సమస్య కాస్త రసవత్తరంగా వుండాలంటే, గట్టిదైన ప్రాసాక్షరం ఎంచుకోవడం బాగుంటుంది. మనము జ్ఞ ఎంచుకుందాం. ఇకిప్పుడు మీఱు చేయాల్సిందల్లా..
౧) ఒక excel sheet తీసుకొని అందులో గళ్ళు గీసుకోండి, ప్రాసాక్షరంగా ఎంచుకున్న 'జ్ఞ'ని ప్రాస పడవలసిన చోటట్లా నింపేయండి. ఆ ప్రాసపడవలసిన డబ్బాల రంగు కూడా మార్చు కోవచ్చు (ఇక్కడ లేతనీలం). ఆపై గురువు పడాల్సిన చోట్లల్లా డబ్బా రంగు మార్చండి. (ఇక్కడ పసుపు).
౨) తరువాత బ్రౌణ్యం తెఱచి జ్ఞ కోసం వెదకగా వచ్చిన వాడదగ్గ పదాలన్నీ క్రింద చిట్టాగా వ్రాసుకోండి. జ్ఞా జ్ఞే అని దీర్ఘం వున్న జ్ఞలు పనికిరావుసుమా, కాబట్టి జ్ఞానం, జిజ్ఞాస వంటివి వదిలివేయండి. ప్రజ్ఞ, ఆజ్ఞ, అనుజ్ఞ, అవజ్ఞ, అజ్ఞ, రసజ్ఞ, మొదలైనవి.
౩) ఇంకా నానాయాతనా పడి పెట్టెని నింపండిలా..
లయగ్రాహి
"ప్రజ్ఞునకు వచ్చును, రసజ్ఞమగు పద్యమది - ఆజ్ఞ పలుకంగనె! మఱజ్ఞునకు రాదే
యజ్ఞములచే"ననుట, అజ్ఞతగుఁ! బ్రహ్మభవ - రాజ్ఞియగు భారతికి విజ్ఞపము చేయన్
ప్రజ్ఞుడవు నీవయి, మనోజ్ఞమగు పద్యమన-నుజ్ఞముగ వచ్చును! కృతజ్ఞతతొ విద్యా
రాజ్ఞికి సుపద్యఁపు ప్రతిజ్ఞఁగొని సాధనను యజ్ఞమును బూని కవితజ్ఞుడవు గావోయ్.
(విన్నపమునకు తత్భవము విజ్ఞపము వాడడం జరిగింది, ఆజ్ఞ = అనుజ్ఞ x అననుజ్ఞ).
కూల్ కదా.
verry cool :)
ReplyDeleteThe next step is to write an algorithm
కొత్తపాళీ గారు కావలనే ఓ r ఎక్కువ వేశారనుకుంటా..
ReplyDeleteచందస్సు నియమాలకు ఒక పాదం/పద్యం కట్టుబడిఉందో లేదో చూసే ఉపకరిణి సరే,,
ఇలా ఏకంగా పద్యాలు వ్రాయటాన్ని కూడా యాంత్రీకరిస్తే. అప్పుడప్పుడూ కలంబెట్టి కాగితం మీద వ్రాసుకునే నాబోటివాళ్లు ఏమికావలి చెప్పు?
లయగ్రాహి రేపటికల్లా వ్రాయలా?నేను ఇప్పటి నుంచి ఓ సంవత్సరానికి వ్రాయగలిగితే గొప్పే -
ఈ లయగ్రాహి వరసలో నాలుగో టపా లో న కింద మ వత్తు ప్రాసాక్షరం గా లయగ్రాహి పద్యం పస్తోందని గ్రహించేసానోచ్
ఈ లయగ్రాహి వరసలో నాలుగో టపా లో న కింద మ వత్తు ప్రాసాక్షరం గా లయగ్రాహి పద్యం పస్తోందని గ్రహించేసానోచ్
ReplyDeleteఆ నాలుగో టపా ఎప్పుడు ఎవరు వేస్తారో, దానికి ప్రాస న్మ ఎలా అవుతుందో నాకైతే అస్సలు అర్థంకాలేదు. కాబట్టి మీరే ఆ న్మ ప్రాసగల పద్యాన్ని మున్ముందు వ్రాస్తారని ఆశిస్తున్నాం.
మన్మథునిఁ జంపెనఁట సన్మునుల మెచ్చెనఁట సన్మతులఁ బ్రోచు శివునిన్మదిఁ దలంతున్
ReplyDeleteచిన్మయుఁడు పర్వతసుతన్మదిని మెచ్చి తనువున్ముదముతో సగముగన్మఱి యొసంగెన్
తన్మయముతోడ భవునిన్మహితు వెడెదను మన్మలిన జీవనగతిన్మలుపుమంచున్
మన్మనములోన నెపుడున్మెరసియుండి కరుణన్మెలఁగుమంచును నుతిన్మిగులఁ జేతున్.
కంది శంకరయ్య గారు,మీరు లయగ్రాహిని కూడా కందం చెప్పినంత తేలికగా ఆశువుగా చెప్పుతున్నారు.. సంతోషమండీ, మీ వంటి పెద్దల బ్లాగ్ప్రవేశం తో మాకు నేర్చుకోవటానికి మరింత వెసులుబాటు.
ReplyDeleteమీకోసం శ్రీ.చిం.రా.కృ.రా గారి బ్లాగులో ఓ వ్యాఖ్యనుంచాను. మీరు చూశినట్టు లేరు
http://andhraamrutham.blogspot.com/2009/07/blog-post_23.html
భవదీయుడు
ఊకదంపుడు
ఊకదంపుడు గారూ, తురుపుముక్కలో మీరు చెప్పిన పోస్ట్ ఎప్పుడో చూసి, రాసి పెట్టుకున్నాను. సమాధానం కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాను. నా పద్యాలు మీకు నచ్చుతున్నందుకు ధన్యుణ్ణి.
ReplyDeleteఊకదంపుడు గారూ, మీరు చెప్పిన తురుపుముక్క బ్లాగులోని పద్యం ఇదే కదా...
ReplyDeleteసిరియు వృక్షంబు ధనపతి పరిమళంబు
ననలు (డగురయు) నుపవనం బసియు నావ
అందు మూడేసి వర్ణంబు లమరు శబ్ద
మధ్యమాక్షరపంక్తి నా మగని పేరు.
ఇందులో రెండవ పాదం లోని బ్రాకెట్లో ఉన్న అక్షరాల విషయంలో నాకు సందేహం. అవి కరెక్టేనా?
శంకరయ్య గారు,
ReplyDeleteఊకదంపుడు గారు న్మ ప్రాసతో లయగ్రాహి వ్రాద్దామనుకున్నట్టున్నారు, మీరు వారి ప్రాసాక్షరం దోచుకున్నారు :D
మా కోసం అలానే ఒక లయవిభాతి కూడా అందిస్తే సంతోషం.
సిరియు వృక్షంబు ధనపతి పరిమళంబు
ననలు డగురయు నుపవనం బసియు నావ;
అందు మూడేసి వర్ణంబు లమరు, శబ్ద
మధ్య మాక్షర పంక్తి నా మగని పేరు.
బాబోయ్..ఈ పద్యాలేంటి...ఆ ఛందస్సేంటీ..నాకు కళ్ళుతిరిగి పోయాయండీ...నా చిన్నప్పుడు ఛందస్సు కట్టుకుని పద్యాలు రాసిన రోజులు గుర్తొచ్చాయి..రాకేశ్వరరావు గారూ..ఇంత చిన్న వయసులో అంత సృజనాత్మకత ఎలా వచ్చిందండీ..
ReplyDelete@కౌటిల్య
ReplyDeleteమఱీనంత చిన్న వయస్సు కాదు లెండి. నాలుగు గాడిదల వయస్సుంటుంది.
అంతని కంటెన్ ఘనుడు కావాలంటే. వాగ్విలాసము చూడండి.
నాలుగు గాడిదల వయసా...అదేంటి
ReplyDeleteSuper
ReplyDeletemeeku tiruguledandi baga rasaaru
ReplyDelete