"జిలుగుం(౩) బంగరు రంగులుం(౩)గలుగు మే(౨)ల్చిన్నారి పూగుత్తి సొ-(౧)పద్యము చదివి నిద్రపోఁబోతే, తెలుఁగులో శార్దూలాలూ మత్తేభాలూ ఎందుకు వాడతారో అని నాకు వెయ్యోసారి పరాకుగాననిపించింది।
మ్ములు గీలించిన తుమ్మకొమ్మలకు నీ(౨)వున్(౩) నీ సతీరత్న మూ-(౧)
యెల గీమున్(౩) దగిలించి రేఁబవలు హా(౨)యిం(౩)దూఁగరా గాడ్పు బి-(౧)
డ్డలు మీ కూడిగ మాచరింప గిజిగాఁ(౨)డా నీకు దీర్ఘాయువౌ"
ఒకటి(౧), వాడినవాటిలో సగానికి పైగా మత్తేభాలలో ఆఖగురువును తరువాతి పాదపు లఘువులతో కలిపేస్తారు, ఆ మాత్రం దానికి UII UUII UI UI IIU UII UII అని కడ గురువును ముందఱ చేర్చేయవచ్చుగా ఛందోరీతిలోనే।
రెండు(౨) యతిస్థానంలో పదంవిఱిచేవారు చాలా తక్కువ। యతికి అటూ యిటూ ఒకే పదభాగాలు వుంటాయి। ఈ రెండు నియమాలూ సంస్కృతంలోనైతే చెల్లవు। తెలుఁగులోనే ॥ ఈ తెలుగు నియమాలకంటే నాకు సంస్కృత నియమాలే నచ్చాయి। నేను శతకం వ్రాసినప్పుడు వాటికే ప్రాముఖ్యతనిస్తాను।
మూఁడవది(౩), పొల్లులు (జిలుగున్, రంగులున్, సిరికిన్, శంఖచక్రయుగమున్) అజంతభాషలో అన్ని పొల్లులు వాడి వృత్తపద్యం వ్రాయకపోతేనేం అనిపిస్తుంది। సీసాలో గీతాలో వ్రాసుకోవచ్చుగా।
ఏదేమైనా, పొల్లులు లేకుండా(౩), యతిస్థానే విఱుపు వచ్చేట్టు(౨), పాదం నుండి పాదం కలుపకుండా(౧) పద్యం వ్రాయడం అంత కష్టమా అనిపించి ఆలోచిస్తే, ఈ పద్యం వచ్చింది।
నల ఉవాచ-
మ। విధియో కాలఁపు వక్రదృష్టివలనో పేరాశ హెచ్చించెనో
మదిలో మూఢఁపు భావజాలమహిమో మత్కర్మ సంక్షిప్తమో
కద నేడీగతినిద్దఱం వనములోనీవుఁనైనుఁ వనిలోకష్టాల పాలైతిమే
పదవే ముందుకు ధైర్యచిత్తముననో పద్మాక్షి చింతింపకే
ముందు రెండు పాదాలు వ్రాసాక ఇది నలునకు అన్వయించుకోవచ్చునని దానికి తగ్గటు మూఁడవ పాదము వ్రాసాను।
ఇప్పుడు పెద్దలు వచ్చి దిధీలకు ప్రాసచెల్లదంటారు!!!
ఇంసోమ్నియపు పద్యాలు ౧