"positive thinking" కి తెలుగు "భావ చింతన" అని భావించి ఆ టైటిల్ పెట్టాను.
తప్పైతే సరి చెప్పగలరు. అలానే "టైటిల్ " కి తెలుగు ఉంటే చెప్పగలరు.
వైజాసత్య గారు తమ బ్లాగు లో "మతం - ప్రభుత్వం" గురించి అభావంగా వ్రాసారు.
నేను వారానికి ఓకసారి హోంవర్కు లా భావ చింతన చేస్తూంటాను. అనాదర్శ ప్రపంచం లో భావంగా ఆలోచిస్తే నాలాంటి ఆదర్శ ప్రియులకు జీవనం కోద్దిగా తేలిక అవుతుంది. కాబట్టి అదే అంశం పై నా ఆలోచన ఏమిటంటే
మతం మంచితనాన్ని గుర్తుచేసే ఓ యంత్రం
ప్రభుత్వం మంచికి అవకాసమిచ్చే ఓ యంత్రాంగం
"positive thinking" అను ఘోష లో ఇది నా చిన్న బిందువు. మీ బిందువు మీరు సమర్పంచండి :)
title = శీర్షిక
ReplyDeletepositive attitude = సానుకూల దృక్పదం
ReplyDeletepositive thinking = సానుకూల చింతన