భాషందం, భువనందం, బ్రతుకందం

Sunday, May 20, 2007

May I have this dance


ఇది ఎంత సింపుల్ గా వీలైతే అంత సింపుల్ గా వ్రాస్తా. చదివినదాని బట్టి మీ తాత్పర్యాలు మీరు లాక్కోండి.

నేను స్వింగ్ మరియు సాల్సా డాన్సులకు కుదిరినప్పుడల్లా వెళుతూంటా. ఇంచక్కా అమ్మాయిలను కలసి నాట్యం చేయొచ్చు, రాక్ అండ్ రోల్ సింగీతం ఆడుతుండగా. అమెరికాలో జీవితం చాలా చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ఉదాహరణకు నేనీ వాఖ్యం రాస్తుండగా బిపి 'మేము వాతావరణానిని కాపాడుతున్నాం' అని ప్రకటన ఇచ్చుకుంటుంది టీవీలో. కాని డాన్స్ ప్లోర్ మీద ఉన్నా ఆ రెండు నుండి ఆరు గంటలు మాత్రం ప్రపంచంలో అంతా మంచే అనిపిస్తుంది.

సాధారణ జీవితంలో అసంభవం అనింపిచేవన్నీ జరుగుతూంటాయి అక్కడ! ఉదాహరణకు,
ఆడవారు మగవారి పై పూర్తి నమ్మకంతో వారు ఎటు పంపితే అటు వెళ్తారు (leading - following అంటారు ఆ ప్రక్రియని) , అలాగే మగ వారు ఆడవారిని పూర్తిగా గౌరవించి వారిని సంతోష పెట్టడానికి సాయశక్తులా ప్రయత్నిస్తారు. 'డాన్స్ చేస్తారా నాతో' (May I have this dance?)అని అడిగితే ఎప్పుడు ఎవరూ 'నొ' అనరు; అదేదో ఒక చట్టవిరుధ్ధమైంది లాగా.

ఇంతకూ ఇవాళ ఏమైందంటే, ఒక అమ్మాయిని తో డాన్స్ చేసే ముందు సంగీతం మొదలవడానికి నిరీక్షిస్తూ, మాటల్లో, ఎప్పుడూ జరిగే సంభాషన ఇలా ఒ ఆశక్తి కరమైన మలుపు తిరిగింది.
నేను: మీరు విధ్యార్థినా?
ఆమె: అ.. మొన్నే పూర్తయ్యుంది కాలేజి.
ఎ శాస్త్రం అభ్యసించారు ?
Cognitive Science?.. మరి మీరో.. ?
నేను, ఇక్కడే టెక్ లో ఎంఎస్ చేసా విధ్యుత్ సాంకేతిక విధ్యలో, కాని మెన్న సెమిస్టర్ లో మీ సైకాలజీలో ఒ క్లాసు తీసుకున్నా..
Under Grad ( బిటెక్కు) ఎక్కడ చేసారు ?
భారతదేశంలో
భారతదేశంలో ఎక్కడ? నాకు తెలిసుండక పోవచ్చు కాని తూర్పా.. పడమరా ??
దక్షిణ భారతంలో ... కేరళ ?
ఒ కేరళ.. నాకు తెలుసు కేరళ .. అమ్మాచి అక్కడ ఉంటారు
అమ్మాచి ఉండేది నేను చదివిన చోటుకు దగ్గరే
అవునా మరి ఎప్పుడైనా దర్శనం చేసుకున్నారా.. ?
(దొరికి పోయారా దేవుడా) .. లేదు కుదరలేదు ..
నేను రెండు సార్లు చూసా .. అమ్మాచి రెండు సార్లు వచ్చారు అమెరికా.. రెండు సార్లూ చూసా..
(కప్పి పుచ్చుకోవడానికి) నేను సత్య సాయి దర్శనం చేసుకున్నా. సత్యసాయి తెలుసా?
ఒ తెలుసు మా మిత్రుల కుంటుంబం ఒక్కరు సత్యసాయి అపారమైన భక్తులు
మా చుట్టాలులో కూడ చాలా మంది ఉన్నారు, అందుకే నాకా అవకాశం దొరికింది. అంటే నేను పెరిగింది ఆంధ్రా అని వేరే రాష్ట్రంలో, సాయి అక్కడి వారు, అందుకే మాకు తెలిసిన వారు ఆయన భక్తులు ఎక్కువ. మాములు గా మనం ఎవూరిలో ఉంటే ఆవూరి దగ్గరలో ఉన్నగురువు ల దగ్గరకు వెళ్తూంటాం...
అ ఒహో..అవును ...

ఈలోగా డిజెకి ఎదో కొత్త ఐడియా వచ్చి, జంటలన్నిటి కలగా పులగం చేయాలని నిశ్చయించుకుంది. మా సంభాషణ ముగిసింది. మామూలుగా ప్లోర్ మీద ఆడవారితో ఎదోక చిరుసంభాషణ నడుపుతుండాలి. అప్పుడప్పుడూ అది ఇలాంటి అనుకోని సంభాషణలకు దారి తీసూంటుంది.

భారతదేశం ప్రపంచ దేశాలకు ఆధ్యాత్మికతను ఇంకా ఎగుమతి చేస్తుంది, ఇది ఇలానే సాగాలని ఆశిద్దాం.

PS: ఆరు నెలల క్రితం ఒక సారి, ఒ వేరే తెల్లమ్మాయి డాన్స్ చేస్తూ మధ్యలో "आती क्या खंडाळा" అని పాట ఎత్తుకుంది. నాకు నిజంగా అశ్చర్యం వేసింది. ఎక్కడ నేర్చుకున్నావంటే, "నా హిందీ క్లాసులో" అని ఒ చిరు నవ్వు నవ్వినా హృదయంలో ఒ చిన్న కోత కోసింది :) ఆమె మీనాక్షాలు నాకింకా గర్తున్నాయి :) మామూలు గా మన దక్షిణ భారతదేశంలో ఉన్నంత పెద్ద కళ్ళు వేరే చోట్ల ఆడువారికి ఉండవు అన్న విషయం మనందరికీ తెలిసిందే.

సవాలు పదాలు
simple, complex, conclusion, cognitive science, post graduate, under graduate, electrical engineering

5 comments:

 1. సరైన తెలుగు సమానార్థకాలు :

  export -ఎగుమతి (ఎగుబడి కాదు)
  simple- సరళమైన
  complex- సంక్లిష్టమైన
  conclusion-ముగింపు/అంతిమ నిర్ణయం
  cognitive science - అభిజ్ఞన శాస్త్రం
  post graduate-స్నాతకోత్తర (స్నాతకోత్తరుడు)
  under graduate- స్నాతక పూర్వుడు
  electrical engineering- విద్యుత్ తంత్రం

  ReplyDelete
 2. మన్నించాలి. పొఱపాటు జరిగింది. "అభిజ్ఞాన శాస్త్రం" అని చదువుకోండి.

  ReplyDelete
 3. maMci TapA. ammAciki bhAratEtara bhaktulu cAlA maMdE unNAru I dESaMlO. RAkES - oka sUcana. modaTlO nuvu rAstunnappuDu ilA gajibiji telugu padAlu rAyaDaM muccaTagA unnA .. rAnu rAnu adE konasAgitE cadivE vALLaki kashTaMgA uMdi. udAharaNaki I TapAlO kRtrimaMgA telugulO prakaTIMcina bHAgAlu TapAlO meyin pAyiMT niMci DisTrAkT cEstunnAyi, TapA aMdAnni digatIstunnAyi. aTuvaMTi cOTla iMglIshu vADaDamE maMcidani nA abhiprAyaM.

  ReplyDelete
 4. "సాధారణ జీవితంలో అసంభవమైనవన్నీ జరుగుతుంటాయక్కడ." ఇది సంగీతం ప్రభావమా, నాట్యం మహత్యమా, లేక అక్కడి సంప్రదాయపు మాయాజాలమా, వాతావరణంలోని గమ్మత్తా!

  ReplyDelete
 5. సమయం దొరికి, ఓపిక ఉంటే ఇంకా లాగండి ఈ టాపిక్‌ని. పూర్తిగా కొత్త విషయం. ఇకపోతే, ప్రతి సంవత్సరం అమ్మ రెండు సార్లు అమెరికా వస్తుంది, ఒక్కసారి మిచిగాన్‌కు. వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాము. రానారె కామెంటుకు నా తరపున ఇది అతకండి "...లేక మరేదయినా?" :-)

  ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం