియమం వుండకూడదు, కానీ వచ్చే రోజుల్లో జరగబోయే పరిశోధనల గుఱించి చిన్ని సూచన ఇద్దామని దాన్ని ఉంచేసాను.)

ఇంకెందుకు ఆలస్యం, మీరూ మీ ఇంటి పేరుకి మార్కులు కట్టండి, మాకు తెలియజెప్పండి. మా మార్కుల పద్ధతి మంచిదయితే, మార్కులు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లో వుండాలి. దానికి సగటు 5, సగటు డీవియేషన్ కూడా 5 వుంటుందని మా అంచనా. వీలైతే పూర్తి వివరాలు త్వరలో :)


నెనర్లు
౧) అన్నిటికంటే ముఖ్యమైన ఇంకో విషయం, మీ ఇంటి పేరు గనక ఈ చిట్టాలో లేకుంటే అక్కడ వేంటనేఁ జేర్చగలరు.
౨) లిప్యంతరీకరణ - కొలిచా౨ల(8) గారి ఈమాట సౌజన్యం.

30 comments:

  1. చాలా ఆసక్తికరంగా ఉండింది.
    ఇలాంటివి ఏ పత్రిక లోనో చూస్తే నేను బర్రు మంటూ స్క్రోల్ డౌనో, ఇంకో లింకో టక్కున క్లిక్కు చేసేవాణ్ణి. మీర్రాశారని తెలియడం వల్లనో, రాసిన విధానం వల్లనో, చివరి వరకూ అసక్తిగా చదివాను.

    భలే, భలే.. నా స్కోరు గుండు సున్నా. సున్నా వస్తే ఆనందపడాలేమో ఈ సందర్భంలో :-)

    ReplyDelete
  2. ఆచంటవారి రాకేశ్వరా

    ఇల్లాంటి "అవుడియా"లు మీకు తప్ప అన్యులకి సాధారణంగా తట్టవు అని నేను రూఢి చేసుకుంటున్నాను.

    ఒక సందేహం. ఉపద్రష్ట (upadrashta) అన్న ఇంటిపేరు విషయంలో 0 0 5 5 = 10 గా తీసుకోవాలా లేక 0 0 5 10 = 15 గా తీసుకోవాలా?

    ఋద్వేగం ఇంటిపేరు... (వినడం కూడ ఇదే మొదటిసారి). మొదట చూసి ఋగ్వేదంగా చదివేసి, తరువాత యథాలాపంగా చూసినపుడు తెగ హాచ్చెర్యపోయి అనుమానం తీర్చుకోవడానికి transliteration కూడ చదివి... బోలెడంత సేపు నిర్ఘాంతపోయాను.

    ReplyDelete
  3. kumar గారు,
    గుండు సున్న చాలా ప్రత్యేక స్కోరు, మీకు వచ్చిందంటే నాకు నమ్మసక్యంగా లేదు. మీరు చిన్న పొఱపాటు చేసి వుండవచ్చు, మీ ఇంటి పేరు చెప్పగలరా?

    రఘావ,
    అవును ఇంత ఘోరమైన పనికి రాని ఉపాయాలన్నీ నావే!!
    ఉపద్రష్ట - ఉ 0, ప 0, ద్‌ర -5(సంయుక్తం), ష్‌ట -10-5 (ష, సంయుక్తం), అ 1 = మొత్తం -19

    ఋగ్వేదం సరైనది. ముద్రారాకేశ్వరం (మద్రారాక్షసం కంటే ఘోరమైనది). కానీ దాని స్కోరు మారుదు !

    ReplyDelete
  4. బావుంది..ఇంతకీ ఎలా వచ్చింది మీకు ఈ అవిడియా...?!
    అన్నట్లు నా స్కోర్ - 10 :)

    ReplyDelete
  5. ఇంటిపేర్లపై పుస్తకాలేవో వచ్చినట్టున్నాయిగానీ, ఇలా దాని విలువను లెక్కగట్టి, అందులో ఏమాత్రం తెలుగుదనముందో తేల్చజూసిన ప్రయత్నం మాత్రం ఇదే మొదటిదయుంటుంది. రాఘవ గారన్నట్టు, ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు మీకే సొంతం. చావాలో చకారం 'చ'కారమే, 'ౘ'కారం కాదనుకుంటా.

    ReplyDelete
  6. అబ్బా! ఆలోచించాల్సిన..కాదు కాదు లెక్కించుకోవాల్సిన విషయమే!

    ReplyDelete
  7. నా స్కోరు రెండు, అహో నాది జానతెలుగు ఇంటిపేరు :)

    ReplyDelete
  8. మా ఇంటి పేరు ఇక్కడ లేదు.
    చేర్చండి మరి "బొమ్ము" ని.
    ముద్దుగా స్నేహితులంతా పిలుస్తారు "బొమ్మా" అని

    ReplyDelete
  9. నేనొప్పుకోను. ఒప్పుకోనంటే ఒప్పుకోను!
    నాకున్న ఒక్కగానొక్కగానొక్క ఇంటిపేరునీ తీవ్రమైనదిగా లెక్కగట్టడాన్ని నేను తీవ్రాతితీవ్రంగా ఖండిస్తున్నాను అధ్యక్షా!
    బెంగాలీ వాళ్ళ నోళ్ళల్లో అయిదేళ్ళు నా పేరూ ఇంటిపేరూ చిత్రహింసలు పాలైన ఆ గత జ్ఞాపకాలు మళ్ళీ సుళ్ళుతిరిగి, కళ్ళల్లో నీళ్ళు తిరిగేలా చేసిన మీరు, ఇంతకింతా అనుభవించాలనీ, వచ్చే జన్మలో శృంగవృక్షపు వాళ్ళింట్లో పుట్టి భృంఘేశ్వరరావు పేరుతో విఖ్యతి గాంచి, రోజూ టీవీ ఏంకర్ల నోళ్ళలో మీ పేరు నూరేళ్ళూ నానాలని శాపమిస్తున్నాను!

    ReplyDelete
  10. నా మార్కులు 3 నా పేరుకి తెలుగు సోకినట్లేనా?

    ReplyDelete
  11. భైరవభట్ల, మీశాపం చాలా దారుణంగా ఉంది. ఱ,ఌ,ౡ లు లుప్తమైపోతున్నాయన్న బాధనే తట్టుకోలేని రాకేశ్వర, ఈ ఘోరమైన శాపాన్ని తట్టుకోగలరా.. లేరూ, లేరూ, ల్లేఱు!

    ReplyDelete
  12. కామేశ్వరరావుగారూ, చదువరిగా రన్నది నిజం. పాపం ఱాకేశుడు! ఐనా మీ శాపం బావుంది... శృంగవృక్షపు భృంగేశ్వరరావు :D శాపవిమోచన మార్గం కూడ సెలవీయండి.

    ReplyDelete
  13. శృంగవృక్షపు భృంఘేశ్వరరావు !!
    కామేశ్వవరావు మేష్టారూ, ఇది మామూలు శాపం కాదు !!
    రాకేశ్ తరపున నేను అడుగుతున్నా, దయచేసి శాపవిమోచన మార్గం శెలవివ్వండి :)

    ReplyDelete
  14. Start Quote: > కానీ దురదృష్టవశాత్తు, అలాంటి పరిశోధనలు ఏమీ జరుగట్లేదు. End quote

    మీరు సరదాగా రాసారో, serious గానో రాసారో నాకు తెలియదు కానీ, పై వాక్యం నిజం కాదు. (ఇంటి) పేర్లని చదవడం/పరిశోధించడం భాషాశాస్త్రంలో ఒక భాగం. Onomastics/Onomotology అంటారు. తెలుగులో చాలా పుస్తకాలే వచ్చాయి. ముఖ్యంగా యార్లగడ్డ బాలగంగాధరరావు (కొద్దేళ్ళ క్రితమే నాగార్జున యూనివర్సిటీ నుండి రిటైర్ అయ్యారు.), ఆయన విద్యార్థులు రాసినవి. ఇంకా లోతుకు వెళ్తానంటే భద్రిరాజు కృష్ణమూర్తిగారు ఆంగ్లంలో రాసిన వ్యాసాలున్నాయి.

    భవదీయుడు,
    శ్రీనివాస్

    ReplyDelete
  15. కామేశ్వర రావు గారు,అయ్యో వున్న మాట చెబితే ఇంత ఆగ్రహం దేనికండి :)
    ఇప్పుడింకో "శృంగవృక్షపు సూరి" అనే వ్యక్తి వచ్చి, ఏమిటి నా ఇంటి పేరు వుంటే శాపమా అని గోల చేస్తారేమోనని భయంగా వుంది. భృంఘేశ్వరం గుఱించి చెప్పనక్కరలేదు, ఆ పేరు ఉన్నవాడు ఈ పాటికి దాన్ని మార్చుకుని, అతని తల్లిదండ్రుల మీద దావా కూడా వేసివుంటాడు :)

    ఇక శాపం విషయమై, ఇప్పటికే నాకు ఒక భయం వుంది. నేను కఌప్త అనే అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే, ఆవిడ "ఏవఁండి, నా పేరు కాస్త కంప్యూటరులో వ్రాసి చూపిద్దురూ" అని అడిగితే, ఆచ౨ంట కఌప్త అని, రెండు(౨) చ నెత్తమీద వచ్చేట్టు, ఌ క క్రింద వచ్చేట్టు ఎలా వ్రాయాలా అని! :)

    ReplyDelete
  16. @ శృతి గారు,
    బొమ్ము ఇంటి పేరు కూడా చాలా బాగుంది, వికీపీడియాలోఁ జేర్చాను. బొమ్మి అనుంటే అరవ సినిమా చన్‌తిరముగి (చంద్రముఖి) లో ఒక పాటకి భలే బాగా సరిపోయేది.

