భాషందం, భువనందం, బ్రతుకందం

Saturday, November 03, 2007

ఆర్కుట్ లో తెలుగు

"సినిమాలలో హ్యాపీడేస్ ఎలాగో, అంతర్జాలంలో ఆర్కుట్ అలా" అనేది మీలో ఆర్కుట్ అకౌంటు వున్నవారికి తెలిసిన విషయమే ! అకౌంటు లేని వారు ముందు హ్యాహీ డేస్ చూసి తరువాత ఆర్కుట్ అకౌంటు తెరవండి ! అప్పుడు అర్థమవుతుంది! అప్పటికీ అర్థమవ్వకపోతే, అక్కడ వున్న హ్యాపీ డేస్ అనే కమ్యూనిటీలో చేరండి ! అప్పుడు అర్థమవుతుంది బ్లాగులకంటే పెద్ద వ్యసనం, వాటికంటే చెత్త టైం పాస్ ఇంకోటి వుందని !

ఇంతకీ మంచి మాటేంటంటే,
బ్లాగులు తెలుగులో వచ్చి నట్లు ఆర్కుట్ కూడా తెలుగులో వచ్చింది.
మీ హోమ్ కి వెళ్లి అందులో ఎడమ పక్క పట్టీలో సెట్టింగులు లో Display Language ని తెలుగు లోకి మార్చుండి. మీ ఆర్కుట్ అనుభవం తెలుగులోకి అనువదించబడుతుంది.

ఆర్కుట్ నుండి కొన్ని అనువాదాలు
Home హోమ్
Settings సెట్టింగులు
Album ఆల్బమ్
Scrapbook స్క్రాప్బుక్
Communities కమ్యూనిటీలు
State స్టేట్
Add Stuff స్టఫ్ చేర్చుట

Passions - transliterate passions as is to telugu, ఇష్టాలు
Activities కార్యకలాపాలు
Email ఇమెయిల్, e- చిరునామా
Relationship Status సంబంధ స్థితి
Single ఒంటరి (How true!)
Here for ఇక్కడ ఎందుకోసం
Children: None పిల్లలు: లేదు

Edit సవరించు
Sexual Orientation లైంగిక దృక్పదం (మరిన్ని వివరాలు ఇవ్వదలచుకోలేదు, మీరే చూసుకోండి)

కొన్ని సవరణల అవసరం వున్ననూ, తెలుగులో వారి గూడును ప్రవేశపెట్టినందుకు ఆర్కుట్ మఱియు గూగుల్ వారిని నిజంగా అభినందించాలి!

ఇప్పుడే గమనించిన విషయం :
ఆర్కుట్ లో మీ ప్రోఫైలుకి మీ బ్లాగు చేర్చవచ్చు, పైన పోర్కొన్న స్టఫ్ చేర్చు లో స్టఫ్ అంటే బ్లాగులు ఫీడులు వగైరా అంటా! ఇంకేంటి అగ్నికి పెట్రోలు తోడైనట్టే!

5 comments:

  1. this post doesnot belong to your style

    ReplyDelete
  2. @Anon గారూ,
    చెప్పినందుకు ధన్యవాదాలు.
    నాకు ఒక శైలి, ఒక ఇమేజీ బ్రాండు వేయడం నాకు ఇష్టంలేదు (ఇప్పటికే తోటరాముడు వంటివారు అలాంటి ఇమేజ్ చెఱలో బందింపబడ్డారు), కాబట్టి ఇలాంటి ఆఫ్ షూట్ టపాలు ఇంకా వేస్తాను. :)

    ReplyDelete
  3. మరి మీరు ఆర్కుట్లో ఎక్కడో?

    ReplyDelete
  4. @ చందన గారు,
    మీరు లంకె ఇచ్చిన ప్రోఫైల్ చూసా .
    ఒక ఫేక్ ప్రోఫైల్ కి వుండవలసిన లక్షణాలన్ని దానికి వున్నాయి :)
    ఇంతకీ మీరు (ఆ ప్రోఫైల్ లోని వారు) ఒక స్త్రీనా, పురుషులా లేక ఒక సిద్ధాంతమా ? :D

    ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం