భాషందం, భువనందం, బ్రతుకందం

Friday, August 24, 2007

నోటువెలది

ఎన్నాళ్ళ నుండో అనిపిస్తుంది
"ఆటవెలది చాలా తేలికే, మరి మనం అందులో ఒక పద్యం కూడా రాయలేదేంటి ఇప్పటి వరకూ?" అని.
దానికి ఒక కారణం, ఎక్కడో "ఆటవెలదిలోనూ తేటగీతిలోను ఒకటవ మరియు మూడవ పాదాలు ఒకేలా ఉంటాయి" అని చదవడం, కానీ అది తప్పని నాలుగు వేమన పద్యాలు ఒక వికీపీడియా చూడగా తెలిసింది.

ఏదేమైనా, ఈవాళ బస్సులో వస్తుంటే, సరైన inspiration లేక పద్యాం వ్రాయలేకపోతున్నాననుకుంటుండగా, కళ్ళ ముందు జిగేలు మని మెరిసింది ఒ పది రుపాయల నోటు, ఇంకే ముంది.
పదిలమైన నోటు పది రుపాయల నోటు
కోరుకున్న దెచ్చు కోకు హెచ్చు
బస్సువాని కివ్వు బైల్దేరు యిక నువ్వు
పట్టణంబు జూడు పల్లె జూడు
ఆటవెలది నిజంగా చాలా తెలికండి. ఎంత తేలికంటే కొద్దిగా సవాలు గా ఉంటుందని నేను యతినియమం తో బాటు ప్రతి పాదంలోనూ అంత్యనియమం కూడా పాటించా (నోటు-నోటు, దెచ్చు-హెచ్చు).

తెలుగులో ఎన్ని హ గణాలు ఉన్నాయంటే మీకు సుర్యగణాలకేం లోటు ఉండదు. అలానే సూర్యగణాలు కాని పద ప్రయోగాలలో ఇంద్రగణాలు చాలా ఉన్నాయి. ఇకనేం మీరు కూడా వ్రాయండో ఆట వెలది.

ఎంతైనా "దేశ బాషలందు దెలుగు లెస్స" అంది ఆటవెలదేగా. ఇవాళే దీన్ని బస్సులో చూసా... హుఁ... అర్థమయ్యింది! మీరు కూడా ఇది వ్రాసున్న బస్సెక్కి కూర్చుని ఆలోచించండి :)

23 comments:

  1. రాకేశ్వర ఆశు కవి అయిపోతున్నావుగా, బాగుంది నీ నీటు వలది. నాకొ సందేహము, నాకు పద్యాలు వ్రాసేటంతా,మీ వంటి పందితులు వ్రాస్తే వ్యాఖ్యానించేటంత సామర్థ్యం లేదు కాని బైల్దేరు అని వ్రా వ్రాయకుడదేమో బయలు దేరు అని వ్రాయాలేమో నాకు తెలియదు. పద్యం మాత్రము అదిరింది.

    ReplyDelete
  2. తొందరగా వ్రాయడము లొ అచ్చు తప్పులు వచ్చాయి గమనించగలరు మరియు క్షమించగలరు. ఈ పదాలు
    నోటువెలది
    పండితులు

    ReplyDelete
  3. @మాటలబాబు ; బైల్దేరు అంటే 'bye' చెప్పి బయల్దేరమని అయ్యింటుంది.
    రాకేశ్వర గారు: 'ఆటవెలది'ని వేమన భోగిగా ఉన్నప్పుడు పట్టుకొని, యోగి అయిన తర్వాత కూడ విడవలేక, శతకం లో దానినే వాడాడు.

    ReplyDelete
  4. @ మాటలబాబు
    పందితులమే, తప్పులేదు :)
    ఆశు కవి అంటే ఎంటో కూడా నాకు తెలియదు.
    మా పక్క బయలుదేరు అనడానికి బైల్దేరు అనికూడా అంటారు.
    బస్సువానికివ్వు బయలుదేరికనువ్వు
    అని కూడా వ్రాయవచ్చు, నాకు
    బైల్దేరు యిక నువ్వు
    అనడమే నచ్చింది.
    అలాగే పది రూపాయలు అని అనాలి, కాని వాడుకలో పది రుపాయలు అని కూడా అంటారు, ఇక్కడ రుపాయలు సరిపోతుంది కాబట్టి అలా వ్రాసాను.

    మీకు చిన్నప్పటి పద్యాలు కూడా గుర్తున్నాయి, కాబట్టి మీరు ప్రయత్నిస్తే వారం రోజులు తిరగకుండానే ఆటవెలది వ్రాయగలరు.

    నేను కూడా రానారె కందాలు వ్రాస్తుంటే అలాగే అనుకున్నా, కాని ఆయన ప్రోత్సహించి, నన్ను స్కూలు లో చేర్చి, నన్ను ప్రయోజకుణ్ణి చేసారు. :)

    మీరు కూడా మా "కోత్త పాళీ స్కూల్ ఆఫ ఆల్ థింగ్స్ " లో చేరండి :)
    వారం రోజుల్లో వృత్తాలు వ్రాయండి.

    ReplyDelete
  5. బైల్దేరు అని సుబ్బరంగా రాసుకోవచ్చు.
    కావ్య భాష ఉపయోగిస్తూ రాస్తే దానికి తగిన నియమాలు పాటించాలి గానీ ఆధునిక వ్యావహారిక భాషలో రాస్తున్నప్పుడు వ్యావహారిక భాషా నియమాలే పాటించేది. ఏ నియమాలూ లేనప్పుడు మనం చెప్పిందే నియమం. ఈ విషయంలో శ్రీనాథుడూ శ్రీకృష్ణదేవరాయలూ మనకి మార్గదర్శకులు.
    రాకేశ్వరా .. నువ్వు మొదట పద్యం రాసినప్పుడు "ఎలిగెన్సు" గురించి లెక్చరిచ్చానని గింజుకున్నావుగా - ఇదీ ఎలిగెన్సు అంటే. పద్యంలోని ప్రతిమాటా సందర్భోచితంగా ఉంది. చిన్ని చిన్ని పదాల కూర్పుతో ముచ్చటగా ఉంది. ఆ పై అంత్య ప్రాస గొప్ప సొగసు తెచ్చి పెట్టింది.
    ఆట వెలది అంటే వేశ్య అని ఒకర్థం. దాంతో నువ్వు "నోటు" వెలది అనేటప్పటికి ..

    ReplyDelete
  6. హ హ...నోటువెలది నోవెల్ గా ఉంది :)
    ఆ రెండో పాదం నాకు అంతగా అర్ధంకాలేదు. కవిభావం ఏమిటి?

    అన్నట్టు, అంత్యప్రాస అదరగొట్టారు.

    మీ మాటవిని మరింతమంది ఈ వెలదుల చూపుల్లో చిక్కుకుంటారని ఆశిస్తా :)

    ReplyDelete
  7. అన్నట్టు గురూగారూ, నోటువెలది అనడమేకాక, మీ స్కూలు పేరు కూడా చెప్పడం జరుగుతోంది. మీ శిష్యరికం అంటారేమో అందరూ... :)

    ReplyDelete
  8. @ sriram
    కోకు అంటే కోకాకోలా అండి :)
    పది రూపాయలకి కోకు బాటిలు వస్తుందిగా ..
    ౩౦౦ అంటే అంత హెచ్చు కాదనుకోండి, కాని విషయం ఒక చుక్కైనా హెచ్చేగా అని :)
    అది భావం :D

    ఇక నోటు వెలదికి వస్తే, వేశ్యల దగ్గరి వెళ్ళడం బదులు ఆటవెలదులు రాసుకుంటే అంతే సుఖం కలుగుతుందనేమో :D

    ReplyDelete
  9. క్షమించాలి, పైన 'విషయం ఒక చుక్కైనా' అన్నా
    దాన్ని 'విషం ఒక్క చుక్కైనా' అని చదువుకోండి.

    ReplyDelete
  10. నేను రాసిన కామెంట్ ఏదీ?

    ReplyDelete
  11. మీరు వ్రాసిన కమెంటు ఎప్పుడూ కనబడలేదు. బహుసా మీరు ప్రచురించకుండానే పేజీ మూసారేమో :0
    నేను మాత్రం తొలగించలేదు.

    ReplyDelete
  12. రాకేశ్వర్ అసలు కామెంట్లు తొలగించడండోయో ఒకసారి బ్లాగు డొకువచ్చినట్లుంది అని వ్రాశాను ఆయిన తొలగించలేదంటే ఇంత ఉదార స్వాభావం కలవాడో మీరే అర్థం చేసుకోవాలి.

    ReplyDelete
  13. అంతర్జాలానికి కొత్త.
    సాహిత్యం గుంపులో జవాబివ్వడానికి సభ్యులకి మాత్రమే అనుమతి ఉందన్నారు.
    నిజానికి ఈ వాఖ్య అక్కడే చేయాల్సింది.ఇక్కడ చేసినందుకు అన్యధా భావించవద్దు.
    అక్కడ మీ "మంచి పుస్తకాల జాబితా" దిగుమతి అయ్యింది.
    మీరు వ్రాసుకున్న "మంచి పుస్తకాల" జాబితాలో "ఊబిలో దున్న" కనబడలేదు.
    !?

    ReplyDelete
  14. ఆటవెలది రాయడం తేలికని మీరన్నారు.. ఓహో తేలికే కామోసనుకున్నా. మీ పద్యం హొయలు చూసి, రాసిపారేద్దామనుకుని రాయబోయా! మీరబద్ధాలాడారని నాకర్థమైపోయింది.

    ReplyDelete
  15. నాకు వృతాలు నేర్వండి వారంలొ వృత్తాలు వ్రాయండి అంటే ఏదో బానే ఉంది వ్రాద్దాం అని ప్రారంభించాను, మెదటి పాదం పూర్తవడం కష్టంగా ఉందిఉ. వృత్తాలే కష్టంగా ఉన్న నాలాంటి వారికి కందాలు ఆటవెలదిలు ఏమి చిక్కుతాయి

    ReplyDelete
  16. మాటలబాబుగారు&రాకేశ్, నాది ఆశ్చర్యం మాత్రమే, ఆక్షేపణగానీ నిందగానీ కాదు :-) ఇంతకీ నేనేం రాశానంటే(రాశాననుకున్నానంటే), ఎలాగూ పద్యం రాయడానికి ఉపక్రమించావు, మరింత సరళంగా మరింత తమాషాగా రాసుంటే బాగుండేది అని రాశాను. కారణం, 'కోకుహెచ్చు' అంటే ఏమిటో రాకేశు చెప్పినంతవరకూ నాకు అర్థం కాలా. పద్యం రాయడం నిజంగా అభినందనీయమే, రాయాలని ఉపక్రమించాక దానికి కాస్త పదనుపెట్టివుంటే ఇంకా బాగుండునని...

    ReplyDelete
  17. చదువరిగారూ, ఈనెల సుజనరంజనిలో మీ పద్యం చూసాను. బావుందండీ. బ్లాగులో కూడా అప్పుడప్పుడు ప్రచురిస్తుండండి. (అన్నట్టు సుజనరంజనిలో శ్రీనివాస్ పేరుతో ఉన్న పద్యం నాదే. వాళ్ళేదో పొరపాటు పడ్డారు.)

    ఈరోజు నాకు దొరికిన మరో మంచి పద్యాల బ్లాగు:
    http://sastry-satakam.blogspot.com/

    ఊకదంపుడు గారి బ్లాగులో పద్యాలు చూసే ఉంటారు.

    May our tribe grow!

    ReplyDelete
  18. @ మాటల బాబు
    మీరు నన్ను మరీ ఎక్కువ పొగిడితే, నేను మీకు డబ్బులు ఇస్తున్నాననుకునో ప్రమాదం ఉంది :)
    నిఝ్ఝంగా తేలికండి ఆటవెలది, తేటగీతి వ్రాయడం:)
    వృత్తాలు చాలా కష్టం,
    ఆవె-> తేగీ -> కందం -> మత్తకోకిల -> ఉత్పలమాల -> శార్ధూలం
    అది కవితా "పరమపద" సోపానాలు :D

    @ రానారె
    ఇక్కడ విషయం ఎఁవటంటే, బస్సులో వెళుతూ, పది రుపాయల నోటు చూసి ఆటవెలది వ్రాసేయవచ్చు, కాబట్టి మీరు కూడా వ్రాయండి అన్నది. ఛ)

    @ చదువరి
    సృజనరంజనిలో మీ ఆటవెలది చూసి మీరు అబద్ధమాడుతున్నారని నాకూ అర్థమయ్యింది :))

    @ శ్రీరాం
    మీ పద్యం బాగుంది. ఈ తడవ నేను కూడా ప్రయత్నిస్తాను :)

    ReplyDelete
  19. రాకేశ్వరరావు గారూ, శ్రీరామ్ గారూ అది రాస్తూంటేనే తెలిసింది పద్యం రాయడం మీరన్నంత తేలికేం గాదని :). ఒకసారి ఎత్తివతల కొట్టారు, యతి కలవలేదని. ఒక్క పాదంలో గూడా యతి కలవలేదు మరి! యతి నియమం ఏంటో సరిగ్గా తెలీలా. తెలుసుకొని, తిరగరాసి పంపిస్తే సర్లెమ్మని వేసారు.

    ఒకటి.. మాటలను అటేసి, ఇటేసి, మాట్లేసి ఏదోలాగా ఛందాన్ని తృప్తిపరచి పద్యం 'తయారు' చెయ్యొచ్చేమో గానీ, సొంపైన పద్యం రాయాలంటే కొత్తపాళీగారన్నట్టు సాధనుండాలి, బాగా చదవాలి, పదసంపద ఉండాలి. అన్నిటికీ మించి సృజనాత్మకత ఉండాలి. ఈలోగా ఇదిగో మీ మీ బ్లాగు వ్యాఖ్యల్లో సాధన జేస్తూంటాను.

    ReplyDelete
  20. చదువరి గారు, మీ పురోగమనం అమోఘం !
    మీరు ఒక్క రోజులోనే, పద్యం వ్రాసి, దానికి యతి కుదిర్చి, యతి కుదర్చడం సరిపోదు, పద్యానికి ఎలగెన్సు కూడా ఉండాలి, అందుకని చాలా పద్యాలు చదవాలి, సాధన చెయ్యాలి, అని ఇవన్నీ కనిపెట్టేశారు, అవన్నీ తెలుసు కోవడానికి/చెయ్యడానికి నాకు చాలా రోజులు పట్టాయి :)

    ReplyDelete
  21. ఆ.వె.ఆటవెలది మీది చక్కగా వుందండి
    నేనుకూడ మొదట నేర్చినదిదె
    ఆటవెలది మంచి ప్రారంభమిడెనాకు
    విశ్వదాభిరామ వినురవేమ.

    ReplyDelete
  22. While reading the poem, in the last line, I felt, Da would be a better sound than Du

    ~ telugu anta baagaa raani "sUryuDu"

    ReplyDelete
  23. @ సూర్యుడు
    అంత్యప్రాస కోసం డు వాడవలసివచ్చింది.
    అన్ని పాదాల్లో ఉ కారం ఆఖరున వుందిగా...

    ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం