కథానాయిక అందగత్తెకు, కథానాయకుడు ప్రేమికుడు ఒక శార్దూలపద్యం వ్రాసి పాడతాడు. పద్యం అస్సలు అర్థంకాకుండా గీర్వాణజఠిలంగా వుంటుంది. అప్పుడు ఆమె అచ్చ తెలుగు హీరోయినీలా పాటపాడి తెలుగుపాటంటే ఎలా వుండాలో వివరిస్తుంది.
లయ
తాన నాననా నానన్నే.. పిపీపుపూ.. పిపీపుపూ.. నన్న నాననా నన్న నాననా.. తుతూతూతూ పిపీపీపీ.. నననన నానన నననన నానన అని సాగుతుందని చెప్పుకోవచ్చండి.
సాహిత్యం
తేటతెలుఁగులో పాటంటే
సందెమాటునా
కరిగిపోతునా
పడమటి దిక్కుకు
కడగా వీడ్కోలు
పలికే దివ్వల్లే
పైరగాలితో
రెపరెపలాడాల
తేటతెలుఁగులో పాటంటే
సందెమాటునా
తేలిచూస్తునా
తూరుపు పొద్దుకు
ఇదుగో ఇకడంటు
పిలిచే మడుగున
చిట్టలలలా
రెపరెపలాడాల
-ఇక్కడ కాస్త మూజిక్-
పంచచామరం సంసుక్రుతంలో
శివునిడోలల్లే డమడమలాడినా
మా తెలుఁగూరి వేటూరి పాటలో
సేలయేటి తేటల్లే ఆడుతు పాడుతు
మెల్లంగ సాగాల
అందుకేఽఽఽఽ
తేటతెలుఁగులో పాటంటే
ఆటవెలదులై
తేటగీతులై
అలసిన ఎంకికి
నాయిడు బావని
పాటల్లె నన్నూ
చాటుకుపిలవాల
వాటేవేయాల
మనవి
మా తరువాతి నవతరంగం సినిమాలో బడిజెట్టు కష్టాలవల్ల మేము వ్రాసుకున్న పాటలే పెట్టుకుంటున్నాం. దీనికి మంచి ౘూను కట్టి యూటూబులో ఎక్కించి మాకందఁజేసిన వారికి సినిమా పేర్లలో పేరు దొడ్డు అక్షరాలలో వేయబడుతుంది.
వ్యాఖ్యాతలకు ప్రత్యేక మనవి
తేట అనే పదం యొక్క పునరుక్తి ఎక్కువయ్యింది.
ఇది పాటకాదు, దీనికంటే ఆ అబ్బాయి వ్రాసిన శార్దూలవిక్రీడితమే సరలంగా వుండుంటుంది.
పాటకూ దీపానికీ అలలకూ ఉపమానం కుదరలేదు. రూపకమూ కుదరలేదు. ఉత్ప్రేక్షమూ కుదరలేదు.
పంచచామరం వంటి పదాలు సామాన్యజనానికి అర్థంకావు.
అక్కడక్కడ ప్రాస కుదరలేదు.
దీని నిండా క్లిషేలే.
- వంటి వ్యాఖ్యలు చేయకుండా, ఈ మాటున పాట బాగుందనండి. రెండో పాటకు మీకు తోచింది వ్రాయవచ్చుఁ.
స్ఫూర్తి
సముద్రాల, దేవులపల్లి, దాశరథి, శ్రీశ్రీ, చినసముద్రాల, పింగళి, కొసరాజు, ఆత్రేయ, ఆరుద్ర, అనిసెట్టి, సీనారె, వేటూరి, సిరివెన్నెల
అంటే ఇప్పుడు ఈ పాటకు తగ్గ సీన్ రాయాలన్నమాట...సరే ఏంచేద్దాం!
ReplyDeleteఇలాంటి సన్నివేశం అదేదో శ్రీకాంత్ సినిమాలో (అదేదో అన్న విశేషణం శ్రీకాంతుకి కాదు సినిమాకి) ఉన్నట్టు గుర్తు.
ReplyDeleteపాట బాగుంది, రెండో పాట ఎప్పుడు రాస్తున్నారు? :-) మీరు "స్ఫూర్తి"లో అంతమంది పేర్ల లిస్టిచ్చినా, నాకెందుకో మీరు ఇవ్వడం మానిన (మరచిన?) చంద్రబోస్ స్ఫూర్తి కనిపించింది పాటలో.
