భాషందం, భువనందం, బ్రతుకందం

Thursday, March 03, 2011

జ్వరం పాట ౧ - కొండవారన మావూరు

కొండవారన మావూరు ఆ సన్నపాయకి సరిౙోడు
బండికడితే పొలిమేర ఏ బల్లకట్టుకు పనిలేదు

కన్నవారితో కలిసుంటాము మా
కున్నౘేలను చేసుకుంటాము, మఱి
మొన్నమొన్ననే మా బుజ్జిని మా
పిన్నమాఁవకు జతకట్టాము

కొండవారన ...

అన్నివున్న ఆ మారాజులు మ-
-ఱెన్నాళ్ళు నిలద్రొక్కారో గాని మా
కన్నయ్య తాత ఆరందరికంటే ఇం-
కొన్నేళ్ళెక్కువే బతికేడు

కొండవారన ...

కొబ్బరికాయలు కొనేకోఁవటి
గుబ్బలపై పెదమంగమ్మతల్లి
బ్బుపడితే ౘూౘే పంతులు
అబ్బో మావుళ్ళో ఎంతో గొప్పోళ్ళు

కొండవారన ...

2 comments:

  1. అంతే అన్నయ్యా, పరదేశంలో ఉంటే సొంతూరి స్మృతులు సర్వసాధారణం.

    చాలా చక్కగా రాసారు...

    ReplyDelete
  2. పాట బావుంది, కానీ జ్వరం పాట??????

    ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం