భాషందం, భువనందం, బ్రతుకందం

Friday, December 21, 2007

PHL - అసలైన హాకీ, సిసలైన ధీరులు

ఇంకో సంవత్సరం గడవనే గడిచింది. PHL క్రొత్త రూపం లో రానే వచ్చింది. ఈ సారి నా ఫేవరేట్స్ ఎప్పటిలాగా ఒరిస్సా ఉక్కుమనుషులే....
మీరు కూడా మీ అభిమాన హైదరాబాదు సుల్తానులనో... బెంగుళూరు డేగలనో... చెన్నపట్నం వీరులోనో... ప్రోత్సహించి వారిని జయప్రదం చేయండి..
నేను ఇంతకు ముందే హాకీ గురించి బ్లాగాను... మీరు చూడకుంటే వెంటనే చూడగలరు.. అది చదవని వారికి నా బ్లాగ్హృదిలో చోటులేదు.
ఇక PHL గురించీ కొన్ని విశేషాలు .

జట్లు Hyderabad Sultans
హైదరాబాదు సుల్తానులు
బెంగుళూరు హైఫ్లైయర్లు
చెన్నై వీరన్లు
మరాఠా వారియర్లు
ఒరిస్సా స్టీలర్లు
షేర్ ఈ జలంధర్
చండీగఢ్ డైనమోలు

స్వల్ప ఇతిహాసంChandigarh Dynamos
మన హైదరాబాదు జట్టు మూడేళ్లు క్రితం మొదటి పీహెచ్ఎల్ గెలిచి చరిత్ర సృష్టించింది. దానికి జట్టులోని ఒరిస్సా ఆటగాళ్లు (ప్రత్యేకించి దిలీప్ టిర్కీ) మఱియూ పాకిస్థానీ ఆటగాడు షకీల్ అబ్బాసీ చాలా తోడ్పడ్డారు. తరువాత ఒరిస్సా స్టీలర్స్ అని కొత్త జట్టుని సృష్టించడంతో వారు అక్కడికి వెళ్లిపోయి మన
సుల్తానులు గద్దె దిగవలసివచ్చింది. తరువాత సంవత్సరం బెంగుళూరు నెగ్గింది (లెన్ అయ్యప్పా వంటి వారితో). తరువాతి సంవత్సరం కత్తగా PHL కి వచ్చిన ఒరిస్సా జట్టు నెగ్గింది (రెండవ ఏఁడు వీళ్లు మొదటి డివిజన్ లో ఆడారు) . ఈ తడవ మారాఠా జట్టు చాలా బాగుంది.Chennai%20Veerans

ఇక దేశం లో మంచి హాకీ చోట్లు పంజాబ్, ఒరిస్సా, కొడగు (కూర్గ్). అందుకే జలంధర్లో ఒక జట్టూ, చండీగఢ్లో ఒక జట్టూ ఉన్నాయి. అందుకే పంజాబ్ జట్టులో అందరిపేరు లోనూ, మఱియూ అన్ని జట్లలోని పంజాబ్ ఆటగాళ్ల పేరులోనూ సింగ్ వుంటుంది.

పీహెచ్ఎల్ లో అందంBangalore Hi-Fliers
నాకు హాకీ అంటే చాలా ఇష్టం. కానీ పీహెచ్ఎల్ అంటే ఇంకా ఎక్కువ ఇష్టం. ఎందుకంటే...
ఏ క్రీడైనా లీగుల్లో ఆడినప్పుడే దానికి అందం. అబధ్రత గల వారు జాతి పరువును క్రీడలతో ముడికట్టి క్రీడని క్రిందకి లాగడం నాకు చిరాకుగా అనిపిస్తుంది. ఉదా- అమెరికాలో తీసుకోండి, అక్కడి విచిత్ర ఫుటబాలు బయట ఎవ్వరూ ఆడరు. కానీ వారి సంస్కృతి లో అది చాలా పెద్ద భాగం. ఇక కాలేజి ఫుట్బాలు గురించైతే వేరే చెప్పనక్కరలేదు. మా మిత్రుడు అనేవాడు "మాఁవా జార్జియా - జార్జియా టెక్ మ్యాచ్ కే అఱవై వేల మంది పట్టే స్టేడియం ఒక్క రోజులో నిండిపోతుందేంటిరా బాబూ.. మన ఆంధ్రాలో ఉస్మానియాకీ జెనటీయూకీ మ్యాచ్ అంటే ఒక్కడు కూడా వుండడుకదరా" అనీ.
Maratha Warriors
ఇంతకీ లీగ్ ల అందం ఏఁవిటంటే, ఇందులో క్రీడ అన్నిటికంటే ముఖ్యం. ఏ జాతి, ప్రాంత, దేశ వారైనా ఎందులోనైనా ఆడవచ్చు. సరిహద్దులులేని ఆదర్శ లోకానికో మచ్చుతునక, ఉదాహరణ. NHLలో ఐతే అమెరికా జట్లు,కెనడా జట్లు కూడా ఉంటాయి. ఇక EUFA గురించి చెప్పనక్కరలేదు.

ఈవాళ వారియర్స్ - వీరన్స్ మ్యాచ్ చూస్తుంటే.. వారియర్స్ స్టార్ ఆటగాడైన పాకిస్థానీ రెహాన్ భట్, గోలు చేసి తన జట్టువారైన మరాఠీలనూ, కొరియన్లనూ, నెథర్లాండ్లు వాళ్లను ఆలింగనం చేసుకుంటుంటే. గాంధీగారుSher-e-Jalandhar
సంతోషపడతారని పిస్తుంది. ఇక ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ అంత రోమాంచికంగా ఇంకోటి వుండదంటే నాకు నవ్వొస్తది. అంటే ఆట ఎంత నిరుత్సాహకరంగా ఉంటుందంటే, అందులో అతి సున్నితమైన కాశ్మీర్ అంశాన్ని కలపి, ఆ అంశాన్ని అమర్యాదపరచాలా? క్రికెట్ అనే కాదు, హాకీలో కూడా ఇది జరుగుతూ ఉంటుంది. ఇక ఫుట్బాలు వల్ల యుద్ధాలు కూడా వచ్చాయని పోకడ. ఈ లీగ్ ఇప్పుడు అవన్నిటినీ తిరగరాస్తుంది.


నా కల Orissa Steelers
ఒక రోజు, టీంలు కేవలం పేరుకే ప్రాంతీయ జట్లు కాకుండా. నిజంగా వారికి ఒక వ్యవస్థ వుండి, ఒక ఊరిలో ఇల్లూ, కఛేరీ, స్టేడియం ఉండి. అక్కడ వారి హోం ఆటలు ఆడితే నిజంగా చాలా బాగుంటుంది. ఇప్పటిలాగా అన్ని దేశాలవారూ ఆడుతూ. ఇక లాహోరు, కరాచీ, ఢాకా, కాట్మండూ వగైరా జట్లు ఉంటాయి (ఒక వంద ఏళ్ళ తరువాత కనీసం?).

ఇక మన దేశంలో క్రీడౌత్సాహికులు పెరుగుతారు, అందరి ఆరోగ్యోలూ బాగుంటాయి.
నాకు ఒక జట్టు యాజమాన్యం ఉంటుంది. ఏ విశాఖ ఉక్కు డేగలో, ఆంధ్రా నరసింహులో అని. అలానే ఒక ఫుడ్బాలు జట్టు కూడా. సీమ తోడేళ్ళో, బెజవాడ వడగాల్పులో అని... (red wings, coyotes, heat anyone?)

ఓం శాంతిః శాంతిః శాంతిః

4 comments:

 1. బెజవాడ వడగాల్పులో . కిసుక్కు!

  ఒస్టీరా! బాగా రాశావు.

  ReplyDelete
 2. పెద్ద పెద్ద టోర్నీల ఆఖరి స్తేజీల్లో చూడటానికి మాత్రమే హాకీ నాకు పరిమితం...
  నీ ఉత్సాహాన్ని నేనెందుకు కాదనాలి ? నేనూ ఏదో ఓ టీము ని సెలెక్టు చేసేసుకుంటాలే.
  చివర్లో ఓం శాంతి అని షారూఖ్ ని కూడా తలచుకున్నావుగా...
  ఇక అంతా చక్ దే నే.

  ReplyDelete
 3. నాకు ఓ కల అండీ, " మాకినేను పున్నారావు" అనో " సామర్ల రామారావు" అనో వింబుల్డన్ లోనో ఇంకో గ్రాండ్ స్లాం లోనో చూడాలని.

  -ఊకదంపుడు

  ReplyDelete
 4. మన దేశ క్రీడలామాత్యుడికి ఆసియా కప్ (హాకీ) గెలిచింది మనమే అని కూడ తెలియదట. ఇక దానికి తగిన ఆధరణ లభించక పోవడంలో ఆశ్చర్యమేమి లేదు. మీ ఈ టపా వలన కనీసం కొందరైనా హాకీని ఆదరిస్తారు అని అనుకుంటున్నాను.

  ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం