భాషందం, భువనందం, బ్రతుకందం

Thursday, May 17, 2007

విసిగించే సాంకేతిక పురుగులు

ఈ computer bugs(సాంకేతిక పురుగులు) ఉంటాయే, తలకాయనొప్పి.

మనలో చాలా మంది ఇంజనీర్లు పురుగుల మీదే బ్రతికేస్తామనుకోండి. సాఫ్టవేర్ తయారీలో 50 శాతం సమయం మరియు వ్యయం ఈ పురుగుల నివారణలోనే వెచ్చించబడతాయి. నేనైతే బెంగుశూరులో రెండేళ్ళు ఇలాంటి పురుగుల నివారణలోనే గడిపేసాను. నాకోచ్చిన జీతం అంతా పురుగు నిర్మూలన కోసమే.
ఈ పురుగుశాస్త్రాన్ని ఇంకా వివరంగా చెప్పాలంటే.

పురుగులు ఎందుకు వస్తాయి
ప్రపంచంలో సగం సమస్యలు జనులు నిరీక్షించే ఒపిక లేనివారు అయి ఉండం వలనే. ఇల్లు కంగా మింగా కడితే బీటలు ఎక్కువ వస్తాయి, అలాగే సాఫ్టువేరు నిర్మించేటప్పుడు ఎంతో నశితంగా ప్లాన్ చేసుకోవాలి. కాని వివిధ కారణాల వల్ల, ఇది చేయరు.
౧) మీ మెనేజరు మీరు తీసుకున్న సమయానికే గాని మీ సాప్ట్ వేర్ నాణ్యతకు విలువ ఇవ్వక పోవడం.
౨) మీరు మీ మెనేజరు (౧) లో వివరించినట్టు ఆలోచిస్తాడని మీరు తప్పుగా అంచానా వేయడం
౩) మీ తోటి ఉద్యోగులతో అక్రమ పోటి
౪) మీకు దూరదృష్టి లేక పోవడం వగైరా

అసలే మన ఊళ్ళల్లో ఒకే ఉద్యోగంలో మూడేళ్ళ నుండి ఉంటున్నానంటే ఒనమాలు రానోళ్ళు కూడా వెర్రోడి లెక్క చూస్తారు. "దూరదృష్టికి కనడానికి మనోనేత్రాలు లేవు, విశ్వాసానికి విలువేలేదు, దురాశకు అంతు లేదు, డబ్బుకు మించిన ఉన్నతాశయం లేదు" అన్నట్టుంది నేటి తెలుగు సమాజం.

పురుగుల వలన నష్టాలు
ఇక్కడ చెప్పేదేముంది, ఒకరు పెట్టిన పురుగులు ఇంకొకరు తీయాలి. తీసేందుకు జీతం ఇవ్వాలి.
ఉదాహరణకు నా బెంగుళూరు ఉద్యోగం విషయంలో, నా రెండేళ్ళ జీతం అంటే దాదాపు ఒ పది లక్షల వృధా. చెత్త ఉద్యోగం చేయలేక నేనుభవించిన మానసిక క్షోభ. నేను రెండేళ్ళకు మానేసినందుకు, కొత్త వ్యక్తిని తీసుకొని ఆమెకు ట్రెయినింగ్ ఇవ్వడానికి అయ్యే వ్యయం. ఎనిమిదేళ్ళ చదువులు తర్వాత, నాలాంటి వాళ్ళు సాంకేతిక ఉద్యోగాలు చేయకూడదని నిర్ణయించుకోవడం. ఇవన్ని, సాఫ్టు వేర్ నిర్మించే తరుణంలో, మరికొంచెం పరిపక్వమైన మతం తో వ్యవహరిస్తే నిర్మూలించ దగ్గవే.

పైన చెప్పిన వన్నీ పరోక్ష నష్టాలే.
ప్రత్యక్షంగా అయితే, సాఫ్ట వేర్ వాడే వారు కొనడానికి వ్యచ్చించిన డబ్బు నష్టం, వారనుభవించే పరాకు, ఆందోళన, కోపం (మరియు కొన్ని సార్లు క్షోభ). సాఫ్ట వేర్ పై ఆధారపడి ఉన్న పరికరాల విడుదలలో ఆలస్యం, దాని వల్ల నష్టం. ఇలా చెప్పుకుంటూ పోతే వస్తూనే ఉంటాయి.

పురుగుల వల్ల లాభం
పురుగుల వల్ల ఇంకా ఎక్కువ జనాలకి ఉద్యోగాలు వస్తాయని వాదించ వచ్చు, ప్రత్యేకించి భారతదేశంలో ఐటి ఉద్యోగాలు ఎక్కువ అవడానికి ఇవి కారకులని అనవచ్చు. కాని కళ్ళమ్మి కళ్ళజోడు కొనుక్కున్నట్టుంటుంది వ్యవహారం.

సంగ్రహం
ఇంతకూ ఇవన్నీ ఎందుకు వ్రాస్తున్నా నంటే, నా క్రితం టపాలో కొ.పా గారు రానారె గారు వ్యాఖ్యానించారు, కాని అ వ్యాఖ్యలు కాస్తా బ్లాగరులో పురుగు ఉండడం వల్ల కనిపించకుండా పోయాయి! ఇవన్ని ప్రపంచంలోనే అతి తెలివైన వ్యక్తులు పనిచేసే గూగుల్ సంస్థ నుండి ! నాకు చెప్ప లేనంత కోపంగా ఉంది. దీనినే Tech Rage అంటారు.

కొసమెఱుపు
మంచి తత్వవేత్త అయిన నా మిత్రుడు అంటూంటాడు "నేటి నాగరికత యొక్క దుస్థితి: మనవాళికి చెందిన అతి తెలివైన వారు సెల్ ఫోనులు చిన్నవి చేసే కార్యంలో నిమగ్నమై ఉన్నారు".

No comments:

Post a Comment

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం