దిఙ్నాగంబుల హస్తఘాతములకుం దేల్పోయెఁ మేఘంబులే
(హనుమంతుని సముద్రలంఘనఘట్టం వివరించవలెను)
నా పూరణ
వాఙ్నామాయుధవర్త్మవర్తిఁ జలదాపారంబు వాతాంశుఁ దాఁ
ప్రాఙ్నాసుండయి దూకగా చెలఁగి యీ బాలార్కభక్షుండు హే
ధిఙ్నూనం మము సైతముం దినుననే ధీభ్రాంతితో త్రుళ్ళెడా
దిఙ్నాగంబుల హస్తఘాతములకుం దేల్పోయె మేఘంబులున్
క్లూ - కాళిదాసుని మేఘదూతములో అమోఘమైన ద్వంద్వార్థములు
వాఙ్నిర్మాణ సువేది వార్ధి గడియన్ వాతాత్మజుండెంచగా
ReplyDeleteదిఙ్నాగంబులఁ దాకి మేఘతతి సందీపించె దౌష్ట్యంబుతో
వాఙ్నిర్దేశిత కార్యసత్ఫలముకై ప్రార్థింప దిగ్దంతులన్
దిఙ్నాగంబుల హస్తఘాతములకుం దేల్పోయెఁ మేఘంబులే.
వాఙ్నిష్ఠాపరమేష్ఠి దివ్యబలసంపద్ధైర్యదీక్షాప్రభా
ReplyDeleteభాఙ్నూత్నార్కుడు వచ్చుచుండెనదిగో! వచ్చున్ గదా వెన్కనే
దృఙ్నీరేజుడు; జచ్చు దైత్యుడు; చెరల్ దీరేనటం చుబ్బు నా
దిఙ్నాగంబుల హస్తఘాతములకుం దేల్పోయెఁ మేఘంబులే