    @ శ్రీనివాస్ గారు,
    నేను ఈ టపా సరదాగా వ్రాసినా, నాకు భారత భాషల్లో తగిన పరిశోధనలు జరగట్లేదనే బాధ అంతర్గతంగా వుండనేవుంది.
    మీరు ఇచ్చిన వివరాలకు ధన్యవాదాలు, ఎక్కడైన పైన చెప్పబడ్డ పుస్తకాలు దొరికితే కొంటాను.
    అన్నట్టు మీరు బ్లాగు మొదలు పెడితే చాలా బాగుంటుంది, నా లాంటి కొత్త తరం భషౌత్సాహకులకు. (చాలా మంది చాలా సార్లు మీకు విన్నవించుకున్నా - శిశుపాలిడి వంద తప్పుల్లా, మా అభ్యర్థనలు కూడుకుంటాయేమోననే ఆశతో). :)

    ReplyDelete
  17. నా ఇంటి పేరు లెక్కలెయ్యలేదు గానీ టపా అవిడియా అద్భుతం!

    ReplyDelete
  18. రాకేశా,
    దీనికి ఓ శాస్త్రం ఉందా? భలే, ఎప్పుడూ విన్లేదు, సరదాగా బాగుంది. నాకు -౫. అది సరే, ఈ టపాకి ఏదైనా మూలం ఉందా లేదా "స్వయంకృషా" :-)

    ReplyDelete
  19. 0 నుండి 5 మధ్యలో వస్తే మీది పదారణాల.. యఱ్‌ఱ్.. మూడుమార్కుల జానతెనుగు ఇంటిపేరు, అందునా కొత్తా పాతా అందరి నోటా తియ్యగా నలిగేది అని.

    5 నుండి 15 మధ్యలో అయితే, పది మార్కుల జానతెనుగు ఇంటి పేరు అచ్చతెలుఁగువారు స్వచ్ఛంగా పలికే పేరు.
    ----------------------------------------------

    మఱి 5 వస్తేనో?

    ReplyDelete
  20. @ వికటకవి గారు,
    ఇది స్వయంకృషే. ఎప్పుడో ఆఱునెలల క్రితం నాకు ఉపాయం వస్తే, అప్పుడే టపా వ్రాసి పెట్టాను. ఇప్పుడు ముద్రిస్తున్నాను.

    @ ఇస్మయిల్ గారు,
    ౫ వస్తే మీ ఇష్టం మీకు పైది నచ్చితే పైది, క్రింది నచ్చితే, క్రిందది ఎంచుకోవచ్చు. :) కంప్యూటర్లలో బగ్గులు ఇలానే పుడతాయి :)

    రాకేశ

    ReplyDelete
  21. గురూ గారు కొంచెం మా ఇంటి పేరుకి ఎన్ని మార్కులొచ్చినయ్యో కొంచెం చెప్పండి.
    బొల్లోజు

    ReplyDelete
  22. బరాకేష్ గారూ,

    ఇంటిపేర్లపై ఇంత 'తీవ్ర'వాదం చేయవచ్చని నేను ఊహించనైనా లేదు. మీ ఈ తీవ్రమైన టపాకు అభినందనలు!

    ReplyDelete
  23. బొల్లోజు బాబా గారు, మీ ఇంటి పేరు zu అని పలికితే 12 మార్కులు వేసుకోండి. లేకుంటే 7 మార్కులు వేసుకోండి.

    ReplyDelete
  24. వావ్! కామేశ్వరరావుగారి శాపం మీకు వరమౌగాక!!

    ఇంటిపేరు సరే, నా అసలుపేరునే భారతంలో చాలామంది సరిగా పలకరు. అసలు వాళ్లు వినడమే మరోలా వింటారనుకుంటా, నేను పేరు చెప్పగానే వాళ్లకు వినబడిన రీతిలో తిరిగిపలుకుతారు. చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను. :)

    ReplyDelete
  25. రామనాథ అనడానికి అందరూ రామనాద అంటూంటారు.
    నేనే మొన్నట్టివరకూ థ,ద,ధ లకు తేడా చూపించేవాడిని కాడు.

    ReplyDelete
  26. @ ఇస్మయిల్ గారు,
    అన్నట్టు మీ ఇంటిపేరులో అరసున్నా పెట్టుకోవచ్చు.
    పెనుఁగొండ -> 15 మార్కులు.
    అయినా మీరు సరిహద్దులో వున్నట్టేననుకోండి :)

    ReplyDelete
  27. నా లెక్క ప్రకారం 5 అయినా, మీ అరసున్నతో 15 అయినా మొత్తానికి నా
    ఇంటి పేరు అచ్చమైన 'జానతెనుగు ఇంటి పేరు - అచ్చతెలుఁగువారు స్వచ్ఛంగా పలికే పేర'హో! అహో! అహో!

    ReplyDelete
  28. అబ్బా! నాకు ఒక్ఖ మార్కులో గుండుసున్నా పోయింది... సున్నాకు నేను పైనున్నా.

    ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం