ఇవాళ తెలుగు లో వ్రాయాలని కోరిక పుట్టింది.
ఆంగ్లంలో వ్రాసాతుంటే, చాలా అనాహ్లాదకరంగా ఉంటుంది. తెలుగులో వ్రాసే ఆనందమే వేరు.
కాని వ్రాసేసరికి, తల ప్రాణం తోకకు వస్తుంది. చాలా సహనం, ఏకాగ్రతా అవసరం.
కొత్తలో ఆంగ్లంలో వ్రాయాలన్నా అలానే అనిపించేది. కాని, చెత్త చెత్త సాఫ్టవేరు ఉద్యోగాలు చేసి చేసి, అలవాటు అయి పోయింది. ఇప్పుడసలు మెరుపు వేగంతో టైపు చేస్తానంటే నమ్మండి. ఏదో ఒక రోజు తెలుగులో కూడా అదే వేగం వస్తుందన్న ఆశ. అప్పటి వరకు ఇదిగో ఇలాంటి చిన్నా చితకా పోస్టులతో సరి పెట్టాలి.
ఉద్యోగంలో చేరాక తెలుగు కీ బోర్డు స్టిక్కర్లు కొనుక్కోవాలి.
ఉంటా మరి.
you can use http://lekhini.org
ReplyDeleteకాస్త కష్టమైనా సరే, Inscript లో టైపుచెయ్యటం సాధనచేయండి. ఇది అచ్చం మన తెలుగు టైపురైటరు లాగ ఉంటుంది. ఒకసారి అలవాటైతే, మరే సాధనమూ అక్కరలేకుండా నేరుగా నోట్‌పాడ్ లో తెలుగు టైపుచెయ్యొచ్చు. నేనూ లేఖినితోనే మొదలెట్టి, కాపీ పేస్టులతో విసుగొచ్చి, Inscript టైపింగు నేర్చుకొన్నాను. లేఖిని సృష్టికర్త వీనెన్‌గారు కూడా ఇదే మాటంటారు. [మీరు కూడా చార్మినార్ బ్రాండ్ ఆస్‌బెస్చాస్ సిమెంట్ రేకులనే వాడండి. మా తతగారు వేసిన రేకులు ఇప్పటికీ చెక్కుచెదరలేదు... అన్నట్టుగా]
ReplyDeleteనేనైతే పద్మ extension ఉపయోగిస్తూ ఉంటాను. కాపీ పేస్టు గోల అయితే ఉండదు దానిలో.
ReplyDelete