భాషందం, భువనందం, బ్రతుకందం

Wednesday, April 18, 2007

ఏరు వాకా సాగారో

పొలాలమ్కుకోని పోయేవారు, టౌనులో మేడలు కట్టేవారు,
బ్యాంకులో డబ్బులు దాచేవారూ, నీ శక్తిని గమనించరు వారు.
ఏరువాకా సాగారోరన్నో చిన్నన్న, నీ కష్టమంతా తీరునురోరన్నో చిన్నన్న...

ఇవి అసలే మంచి రోజులు కావు.

ఓ నాలుగు రోజుల నుండి మనేదు గా ఉంది. ఎందుకంటారా ?
పని లేనోడికి మనేదేగద ఏసేది. ఈ పనిలేక వచ్చే మనేదు తగ్గించుకోవడానికి నేను ప్రతి ఆదివారం ఓ ఎనిమిది కీమీలు ద్విచక్ర వాహనం తొక్కి , మంచు మీద స్కేటింగ్ చేసి, ఆ ఎనిమిది కీమీలు వెనక్కి తొక్కోచ్చి హాయిగా నిద్రోతా. దాని మీద వేరెప్పుడైనా 'అయిసు పై అభిమన్యుడు' అని టపా రాస్తానులెండి.

ఈ వారం ఏమైందంటే..
ఆదివారం మనేదు తీర్చుకొని వచ్చాక, ఈ నాలుగు సంఘటనలు జరిగాయి.
౧) హెఁపీ ఫీట్ చూసా
౨) వెర్జీనియాలో ఘోరం జరిగింది
౩) తెలుగు నేల లో వోఁల్డ్ (వరల్డ్ కాదు) ట్రేడ్ సెంటర్ కూలిపోవడం ఉత్త అబద్దం అని చదివ
౪) ఇంకేదో జరిగింది కాని ఇప్పుడు గుర్తుకు రావట్లేదు

౧) హెఁపీ ఫీట్
ఈ సినిమా ఏదో పిల్లల సినిమా అనుకొని చూస్తే... ఇంతకూ ఇందులో మానవులు, సముద్రపు చేపలను అతిగా పట్టి, తినేసి, పెన్గ్విన్ల కోసం ఏమి మిగలచ కుండా ఎలా చేస్తున్నామో విపులంగా చూపిస్తారు. అసలే వాతావరణవాదిని. ఒక సారి సీ-వోఁల్డ్(వరల్డ్ కాదు) కు వెళ్లి అక్కడ సముద్రపు జీవులను, క్లోరిన్ కుండీలలో చూసి మనేదు తెచ్చుకున్నవాడిని.

౩) అమెరికాని 'చట్చాల దేశం' (land of laws) అంటారు. కాని నాకెప్పుడు ఇది 'అబద్దాల దేశం' (land of lies) అనిపిస్తుంది. మీరు తప్పకుండా ఈ వీడియో మరియు ఈ వీడియో చూడండి.

౪) నాల్గోది గుర్తుకు వచ్చింది.
ముందు ఆర్పి పట్నాయక్ పాట వినడం వల్ల అనుకున్నా గాని అది కాదు. నిన్న ఈనాడు చదివా, ఏముంది మన అబ్బాయి జగన్మొహనం , వినాయకుడు ఉండ్రాళ్ళు మింగినట్టు మిగేసాడంట. దేన్నా? కడపలో భుముల్ని.

ఏంటో ఒక దేశంలో అన్ని అబద్దాలే, ఇంకో దేశంలో నిజాలు బయట పెట్టినా ఎవరూ పట్టించుకోరు.

పై విషయాల వల్ల చాలా మనేదేసింది. స్కేటింగ్ కు వెళ్దామంటే మొన్న వెళ్ళినదానికి ఊనం అయిన వళ్లు ఇంకా తేరుకోలేదు. అయితే ఇప్పుడు విరుగుడు ఏంటి?

ఉందిగా మీ-ట్యూబ్. యూ-ట్యూబ్ లో 'ఏరువాకా సాగారోరన్నో సిన్నన్న' పాట తగిలింది.
అత్యుత్తమ ఫలితాలకోసం, కాలక్రమీణ తెలుగు నటీమణుల పతనం గురించి తలచుకోవద్దు.ద వోఁల్డ్(వరల్డ్ కాదు) ఈజ్(ఈజ్ కాదు) ఒన్స అగెన్(ఎగేయిన్ కాదు) అ బ్యూటిఫుల్ ప్లేస్.
అంటే మనేదు తగ్గిపోయి ప్రాణం చల్లగా ఉంది. ఏముందో గాని ఈ పాత పాటల్లో మాయ.

సవాలు పదాలు
మనేదు = మనోవ్యధ = మనః + వ్యధ
Inscript లో లేదా లేఖిని లో రెండో చ, రెండో జ (ఆజాద్ లో లాగ) ఎలా తెప్పించాలో తెలిసినచో మాకు కూడా శెలవు ఇచ్చుకోగలరు.

8 comments:

 1. మీరూ నమ్మేశారా "తెలుగునేల"లో వున్న వీడియోలోని చిలకపలుకులనీ...
  అయితే ఈ నా కామెంటు చదివి ఇవికూడా నమ్మండి.

  కానీ నేను చూచిన సగంలో నాకు అర్థం అయ్యిందేంటంటే భవనాలు కూలిపోవడానికి విమానాలు కారణం కాదు ఇంకేవో పేలుడు పదార్థాలు అమర్చి పేల్చి వేశారని...
  దీనంత డొంక తిరుగుడు వీడియో ఇంకోటి వుండదనిపించింది నాకు...
  1) explosive plant చేయగలిగివుంటే ప్రాణాలకు తెగించి వాటిమీదికి విమానాలు నడపడం అంత తెలివిమాలిన చేష్ట ఎందుకు చేయాల్సి వచ్చింది?
  2)విమానాలు డీకొన్నప్పుడే explosives పేలాలని దేనితో అంత ఖచ్చితంగా నియంత్రించారు?
  3)ఒకానొక ఈక్వేషన్ తో 8/10 సెకన్లలో 110 అంతస్తుల భవనం నేల ఎలా రాలుతుంది. ఒక free falling object కూడా ఒక్క నిమిషం పైనే తీసుకుంటుందని అన్నారు. మరి explosives ఆ వేగాన్ని మరింత వేగవంతం చేస్తాయా? అలాగైనా 8/10 సెకన్లలో నేల రాలకూడదు కదా?

  వీళ్ళని ఏది ముందుకు నడిపిస్తుందో తెలియదు కానీ ప్రతిదానికి ఆధారలు చూపిస్తారు. మీరు దీన్ని నమ్మితే కింద నేనిచ్చిన లింకులు కూడా చూడండి. నాజీల దురాగతాలు జరగలేదని, భూమి బల్లపరుపుగా వుందనీ, చంద్రూడిమీద మనిషి కాలు పెట్టలేదనీ కూడా నమ్ముతారు.

  ప్రతిదాన్నీ అనుమానించేవాళ్ళున్నారు. కళ్ళేదుట జరిగిన దాన్ని మనం నమ్మకపోతే
  1) హొలోకాస్ట్ జరిగిందని నమ్మని వాళ్ళు (ఉదాహరణకు ఇరాన్ ప్రెసిడెంటు) (http://en.wikipedia.org/wiki/Holocaust_denial)
  2) భూమి భల్లపరుపుగా వుందని నమ్మే వాళ్ళు (http://www.alaska.net/~clund/e_djublonskopf/Flatearthsociety.htm)
  3) మనిషి చంద్రూడిమీద నడవలేదని నమ్మే వాళ్ళూ (http://www.badastronomy.com/bad/tv/foxapollo.html)
  వుండటంలో ఆశ్చర్యమేముంది.


  --ప్రసాద్
  http://blog.charasala.com

  ReplyDelete
 2. మనేదు గురించి నెనెప్పుడూ వినలేదండి.మీ బ్లాగులో నాకు కొత్త విషయాలు తెలుస్తున్నాయి.ప్రసాదు గారికి కలిగిన అనుమానాలే నాకు కలిగాయి.

  ReplyDelete
 3. Happy Feet... Yeah..I too thought it was a children's movie, givben the way it began. However, it addresses environmental issues very subtlely...

  ReplyDelete
 4. మా అమ్మమ్మ ఈ పాట విని కన్నీళ్ళు (ఆనందభాష్పాలు) పెట్టుకునేది.. వయసులో తన జీవితాన్ని తలుచుకొని... చక్కటి పాట. చాలా కృతజ్ఞతలు.

  ReplyDelete
 5. హేఁపీ ఫీట్ (హ్యాపీకాదు కదూ!) లో పెంగ్విన్లకు మిగలనీయకుండా మనమే చేపలన్నీ తినడమే కాదు, మనం ఎక్కడపడితే అక్కడ వదిలిన ప్లాస్టిక్ పదార్థాలవల్ల "సాములోరు పెంగ్విన్" లేక "పెంగ్విన్ బాబా" ఎంత నరకం అనుభవిస్తాడో కూడా చూసి మనమంతా కాస్త బుద్ధిగలిగి మసలుకోవాలి. చాలా హృద్యమైన సినిమా. ఏరువాక ఒక నిత్యశ్యామలమైన (ఎవర్‌గ్రీన్‌కు యథాతథం) హుషారైన పాట. అందులోని యలపట, దాపట ఎడ్లదోలుకో అనే పదాలకు అర్థం ఇప్పుడు ఎందరికి తెలుసు?

  ReplyDelete
 6. ఈ యలపట , దాపట గురుంచి చదివెసరికి నా చిన్న నాటి రొజులు గుర్తొచ్హాయి, నెను 7వ తరగతి అయ్యాక చదువు మనెసి ఒక 3సంరాలు వ్యవసాయం చెసాను రొజు ఎద్దులను ఉదయానె పొలము దున్నుటకు కాడి కట్టే టప్పుడు ఒకటె సందెహము మా వాల్లు ఎమొ యలపట, దపట అంటారు నాకెమొ గుర్తుండదు, సొ మొత్తానికి యలపట అంటె యడమ వైపు అని గుర్తుంచుకొన్నట్టు గుర్తు ఇంక మిగిలింది కుడి అని. మరి ఇది రైటు అంటారా లెక తప్పా రానారె గారు మల్లి మర్చిపొయా.

  ReplyDelete
 7. దిలీప్ గారూ, అలా అయితే ఏ ఎద్దులతో అయినా మీకు కష్టమే. యలపట అంటే కుడి. దాపట అంటే ఎడమ. మీరు నన్ను అడగకూడదనే నా వ్యాఖ్యలో ఆ పదాలకు బ్రౌను నిఘంటువులోని లింకు ఇచ్చాను. క్లిక్కి చూడండి. పంచుకున్నందుకు ఆచంట గారికి కృతజ్ఞతలు.

  ReplyDelete
 8. @ సౌమ్య గారు - subtle కూడా ఏమి లేదండి సినిమా లో. ముక్కు సూటి గానే చెప్పారు ...

  @ రానారె గారు - యలపట, దాపట
  వ్యవసాయదారుల కుటుంబంలో పుట్టిని ఆ పదాలు నాకు తెలియలేదు. చెప్పినందుకు కృతజ్ఞతలు.

  @ దిలీప్ గారు -
  ఏడవ తరగతి తరువాత వ్యవసాయం చేసారు, ఇప్పుడేమో కంప్యూటర్ లతో కులుకుతున్నారు. మీరు జీవితంలో చాలా వైవిధ్యమైన అనుభవాలు చూసారు.
  యలపట - యడమ కొద్దిగా ఒకేలా ఉన్నాయి కదా?
  నాకూ అలానే అనిపించింది. కుడి అనే పదం ఉండగా యలపట ఎందుకు అవసరం వచ్చిందో??

  ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం