
ఉపోద్ఘాతము
మొన్న భూమి దినం సందర్భంగా ఒక వ్యాసం వ్రాసాను. అందులో మీరు భూమాతను కాపాడడంలో ఎలా తోడ్పడగలరు అనే అంశం మీద ఒ నాలుగు మాటలు వ్రాయమని పెద్దల కోరిక. ఈ వ్యాసం ఆ మేరకు.
పాదముద్ర
అతి ఉచితమైన మరియు సరళమైన పద్ధతి ఎమిటంటే. మీరు పాదముద్ర పరీక్ష తీసుకోండి. మీ స్కోరు చూడండి. మీకు ఎ అంశాలలో ఎక్కువ వచ్చిందో గమనించి ఆయా విషయాలలో జాగ్రత్త వహించండి. ఉదాహరణకు మీకు Mobility ఎక్కువ ఉంటే, సామూహిక వాహనాలు వాడడం లాంటివి చేయాలి.
మీరు భారతదేశవాసులైతే మీ పాదముద్ర తక్కువే ఉంటుంది. కాని దానిని చూసి మురిసి పోవడం అంత మంచిది కాదు. భారతీయులకు వర్తించే ఇతర విషయాలు క్రింద వివరిస్తాను.
అలవాట్లు
౧) లైట్లు మరియు ఇతర ఎల్కట్రాఁనిక్ పరికరాలను మితిగా వాడడం
౨) సామూహిక వాహన వ్యవస్ధ వాడడం
౩) కాగితాలు మరియు ప్లాస్టిక్ రీసైకిల్ చేయడం
౪) ఎక్కువ మైలేజు ఇచ్చే వాహనాలు వాడడం. అలా కొన్న వాహనాలు ఎక్కువ మైలేజు ఇచ్చేటట్టు చూడడం.
౫) నీరు, ప్రత్యేకంగా వేడినీరు, తక్కువ గా వాడడం
౬) పేకేజ్డ్ పదార్థాలు తక్కువ గా వాడడం
౭) వాతానుకూలం మితిగా వాడడం
౮) చెట్లు నాటడం
౯) ఇళ్ళు లేదా కార్యాలయాలు నిర్మించే డప్పుడు లైట్లు మరియు వాతానుకూలం తక్కువ అవసరమైయ్యేడట్టు నిర్మించడం
౧౦) వీలైనంత వరకు మాంసాహారం తగ్గించడం
౧౧) సస్య ప్రక్రియలు పరిశోధించి మరియు వాటిని అమలు చేయడం మీద ఆధారపడిన కంపనీలలో పెట్టుబడులు పెట్టడం. (భారతదేశంలో suzlon లాంటివి).
౧౨) పక్కవారికి కూడా వారి బాధ్యతలు తెలపడం, రాజకీయాల ద్వారా వ్యవస్ధను మార్చడం.
అమల భారతం
ఇంటర్నెట్ లో కనిపించే ఎక్కువ పాదముద్ర calculator లు లేదా carbon calculator లు పాశ్చాత్య దేశాలకు అనుగుణంగా నిర్మింప బడినవి. మన వ్యవస్ధలో ఇందనం వెల ఎక్కువ ఉండడం వలన మనము దానిని పొదుపు గానే వాడుతుంటాం.
అలానే మన పూర్వీకులు చాలా sustainable మరియు repeatable జీవన విధానాలు వాడేవారు. కాని మవము తెల్లవారి మాయలో పిడి అలాంటి పద్ధతులను కొంత వరకు మరచిపోయాము. సువార్త ఏమిటంటే, మన ప్రస్తుత జీవన విధానంలో మన పూర్వీకుల ఉచితమైన అలవాట్ల ప్రభావం చాలా ఉంది.
ఇక సమస్యలకు వస్తే,
మనం జనాబా ఎక్కువ, ప్లాస్టిక్ లాంటివి వాడడమే తప్ప దాని దుష్పలితాలు తెలియవు.
ఉదాహరణకు కారులో వెళుతున్న ఒ కుటుంబం.
పిల్లాడు : అమ్మ, చిప్స్ అయ్యిపోయాయి కవర్ ఏమి చేయను
అమ్మ: కారు కిటికీలో నుండి బయటకు వదిలేయ్ !
ఇలా కార్ల నుండి ట్రైన్లనుండి వదిలే చెత్త వల్ల భూమి విషపూరితమౌతుంది. రీసైకిలింగ్ గురించి జనాలకు తెలియజప్పవలసిన అవసరం చాలా ఉంది.
అలానే కల్తి ఇందనాల వల్ల రావలసినదాని కంటే ఎక్కువ వచ్చే కార్బన్ మరియు బాస్ఫరం పూరితమైన వాయువులు, పట్టణాలలో ఎంత హాని కలుగజేస్తాయో తెలిసినదే. దానికి తోడు ప్రతి వాహనం వలన వచ్చే కాలుష్యాన్ని నియంత్రిచవలసిన ట్రాఫిక్ పోలీసు వ్యవస్థ సోమరిబారిపోవడం.
సంగ్రహము
భూవాతావరణ సాన్నిహిత్యాన్ని ఒక జీవన విధానం గా మలచుకోండి. మీరు చేసే ప్రతి పనిలో దాని అర్థాన్ని ఇనుమడించకోండి. మనము పుట్టినప్పుడు అందంగా ఉన్న పంచభూతాలు మనము పోయేసరికి క్షీణించినాయంటే దానికి కారకులెవరు ?
లంకెలు
అల్ గోరు ఉపన్యాసం,
ఒ చిన్న హాస్య పూరిత పాట,
Sustainability మీద ఒ ఉపన్యాసం
సవాలు పదాలు ( వీటికి తెలుగు అనువాదాలు తెలిసినచో తెలుపగలురు)
recylce , mileage, pacakaged, company (business entity) , internet, calculator, sustainable, repeatable, carbon