భాషందం, భువనందం, బ్రతుకందం

Monday, July 16, 2007

తప్పక చదవవలసిన సాహిత్యం

నేను తెలుగు సాహిత్యం గుంపులో "'ఈ పుస్తకం అందరూ చదవాలి' అనుకునే మంచి పుస్తకాలు" సూచించమని అడిగితే మంచి చూచనలు చాలా వచ్చాయి. వాటన్నిటి సంగ్రహం ఇక్కడ ఒక టపా గా వేద్దామని అనుకున్నా.
అలాగే మన తెలుగు గుంపుల్లో అన్ని తీగల్లాగా ఇదికూడా కొద్దిగా పక్కదారి పట్టి, కొంత సేపటికి కథలు మాత్రమే సూచిచంచడం మొదలు పెట్టారు. కాబట్టి మీకు ఎఁవైనా మహా సాహిత్యం ఉండవలసినది ఈ క్రింది జాబితా లో లేదు అని అనిపిస్తే, వెంటనే ఆ గుంపులో చేరి మీరు కూడా చూచించగలరు, లేక పోతే ఈ టపాలో వ్యాఖ్యానించండి.
ఇంకా, జాబితా గురించి, గుంపులోని తీగలోనుండి పుస్తకాల పేర్లు మాత్రమే ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. ఇంకా వివరాలు చర్చలు, పరస్పర డబ్బాల:) కోసం అక్కడ చూడండి.

కొత్త పాళీ

"విజయవిలాసము" - చేమకూర వెంకటకవి (తాపీ ధర్మారావు వ్యాఖ్యతో)
"ఆముక్త మాల్యద" - శ్రీకృష్ణదేవరాయలు (వావిళ్ళ వారి వ్యాఖ్యతో)

కొడవగంటి కుటుంబరావు సాహిత్యం - 6 సంపుటలు
శ్రీపాద సుబ్రహ్మన్య శస్త్రి కథలు - 3 సంపుటలు
"సాక్షి వ్యాసాలు" పానుగంతి లక్ష్మి నరసింహం
కృష్ణ శాస్త్రి కవితలు
"అమృతం కురిసిన రాత్రి" - తిలక్
"మహా ప్రస్థానం, ఖడ్గసృష్టి" - శ్రీశ్రీ

katha annuals
"దృశ్యాదృశ్యం" చంద్రలత
"హిమజ్వాల, అనుక్షణికం" వద్దెర చందిదాస్

సౌమ్య
"సలాం హైదరాబాద్" – లోకేశ్వర్ (తెలంగాణ మాండలికం)

చరసాల
"పచ్చనాకు సాక్షిగా", "సినబ్బ కథలు", "మునికన్నడి సేద్యం", "పాల పొదుగు" ఒకే సంపుటంగా "మిట్టూరోడి కథలు" - నామిని సుబ్రమణ్యం నాయుడు (రానారె శైలి)

వెంకట రమణ
"ప్రళయ కావేరి కథలు" - సా.వెం.రమేశ్ (రానారె శైలి)

త్రివిక్రం
"పెన్నేటి కథలు" పి. రామకృష్ణారెడ్డి (కలం పేరు తులసీకృష్ణ)
కొన్ని రాయలసీమ కథల సంకలనాలు/సంపుటులు:
*సీమకథలు (VPH)
*రాయలసీమ కక్షల కథలు (పెన్నేటి ప్రచురణలు, కడప)
*పెన్నేటి కతలు (పెన్నేటి ప్రచురణలు)
*కడప కథ (నందలూరు కథానిలయం)
*చక్రవేణు కథలు (విరసం?)
*మొలకల పున్నమి (వేంపల్లి గంగాధర్, ఉషస్సు ప్రచురణలు)
ఆరవీటి శ్రీనివాసులు కథలు (VPH?)
పెన్నేటి మలుపులు (శాంతి నారాయణ)
సడ్లపల్లి చిదంబర రెడ్డి కథలు
నాలుగ్గాళ్ల మండపం
నామిని కథలు
కర్నూలు కథ
*చుక్కపొడిచింది (పాలగిరి విశ్వప్రసాద్, నేత్రం ప్రచురణలు, కడప)*
*కేతు కథలు (మూడు భాగాలు)*
*సొదుం జయరాం కథలు (విజేత కాంపిటీషన్స్, జనరల్ బుక్స్ సీరీస్)*
*మధురాంతకం కథలు (VPH)*
*సింగమనేని కథలు *
*రాతిఫూలు (నేత్రం ప్రచురణలు)*

రానారె
ముళ్లపూడివెంకటరమణ సాహితీ సర్వస్వం. (ప్రత్యేకించి "సినీరమణీయం")

నేను సైతం
"నూతిలో గొంతుకలు" ఆలూరి బైరాగి

పద్మ ఇంద్రగంటి
"మిట్టూరోడి కతలూ" - నామిని సుబ్రహ్మణ్యం నాయుడి (రాయలసీమ మాండలికం)
"ఇస్కూలు పిల్ల కాయల కథలు"
"దర్గామిట్ట కథలు" - మహమ్మద్ ఖదీర్ బాబు
"ఇల్లేరమ్మ కథలూ" -సోమరజు సుశీల
మధురాంతకం రాజారాం కథలు (రాయలసీమ మాండలికం)
శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, తిరుమల రామచంద్ర, టంగుటూరి ప్రకాశం ల ఆత్మ కథలు.
(ఆధునిక సాహిత్యం కొనుక్కోవడానికి సూచనలు కావాలంటే, కొన్నాళ్ల క్రితం వెల్చేరు నారాయణ రావుగారు మరి కొందరు తయారు చేసిన "ఈ శతాబ్దపు రచనా శతం" చూడండి)

క.వ.గిరిధర రావు
ఖదీర్ బాబు గారి కథలు - దర్గామిట్ట కతలు, పోలేరమ్మబండ కతలు.
శంకరమంచి సత్యం గారి 'అమరావతి కథలు'.

నవీన్ గార్ల
"పోలేరమ్మబండ కథలు"- మహమ్మద్ ఖదీర్ బాబు
"మా పసలపూడి కథలు" - వంశీ

రాధికా రిమ్మలపూడి
"అత్తగారి కథలు" - భానుమతీ రామకృష్ణ


తప్పులుంటే మన్నించి, నాకు తెలుపగలరు.

11 comments:

 1. రాకేశ్వరరావు, అన్నీ ఒక్క చోట పెట్టి మంచి పని చేశావు. ఇప్పుడు జనాలు Threadsను తీగ అనట్లేదు...చర్చాహారం అంటున్నారు. ("తెలుగుపదం" గుంపు సౌజన్యం)

  ReplyDelete
 2. అమరావతి కథలు - సత్యం శంకరమంచి
  అంటరాని వసంతం (నవల) - జి. కళ్యాణరావు
  మాలపల్లి (నవల 1930ల కథ)- ఉన్నవ లక్ష్మీ నారాయణ
  అతడు - ఆమె (నవల) - ఉప్పల లక్ష్మణరావు
  కవితా ఓ కవితా (1980ల ఆధునిక కవితా సంకలనం)

  ReplyDelete
 3. పండుటాకు - కాత్రగడ్డ దయానంద్

  (ఇంకా చాలా ఉన్నాయి...తరువాత చెబుతా..)

  అనిల్ చీమలమఱ్ఱి

  ReplyDelete
 4. అయ్యో!

