భాషందం, భువనందం, బ్రతుకందం

Tuesday, December 16, 2008

ఇంటి పేర్లలో చివరి అక్షరం గణాంకాలు

మీ ఇంటి పేరు ఎంత తీవ్రమైనది? తరువాయి.


అ 30.5% (ప్రతి 10 లో మూఁడు)

ఆ 4.9% (ప్రతి 20 లో ఒకటి)

ఇ 41.6% (ప్రతి 5 లో రెండు)

ఈ 0.2% (ప్రతి 450 లో ఒకటి)

ఉ 16.1% (ప్రతి 6 లో ఒకటి)

ఊ 0.02% (ప్రతి 3000 లో ఒకటి)

ఎ,ఏ 1.5% (ప్రతి 66 లో ఒకటి)
అం 5.1% (ప్రతి 20 లో ఒకటి)



ఇంటిపేర్లలో చివరి అక్షరం



కొన్ని ఉదాహరణలు

ఎ, ఏలు
అందే, అన్నె, అన్నే, గద్దె, గాదె, ఆదె, ఆరె, ఏగే, కళువె, కామిరె, కాసె, దివిటె, దుట్టె, నార్నె, ---పల్లె (మునిపల్లె, రెడ్డిపల్లె మొ||), లాదె, వడ్డె ...
ఎ,ఏలని వేఱేగా చూడడం నాకైతే అనవసరమనిపిస్తుంది, ఉదా - అందె అన్నా అందే అన్నా తేడా వుండదు కదా ? ఇక పల్లె అని వచ్చేవాటిని పల్లి అని మార్చేయవచ్చు, ఉదా - మునిపల్లి, రెడ్డిపల్లి.


కాశీ, తాపీ, దబ్బిడీ, బహిరీ.
ఇందులో కూడా చాలా సార్లు ఉన్న ఇ కే దీర్ఘం ఇవ్వచ్చు. ఉదా- కాశీ అన్నా కాశి అన్నా పెద్ద అర్థం మారదుగా. కానీ తాపీ మాత్రం ఈ తోనే ముగించాలి. కాబట్టి ఈ లెక్క కూడా వివాదాస్పదం.


అమ్మూ
నాకు ఇదొక్కటే తారసపడ్డాది. కానీ క్రిత టపాలో శృతిగారు వారి ఇంటి పేరు బొమ్ము అన్నారు, దాన్ని బొమ్మూ అనీ వ్రాసుకోవచ్చు మఱి. కాబట్టి ఉ,ఊ లను వేఱు వేఱుగా భావించడం నాకు ఒప్పట్లేదు.


రోమనులో వ్రాసినపుడు. a,i,u,e,m (అ,ఇ,ఉ,ఎ,అం) లతో ముగిస్తున్నాయని భావించి ఈ ఐదిటికే లెక్క కడితే, అన్నిటికన్నా అఱుదైనవి ఎ తో ముగిసే ఇంటిపేర్లు. ఆ పంచాంతాలలోఁ గూడా ఎ, అం లకు చివర పు చేర్చేయవచ్చు. ఉదా- ధర్మవరం - ధర్మవరపు, మన్నె - మన్నెపు.

కాబట్టి ఇంతా చేస్తే తెలుగింటిపేర్లు అ, ఇ, ఉ లోనో ముగుస్తాయని భావించవచ్చు! (నేను మొన్నటి వఱకూ అలానే అనుకున్నాను - ఈ పరిశోధన తరువాతే ఎఅంతాలు, ఈఅంతాలు తారసపడ్డాయి)

తెలుఁగు భాష అజంతం
తెలుఁగు పాట అమృతం

3 comments:

  1. రాకేశ్వరా, వేరే ఏమీ లేనట్టుగా ఇంటిపేర్ల మీద పడ్డావెందుకు? ఏదైనా రహస్యమా? నా చెవిలో చెప్పచ్చు కదా! :)

    ReplyDelete
  2. ఇంటిపేర్ల మీద ఎంత పరిశోధన చేస్తున్నారండి, అబినందనలు.

    మీ శ్రమకి మీకు ఓ డాక్టేరట్ ఇవ్వచ్చు(నిజంగానే అంటున్నాను..ఏ మాత్రం అర్హత లేని సానియా మీర్జాకి ఇవ్వంగా లేంది, ఇలాంటి వాటికి ఎందుకివ్వకూడదూ?)
    చాల ఆరుదుగా వినిపించే ఇంటిపేర్లకి (అంటే "ఊ" తోటి "ఈ" తోటి అంతం అయ్యే వాటికి) కొన్ని ఉదాహరణలు కూడా ఇవ్వండి.

    ReplyDelete
  3. @ రాఘవ,
    ఏమీ లేదు, ఏదో "పని లేని స్టాటిస్టీషియను ఇల్లు పేర్లుఁ గొరిగాడఁట" :)
    క్రిత పోస్టులో అంత్యాక్షరానికి ఎన్ని మార్కులు ఇవ్వాలని ఆలోచిస్తున్నప్పుడు, ఏది అఱుదైతే దానికి ఎక్కువ ఇవ్వాలి కద, అందుకే ఈ లెక్కులు వేయల్సివచ్చింది.
    ఉదా - ఇ సగం ఇంటి పేర్లలో వుంటుంది కాబట్టి దానికి సున్నా, అలానే ఈ చాలా తక్కువ ఇంటి పేర్లకు వుంటుంది కాబట్టి దానికి ఎక్కువ ఇవ్వడం వంటివి.

    @ సిరిసిరిమువ్వ గారు,
    ఈ మాత్రం దానికే డాక్టరేటు అని చెప్పి, మీరు ఇంటిపేర్ల మీద తెలుగు భాష మీద అసులు పరిశోధన చేసే వ్యక్తులను బాధపెడుతున్నారు. :)
    మీ కోరిక మేరకు టపాకి కొన్ని ఉదాహరణలు చేరుస్తాను.

    ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం