భాషందం, భువనందం, బ్రతుకందం

Monday, November 14, 2005

ఒక మంచి అనుభవం

నేను జార్జియ టెక్ లొ స్టూడెంట్ ని.
మొన్నొక రొజు క్లాసుకు నడుచుకుంటూ వెళ్తూ, దారిలో ఒక సిగ్నలు కొసం ఆగాను. ఇంతలో ఒక నల్ల పెద్ద మనిషి వచ్చి ఇలా పలుకరించారు.

"నువ్వు కాలేజికి వెళుతున్నావా ?"
“అవును”
"డాక్టరు చదువుతున్నావా?"
“ఆ.. హూఁ.. అం.. <చూడ్డానికి కాస్త చదువు కున్నవారిలాగానే ఉన్నారు, కాబట్టి టెక్ స్కూల్ లో డాక్టరు చదువు ఉండదని తెలిసే ఉండొచ్చు, కాబట్టి డాక్టరేట్ అని ఉద్దేశమా? లేక పోతే నిజంగా డాక్టరనే ఉద్దెసమా? తెలియక నేను నాలుక చప్పరిచ్చాను> లేదు ఎం ఎస్సె”
<ఆయనకి ఎంఎస్ అంటె అర్ధం అయినట్లులేదు>
"ఆఁ నేను క్లినిక కి వెళ్ళినప్పుడు మీ వాళ్ళు చాలా కనపడతారు, అదే ఆసుపత్రుల్లో".
<హమ్మయ్య అయితే ఆసుపత్రుల్లో డాక్టరు అని ఉద్దేసం అన్నమాట>
“లేదు కంప్యూటర్ సైన్సు చదువుతున్నా”
"అవునా? (కొద్దిగా నిరాశగా... ఎంతయినా అమెరికలో డాక్టలంటె మోజుగా) ఎందు కంటె మీ వాళ్ళు చాలా బాగా చూసుకంటారు"
<మీ వాళ్ళు అంటె భారతీయులనా, పర్వా లేదు చాలా మంచి అభిప్రాయముందే>
“మేము సగం మంది డాక్టర్లు సగం మంది కంప్యూటర్ ఇంజనీర్లగా పనిచేస్తోంటాం”
"మంచిది, రెండు మంచివేగా" <నా సంతృప్తి కోసం అన్నట్టున్నారు>
నేను నవ్వుకున్నాను
"ఎన్ని సంవత్సరాలైనాయి? "
“ఇంకా రెండున్నాయి.”

(గమనించాల్సిన విషయం ఏమిటంటే.. అతను పెద్దగా చదవలేదు కాలేజికి వెళ్ళి ఉండరు.. కాబట్టి ఎం ఎస్ అంటె "కాలేజి" ఒక సారి పూర్తయి పోయిందని తెలిసి ఉండదు, కాబట్టి నాలుగేళ్ళ "కాలేజి" లో ఇన్కా రెండేళ్ళె ఉన్నాయనుకున్నారు)

"అవునా?" (ఉత్సాహంగా)
(పక్కనే ఉన్న వెరే నల్ల పెద్ద మనిషితో..)
"హి కెన మేక ఇట్.. ఐ యామ షూర్"
(ఆఫ్రికన్ అమేరిక్న్లు ఆటలలో రాణిస్తారుగాని పాపం చదువులో మామోలుగ కొద్దిగా వెనుక ఉంటారని గమనించాను, కాలేజి పూర్తి చేస్తె చాలా గర్వ కారణం అనుకుంట)
<వాళ్ళ అభిమానానికి నేను మురిసిపోతుంటె సిగ్నలు పడింది>
“తెంక్యూ సర్... ఐ విల్ మేక్ ఇట్” అంటూ వెనుకకి చూస్తూ రోడ్డు దాటుతుంటే
"జాగ్రత్తగా దాటు.."

అమెరికా లో ఇట్లాంటి సంఘటనలు పెద్దగా జరగవని బాధ పడుతుంటాను, ఎవరి పని వారిదఏ అన్నట్టు వుంటారు. అందుకే ఆ రోజు ఆయన చూపించిన ఆశక్తి చాలా ఆనంద పరిచింది. వారి కొసమయినా ఐ తింక్ ఐ విల్ మేక్ ఇట్ బిగ్.

4 comments:

  1. Its very rare to see ppl stop by to talk friendly with us. Good to know we can expect these things to happen in this country :)

    ReplyDelete
  2. సాధారణంగా తెల్లవారికంటే నల్లవారే ఎక్కువగా మాటకలుపుతారు - ఇది నేను గమనించిన సంగతి.

    ReplyDelete
  3. మొన్నో నల్లాయన నేను రైలు కోసం చూస్తుంటే "సంజయ్... సంజయ్..." అంటూ దగ్గరకు వచ్చాడు. తీరా సంగతేంటంటే "సంజయ్.." అనే భారతీయ సంతతి కుర్రాడు అమెరికన్ ఐడల్ లో బాగా దూసుకెళుతున్నాడాట. ఆ విశయం నాతో సంతోషంగా పంచుకోవడానికి నాతో మాట కలిపాడు.

    --ప్రసాద్
    http://blog.charasala.com

    ReplyDelete
  4. అమెరికాలో తెల్లోళ్ళు ఒక్కసారి మాటకలిపితే చాలా సేపు మాట్లాడతారు.ఎమైనా అడిగితే అవునో కాదో చెప్పడానికి పావుగంట పైనే వివరణ ఇస్తారు.లేదంటే కన్నెత్తికూడా చూడరు.

    ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం