భాషందం, భువనందం, బ్రతుకందం

Saturday, September 08, 2007

టిర్కీ త్రిమూర్తులూ

ఉపోద్ఘాతం
టిర్కి ఎవరా ?
మీరసు ఏ లోకంలో ఉంటారు ? ఇవళ రాత్రి టీవిలో ఆటలు చూడలేదా
చూసామే.
ఐతే టిర్కీలు తెలియక పోవడమేమిటి.
క్రికెట్ టీములో అలాంటివారెవరూ లేరే.
క్రికెట్టా? హాకీ ఉండగా అడ్డమైన చెత్త చూడొద్దన్నానా ?
అదీను ఆసియా కప్పు సెమీ ఫైనల్లలో, పాకిస్థాన్ తల దన్నిన జపాను తో భారతం పోరు పడుతుండగా.
ఐనా టిర్కీలు తెలియని వారితో నాకు మాటలేంటి ? మీరు తక్షణమేనా బ్లాగు విడిచి పొండి. మీ పేరుతో ఒ చదువరి నా బ్లాగుకే లేరనుకుంటాను, అలానే నా బ్లాగుకు మీ రెన్ని సార్లు వచ్చారో చెబితే, నా సందర్శకుల లెక్క నుండి అంత తీసివేస్తాను.
ఎఁవిటీ అలా ఐతే, నా సందర్శకుల సంఖ్య సున్నా అవుతుందా? అయితే అవుతుంది.
బాబ్బాబు ఇంకో మాట చెప్పు.
సరే ఐతే, రేపు ఆసియా కప్పు ఫైనలు వస్తుంది. భారతం దక్షిణ కొరియా తో తలపడనుంది. పశ్చాత్తాపంగా అది చూడండి ఐతే. ఇంకా వివరాలు కావాలా.

ఆసియా కప్పు
ఆసియా దేశాలు ఆడే హాకీ టూర్నమెంటు. పాల్గొన్న దేశాలు
పూలు ఎ - పాకిస్థాను, మలేషియా, జపాను, సింగాపురం, హాఙ్ కాఙ్
పూలు బి - భారతు, కొరియా, చైనా, థాయిలాండ్, శ్రీలంకా, బాంగ్లదేశం

అందులో మంచి టీములు - మనం, పాక్, కొరియా, మలేషియా,
ఫర్వాలేదు జట్లు - చైనా, జపాను, (రెండూ ఈ మధ్యనే పైకి వచ్చాయి), హాఙ్ కాఙ్ కొంత వరకూ పర్వాలేదు.
చెత్తవి - మిగతావి

లీగు ఆటలు
పూలు బీ లో భారత్ ఓటమి ఎరుగదు, కానీ చైనా కొరియాల మీద కష్టపడి నెగ్గుకొచ్చాం.
పూలు ఎ లో అందరూ గొప్ప జట్టుగా కొలిచి, విశ్వ హాకీ రాంకింగులో మిగతా ఆసియా జట్ల కంటే మంచి రాంకింగు ఉన్న పాకిస్థాన్ని జపాను అనుకోకుండా ఓడించడంతో, వారు సెమీస్ కి రాలేదు. భారత్ శ్రీలంకను ౨౦ లక్ష్యాలతో, థాయిని ౧౬ లక్ష్యాలతో చిత్తు చేసింది.

సెమీసు
భారత్ x జపాను (భారత్ నెగ్గింది)
మలేషియా x కొరియా (కొరియా నెగ్గింది)

ఫైనల్సు భారత్ x కొరియా రేపు ఆదివారం సాయంత్రం ౬:౩౦ (ఆరున్నరకు).

ఇక హాకీ గురించి
౧) గోలు దూరం నుంచి కొడితే చెల్లదు, ౨౦ గజాల దూరం లో ఉన్న D (అరవృత్తం) లో ఆటగానికి కఱ్ఱకి కనీసం తాకి లోని కెళ్తేనే చెల్లుతుంది.
౨) కాలుకి బంతి తగల కూడదు, తగిలిన అది అవతలి జట్టుకు ఇవ్వబడును (free hit)
౩) D లో రక్షణ ఆటగాడి కాలుకి తగిలిన, అవతలి టీంకి penalty corner ఇవ్వబడును, అవి హాకిలోనే అతి ఉత్కంఠ మైన క్షణాలుగా చెప్పవచ్చు.

మిగలిన ఆట మామూలుగానే ఎవరి లక్ష్యాం లోనికి వారు బంతిని పంపించడానికి కృషిచేస్తారు.

మన జట్టు
ఇంతకీ ఈ టిర్కీలెవరా
ప్రభోద్ టిర్కీ - జట్టు సారథి, మైధాన మధ్యలో ఆడతాడు.
ఇగ్నేశ్ టిర్కీ - ప్రభోద్ తమ్ముడు, ఆక్రమణ పంక్తి లో భాగం
దిలీప్ టిర్కీ - రక్షా పంక్తి లో ముఖ్యుడు, ప్రపంచంలోనే అతి మంచి హాకీ రక్షకులలో ఒకడు. జట్టుకు సారథ్యం కూడా వహించాడు. ఇతనిని ముద్దుగా 'గోడ' అంటారు.
(టిర్కీ ఒరిస్సాలోని కొండ జాతులలో ఇంటి పేరు, వీరు వీర హాకీ ఆడతారు. నా పాత రూమ్మేటు టొప్పో కూడా ఈ కోవకి చెందిన వాడే. చాలా గట్టి మనిషి, రాయి అని పిలుచేవారం మేము. హాకీ చాలా బాగా ఆడేవాడు. ఇక పంజాబు, కొడగులలో కూడా హాకి అంటే ప్రాణం )
ప్రభ్‌జోద్ సింహ్ - ఆక్రమణ పంక్తి మధ్యుడు. ఇతని దగ్గరకి బంతి వచ్చిందంటే, మీరు కుర్చీనుండి లేచి కూర్చోవాల్సిందే.
రఘునాథ్ - ఇతను ఎక్కవగా పెనాల్టి కార్నర్లను కొట్టే వ్యక్తి, ఇతను substitute అయిపోతే, దిలీప్ టిర్కీ కి పెనాల్టీ కార్నర్లు ఎక్కువా అప్పజెప్పుతారు.
ఇంకా ఇతర మంచి ఆటగాళ్ళు - శివేంధర్ సింహ్, తూషార్ ఖాండేకర్, రాజ్ పాల్ సింహ్, బల్జీత్ సింహ్ (గోలీ) వగైరా.

కొసమెఱుపు
మీరు ఇంకా సంకోచిస్తున్నారంటే, హాకీ గురించి వేదాలలో ఏఁవ్ రాసుందో వినండి.
ధీరులు హాకీ ఆడతారు
రసజ్ఞులు ఫుడ్‌బాలు ఆడతారు
హాకీ అతివేగ, అతిప్రమాదకర, అతి అలసట కలిగించే క్రీడలలో ప్రథమం. అలా అని ఇది నాన్-కాంటాక్టు ఆట. వెధవ వేషాలు చెల్లవు. ఇంకేముంది ఐతే, రేపు సాయంత్రం ఆరున్నరకి డిడి క్రీడల టీవీలో చక్కదే, ఒహ్ చక్కదే ఇండియా అనుకుంటూ ఆసియా కప్పు ఫైనల్సు చూడండి.

చక్కుదే అంటే గుర్తొచ్చింది, మన ఆడ వారి జట్టు ఎం చేస్తుందో హాఙ్ కాఙ్ లోని మహిళల హాకీ కప్పులో, ఈ పాటికి నగ్గేసుండాలి, క్రిత విజేతలు మరి. ఇప్పుడే అందిన తాజా వార్త మన అందగర్తెలు(అన్నట్టు సినిమాల్లో చూపించనంత అందంగా ఐతే నిజమైన భారతీయ హాకీ క్రీడాకారిణులు ఉండరు) సెమీస్ లో కొరియా చెతిలో ఓడారు. చక్కదే అంటూ సినిమాలు చూడడం కాదు అస్సల్ సినిమా యాడాడతుందో ఆడ సూడాల్న. మీరెప్పుడైనా ఆడవారి హాకీ చూసారా, ఎ జెర్మనీ ఆస్ట్రేలియా ఆటో చూడండి, నా లాంటోళ్ళిక ఇలాటి బ్రతిమాలుకునే టపాలు వ్రాయక్కరలేదు. ఎందుకంటే, మహిళల హాకీ ప్రపంచంలోనే అతివేగ, అతిప్రమాదకర, అతి చిన్న స్కర్టు వాడే క్రీడలలో ప్రథమం. ;-)

6 comments:

 1. నీ బుద్ధికి రెండుపక్కలా పదునే, రాకేశ్వరా!

  ReplyDelete
 2. ఇవాళ ఫైనల్ గెలిచేసారు 7-2 తో :)
  నే క్రికెట్టూ, హాకీ రెండూ చూస్తా లేండి.

  మీరు ఈ కింది లాంటి ఎక్స్ట్రీమ్ వ్యాఖ్యలు చెయ్యకపోతే బాగుంటుంది.
  "నపురుషనస్త్రీలు క్రికెట్ ఆడతారు."

  ReplyDelete
 3. @ కోపా గారు
  నీ బుద్ధి వికృత బుద్ధి అనడానికి మీరు వాడిన euphemism అమోఘం. దౌత్యశాస్త్రం కూడా మీదగ్గరే నేర్చుకోవచ్చు. :)

  @ ప్రవీణ్ గారు
  మీరు మ్యాచి చూసినందుకు గానూ నాకు భారత్ కొరియాని చిత్తు చిత్తుగా ఓడించినందుకు ఎంత సంతోషంగా ఉందో, అంతే సంతోషంగా ఉంది.
  ఈ ఆనందం లో మీకు నా బ్లాగు అర్పిద్దాఁవను కున్నాను, గానీ, నా జీవిత చరిత్ర వ్రాసేటప్పుడూ కాపీ రైటు సమస్యలు వస్తాయని నేను వెనుకాడుతున్నాను. :)

  నేను వ్రాసిన వాఖ్యం వ్యాకరణపరం గా తప్పు అర్థవంతంగానిది అని మీరు గమనించి మన్నించగలరు.కానీ అంత వరకూ, దానికి బదులు, మీ సలహా(లు) శిరసావహిస్తాను. మీకు ఏ అంశం మీద టాపా కావాలంటే, దాని మీద వ్రాస్తా (క్రికెట్ తప్ప) :))
  దాని మీద వ్రాయాలంటే extreme గానే వ్రాయగలను :(

  ReplyDelete
 4. ఒకే శృంఖల(సిరీస్‌?)లో 50గోల్ళు చేసిన ఘనత !?

  ReplyDelete
 5. ఆహాహా! ఈ టపా చదివి పరవశించిపోయానంటే నమ్మండి. ముఖ్యంగా "క్రికెట్టా? (హాకీ ఉండగా) అడ్డమైన చెత్త చూడొద్దన్నానా ?", తర్వాతి రెండు పేరాలు; మన జట్టులోని ఆటగాళ్ళ పరిచయాలు, హాకీ గురించిన వేదవాక్కు, "చక్కదే అంటూ సినిమాలు చూడడం కాదు అస్సల్ సినిమా యాడాడుతుందో ఆడ సూడాల" లాంటి వాక్యాలు నాకు బాగా నచ్చాయి. జనాల్లో కిర్కిట్టు పిచ్చి ఎక్స్‍ట్రీముగా ఉన్నప్పుడు దాని మీద ఎక్స్‍ట్రీముగా రాసినా తప్పు లేదు.

  ReplyDelete
 6. సుగాత్రి గారు,
  మీకు కూడా నేను 'టప'దానం చేస్తున్నాను. కోరుకోండి :)

  ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం