భాషందం, భువనందం, బ్రతుకందం

Tuesday, January 20, 2009

నీచమానవులు

కార్యసాధన విషయంలో మనుషులు మూఁడు రకాలుగా ఉంటారని చెబుతూ ఉదరహించే పద్యం ఆరంభింపరు నీచమానవులు. భర్తృహరి రచించిన ప్రారభ్యతే న ఖలు అనే సంస్కృత పద్యాన్ని ఏనుగు లక్ష్మణ కవి తెనిగించారిలా

శా|
ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాససంత్రస్తులై

యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్
ధీరుల్ విఘ్ననిహన్యమానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై
ప్రారబ్ధార్థము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్

ఏదైనా పని మొదలుపెట్టినపుడు ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెరవక తుదికంటా లక్ష్యం కోసం శ్రమించడమే కార్యసాధకుడి నైజం. అలాంటి వారు ఉత్తములు. ఎప్పుడో ఎదురయ్యో అడ్డంకులను తలచుకుని ఏ పని చేపట్టని వారు అధములు. ఏదో చేయలన్న తపనతో మొదలుపెట్టినప్పటికీ మధ్యలో ఆటంకాలు ఎదురవగానే వదిలేసేవారు మధ్యములని ఊ పద్యభావం.

-
ఈ పద్యం నాకు నిన్న కంటఁబడింది. బాగా నచ్చి బ్లాగులో పెట్టుకుందాం ఇంబలువురి కంటఁబడుతుందని ఇలా పెడుతున్నాను. సువాస భారతీయులు ఎవరో ఈ పద్యాన్ని నిన్న చూసేవుంటారు, ఎక్కడ చూసారో చెప్పఁగలిగితే, పుణ్యం (గుడ్ కార్మా) వస్తుంది.

1 comment:

  1. రాకేశ్వరులవారూ, ఈ పద్యాన్ని చిన్నప్పుడు బళ్లో ఉన్నప్పుడు అనుకుంటాను చదువుకున్న గుర్తు. నాకు తఱచుగా గుర్తొచ్చే కొన్ని పద్యాల్లో ఇదీ ఒకటి. ఎందుకు గుర్తొస్తుంది ఏమిటి దీనిలో నచ్చిన విషయం ఇత్యాది విషయాలు... అమ్మా ఇక్కడ కాదు, తరువాత చెప్తాను ;)

    ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం