భాషందం, భువనందం, బ్రతుకందం

Sunday, October 11, 2009

నాకూ సముద్రానికీ మధ్యలోఁ


నేను సముద్రపుటంచు మీదఁ కూర్చున్నాను
నాకూ నా సముద్రానికీ మధ్యలో ఏఁవీ లేదు
అదిగో వచ్చేస్తోంది ఒక అల
ఈ అల నా కాళ్ళను తాకుతుంది చూడు

ఇదిగో వచ్చేసింది దగ్గరకంటూ
అఱ్ఱే అడుగు దూరంలో ఆగి వెనక్కిపోయిందే.
పోనీ వచ్చే అల తకుతుంది చూడు
అబ్బే ఇదీ అంగుళం దూరంలోనే ఆగిపోయింది.

ఎందుకో మఱి ఈ సంశయం? పఱికించి చూస్తే,
నాకూ సముద్రానికీ మధ్యన నా బట్టలున్నాయి
అంతేనా?

నేను వేసుకున్న సూటూ బూటూ టయ్యి
నా కార్యాలయంపు పనులున్నాయి
నా యింటి వాళ్ళ ఆకళ్ళు వారి అవసరాలు
నా పరువూ మర్యాదా నా పెద్దరికం
ఇంకా ఇలా ఎన్నేన్నో వున్నాయి

ఏంతో కాలంగా
నేను సముద్రపుటంచునే కూర్చుని వున్నాను
నాకూ ఈ సముద్రానికీ మధ్యన చాలానే వున్నాయి
ఒంటరిగా కూర్చున్న నన్ను పలుకరించ రాబోయి
ఎన్నోసార్లు ఈ సముద్రం వెనక్కు జా౨రుకుంది!

నాకూ సముద్రానికీ మధ్యన
నేఁ దాటలేని నా జీవితఁపు అగాధమూ
అది దాటలేని నా అస్వతంత్రపు కోటా
వున్నాయి.


8 comments:

  1. చాలా బావుంది!
    చివరి పేరా మాత్రం అనవసరమని నా కనిపించింది.

    ReplyDelete
  2. అవును కామేశ్వర రావు గారు, నాకు కవితని ముగించాలంటే చాలా బాధ అందుకనే అనవసరంగా సాగదీస్తూంటాను కొద్ది కొద్దిగా. చివరి పారా లేకపోతేనే బాగుంటుంది, నిజమే.
    రాకేశ్వర

    ReplyDelete
  3. ఒకట్రెండు టైపాటుల్ని సరిచెయ్యండి. చాలా బాగా వ్రాస్తున్నారు.

    ReplyDelete
  4. ఓహో స్థాన మహిమా?

    ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం