భాషందం, భువనందం, బ్రతుకందం

Thursday, May 14, 2009

చెవిటి వాని ముందు శంఖం

చెవిటివాని ముందు శంఖం వూదితే, దాన్ని కొఱకడానికి నీ తాతలు దిగిరావాలన్నాట్ట! బ్లాగ్లోకం కూడా వెనకటిలాలేదు. అనామిషులూ ముక్కూ మొఖం లేని నెలతక్కువ బడుద్దాయిలు ఎక్కువయ్యారు. ఏ పుంతలోనుండి ఏ చెంబు పట్టుకొని ఎవడు వచ్చి విసర్జించి పోతాడో తెలియకుండా వుంది. అందుకే క్రిందటి టపా తీసేయడమైనది.

త.క- మీ అసౌకర్యార్ధం, భావి తరాలా సమాచారార్ధం ఇక్కడ దాన్ని జత చేస్తున్నాను. దయచేసి చదవద్దు. ఇది భావితరాలకు మాత్రమే.

------------
లంజాకొడుకు అద్వైతం
మీకు టపా శీర్షిక పరుషంగా అనిపించి కోపం వచ్చి, కూడలిజల్లాడాదులధిపతులకు నా బ్లాగును లంకించడం మానేయాలని అభ్యర్ధిస్తే, మీరు బుద్ధుడు కదన్నమట. ఆయనీపాటికే నా బ్లాగుకు రావాలి, వచ్చాడేమోనని ఇలా శీర్షిక పెట్టాను. కానీ పాడు విధి వక్రించింది ఆయన రాలేదు. ఈ విధి ఎప్పుడు వక్రిస్తుందేగానీ ఒక్కసారైనా అవక్రిస్తుందేమో చూద్దాం అనుకుంటే, అబ్బే లాభం లేదు, విధి విధి ఎప్పుడూ వక్రించేవుంటుంది.

మీరు ఏ గౌతమబుద్ధుడో, ఆదిశంకరాచార్యుడో అయితే మీకు కోపం వచ్చేది కాదు. ఎందుకంటే వారికి అద్వైతం ఎఱుక. మనకి ఎఱుక కాదు. అద్వైతం అంటే అందరికీ తెలిసు. ఏముంది, అన్నీ ఒకే పదార్ధం నుండి పుట్టాయి, మళ్ళీ అన్ని ఒకే పదార్ధంలోనికి వెళిపోతాయి. ఈ మాత్రం విషయం మీ బామ్మగారినడిగితే చెబుతుంది, "ఏముందిరా, మట్టిలోంచి పుట్టాం మట్టిలోకే పోతాం". మీ బామ్మగారు ఆమె మాట మీద నిలబడి ఇప్పటికే మట్టిలో కలసిపోయుంటే , ఎనిమిదో తరగతి చదివే మీ మనఁవరాలినడగండి చెబుతుంది, "తాత్‌గరూ, మన సన్ను మూడో జనరేషన్ స్టార్ అంట. అంటే ఇంతకు ముందు ఒక స్టార్ క్రియేట్ అయ్యి, అది డిస్ట్రాయ్ అయ్యి, మళ్ళీ క్రియేట్ అయ్యి... అలా త్రీ టైమ్స్ జరిగి ఇప్పుడు సాలార్ సిస్టమ్ అయితే మనం దాని మీద లివ్ చేస్తున్నామఁట". మీరు లోలోపల మీ మనఁవరాలి ఆంగ్ల చదువులకు ముఱిసిపోతూనే, బయటకు కోపం అభినయిస్తూ, "నువ్వేమయినా చూసొచ్చావా మూఁడు సార్లు జరగడం" అని అడుగుతారు. కానీ ఇక్కడ పాయింట్ అది కాదు. ఒక లక్ష కోట్ల ఏండ్ల క్రితం మీ ప్రస్తుత శరీరంలోని పరమాణువులన్నీ ఏదో ఎక్కడో అంతరిక్షంలో తిరుగుతూవుండేవని మీరు ఒప్పుకోక తప్పదు.

కాబట్టి, ఒక విషయం తెలియడం తేలికే, అది తెలిసినట్టు ప్రవర్తించడం వేఱే పని. మనందరికీ అద్వైతం తెలిసినా, అది నిత్యం ఎఱింగి అలా నడుచుకోవడం వేఱే. ఉదా- మీకు తెలుసుఁ ప్లాస్టిక్కు ఐదు లక్షల ఏండ్లు భూమ్మీదనలానే శనిలా పడుంటుందని, కానీ పెళ్ళిల్లో రైళ్ళలో వాటిల్లోంచే నీళ్ళు తాగుతాం. కాబట్టి మనకు అద్వైతం తెలిసినా మనల్ని ఎవరైనా లంజాకొడకా అంటే మనకు కోపమే వస్తుంది.

ఇంతకీ ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, నేను క్రిత టపాలో ఒక కందం పద్యం వ్రాసాను. నా మొదటి సర్వలఘుకందం. దాంట్లో ఒక బూతు పదం అవసరమైంది. నేను బూతుపదాల్లో నమ్మను. కొందరు "దేవుడు లేడు, ఉంటే ఏడి చూపించి" అన్నట్టు, నేను "బూతుపదం లేదు, వుంటే ఏది చూపించు" అని అడుగే బాపతు. కానీ దేవుణ్ణి చూపమనేవారు కూడా తిరుపతి వెళ్ళివచ్చినట్టు, నేను కూడా క్రిత టపాలో గణికకొడుకులు అనే మాటవాడాల్సివచ్చింది.
కం. పలుపలు వరములు జనులుకుఁ
గలుపుదుమనుచును గలగలఁ గడు కపటములన్
బలుకుచు గెలుపుల కలలలొఁ
గులుకుచుఁ గదిలె డల గణిక కొడుకులఁ గనుమా
లంజాకొడకా అని ఎందుకు వాడలేదని మీరడగవచ్చు. దానికి రెండు కారణాలు. నేను వ్రాసింది సర్వలఘు కందం. కాబట్టి జా,లం వంటివి వాడకూడదు. అదే తెనాలి రామలింగడు వ్రాసిన గంజాయి తాగి పద్యం లోనయితే ముచ్చటగా వాడుకోవచ్చు.
కం. గంజాయి త్రావి తురకల
సంజాతము చేసికల్లు చవి గొన్నావా
లంజల కొడకా ఎక్కడ
కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్
రెండవ కారణం, నేను వ్రాసిన పద్యంలో క,గ,ల,లు అనుప్రాస. గణికకొడుకులు లో క,గ,లలు ఐదు వచ్చాయి. కూల్ కదా.

మొత్తానికి అలా "అల గణికకొడుకులని రాజకీయనాయకులతో పోల్చి చెప్పినందుకు" వారికి క్షమాపణ చెప్పుకోవడం కుదరలేదు క్రిత టపాలోఁ. అందుకే ఇంకో టపా వ్రాయాల్సివచ్చింది. అసలు లంజాకొడుకులు అవడంలో వారి తప్పేముంది? మీ నాన్నగారు ఫలానా కారు సేల్సుమానో, అడ్వర్టైజింగు మేనేజరో, రాజకీయనాయకుడో, బాక్సైటు గనుల గుత్తేదారో, ఇతరత్రా ద్రోహచింతనాత్మక వ్యాపరస్థులో అవడంలో మీ తప్పేముంది. మీరు వారిని కన్నారా, పెంచారా, కేవలం మీ విధి తన అలవాట్లు మానుకోలేక వక్రించడం వల్ల మీరు వారి కడుపున పుట్టారు. లంజతండ్రి అనేది తిట్టుగాని లంజకొడుకు తిట్టుఎలా అవుతుంది?

అయినా మీరు వేశ్యాంగనకు జన్మించారే అనుకుందాం, వారి వృత్తిలో తప్పేముంది. వారు ఎవరినైనా మోసం చేశారా? లేదు. కాయకష్టం పడి సంపాదించారు. కాయకష్టం పడకుండా బోలెడంత సంపాదించే సాఫ్టువేరోళ్ళ కన్నా వీరు ఏమాత్రం హీనులు కారు. శరీరావసరాలకు వాళ్ళని వాడుకొని, సంఘంలో నొక మూలకు తోసిన మీ పేరు బూతు. సంఘం అనే మాట బూతు. అయినా నేను ఇందాక చెప్పినట్టు బూతుల్లో నమ్మను, "ఏదీ ఈ సంఘం ఎక్కడుంది? చూపీ నాకు". నాలుగు గాడిదల వయస్సు వచ్చినా మీరు పెళ్ళి చేయని మీ అబ్బాయి ఆరాటం ఏట్లోకట్ల కిందా మీదా పడి మాన్పించే స్త్రీయోత్తములు, నీరాటవనాటములు పోరాటపడ్డప్పుడు భద్రకుంజరపు ఆరాటము ఘోరాటవిలోన మాన్పిన పురుషోత్తముని సమానులు కారా? ఏరి మాట్లాడరే ఎవరూను? నోరు పడిపోయిందా?

గుఱజాడ కన్యాశుల్కం (Girls for Sale) చదివి కూడా, మధురవాణిగా సావిత్రిని చూసికూడా వారిని చిన్నచూపు చూసే మీరు
+ చేసేది మనోలంజరికం. ఇది కూడా బూతు కాదు, తప్పుడు పనీకాదూ, అయినా మీ దయాత్మక సమాచారం కోసం చెబుతున్నాను. <+ ఇక్కడ మీరు అంటే కొన్ని సామాజిక వర్గాలని హీనంగా చూసేవారు మాత్రమే>

మీమల్ని ఎవరైనా పలానా తలారి సుబ్బయ్య కొడుకు అని పరిచయం చేయబోతే, మీరు అబ్బే కాదండి, ఫోన్లు, మైకు సెట్లు వంటి వున్న ఈ రోజుల్లో ఇక తలారితనం ఎవరు చేస్తున్నారండి, మా అయ్యకూడా కూలి పనిలోకే వెళ్తున్నాడు, అని వివరిస్తారా లేదా. అలాగే ఎవరైనా మనల్ని లంజాకొడకా అంటే, మనం కూడా అబ్బే కాదండి, టీవీ, సినిమాలు, ఐటెం సాంగులు, ఇంటర్నెట్టు వంటి వున్న ఈ రోజుల్లో ఇక లంజరికం ఎవరు చేస్తున్నారండి, మా అమ్మకూడా కూలి పనిలోకే వెళ్తుందండి. అని వివరించుకోవాలి. అలా కాకపోతే, ఏ రిప్రడక్టివ్ థెరపిస్టు అనో, నాన్ లీనియర్ ఎడిటర్ అనో, స్పేస్ షటిల్ ప్రోగ్రామర్ అనో వివరించుకోవాలి.

అలా మొత్తానికి బుద్ధుణ్ణి మనం వేశ్యాసుతుఁడని స్తుతించినా ఆయనకు తేడావుండదు (చాలా రాజకీయనాయకులుకు చేతినిండా పని చిక్కుతుందనుకోండి). ఎందుకంటే అద్వైత స్వరూపుణ్ణి ఏమని పిలిచినా ఒకటేగా. చేపగా పుట్టినోడు, పందిగా పుట్టినోడు, తాబేలుగా పుట్టినోడు, రాజుగా పుట్టినోడు, గొల్లవానిగా పుట్టినోడు, బ్రాహ్మణపిల్లవాడిగా పుట్టినోడు, అలానే వడ్రంగిగా ఖండాంతరంలో పుట్టిన వాడు. పిల్లిగా వేరేదో దేశంలో పుట్టిన వాడు. అలగే ఇతర పశు పక్ష జంతాదులుగా పుట్టిన వాడు. స్త్రీగా పుట్టినది. వేశ్యగానే పుట్టినది. అసలు పుట్టనేపుట్టనిది. అట్టిదానిని ఏమని పిలిస్తేనేం. అట్టిది వేశ్యకడుపున పుడితేనేం?

అసలు బూతు అనేది వినేవాడి చెవిలోనుంది. ఉదా- మీరు ఎవరినో ఒకరిని సరదాకి "రండి రాజశేఖర రెడ్డిగారు" అని మర్యాద చేస్తే; అతను కాంగ్రేస్ కార్యకర్త అయితే సంబరపడిపోతాడు. తెలుఁగుదేశం కార్యకర్త అయితే, మిమ్మల్ని మళ్ళీ ఏ లంజాకొడుకనో అంటాడు. అతని దృష్టిలోనది బూతు కాబట్టి.

అర్థమయ్యిందనుకుంట వేదాంతం. అయితే మనకు ఇప్పుడో చిక్కువచ్చిపడింది. నా పద్యంలో అల గణికకొడుకుల గనుమా అని అంటే రాజకీయనాకులను మెచ్చుకున్నట్టుంటుంది గాని తిట్టినట్టు వుండదు. అయితే ఇప్పుడేం చేద్దాం. యు నో వాట్... తఱించి చూస్తే మనమెవ్వరం బుద్ధులం గాము. ఆచార్యులమూ కాము. కాబట్టి పద్యాన్ని అలానే వదిలేస్తే సరిపోతుంది.

<ఇక్కడింకా వుంది సోది .. కానీ నేను భద్రపఱచుకున్న దానిలో ఇంతవఱకే యుంది. క్షమించగలరు>

జై యల్లమ్మ తల్లి.

8 comments:

  1. ఎలా ఉంది అనుభవం?