ఈ పాట బాగుంది. రెండో పాటెప్పుడు?
ReplyDeleteదివ్వల్లే ???
ReplyDeleteశివునిడోలల్లే ???
డమడమలాడినా????
అలసిన ఎంకికి అనవలెనా ఎంకిని అనవలెనా ....
సినిమా పాట ముందు సినిమాలో వస్తేనే అందం...
భవదీయుడు
ఊకదంపుడు
తేటతెలుఁగులో పాటంటే
ReplyDelete..యో యో .. యో గొన్నా రాకిట్
సందెమాటునా
...యో యో.. యు గొన్నా మేకిట్
కరిగిపోతునా
... దట్స్ కూల్ బేబీ
పడమటి దిక్కుకు
... ఈ లవ్ దిస్
కడగా వీడ్కోలు
... వై వై వై..డియరో డియ
పలికే దివ్వల్లే
... నైస్ నైస్ యు నో
పైరగాలితో
... అయాం గొన్న సింగ్ దిస్
రెపరెపలాడాల
.... యాహూ యావా
ఖంగారు పడకండి. ఈ పాటకు రీమిక్స్ లిరిక్స్ ఇవి. మీ సినిమాలో ఆఖర్న టైటిల్స్ పైకి పైకి పోతూన్నప్పుడు బాగ్రవుండ్ లో వాడండి. నా పేరు మాత్రం టైటిల్స్ లో వేయండి. మీరు ఒరిజినల్ పాటకి మ్యూజిక్ ఇస్తే, రీమిక్స్ మ్యూజిక్ ఫ్రీగా "కొట్టి" ఇస్తాను.
వేటూరి పేరు ఎక్కడ కనబడితే అక్కడ నా జేజేలు :) బాగుందండి, మీ పాట!
ReplyDeleteకామేశ్వర రావు గారు,
ReplyDeleteఈ చంద్రబోసు ఎవరో కూడా నాకు తెలియదు. కానీ నా పాటల్లా అతనిది వుందంటే తప్పకుండా గొప్పవాడే అయివుంటాడు.
ఊదం గారు,
నేను ప్రత్యేకించి మనవి చేసుకున్నా మీరు పేర్లు పెట్టేరే, ఎంత అసభ్యత!
ఇతే పాట మీరు వ్రాసారనుకుని కొంత సేపు నేను అందుకుంటే, అసలు మీరు జీవితంలో మారు కలం పట్టరు, కీబోర్డు ముట్టురు, అంత చెండాలంగానూ వుంది. ఏం కొత్తపాళి గారు, కామేశ్వరరవుగార్లు ఇంత కంటెఁ మంచివి చదవకా, మీరు చదివా?
పాట నిజ్జంగా బాగుంది కాబట్టి బాగుందన్నారు. మీరు కుళ్ళుకోక ఇలాంటి సత్ప్రయ్నాలు చేస్తే భాషాసంస్కృతులను ఉద్ధరించనవారవుతారు.
సందీపు గారు,
రెండేళ్ళగా వేటూరి నామ జపం చేస్తే ఏదో ఈ మాత్రం పాట క్రక్కగలిగాను. :)
ఇంసోమ్నియపు తోటలోకి
ReplyDeleteనవతరంగం మొకటి వచ్చింది
శార్దూలం నడుమిరిగింది
శ్రాధ్ధపు(*) సినిమా పాటైంది
[* సాధు ప్రయోగం, శ్రధ్ధ తో రాసిన అని అన్వయం]
ప.రా.క్షేత్రాంగనను బోలింది
ఒత్తు లొదిలి ఆమెకై చిక్కింది
తననా పిపిపీ పులుముకుంది
ఆమె పెదవులపై చోటుకంది
త్వరలో తెరపై చిందీకుందీ
నోళ్ల నువ్వుజీడై నానుతానంది
రాకపోతుందా నందీ
అని తను లోలో గొణిగింది
కాని పాపం అందంగుంది (2)
పేరున్న బ్లాగున వెలిసింది
కూడలి లో కలిసింది
లోకులకూ తెలిసింది
పాట బాగుంది అనమంది
మనవిని ఫత్వా చేసింది..
అనని వ్యాఖ్య నొకటికంది
కోపంతో బుస కొట్టింది
అభిజాత్యం బుద్ధి మందం
అహంకారం "ఊదం"కంది
బాగుందంటే పదిమందీ
ఓర్వలేని కుళ్లుకు నెలవందీ
"క్లాపు" నకొచ్చి కబురంది
"ఫ్లాపు కాక పోతుందీ"
అనే ద్వర్ధిని పలకందీ
కదలని మంకెన్న వీడంది..
<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>
నిజమే - వారు ఎక్కువ చదివిన వారు. వారికి అర్ధమైంది . నాకు అర్ధం కాలేదు.
శివుని డోలల్లే అంటే ఉయ్యాల డమడమ లాడటమేటి అని అడిగింది ఈ ఊకదంపుడు బుఱ్ఱ.
డోలు అల్లే అని మీరు ఏడో వ్యాఖ్య లో డొక్క చీల్చి వాయించిన తరువాత కానీ తెలియదు .. ఇక డమడమలు ఏమిటో .. ఏ నిఘంటువును ఆశ్రయించినా తెలియలేదు.. బహుశః మంచు పర్వతం అవటం వల్ల చర్మం బాగ మొద్దుబారి .. అలా శబ్దం వస్తుందేమో ...
సినీ కవి ఒత్తులొదలక్కరలేదు.. ఆ పనికి ప్రత్యేకం గాయనీ గాయకులున్నారు.
శీఘ్రమేవ సింగిల్ కార్డూ, సింగరు కార్డూ ప్రాప్తి రస్తు.
భవదీయుడు
ఊకదంపుడు
@రవి గారూ .... పరమ సత్యం.
రాకేశ్వర రావు గారు,
ReplyDelete[* సాధు ప్రయోగం, శ్రధ్ధ తో రాసిన అని అన్వయం]
అచ్చుతప్పు - సాదు అని చదువుకోండి.
కామేశ్వర రావు గారు,
మీరు చెప్పేది .. పెళ్ళి సందడి సినిమాలో చెమ్మ చెక్కా(2) అనే పాట ముందు "అభ్రపధమున్న" గురించి అనుకుంటా ?
భవదీయుడు
ఊకదంపుడు
Do you really need a tune for this? If yes then feel free to send me a mail
ReplyDeleteరౌడీ గారు, మీ యిష్టం కట్టి ఇస్తానంటే అంతకంటే భాగ్యమా? మీరు పాడిన ఒక పాట విన్నాను ఇంతకు ముందు చాలా బాగుంది।
ReplyDeleteసరేనండి. అయితే ట్యూనుకి అనుగుణంగా కొద్దిపాటి మార్పులు చేర్పులు చేస్తాను పాటకి, మీకిష్టమయితే
ReplyDeleteషూర్ షూర్ రౌడీ గారు। మీ పాటేననుకోండి। :)
ReplyDeleteరికార్డు చేసి మీ బ్లాగులోనికెక్కించండి। విందాము॥
ఈ అచ్చ తెనుగు హీరోయినీ ఎక్కడుంది రాకేశా?
ReplyDeleteChanged the lyrics a little ( To suit my tune). Please tell me whether the change is okay with you
ReplyDelete________________________________________________
తేట తెలుగు పాటంటే
సందెమాటున తేలి చూస్తునా
తూరుపు పొద్దును
రా రమ్మంటూ
పిలిచే చిట్టల లా లా లా లా
తేట తెలుగు పాటంటే
సందెమాటున తేలి చూస్తునా
పాంచారామం సంస్కృతమై
శివునిడోలల్లే ఆడగా
మా తెలుగూరి వేటూరి
పాటే సెలయేరై పారగా
స్వరమాడుతూనే, పాడుతూనే
హాయిగా, తీయగా సాగదా
హాయిగా, తీయగా సాగదా
ఆటవెలది తేటగీతీ
అలసిన ఎంకి సేద తీర్చవా
నాయుడు బావ రాగాలు
చాటుకు తననే పిలువవా
తీపంటే ఈ తెలుగే
తెలుసుకో తెలుసుకో తెలుసుకో
తెలుసుకో తెలుసుకో తెలుసుకో
తెలుసుకో తెలుసుకో తెలుసుకో
రౌడీగారు,
ReplyDeleteబాగుంది కానీయండి।
ట్యూనుతో, మ్యూజిక్కుతో పాడిన పాట లింకేది?
ReplyDelete