చాలా మంచి పట్టాలో రెండు, చేతిలో పెట్టుకొని, మూడు నెలలుగా ఉద్యోగం లేక, కొత్తగా ఏదో 'వీసా' వ్యనస్థలో ఉన్న లోపాలవల్ల కనీసం ఉద్యోగం వచ్చే అవకాశం కూడా లేనివాడిని దురదృష్టవంతుడనే అనాలి, కాని ఇది అలాంటి చిన్న చిన్న దురదృష్టాల గురించి కాదు లెండి. ఇవి ఇంకా 'పెద్ద' విషయాలు. జన్మానికోసారి లాంటివి.
నేను దక్షిణ 'సంయుక్త అమెరికా రాష్ట్రాల'లోనే అతి మంచిదైన 'గార్జియా ఇన్సటిట్యూట్ ఆఫ్ టెక్నాలెజి' లో చదివా. మొన్ననే క్రిస్మస్ కి అక్కడ నుండి బయటకు వచ్చా. నేను అక్కడ చాలా మంచి అనుభవాలను పొందాను అని అనవచ్చు.
నేనక్కడ ఉన్నప్పుడు గొప్ప వ్యక్తులు కొందరు మాటలాడడానికి వచ్చేవారు. మంచి కళాశాల, చాలా చురుకైన విధ్యార్థులు ఉంటారు కాబట్టి, ఉపన్యాసాలివ్వాలను కునే నాయకులు బాగా ఆకర్షితులయ్యేవారు. కాని నేనక్కడున్నప్పుడు చాలా గొప్పవారైతే ఎవరూ రాలేదు. నేనక్కడ నుంచి వచ్చేసిన తర్వాతి మూడు నెలల్లో ఇద్దరు చాలా గొప్ప వ్యక్తులు అక్కడికి వచ్చారు/రాబోతున్నారు.
అందులో ఒకరు 'ఆల్ గోర్'. గోరు గారు నేను అమితంగా ఆదరించే సమకాలికుల్లో(ఈ పదం జీవితంలో ఎప్పుడూ వాడతాననుకోలేదు చిన్నప్పుడు) ఒకరు. నేనో చిన్న తరహా వాతావరణవాదిని. ఆయన తీసిన 'ఓ కఠువు నిజం' (A bitter truth) సినిమా తట్టుకోలేనని చూడలేదనుకోండి. కాని రాష్ట్రపతి అవగలిగిన వ్యక్తి, ఇలా ఒక మహోత్తమ కార్యం (noble cause) కోసం పాటుపడడం ఎంతైనా గొప్పే. వచ్చే యాభై ఏళ్ళలో అంత అత్యవసరం కాకపోయునా, మన మననువల కాలానికి 'భూగోళ ఉడుకు' (Global warming) అతి పెద్ద సమస్య అవుతుందని నా అంచనా. జీవితంలో ఎప్పుడైనా ఒక సారి వెళ్ళవలసిన ఆయన ప్రసంగానికి వెళ్ళలేక పోతున్నా...
ఇక రెండో వ్యక్తి 'బరక్ ఒబామా'. మా పాఠశాలకు వస్తున్నారని తేలియగానే ఒబామాగారి గురించి వికీపీడియాలో చదివా ఒక సారి. అన్నట్టు ఒబామాగారు 2008 అమేరికా రాష్ట్రపతి ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. చెప్పుకోదగ్గ విషయం - ఈయన నల్లాయన. అలా అంటే ఎప్పుడూ కని పించే 'ఆఫ్రికన్ అమేరికన్' కూడా కాదు. ఈయని నాన్నగరు అచ్చంగా కెనియాలో పుట్టారు. కాని అమ్మ నిండు అమెరికను, అమ్మ-అయ్య అయితే రెండో ప్రపంచ యుధ్ధంలో కూడా పోరాడారంట. ఈయన యుక్త వయస్సులో (adolescence) ఎంత 'స్వజ్ఞాన క్షోభ' (identity crisis) అనుభవించేవరంటే, అది మరచి పోవడానికి మత్తు పదార్థాలు, మద్యం వాడేవారట ! అ స్థితి నుండి ఇప్పుడు రాష్ట్రపతి పోటీలో ఉన్నారంటే సామాన్య విషయం కాదుగా.. ఈయని ప్రచారసభకు కూడా వెళ్ళలేక పోతున్నా.
చెప్పాలంటే గొప్ప వ్యక్తులు ఇచ్చేడట్టు వేరేది స్ఫుర్తినీయలేదు. అసలే నాకు ప్రజాస్వామయం పై అపారమైన విశ్వాసం :)
ఛాలెంజి పదాలు (మీకు వీటి అర్థాలు తెలిసినచో దయచేసి చెప్పగలరు)
noble cause, living people, global warming, adolescence, identity crisis, challengee
అలాంటి వ్యక్తులను వినడానికి అవకాశం రావడం సంతోషం. కాగలిగితే వెళ్ళండి.
ReplyDeleteఇకపోతే మీరడిగిన కొన్ని పదాలకు అర్థాలు
noble cause - ఉదాత్తమయిన కారణము
adolescence - కౌమార్యం
challengee - సవాలు
Living people = సజీవులు
ReplyDeleteGlobal warming = భూగోళపు ఉష్ణీభవనం
Identity crisis = వ్యక్తిత్వ సంక్షోభం (పలకడానికి కష్టంగా ఉంది కదూ ! అయినా తప్పదు. ఇదొక మనశ్శాస్త్ర (psychology) పారిభాషిక పదం)
Challenge = సవాలు (హిందీ "సవాల్" కి దీనికీ అర్థంలో తేడా ఉంది)
అభావం అనేదాన్ని మీరు negative అనే అర్థంలో వాడుతున్నారు. అది సరి కాదు. "ప్రతికూలం" అనేది దానికి షుమారుగా సరిపోయే సమానార్థకం (equivalent). హిందీలో "నకారాత్మక్" అంటున్నారు. అది కొంచెం కృతకంగా ధ్వనించే వ్యక్తీకరణ. కాని అది ఆభాషకే తగి ఉంటుంది. మనం వాడలేం. ఎందుకంటే ఆ భాషలో "న, నహి" అంటే వ్యతిరేకార్థకం కనుక.
ReplyDeleteadolescence అంటే కౌమార దశ అని నేను అనుకుంటున్నాను
ReplyDelete