    ReplyDelete
  2. బ్లాగ్లోకం కూడా వెనకటిలాలేదు - అంటే బ్లాగ్లోకం పాత రోజుల్లో బావుంది అన్న అర్ధం వస్తుంది; దీన్నే "ఛేంజ్ రెసిస్టర్స్" అంటారని ఇప్పుడే చదువుకొని వచ్చాను.పాతెదెప్పుడూ మంచిగా కనిపిస్తుంది - అంతే! ఇప్పుడూ బానే ఉంది; భవిష్యత్తు బహు ఉజ్జ్వలంగా ఉంటుంది - అని కూడా అనుకోవచ్చు; కాస్త "ఆలోచించిండి"! అద్వైతం మీకు మీరు అన్వయించుకొని చూసుంటే, బహుశా మీరు పోస్టును తీసేయవలసిన అవసరం వచ్చి ఉండేది కాదేమో!వచ్చిన వ్యతిరిక్తత మీకు ద్వైతంలో దయ్యంలా కనబడి, దాన్ని మీరు ఈ విధంగా "అణచి" వేయటమో, లేక మిమ్మల్ని మీరే అణచుకోటమో జరిగిందని నేను దీన్ని విశ్లేషించుకుంటున్నాను :). స్వేఛ్చ - ఫ్రీడం ఈజ్ ది కీ!..ఇట్ కమ్స్ విత్ రెస్పాన్సిబిలిటీ - అని ఆంగ్లేయులు ఊరకనే తెలుసుకున్నారను కుంటున్నారంటారా!

    "నల్ల హంస" అని అనువదించకుండా - ఆలోచించి "అదృష్టం", "విధి" అనేవి నిజానికి - "The unknown unknown" అనే అర్ధంలోనే చెప్పుకోవచ్చేమో కాస్త చూడగలరా! లేదు ఆల్రెడీ ఇంకా ఏమన్నా పదాలు మనకున్నాయేమో! ఆలోచించి - "ఆలోచింప" చేయగలరా! ప్లీజ్! నిర్ధారించి చెప్పే "బ్రాహ్మినికల్ ఆటిట్యూడ్" ని కాస్త తగ్గించాలేమో అని నా ప్రయత్నం.

    ReplyDelete
  3. నాకు "ఆలోచన"లోనూ అందం కనిపిస్తుంది; అలా అందంగా "ఆలోచన" చెప్పండి పోని.

    ReplyDelete
  4. మనం చేసే ప్రతి పనిని విమర్శించే వారు,ఆదరించేవారు ఉంటారు.మనం చేసే పని తప్పు కానప్పుడు వేనుకకి తగ్గవలసిన అవసరం లేదు.అలా మీరు వేనక అడుగు వేశారు అంటే మీ శత్రువులు వీజయం సాదించేనట్లే.
    అవకాశం ఇవ్వద్దు..అనిచివేయలి

    ReplyDelete
  5. అణిచి వేయక్కర్లేదు; కాస్త ఫ్లెక్సిబిల్ గా ఆలోచించి, ఆ పోస్టు వరకు కామెంట్లు మోడరేషన్ లో పెట్టడమో, లేక పూర్తిగా ఆపేయడమో చేస్తే ఐపోతుంది;
    0 అండ్ 1 అనేది బైనరీ లాజిక్; ఇంకా ఉండే ఉంటాయి గదా! పాజిబిలిటీస్ ఆర్ ఇమ్మెన్స్...ఈ విషయం మరచిపోకూడదనేది నా అభిప్రాయం. స్టాటస్టికల్ అనలిస్ట్ అన్నవారు అస్సలు మర్చి పోకూడదేమో!

    ReplyDelete
  6. అంత గుట్టుగా తీసెయ్యాల్సిందేం లేదు పాత టపాలో అని నా అభిప్రాయం.
    ఐనా తెలీకడుగుతానూ, బూతులు చెవినబడితే తట్టుకోలేని వాళ్ళు మరి వాటిని నోటిమీదకి తెచ్చుకోవడమెందుకు?

    ReplyDelete
  7. మీ టపా లో చెప్పిన నెల తక్కువ బడుద్దాయ్ లోని ఒక బడుద్దాయ్ ని, మీ గత టపా లో మీరు వేశ్యల కన్నా తీసిపడేసారే సాప్ట్వేరు వాళ్ళని వాళ్ళలలో ఒకదాన్ని అయిన నాకు ఒక సందేహమండి రాకేశ్వరరావ్ గారు వెనకటి బ్లాగు లోకం లో మీరన్న వేశ్య కొడుకు అంటె తప్పు కాదాండి ?

    ReplyDelete
  8. అనుభవమైతే గాని తత్వం బోధపళ్ళేదని బాధపడ్డాడట వెనకొకరు. తొందరగానే గ్రహించారు. హాస్యరసాయనమైనా మోతాదు మించితే వికటిస్తుందనడానికి మీ పాత టపా ఉదాహరణ!

    ReplyDelete
నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం