నీకు వేసే నేను చూస్తే
నడచుకుంటూ నావద్దకే
వచ్చినట్టే వచ్చి వెనుకకు
మరలుఁదిరిగీ పోయినావే
వెలుగునీడల సందులోన
కనసు నెనసుల గట్టుపైన
నీ ఆకళింపుకు
కౌగిలింతకు
ఎదురు చూసే నావద్దకే
వచ్చినట్టే వచ్చి వెనుకకు
మరలుఁదిరిగీ పోయినావే
రాత్రి పూటా పగటిపూటా
మండు కాలము శీతకాలము
బండరాళ్ళుతొ నిండివున్న
నేల యంచుకు ముద్దులొసగుతు
గాలికారే నుఱుగుతోన
గుసగుసలు గునుసుదాన
రాగలకాలము
లోగటికాలము
ఆగక సాగెడి మీ
శృంగారమునకు
రెండులిప్తల సాక్షినేనని
ఎఱిఁగిన వ్యధతోఁ
వెనదిరగఁబోతే
ఆగమంటూ
వచ్చినట్టే వచ్చి వెనుకకు
మరలుఁదిరిగీ పోయినావే
కన్నడ పదములు
ReplyDeleteకనసు - కల
నెనసు - నిజము
రాకేశ్వర రావు గారూ,
ReplyDeleteకలల అలల కాలాన్ని, తెలినురుగుల తేటపాటలో భలే లెక్కకట్టారండీ...మీ కల్పనల కలానికి నా మంగిడీలు.....
చాలా రోజుల తర్వాత కూడలిలో మీ "అందం" కనపడేసరికి చాలా ఆనందమనిపించింది....వచ్చి మీ పాట చదివాక "భలే!బాగ"నిపించింది....మరీ ఇలా నెలకోటి కాకుండా, వారానికోటన్నా రాయండి...
కౌటిల్య.
చాలా బావుంది.. :-)
ReplyDeleteకవిత పేరు "రెప్పపాటి ప్రేమ" తో కలిపి చదువుకోవాలంటారా? ఎందుకో ఆ విధంగా కలిపి చదవక పోతే మొదటి లైన్ సరైన అర్ధాన్నివ్వట్లేదనిపిస్తోంది.
ReplyDeleteNice...
ReplyDeleteరాకేష్ నీ కవిత బాగుంది .
ReplyDeleteఇదివరకటివాటికన్నా ఇది నచ్చింది.
చాలా బాగుందండి మీ కవిత. హృదయపూర్వకమైన అభినందనలు.
ReplyDeleteమొదటి లైను మాత్రం కొంచెం ఇబ్బంది పెడుతోంది.
మరలు నా మరలి నా ? కొంచెం అనుమానంగా ఉంది.
మరీ ఈ స్థాయిలో కన్తెలుగులో కవితలు రాస్తే ఎట్లా! బాగుంది.
ReplyDeleteకన్తెలుగు అనాలా తెన్కన్నడ అనాలా?
ReplyDeleteతెలుగు , కన్నడ అంటే అందంగా ఉంటుందండీ.
ReplyDeleteతెలుఁగన్నడం అనే సాధికారిక ప్రయోగం ఉందని నా గట్టి నమ్మకం। ఎక్కడ చూచానో మాత్రం గుర్తుకురావట్లేదు।
ReplyDeleteకాకతీయుల కాలం నాటి శిలాశాసనాల్లో కనిపించే లిపిని తెలుగన్నడం అన్నారు. శ్రీకృష్ణదేవరాయల కాలం నాటికి తెలుగు, కన్నడ భాషలకు వేరువేరు లిపులు రూపుదిద్దుకున్నాయి.
ReplyDeleteకనసు నెనసు బాగున్నై.
ReplyDeleteమొదటి చరణం అస్సలు అర్ధం కాలేదు.
నాకు తెలిసి మరలు అంటే మరకి బహువచనం. :)
@ కొత్తపాళీ,
ReplyDeleteబ్రౌణ్యంలో మరలు.
దాలి మళ్ళించారు అంటారుగా। కానీ మరలు తిఱిగి అన్నది మంచి ప్రయోగం కాదనుకుంటలెండి।
మరలు తిఱిగి అంటే return back అన్నట్టు వుంటుంది।
ReplyDeleteఊహ చాలా బాగుంటుంది కానీ, అక్షరాలు సరిగా పడట్లేదు।
ReplyDeleteనీలిసంద్రపు టొడ్డు నుండియు
ReplyDeleteమేలు కవితలు చెప్ప నేర్చుచు;
భేషుగా గానమును మా రా
కేషు మాత్రమె చేయ కలడోచ్!
మాత్రా ఛందస్సులో "తొ" అని [తోలు లో తో కాకుండ "తొక్క" లో తొ] ప్రయోగించటం వైయాకరణులకు తగునా అని.
ReplyDeleteఅల కూడ తీరాన కూచున్నవాళ్లని చూసి ,నేనూ రెప్పపాటి శృంగారానికి సాక్షినే అనుకుంటుందేమో
చింతా గురువుగారు,
ReplyDeleteగర్భిత పద్యాలు వ్రాసే మీ చేత మాత్రా ఛందస్సు వ్రాయించాను మన్నించాలి :)
ఊదంగారు ,
బాగుంది మీ కల్పన। నేను వారి ప్రేమకు ఱెప్పపాటుకాలం సాక్షి। అల మన ఱెప్పరాటి ప్రేమకు సాక్షి।
నమస్కారగళు. మొదట నెనసుగానే కనసుగుఱించి ఇబ్బందిపడ్డానండీ తెలియక! ఱెప్పపాటులో అలలకై(పై) తేలియాడిందా మీ మనస్సు! :)
ReplyDeleteపాలు కారే బుగ్గలు - గాలి కారే నుఱుగు! వావ్వ్!
ఇహ నా అనుమానాలు:
౧ నీకు వేసే? నీకేసే?
౨ గణసౌలభ్యం కోసం వెన్నుతిరుగు అన్నా అర్థం చేసుకోవచ్చు కానీ, వెనుకకు మరలు తిరుగు అంటే అర్థం చేసుకోవడం కొంచెం ఇబ్బందే.
౩ బండఱాళ్లతో కదా అనవలసినదీ? మీరు కూడ ఇలా బండఱాళ్లుతో అనటం ఏమీ బాగోలేదు.
@ఊకదంపుడు: తొక్కలో "తొ"తో నా! :D