భాషందం, భువనందం, బ్రతుకందం

Monday, April 23, 2007

భూమి దినం


ఈ వాళ భూమి రోజు. అంటే సంవత్సరమంతా ఎంత ఇందనం దుబారా చేసి, ఎంత ప్లాస్టిక్ వాడి, ఎంత మాంశాహారం తిని, ఎంత పెద్ద ఇంట్లో ఉన్నా, ఈ ఒక్క రోజు మాత్రం ఒ పది నిమిషాల పాటైనా, మన తల్లి భూదేవిని ఎలా కపాడుకోవాలా, మన ముందు తరాలవారికి మంచి వనరులను అందిచాలా అన్న విషయాలను ఆలోచించాలి.

గూగుల్ వారు, ఏదైనా విశేషమైన రోజైతే దానికి అనుగుణంగా వారి లోగో ను మారుస్తారు. అలా మార్చిన లోగో చూసి, దానిని క్లిక్ చేసి, మెదటి లింక్ అయిన భూదిన భూగోళిక పాదముద్ర క్విజ్ లో పాల్గొన్నాను.

నా జీవితం లో మారుతూవున్న తరుణంలో ఉన్నా కాబట్టి , నేను ఆ క్విజ్ తీసుకునేడప్పుడు, నన్ను నేను ఈ రెండు విధాలుగా ఊహించుకొని క్విజ్ లో పాల్గోన్నాను.
1) బెంగుళూరు లో బైక్ ఉన్న సాఫ్టవేర్ ఇంజినీరు. (రెండేళ్ళ క్రితం నా పరిస్ధితి అన్నమాట)
2) అమెరికాలో భారతీయ విధ్యార్థి (మొన్నటి వరకు నా పరిస్థితి)

భూగోళిక పాదముద్ర
మీకు ఫలితాల గురించి చెప్పే ముందు, Biologically Productive Global Hectares మరియు Ecological Footprint గురించి కొంత జ్ఞానం: "భూగోళిక పాదముద్ర" అంటే మానవుల జీవనానికి కావలసిన వనరులు, మరియు మానవులు ఉత్పత్తి చేసే చెత్త జీర్ణించు కోవడానికి కావలసిన భూమి లేక్కించే ఒ విధానం.

ఉదాహరణకు,
అమెరికా లో సబర్బులో పెద్ద బంగళా ఉన్న మీ మావయ్య గారి కుటుంబం తీసుకున్నారను కోండి. వారు రెండు కారులకు వాడే పెట్రోలు, వారి పెద్ద ఇంటికి కావలసిన ఎసి కి అయ్యే ఇందనం, వారు వాడే ప్రాసెడ్ ఫూడ్స్ , వారు సంవత్సరానికో సారి చేసే ఇండియా ప్రయాణలకయ్యే ఇందనం, వగైరా వగైరా తీసుకున్నారనుకోండి,
నలుగురి మీద ఒ నూట నలభై హెక్టేర్ల భూమి ఇచ్చే వనరులు అవసరమౌతాయి (అంటే తలో నలభై హెక్టార్లన మాట).

అదే ఆయని తాతగారూ, మీ ముత్తాతగారూ ఐన సీతాపురం అప్పారావు గారి కుటంబాన్ని తీసుకున్మారను కోండి. వారు పైవేవీ వాడరు, పైపెచ్చు అప్పట్లో inorganic waste ఉత్పత్తి చేసేవారు కాదు. కాబట్టి వారికి అవసరమైన వనరులల్లా దాదాపు ఒ హెక్టారులో ఉంటాయి. (అంటే తలో పావు హెక్టారు అన్నమాట).

అందరూ మన న్యుజెర్సి మావయ్యగారిలాగా ఉంటే, ప్రపంచ జనాభా అంతటికీ కలిపి ఒ పది భూగోళాల అవసరం ఉంటుంది !! అదృష్టవ సాత్తు, అందరూ మన మావయ్యగారిలాగా అమెరికాలో చాలా డబ్బున్న వైద్యులు కారు. అలాని అందరం మన ముత్తాతల కాలం లో లాగా బతక గలిగిన దీక్ష మనకు లేదు.

కొన్ని గణాంకాలు
వివిధ జీవన విధానాలున్న వ్యక్తుల భౌగోళిక పాదముద్ర (భూగోళం మీద వత్తిడి) ఇలా ఉంటాయి.

అమెరికా మధ్యతరగతి : 15 హెక్టార్లు (10 భూగోళాలు)
అమెరికాలో విధ్యార్థి : 6 హెక్టార్లు (4.2 భూగోళాలు)
హైదరాబాదులో ఇంజనీరు : 2.1 హెక్టార్లు (1.2 భూగోళాలు)
మన పూర్వీకులు : 0.25 హెక్టార్లు కంటే తక్కువ (1 భూగోళం కంటే తక్కువ)

సగటు నేటి భారతీయుడు : 0.8 హెక్టారు (1 భూగోళం కంటే తక్కువ)
సగటు నేటి అమెరికనుడు : 9.7 హెక్టార్లు (5.3 భూగోళాలు)

ఇంకో ఆశక్తికరమైన విషయం ఏమిటంటే, విమానాలు భూగోళం పైన చాలా భారము. అంటే మీరు విమానాల మీద ప్రయాణించడం మొదలు పెడితే, మీ భౌగోళిక పాదముద్ర చాలా ఎక్కువ పెరిగి పోతుంది.
ఇవన్ని చూసారుగా ఇక మీరు కూడా భూవనరులు గురించి చదివి, మీ వంతు తోడ్పడండి.

గమనికలు
వ్యాఖ్యానిచే ముందు ఈ విషయాలను గుర్తుపెట్టుకోవలెను.
1) భూవనరులను దేశాల వారీగా విభజించిబడినవి. కాబట్టి కొన్ని దేశాలలో ఐదు హెక్టారులు పెద్ద విషయం కాదు, కాని మరి కొన్ని దేశాలలో ఒక హెక్టారు కూడా ఎక్కువే అవ్వొచ్చు. జనాభా, దేశ వనరులు లాంటి పట్టించుకోవలసిన ఇతర అంశాలు చాలా ఉంటాయి.
2) పైన చెప్పిన సంఖ్యలు పోల్చడానికి మాత్రమే, చెప్పాలంటే ఈ లెక్కించే పధ్ధతి మోత్తం అంచనాలకు కోసమే. ఇది మూడవ తరగతి గణితంలా గా ఖచ్చితమైన శాస్త్రం కాదు.
3) ఒకే ఉద్యోగం చేసే ఇద్దరు వ్యక్తుల పాదముద్రలు ఆ యా వ్యక్తుల అలవాట్ల బట్టి చాలా ఎక్కువా-తక్కువా ఉండవచ్చు.
4) ఈ బ్లాగు ఆర్థికాంశాలగురించి కాదు.

లంకెలు
గూగుల్ భూమి దినం, పాదముద్ర క్విజ్, భూమి దినం వికీపీడియా, పాదముద్ర వికీపీడియా

కొసమెఱుపు
"భూమి మన పూర్వీకులనుండి బహుమతి కాదు. అది మన పిల్లల నుండి తీసుకున్న ఋణం" - అనామకులు

3 comments:

  1. నా మనసుకి సన్నిహితమైన విషయం.
    బాగా రాశారు.

    ReplyDelete
  2. చాలా బాగా రాశారు. భౌగోళిక పాదముద్ర లాంటి పదాలతో విషయాన్ని తెలుగులోకి అనువదించి వివరంగా రాసినందుకు మిమ్మల్ని అభినందించితీరాలి. మీరు చెప్పినవి శ్ర్దద్ధగా గమనించాను. దీనిని తెలుసుకొన్నాక మన కర్తవ్యం ఏమిటి అనే అంశాన్ని నాలుగు మాటల్లో రాసి ఉంటే మరింత బాగుండేది కదా.

    ReplyDelete
  3. చాలా వివరణాత్మక టపా.కొసమెరుపు లొ చెప్పిన మాటలు ఇదే మొదటి సారి వినడం.నిజమే అనిపించింది.ఈనాడులో కూడా ఇలాంటి వ్య్యాసమే ఒకటి వుంది.

    ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం