భాషందం, భువనందం, బ్రతుకందం

Wednesday, April 11, 2007

కొత్త నిర్ణయం

నేనోకొత్త నిర్ణయం తీసుకుంటున్నా.
( అసలు చెప్పాలంటే, అది నిర్ణయం కాదు resolution. మన తెలుగు కొద్దిగా ఈకు. resolution ని తెలుగులో ఏమంటారో తెలియక నిర్ణయం అనేస్తున్నా. కనీసం decision అని ఎక్కువ మంది తెలుగు వారు తెగులులిష్ లోవాడినట్టు వాడ లేదు. ఎ వీవెన్ గారో resolution కి తెలుగు పదం చెప్పి పుణ్యం గట్టుకోవాలి. )

ఇంతకీ ఎప్పుడు చెబుతాడా అని మీరందరు ఎదురు చూస్తున్న ఆ నిర్ణయం ఏమీటంటే..
నేను నా ఆంగ్ల బ్లాగును పక్కన పెట్టి కొన్నాళ్ళు, మీరు ఈ నిమిషాన చదువుతున్న నా తెలుగు బ్లాగును పునరోగిద్దామని (అదే నండి రీడెవలప్పు చేద్దామని) నిర్ణయించు కున్నాను.

దీని వల్ల ఉపయోగాలు
1) నా ఆంగ్ల బ్లాగు ఎలాగూ ఎవరూ చదవట్లేదు :(
2) నా తెలుగు పునరోగిస్తుంది (అదే నండి రీడెవలప్పు అవుతుంది. మా తెలుగు పంతులు గారు
పునరోగం అనే మాట వింటే ఆయన గుండె ఒక్క క్షణం ఆగి మళ్ళి కొట్టుకుంటుంది).
3) కొత్త మిత్రులు పరిచయం అవుతారు.
4) తెలుగు టైపింగు 'రోగిస్తుంది' (అదే నండి డెవలప్పు అవుతుంది). మాటలో మాట (అదే నండి బైదిబై) నేను తెలుగు కీ-బోర్డు లేకపోయినా, డైరెక్ట్ ఇన్పుట్ చేస్తా... మాతృభాషను ఆంగ్ల లిపితో
ఎంగిలి చేయడం ఇష్టంలేక. అలా రాయడం ఎంత కష్టమో అన్నదాని గురించి వేరెప్పుడైనా ఓ టపా వేస్తాలెండి.
5) నా ఆంగ్ల బ్లాగును ఎవరూ ఎక్కడా లింకు చేయక పోయినా, మన తెలుగు సోదరులు కూడలి.ఆర్గ్ లో నాకు ఒ లంకె వేస్తారు.
6) పైన చెప్పిన కూడలి.ఆర్గ్ లో నా ఈ టపా వస్తుందో రాదో పరీక్ష చేయవచ్చు.(పరీక్ష స్పేల్లింగు గుర్తుందని మా తెలుగు మాస్టారు సంతోషిస్తారు :))

కృతజ్ఞతలు
1) సౌమ్యగారు ఆంగ్లంలో బ్లాగగలిగినా తెలుగులోనే బ్లాగి నాకు స్పూర్తినిచ్చారు.
(అరే... 'బ్లాగగలిగినా' కొత్త పదం మా తెలుగు మాస్టారు
చాలా సంతోషిస్తారు :) )
(బ్లాగి - వాగి పదానికి సంభందం లేదు :) agglutinative language కదండి మన్నించాలి)
2) లంకుతున్నందుకు కూడలి వారికి
3) స్పూర్తినిచ్చిన అనేక తెలుగు బ్లాగర్లకు

సహాయం
ఈ క్రింది పదములకు తెలుగు చేప్పగలరు
resolution, redevelop, స్పూర్తి = inspiration?, spellings, acknowledgments (as written in the beginning of books), 'by the by' or 'by the way'

ఆఖరి జోకు (హాస్యం? చతురోక్తి?)
redevelop కి అర్థం తప్పనిసరిగా చెప్పగలరు, ఎందు కంటే నేను రాజకీయాలలో చేరి దేశాన్ని పునరోగిద్దామనుకుంటున్నాను (సిక్/sic). కాబట్టి ఆ పదం శెలవిచ్చుకున్నాక, మీ అమూల్యమైన ఓటు ముద్రను నాకే వేయాలని గుర్తు పెట్టుకోండి.

10 comments:

  1. resolution : ప్రతిజ్ఞ అనొచ్చు ఏమో!
    redevelop : పునరభివృద్ధి ??
    spelling : అక్షర కూర్పు అంటే ఎలా ఉంటుందంటారు?
    Acknowledgement: In the contect u asked - కృతజ్ఞతలు
    by the way..by the by : అన్నట్లు
    (eg: BTW, how did u write ur exam?
    అన్నట్లు పరీక్ష ఎలా రాసావు?)

    -
    మీ కృతజ్ఞత లకు ధన్యవాదాలు.:)

    రోగించడం ఏమిటండీ? రోగం లాగుంది వింటానికి :P

    ReplyDelete
  2. resolution అంటే తీర్మానం అవుతుందేమో.

    ReplyDelete
  3. resolution = తీర్మానం
    redevolop = పునర్వికాసం
    inspiration = స్ఫూర్తి (లేక ఉత్తేజం)

    spellings = గుణింతాలు
    acknowledgements = నెనర్లు
    ఆఖరి జోకు = కొసమెఱుపు

    ReplyDelete
  4. బహుశా మీ ఉద్దేశం "పురోగమనం" అయి ఉంటుంది.
    అంత కష్టం ఎందుకు అనుకుంటే .. మన మాజీ ముఖ్యమంత్రిగారు చూపిన దారిలో మీరు "ముందుకు వెళుతూ" ఉండొచ్చు :-)
    అవునూ, మీకు జాజ్ సంగీతం అంటే ఇష్టమా?

    ReplyDelete
  5. ముందస్తుగా మీ పేరుని తెనిగించండి. "రాక్.అ " అంటే ఎమిటో?

    తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం గారు చాలావరకు మీ సందేహాలు తీర్చేశారు కదా! నాకు మాత్రం, resolution అంటే తీర్మానం కన్నా 'కృతనిశ్చయం ' బాగుంటుందేమో అనిపిస్తుంది.

    ReplyDelete
  6. అర్థాలు చెప్పడానికి తమ విలువైన సమయాన్ని, టైపు పనివారి తనాన్ని వెచ్చించిన సహృదయులకు నమఃస్సుమాంజలి.
    కొద్దిగా ఎక్కువైయ్యుందా ?? :)

    ReplyDelete
  7. అవును కొద్దిగా ఎక్కువైంది :)) ఎలా తగ్గించవచ్చో చూడండి.
    మనః + సుమాంజలి = మనస్సుమాంజలి (సంధి పేరేమిటీ!?)
    ఇక్కడికొచ్చి - Spellings = గుణింతాలు అని,
    Ackacknowledgement = నెనరు అనీ నేర్చుకొన్నాను. మీకూ, తాడేపల్లిగారికీ కృతజ్ఞతలు.

    ReplyDelete
  8. This comment has been removed by the author.

    ReplyDelete
  9. అన్నట్టు (by the way), యువ సినిమాలో వేటూరి రాసిన పాట: "దేహం తిరి - వెలుగన్నది నెనరే" సరిగా వినాలి కానీ, ఆ పాటలో ఆధ్యాత్మికత ఉంది. తిరి అంటే సుడి అనీ చీకటి అనికూడానేమో. ఒక టపా రాయొచ్చు దానిమీద. మొదటిసారి ఆ పాట విన్నప్పుడు తమిళాన్ని పలకడాకి కదిలిన పెదాలకు తెలుగు రాసే రంధిలో ఏదో రాశాడనుకున్నా గానీ ఇప్పుడు లెంపలేసుకుంటున్నాను.

    ReplyDelete
    Replies
    1. దేహం తిరి ...అంటె....ఈ శరీరం వొత్తు(వెలిగించే)

      Then...వెలుగన్నది చెలిమే

      Delete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం