భాషందం, భువనందం, బ్రతుకందం

Friday, May 22, 2009

గాడిద స్వామ్యం

అనగా అనగా ఓ గాడిద
దానికున్న ఆస్తల్లా కాస్త బూడిద

ఐతేనేం, పట్టింది దాని కదృష్టం
ఎన్ని దేవుళ్ళని మోసిందో దాని పృష్టం!

ఉత్సవాల్లో దేవతా విగ్రహాలని మోసింది
ఊరిజనం కైమోడ్పులు తనకేనని భ్రమసింది.

ఇంతమంది భక్తులు తనకుండగా
ఎన్నికలకి నిలబడకపోవటం దండగ

అని తలపోసి నామినేషన్‌ పడేసింది;
ఐతే, ఇక్కడ ఈసప్‌ కథ అడ్డంగా తిరిగేసింది.

గార్దభాన్ని మక్కలిరగ తన్నక పోగా
జనమంతా గాడిదలయారు చిత్రంగా.

గాడిదకి ఓటు వేసి గెలిపించుకున్నారు.
గాడిదస్వామ్యం తమదని నిరూపించుకున్నారు.

- ఇస్మాయిల్ యొక్క "రాత్రి వచ్చిన రహస్యపు వాన" నుండి (ఈమాట వారి సౌజన్యంతోఁ)

5 comments:

  1. నిజమే గాడిద స్వామ్యం.

    ReplyDelete
  2. మన ప్రజాస్వామ్య తీరుతెన్నులను తెలియచేసారు నిజంగా మనది గాడిదస్వామ్యమేనండి మీకు మరియూ ఇస్మాయిల్ గారికి నా ధన్యవాదాలు

    ReplyDelete
  3. మనకి నచ్చినవాడు గెలిస్తే పెజ్జా(గ్గా)స్వామ్యం, నచ్చనివాడు గెలిస్తే గాడిదస్వామ్యం, సెబాసో, ఏమి సామ్యమండీ ;)

    ReplyDelete
  4. రాకేశ్వరా,

    మీరిచ్చిన వికీ లంకె స్మైల్ గారిది. ఇస్మాయిల్ గారు, స్మైల్ గారు స్నేహితులు. వీరిద్దరి విషయంలో చాలా మంది ఇలాగే కన్‌ఫ్యూజ్ అయ్యారు.

    ఏమైనా మంచి కవితని పంచుకున్నారు.

    అభినందనలు.

    ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం