"ఇన్ని నిబంధనలతో, ఎవరైనా పద్యం వ్రాయగలరా, అదీ వారూహించిన భావం పోకుండా?"
కాని నాకున్న సందేహాలన్నీ, పోతనగారి ఈ పద్యం చదివాక పోయాయి.
సిరికిం జెప్పడు; శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపడేచిన్నప్పుడు మా తెలుగు పంతులుగారు దీనిని మా క్లాసులో వివరించారు. అప్పట్నించి నా బుర్ర వెనకాలెక్కడో దీని భావం అలా మిగిలిపోయింది. మా తెలుగు మస్టారుకి తెలుగు అంటే చాలా అభిమానం దానిని నాలాంటి అమెరికా పిచ్చున్న వాడికి కూడా బాగా అందించారు. పిచ్చి తీరింది కాబట్టి దానికిందున్నది పైకి తేలుతుంది. అందాన్ని చూడడానికి మనోనేత్రం దుర్గమ్మ ఇచ్చినందుకు, అదృష్టం నాది.
పరివారంబును జీర డభ్రగపతిం బన్నింప డాకర్ణికాం
తర ధమ్మిల్లము జక్క నొత్తడు వివాదప్రోత్థిత శ్రీ కుచో
పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై
ఏదేమైనా తెలుగు వృత్తాలు వ్రాయడం నాలాంటి వాళ్ళకు ఈ జన్మకు అసాధ్యమైనా, వాటిని చదివి ఆనందించే భాగ్యమైనా ఉండాలికదా? వచ్చే జన్మకి తెలుగు మాట్లాడే యోగ్యం కూడా ఉండదేమో :).
వృత్తాలను తేలికగా గుర్తుపెట్టకోవాలన్నా, వాటిని పాడుకోవాలన్నా వాటి లయ రావడం ముఖ్యం. అందుకనే వాటి లయ నేర్చడానికో విన్నూత్నమైన పద్ధతి వాడుతున్నాను, అది మీతో పంచుకోవడానికి ఈ టపా. లయలన్నీ శంకా రామకృష్ణగారివి.
బొమ్మలు
ఈ క్రింద ఉన్న సోపానరేఖాచిత్రాలలో(పదం నేర్పింది రానారె, తెలుగుపదం గుంపులో), ఆకు పచ్చ రంగులో పెద్దగా కనిపించే గళ్ళు గురువులు, వాటికి అరవైశాల్యమున్న చిలకపచ్చ గళ్ళు లఘువులు. ఎడమవైపు నుండి కుడి వైపుకు, క్రింది నుండి పైకి చదువుకుపోవాలి, ఉదాహరణకు, ఉత్పలమాల మొదటి గణం భ, కాబట్టి ఒక పెద్దడబ్బా దాని పైన రెండు చిన్నడబ్బాలు కనిపిస్తాయి, కాబట్టి వాటిని UII గా చదువుకోవాలి. ఇక లయ రావడానికి, 'తా','న' లను గురు లఘువులుగా వాడడమైనది. బొమ్మలో 'య' ఉన్న చోటు యతి స్థానం. ఎఱుపు రంగులో ఉన్న పాదాలకు ఇక్కడిచ్చిన నడక బాగా కుదురుతుంది. ఒక ఉదాహరణ చూస్తే మీకే అర్థమవుతుంది అంతా. యతి ముందు చిన్న విరామం ఇవ్వడం మరువవద్దు.
ఉత్పలమాల
గణాలు: భ, ర, న, భ, భ, ర, వ
యతి: ౧౦
నడక ౧ : తానన తాన తాన తన తానన తానన తాన తాన తా
నడక ౨ : ధీంతన ధీంన తోంన నన ధీంతక తోంతక ధిక్కు ధిక్కు ధా
ఉదా ౧:
తొండము నేక దంతమును తోరపు బొజ్జయు వామ హస్తమున్ఉదా ౨:
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్
కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జవై
యుండెడి పార్వతీ తనయ యోయి గణాధిప నీకు మ్రొక్కెదన్
భండన భీముడార్త జన భాంధవుడుజ్వల బాణ తూణ కోసోది: ఉత్పలమాల, చంపకమాల జంట వృత్తాలు. ఎందుకో మీకు బొమ్మలు పోల్చిచూస్తే అర్థమవుతుంది. అలానే శార్దూలము, మత్తేభమునూ.
దండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామ మూర్తికిన్
రెండవ సాటి దైవమిక లేడనుచున్ కడ గట్టి భేరికా
డాండడ డాండ డాండ నినదంబుల జాండము నిండ మత్త వే
దండము నెక్కి చాటెదను దాశరధీ కరుణా పయోనిధీ !!
చంపకమాల
గణాలు: న, జ, భ, జ, జ, జ, ర
యతి: ౧౧
నడక ౧ : తన నన తాన తాన తన తానన తానన తాన తాన నా
నడక ౨ : ధిరనన ధీంన తోంన నన ధీంతక తోంతక ధిక్కు ధిక్కు ధా
ఉదా ౧:
అలుగుటయే యెరుంగని మహామహితాత్ము డజాతశత్రుడేఉదా ౨:
అలిగిననాడు సాగరము లన్నియు ఏకము కాక పోవు క-
ర్ణులు పదివేవురైన అని నొత్తురు చత్తురు రాజ రాజ నా-
పలుకులు విశ్వసింపుము విపన్నుల లోకులగావు మెల్లరన్
అటజని గాంచె భూమి సురు డంబర చుంబి సురస్సర జ్ఝరీసోది: నాలుగో పాదం గుర్తుకులేదు, ఎప్పుడో ఎనిమిదో తరగతిలో విన్నా, పద్యం అర్థం కూడా తెలియదు, ఎవరో రాజు ఎవో జలపాతలను చూస్తున్నాడని తప్ప. కాని పద్యం వింటుంటే జలపాతాంలా అనిపించి ఈ పద్యం 'బాగా' గుర్తుంది.
పటల ముహుర్ముహుర్లట దబంగ తరంగ మృదంగ నిస్వన
స్పుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్
శార్దూలం
గణాలు: మ, స, జ, స, త, త, గ
యతి: ౧౩
నడక ౧ : తానా తానన తాన తాన తననా తానాన తానాన నా
నడక ౨ : తద్ధిత్తోం తక తోంన తోంన ధిరనా తద్ధిక్కు తద్ధిక్కు తా
ఉదా ౧:
జండాపై కపి రాజు ముందు సిత వాజిశ్రేణినిన్ గూర్చి నేఉదా ౨:
దండంబున్ గొని దోలు స్యందనము మీదన్ నారి సారించుచున్
గాండీవమ్ము ధరించి ఫల్గుణుడు మూకం జెండు చున్నప్పు డొ
క్కండున్నీ మొర నాలకింపడు కురుక్ష్మా నాథ సంధింపగాన్
అంతా మిథ్య తలంచి చూచిన, నరుండట్లౌ టెరింగిన్, సదాసోది: రెండవదానిని ఎక్కడనుండో అతికించినా, ఇది నా ఎనిమిదో తరగతి నుండి గుర్తున్న ఒకే ఒక పూర్తి పద్యం. సరళ మైన తెలుగులో ఉండే వృత్తమిది.
కాంత, ల్పుత్రులు, నర్థమున్, తనువు నిక్కంబంచు మోహార్ణవ
భ్రాంతిం జెంది చరించుఁ గాని; పరమార్థంబైన నీ యందుఁ దా
జింతాకంతయుఁ జింత నిల్పడుఁ గదా శ్రీ కాళ హస్తీశ్వరా !
మత్తేభం
గణాలు: స, భ, ర, న, మ, య, వ
యతి: ౧౪
నడక ౧ : తననా తానన తాన తాన తననా తానాన తానాన నా
నడక ౨ : తకధిత్తోం తక తోంన తోంన ధిరనా తద్ధిక్కు తద్ధిక్కు తా
ఉదా ౧:
అల వైకుంఠ పురంబులో నగరిలో నా మూల సౌధంబు దా
పల మందార వనాతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంక రమా వినోది యగు నాపన్నః ప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము పాహి పాహి యన గుయ్యాలించి సంరంభియై
ఉదా ౨:
సిరికిం జెప్పడు; శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపడేగురువులు:
పరివారంబును జీర డభ్రగపతిం బన్నింప డాకర్ణికాం
తర ధమ్మిల్లము జక్క నొత్తడు వివాదప్రోత్థిత శ్రీ కుచో
పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై.
బి.ఎ. రాంమోహనరావు (తెలుగు పంతులు, పేరులేని పాఠశాల), శంకా రామకృష్ణ (వ్యాసం ౧, వ్యాసం ౨), కొత్తపాళీ, తెవికీ, ఈమాట
లఘువు: రానారె :)
తప్పులుంటే, ఎప్పటిలానే, మన్నించి తెలుపుగలరు.