  "పెన్నేటి కతలు" రచయిత ఆరవేటి శ్రీనివాసులు అని రాశానా? కాదండీ. పెన్నేటి కతలు రాసింది పి. రామకృష్ణారెడ్డి (కలం పేరు తులసీకృష్ణ). (ఈ విషయం అదే గుంపులో అంతకుముందు మరో దారంలో రాశానుగదాని మళ్ళీ రాయలేదు. కారణమేదైనా స్పష్టంగా రాయనందుకు సారీ!) ఇది కేవలం రాయలసీమ కథలు కోరేవాళ్ల కోసం ఇచ్చిన లిస్టు. ఇటీవల చందు గారు అడిగినప్పుడు ఆయనకు ఇంకో పెద్ద లిస్టు పంపించాను. అదొకసారి వెతికి పంపుతాను. :)

  (నాలుగ్గాళ్ళ మండపం రాసింది పులికంటి కృష్ణారెడ్డి గారు)

  ReplyDelete
 5. ఈ లోపల నవలల కోసం ఈ టపా కూడా చూడండి.

  ReplyDelete
 6. (బాపు బొమ్మలతో) రమణ రాసిన బుడుగు !! రమణ రాతలంటే నాకు చాలా ఇష్టం, మహా సాహిత్యం కాకపోవచ్చు కాని, పసందైన సాహిత్యం అది :)

  ReplyDelete
 7. ఆంధ్రమహాభాగవత గ్రంధాన్ని కొనండి. ఔను. నేనేమీ తాగినమత్తులో చెప్పడంలేదు. :) అందులో రుక్మిణీకల్యాణం, గజేంద్రమోక్షం లాంటి కొన్ని మనకు బాగా పరిచయమైన ఘట్టాలు, మనం తరచూ వినే పద్యాలు సులభంగా అర్థమౌతాయి. అవి అర్థమయేసరికి పోతన మీకు ఒక మెగాస్టార్‌లా కనిపిస్తాడు. ఆ పుస్తకాన్ని అడపాదడపా తిరగేస్తూ ఉంటే ఆశ్చర్యాన్నిగొలిపే పద్యాలూ, సంఘటనలూ, రసవత్తరంగా పట్టుగా ఉత్కంఠగా నడిచే ఘట్టాలు, ఎన్నెన్నో కనిపిస్తాయి. శృంగారవర్ణణలు ‌కూడా. బ్రౌణ్యం పక్కనుంటే మంచిగ్‌లా మజాగా ఉంటుంది.

  ReplyDelete
 8. రాకేశ్వరరావు గారు మీరు విశ్వనాధ సత్యనారాయణ గారి గురించి మరిచి పోయారు. దయ చేసి ఆ పుస్తకాలు గురించి వాటి లిస్ట్(వేరే ఇవ్వనక్కర లేదనుకుంటాను)గురించి మీరే ప్రచురించండి

  వేణు-

  ReplyDelete
 9. రాకేశ్వరరావు గారు మీరు విశ్వనాధ సత్యనారాయణ గారి గురించి మరిచి పోయారు. దయ చేసి ఆ పుస్తకాలు గురించి వాటి లిస్ట్(వేరే ఇవ్వనక్కర లేదనుకుంటాను)గురించి మీరే ప్రచురించండి

  వేణు-

  ReplyDelete
 10. రానారే చెప్పినది పాటించదగినది. నవ శతకమంజరి అన్న చిన్న పుస్తకంలో కొన్ని శతకాలతో పాటు గజేంద్రమోక్షం పద్యాలు ఇచ్చారు సంకలనకర్త. అది పుచ్చుకొని మా పిల్లల వెనక పడుతున్నా- ఒకనాలుగు పద్యాలు కంఠస్తం పట్టండి ప్లీజని.
  మధురాంతకం రాజారాం గారు రాయలసీమ వాసి. నాకు తెలిసి ఆయన రచనలు రాయలసీమ మాండలికంలో వ్రాయలేదు. మాండలికంలో వ్రాయకపోవడానికి కారణం కూడా ఒక ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు. ఆమాండలికాన్ని రచనల్లోకి తెచ్చినాయన పులికంటి కృష్ణారెడ్డి అనుకుంటా.

  ReplyDelete
 11. బ్లాగుసన్యాసమా? లేక పుస్తకాల్లో మునిగిపోవడం వల్ల కుదరలేదా?

  ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం