భాషందం, భువనందం, బ్రతుకందం

Thursday, November 15, 2007

రానారె తో ముఖాముఖి

ఉపోద్ఘాతం
ఒక నెల రోజుల క్రితం, ఓ వేడి ఆంధ్రా మధ్యాహ్నం వేళ, సృజనాత్మకత పేగుల్లో కొట్టుకొచ్చినప్పుడు, రెండు పాత్రలను కల్పించి వ్రాసిన సంభాషణ ఇది. ఒక యువ విలేకరి, ఒక పెద్ద రాజకీయవేత్తని ఇంటర్వ్యూ చేస్తుంది. రాజకీయనాయకుడి పాత్ర నా నుంచి జనించినదైనా, అతను వ్యక్తపరిచే అభిప్రాయాలు నావి కావు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది, 'ది డైలీ షో'లో ఒక స్కిరిప్టు అనుకోండి.

ముఖాముఖి

నమస్కారం రానారె (రాకేశ్వర నాయిడు రెడ్డి) గారు.

నమస్కారఁవమ్మా.

మీరు శ్రీశ్రీ కవిత్వాన్ని మీ రచనల్లో ఖూనీ చేస్తారు అని ప్రజాభిప్రాయం, మీరేమంటారు ?

నేనే మంటాను, ఎవరి అభిప్రాయం వారిది. ఇతర రాజకీయనాయకులలా నేను అన్యుల అభిప్రాయాలను ఖండించను, నాది విశాల దృక్పదం.

మీరలా వ్రాయడం శ్రీశ్రీ అభిమానులూ, గాంధీ అభిమానలూ తీవ్రంగా ఖండిస్తారోమో ?

శ్రీశ్రీ అభిమానులకు - ఇక్కడ శ్రీశ్రీ కవిత్వం గురించి, తెలుగు కవిత్వం గురించి పలువురికి ఆసక్తి కలుగుతుందాలేదా అన్నది ముఖ్యం. ఏ ఉద్యమంలోనైనా కొందరు పాలికాపుల బలి అవడం జరుగుతుంది కామ్రేడ్! మీలాంటి వారికి లేడి నెత్తురు కావల్సినప్పుడు మాలాంటి పులిలకు ఖూనీ చెయ్యక తప్పదు!
గాంధీవాదులకు - లోక కల్యాణం కోసం నలుగుర్ని చంపినా పర్వాలేదన్న వితండవాదం చేసి హింసఖాండని సమర్ధించుకునే '*కామీ'గాళ్లతోనా మీకు సహవాసం. అయినా గాంధేయులంటే, ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపాలి కాని, ఇలా ప్రశ్నించకూడదు. ఉదాహరణకు, "శ్రీశ్రీని ఖూనీ చేసారు, ఇదిగో తిలక్" అని చూపించాలి.

మీ ఈ మాటలు వారిని ఇంకా బాధకలిగిస్తాయేమో?

మీరు ఇంటర్‌వ్యూ చేస్తున్నారా? పుల్లలు పెడుతున్నారా? అయినా వారి భాషలోనే, వారికి నేను చెప్పదలచుకుంది ఒక్కటే "పతితులారా, బ్రష్టులారా, దగాపడిన దమ్ములారా, ఏడవకండి"!

ఎం సార్ జగన్నాథ రథచక్రాల్ వస్తున్నాయా?

రావట్లేదమ్మా, అయినా ఎవరో ఒకళ్లు వెళ్లి వాటిని తీసుకొస్తారనుకోవడం మూర్ఖత్వం. ఒక వెయ్యి మంది లాగితేనే గాని కదలనిది, ఎవరో వెళ్ళి నీ కోసం తీస్కొస్తానంటే నమ్మేయడమే? అయినా, అవి వచ్చినా ఎఁవ్ చేస్తావఁమ్మా, వాటి కింద తలపెట్టి చావడం కంటే ఎం చెయ్యలేవు? ఇదే నమ్మా ఈ దేశానికి వచ్చిన చిక్కు, ఎప్పుడూ ఎవరో అవతార పురుషుడు వచ్చి తమ బ్రతుకుని ఉద్దరిస్తారని చేతులు దులుపుకుని ఎదురు చూస్తుంటారు. దాన్ని ఉపయోగించుకుని జనాలు జగన్నాథుడని కవితలు వ్రాసో లేదా శివాజీ, ఠాగుర్, రామయణం అని సినామాలను డబ్ చేసో సొమ్ము చేసుకుంటున్నారు.

అయితే ఎఁవ్ చేయమంటారు సార్ ?

అలాంటి సినిమాలు పరభాషలలో వచ్చిన తరువాత వాటిని డబ్ చేయడం కంటే, మీరే సొంతంగా తీయండమ్మా! ఆ సెంటిమెంట్‌ని మీరే సొమ్ము చేసుకోండి! ఎవడో అరవోడు వచ్చి సినిమా తీస్తాడు అని ఎదురుచూడడం మానేయండి.

మరి రామాయణ ప్రస్తావన ?

అదేనమ్మ, ఎవరో సంస్కృత కవి ఎదో మన ద్రావిడులని ప్రతినాయకులు చేసి రాసిన నవలను, మనము ముగ్గురు మహాకవులని నియమించుకొని డబ్ చేసుకున్నాముగా. అలాంటి పనులు మానేసి, మన మాస్‌ని హీరోగా, ఆర్యుడూ, ఉత్తరదేశస్తుడూ ఐన రాహుల్ దేవ్‌ని విలన్‌గా పెట్టి మాస్ అని సినిమాలు తియ్యమంటున్నాను.

కవిత్రయం వ్రాసింది మహాభారతం సార్! మీకు తెలియనిదేఁవుంది గాని! ఇంతకీ మీరు కూడా రామాయణం నమ్మరా సార్?

షీర్ నాన్సెన్స్! మనల్ని దానవులు చేసి రాసిన పుస్తకం. అందునా నమ్ముకొచ్చిన ఆలిని క్షణం సుఖపెట్టలేని వాడమ్మా మీకు దేవుడు ?

అయ్యో రామా !

అఱే చెప్తుంటే నీకు కాదు? ఆ పేరు ఎత్తొద్దంటే!

మరేమనాలి సార్ ?

ఎంకన్న అనుకో, యాదన్న అనుకో, అప్పన్న అనుకో!

అన్నీ ఆ పురుషోత్తముని నామాలేగా సార్?

ఎంటమ్మా నీ పోలిక? మీ కాలం పిల్లలందరూ ఇంతే! ఆంగ్ల చదువులు నేర్వడంకాదు, అమ్మమ్మ దగ్గర రామాయణం వినాలి.

మీరే కద సార్ మన కథలు మనమే రాసుకోవాలి ఎఱువు తెచ్చుకోకూడదన్నారు? ఇప్పుడేమో వాటినే వినాలంటున్నారు!

పక్కవారివి చదివితే అందులో తప్పులు పట్టొచ్చమ్మ. ఏమో ఎవరికి తెలుసు, కొంత పుణ్యం కూడా రావచ్చు, ఆ విషయంలో రిస్క్ తీసుకోవడం ఎందుకు?

అప్పన్నకీ సీతాపతికీ పోలిక గురించి ఏదో అంటున్నారు?

అవును పొట్ట చీల్చి పేగులు తినే సింగముఖుడు మన అప్పన్నకీ, చెట్లు వెనకాల దాగి బాణాలు వేసే కౌశలేయునికా నీ పోలిక? అఖిలస్ ఎవఁన్నాడో తెలుసా, బాణాలు పిరికివారి ఆయుధాలఁట. అఖిలస్ అంటే తెలుసుగా?

తెలుసు సార్, అఖిలస్ అంటే బ్రాడ్ పిట్, ఎంత హాట్‌గా వుంటాడో. హెక్టర్ గా ఎరిక్ బానా కూడా చాలా హాట్‌గా వుంటాడు. మా కాలేజీ బ్రాడ్ పిట్ ఫాన్ క్లబ్‌కి నేనే అధ్యక్షురాలిని. ఇక ఒర్లాండో బ్లూమ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు ఒకే సినిమాలో ముగ్గురు హంక్సు. ట్రాయ్ ఎన్నిసార్లు చూసానో రెక్కలేదు.
మీతరం అమ్మయిలందరూ ఇంతేనమ్మ, ఆంగ్ల సినిమాలు ఆపోశన పడతారు. రామాయణభారతాలు తెలిసీ తెలియనట్టు వుంటారు. అందుకే దేశం వెనక బడిపోతుంది. ఆడ యువతకి వారి బాధ్యత తెలిసిరావట్లేదు.

ఏంటి సార్ వినిపించుకోలేదు, ట్రాయ్ గురించి ఆలోచిస్తూ వుండి పోయా...

అందుకేనమ్మా నేను కూడా ఎవరైనా కుఱ్ఱాడిని పంపమన్నాను.

మీరామాటంటే గుర్తొచ్చింది. మీకు స్త్రీల సామర్థ్యం మీద నమ్మకం లేదని, మీరు మగాధిపత్యవాదులని ఆరోపణలు వున్నాయి, వాటి మీద మీ వ్యాఖ్యానం?

స్త్రీల సామర్థ్యం మీద నాకు చాలా మంచి అభిప్రాయం వుంది. జనాబాలో సగం మంది వారే కాబట్టి, ప్రభుత్వాన్ని నిలబెట్టగల, కూల్చగల సత్త ఉంది వారికి.

అంటే జనాబా ఎక్కువ కాని, వారు చేతగాని వారనా మీ అభిప్రాయం ?

ఆడవారు ఎంత తెలివైన వారంటే, వారు ఆలోచించడం మొదులు పెడితే మగ వారికే ముప్పు. అయినా ఆడవారంటే అందానికి ప్రతిరూపం, ఆ అందాన్ని ఆస్వాదించడానికే భగవంతుడు వారిని సృష్టించాడు. అలాంటి అందం పని చేయవలసి రావడం, ఆలోచించవలసి రావడం నాగరికతకే అవమానం. తెల్లవారు స్త్రీ అభ్యుదయం పేరుతో, ఆడవారి చేత అన్ని పనులూ చేయిస్తుంటారు. శాస్త్రం, సాంప్రదాయం, ఆచారం, సంస్కృతి, పరంపర లేని వాళ్లు వారికేం తెలుసు. నేను చెప్పొచ్చేదేంటంటే, ఆడదాని తెలివితేటలు నమ్ముకున్న వాడికంటే వెఱ్ఱివాడు లేడు.

మీరు ఎంత తెలివిగా మాట్లాడినా, మీ మాటల్లో ద్వందత్వం, అవకాశవాదం, మీ కుటిల ఆలోచన, ఇఱుకు దృక్పదం కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. మీలాంటి దిగజారిన రజకీయవేత్తని ఇంటర్వ్యూ చెయ్యడానికి వచ్చినందుకు నేను పశ్చాత్తాప పడుతున్నా. ఇక్కడితో ఇంటర్‌వ్యూ సమాప్తం ఉంటా.

శీఘ్రమేవ కల్యాణప్రాప్తిరస్తు!

12 comments:

  1. కత్తి!!! ఇంత కంటే అనడానికి ఏమీ లేదు.

    ReplyDelete
  2. ఖడ్గం! ఆయన కత్తి అన్నాడుగా, ఇంకా స్ట్రాంగుగా ఉంటుందని.... :-) మీ పాండిత్యానికి అప్పుతచ్చులు ముసుగేస్తున్నాయి. ఆ మాయదారి ముసుగు తొలగించే ప్రయత్నం చెయ్యండి.

    ReplyDelete
  3. నవ్విన నవ్వు నవ్వకుండా నవ్వుకున్నా :)) ముగింపు సూపర్!

    ReplyDelete
  4. మీరు కధలు రాయడం మొదలు పెట్టండి.

    చదువుతున్నంత సేపు బావుంది కాని పుటుక్కున అయిపోయిందనిపించింది..

    ReplyDelete
  5. యాటకొడవలి!! కత్తి, ఖడ్గం ఐపొయినాయ్ గదా. గిరిగారి మాట వినండి. :-) చెప్పింది రాసుకొని వెళ్లకుండా తన అభిప్రాయాలతో రానారె ఏకీభవించాలనుకొని వచ్చిన ఆ ఇంటర్వ్యూయరికి చివర్లోని ఆ దీవెన మేలుచేస్తుందని ఆశిద్దాం.

    ReplyDelete
  6. మా కంపెనీ వారు కొత్తవారిని తీసుకోవడం ఆపేసారు (సబ్-ప్రైం అప్పులు కుప్పకూలడం వలన)

    ReplyDelete
  7. ఎవరీ విహారి? జిల్లా జడ్జి గారిలాగా అన్ని బ్లాగులలో రేటింగులిచ్చుకుంటా పోతా వున్నాడు. మాటలు రావా? బద్ధకమా?

    ReplyDelete
  8. అయ్యా "ప్రముఖ బ్లాగరైన" అనానిమసు గారు.

    నా పేరు విహారండి.

    మా వూరు http://blog.vihaari.net అండి.
    నేను అప్పుడప్పుడూ బ్లాగులు కూడా రాత్తుంటానండి.
    అప్పుడప్పుడూ ఇలా రేటింగ్స్ కూడా ఇస్త్తుంటానండి.
    అప్పుడప్పుడూ బద్దకమండీ, అప్పుడప్పుడూ మాటలు రావండి.
    హుందాగా రేటింగ్ తీసుకునే వాళ్ళకి ఇలా ఇత్తా నండి.
    నాకు జిల్లా జడ్జి హోదా ఇచ్చినందుకు చాలా నెనర్లండి.

    -- పేరున్న విహారి

    ReplyDelete
  9. అందరికీ ధన్యవాదాలు
    భూపతిగారికి: ఇది హాస్య టపా క్రింద రాదు. దాని బదులు పాత్రలను సృష్టించడంలో ఓ అభ్యాసంగా భావించవచ్చు!

    ReplyDelete
  10. అయ్యో ఎంత మాట.నేను దీన్ని హాస్యం కింద వర్గీకరించలేదు. అనానిమసుకు హాస్యంగా చెప్పానంతే. దానికి మీ బ్లాగు వేదికైనందుకు క్షంతవ్యుడని.

    మీరు రాసింది సెటైరనుకుంటున్నా. అది కూడ తప్పిదమైన క్షమించగలరు. నా అభిప్రాయం అలా స్కోరు రూపంలో చెప్పాను.

    నన్ను విహారి అని సంభోదించిన ఎడల సంతోషించగలను. ప్రత్యేంగా భూపతి అని సంభొదించడంలో గల తేడాని తెలుసుకోలేక పోతున్న అమాయకుడను.

    -- విహారి.

    ReplyDelete
  11. @ విహారి గారు,
    మంచిది. ఐతే నా పాత్ర సృజనా శక్తికే మీరు ఆఱు వేశారనమట :)
    సెటైరంటారా... ప్రతి రోజూ రాజకీయనాయకుల మాటలు విని విసుగెత్తి, వారి ప్రతిరూపంగా ఓ నీచ పాత్ర సృష్టించా.

    ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం