భాషందం, భువనందం, బ్రతుకందం

Sunday, May 06, 2007

మీరు గోడలలో నుంచి వెళ్ళగలరా ?


"వీడెవడండి బాబు? ఇదేమి వింత ప్రశ్న వేస్తున్నాడు" అనుకుంటున్నారా? మీలో కొందరైతే, "యా యేంటి నువ్వెళ్ళగలవా పెద్ద ?" అని నిలదీయదల చుంటారు కూడా. ఏదేమైనా చాలా రోజులైంది బ్లాగి అని ఒ ఆసక్తికరమైన విషయం దొరికి బ్లాగుతున్నా.

ఉపోద్ఘాతం
ఈ మధ్య దెయ్యాల గురించి పెద్దలు చాలా మంది వ్రాస్తున్నారు. కొందరు 55 మాటల్లో కథలు అనే వర్గంలో దెయ్యాల గురించి హాస్యంగా వ్రాసినా, మరి కొందరు పెద్దలు చాలా సీరియస్ గా క్షధ్రశక్తుల గురించి వ్రాస్తున్నారు. నేనేమో పాశ్చాత్య విద్యా విధానంలో అభ్యాసం పొంది, భారత తత్వ శాస్తాల మద్య పెరిగాను. దానికి తోడు కాళీ సమయం ఎక్కువై, భౌతిక శాస్తం యొక్క హద్దుల గురించి ఆలోచించడం వగైరా చేస్తున్నా. ఈమధ్య దేనినీ నమ్మడానికి లేదన్నట్టుంది ప్రపంచం. 911 నుండి ఆర్యనుల దండయాత్ర వరకూ అన్నిటి మీదా సందేహాలే.

ఏదేమైనా ఈ గోడలలోనించి వెళ్ళే అంశం పై నా రెండు పైసల దక్షణం నేను సమర్పించు కుందామని నిశ్చయించా.

Assumptions
౧) మీకు భౌతిక కాయం ఉంది. అంటే మీరు ఆత్మ మాత్రమే కాదు, శరీరం కూడా. ఒక్కముక్కలో మీరు దయ్యం కాదన్నమాట.
౨) మీరు గోడలోనించి వెళ్ళడానికి పట్టే సమయం మామూలుగా ఓ రెండడుగులు వేసేంత కంటే చాలా ఎక్కువ ఉండకూడదు.
౩) గోడకు ఎమీ అవకుండానే మీరు ఇప్పుడు ఇటువైపు ఉన్నవారు అటువైపు చేరుకోవాలి.
౪) గోడ వైశాల్యం (ఎత్తు x వెడ్లపు ) అనంతం. అంటే వేరే మాటల్లో, గోడ చుట్టూ దిరిగి వెళ్ళడం వీలుకాదు.
౫) గోడలో ఉన్న అన్ని elements, periodic table కి చెందిఉండాలి. అంటే వేరే మాటల్లో అది నిజమైన సహజమైన గోడ అయ్యుండాలి.
౬) గోడ మందం సున్నా కంటే హెచ్చు.

ఉన్న మార్గాలు
గోడల్లోనుండి నడవడానికి రెండు మార్గలున్నాయి. అవును నిజం మీమీదొట్టు, నాకు పరిమితమైన విజ్ఞానం ప్రకారం రెండే ఉన్నాయి. మీకు ఇంకా ఎక్కువ విధానాలు తెలిసుండొచ్చు.

ఒకటో పద్ధతి
మనకూ చీమలకూ ఉన్నా తేడా ఎమిటి?
చీమలు హింసకూడిన మతిలేని సినిమాలను అఖండ విజయం చేయవు. పైగా అవి రెండు dimensions లోనే కదలగలవు. అంటే అవి పైకీ కిందకీ కదలలేవు.
చీమ దారిలో పెన్సిల్ పుల్ల పెడితే అది దాన్ని దాటి వెళ్ళలేదన్న విషయం మనమందరం చిన్నప్పుడు ఓ వర్షాకాలం సాయంత్రం ఆడుకోవడానికి మిత్రులెవరూ లేనప్పుడు చీమలను హింసిస్తూ గ్రహించిన విషయమే.

చీమలకు పెన్సిలెలాగో మనకు గోడలలాగ అన్నమాట. మీరూ నాలాగా దయా దక్షణ్యం ఉన్నవారైతే అ చీమ బాధ చూడలేక దానిని పైకేత్తి ఆ పెన్సిల్ కి అటువైపు చేర్చివుంటారు. అంటే 2 dimensional space అయిన మీ అరుగు నుండి ఆ చీమను 3rd dimension లోకి తీసుకెళ్ళి మళ్ళి దాన్ని తిరిగి 2 dimensional space అయిన మీ అరుగు మీద పెట్టారు. అలాగే 3 dimensional space అయిన ఈ గది లోనుండి మిమ్మల్ని మీ ఇష్ట దైవం 4వ dimension లోకి లేవనత్తి , తిరిగి గోడకు అవతలి పక్క వదలాలి.

అది వీలవ్వాలంటే మీకు లాగానే మీ ఇష్ట దైవనికి కూడా మంచి వేళ్ళు ఉండాలి. మీ ఇష్ట దైవం మా తమ్ముడు లాంటోడైతే, గోడకు వేరే పక్క మీ భౌతిక కాయం మాత్రమే చేరుతుంది. ఇది మన assumptions ని ఉల్లంఘించట్లేదు గా, చచ్చైనా సాదిధ్ధాం అనే మతం ఉన్నవారైతే కానీయండి.

ఈ నాలుగో dimension తిరకాసు చీమల్ని చంపినట్టు వివరించినా అర్థం కాని వారికోసం ఇంకో వివరణాయత్నం.
మీ ఇష్ట దైవం కాల యముడైతే. ఆయని ఇష్టడైమెన్షన్ అయిన కాలాన్ని వెనక్కి తిప్పి, గోడ లేని సమయం చూసి మిమ్మల్ని ఇవతలి పక్క చేర్చి, సడి సప్పుడూ లేకుండా కాలాన్ని మళ్ళి ముందుకు తిప్పేస్తాడు. గోడ ఉన్న చోటే ఉంటుంది, మీరు అవతలపక్కుంటారు. ఇప్పుడు అర్థమయ్యుందా?
అన్నట్టు కాల యముడు ప్రత్యక్షమైనప్పుడు నేను రిఫర్ చేసానని చెప్పడం మర్చిపోకండి. అసలే కలి కాలం లో పుణ్యం దొరకడం కష్టమైపోయుంది నిరుద్యోగులకు.

రెండో పద్ధతి
మీ తీగలువాడని దూర్వణి పరికరం (ఉరఫ్ సెల్ ఫోను) సంకేతాలు గోడల్లో నుండి వెళ్ళగలవు. అలానే మీరు కూడా వెళ్ళగలగాలి కదా??

మీరు తెలివైన వారు, తెలుగు లాంటి కష్టమైన భాష చదవనేర్చిన వారు, కాబట్టి వెంటనే మీరు, వాటికి భౌతిక కాయం లేదు గనుక వాటికి assumption ౧ అబ్బదు గనక వేరే మాట చెప్పమంటారు.
నేను ఇరవై ఏళ్ళగా భౌతిక శాస్తం చదువుతున్నా కాబట్టి,
" ఆ తరంగాలకు కాంతితో పోల్చగల్గిన వేగం ఉంది కాబట్టి, ఐన్‌స్టైను ప్రకారం వాటికి బరువు ఉంటుంది" అని మీరెవరూ నిరూపించలేని వితండవాదం చేస్తా.
మీరు వెంటనే, " విధ్యుత్తరంగాలవలె నీవు కూడా గోడలలో నుండి వెళ్ళగలవా ? ఐతే ఏది వెళ్లు " అంటారు.
"కాని పౌలీ ఎక్సక్లూజౕన్ నీతి" ( Pauli Exclusion Principle ) వల్ల అది నా ప్రస్తుత భౌతిక స్థితిలో సాధ్యం కాదు" .

నా వంటి లో ఉన్నవి, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు మరియు ప్రోటాన్లు. అవి మూడు ఫెర్మియాన్లు కాబట్టి అవి వాటి స్థితిని వేటితోనూ పంచుకోవు కాబట్టి, అలాంటి రెండు పార్టికల్లు ఒక చోట ఉండలేవు. కనుక నేను assumption ౫ ఉల్లంఘించకుండా గోడలలో నుండి నడవలేను.

ఉల్ఫ్‌గాంగ్ పౌలీ పానకం లో పుడకలా వచ్చి చెడగోట్టాడు గాని లేకపోతేనా ఈ పాటికి అసలు ...

మీరు మీ కాయాన్ని పాశ్చాత్యుడైన ఫెర్మీగారి ఫెర్మియాన్లతో కాకుండా, మన వారైన సత్యేంద్ర నాథ్ గారి బోసాన్లతో నిర్మించుకోగలిగితే ఈ పని సాధ్యం, పౌలీ కూడా మిమ్మల్ని ఆపలేరు. కాని గోడ దాటగానే వెంటనే ఫెర్మియాన్లలోకి మారిపోవడం మరువకండి లేకపోతే చాలా చాలా పెద్ద సమస్యలో పడతారు. ఎవరి సెల్ ఫోన్ లోనే సిఘ్నలై కూర్చుంటారు !!
ఆ విశేషాలు వేరెప్పుడైనా. ఇప్పటికి ఇంత సేపూ శాస్త్రం పేరిట సాగిన ఈ అరాచకం చాలు.

సంగ్రహం
నేను గోడలలో నుండి వెళ్ళగలను అని ఎవరైనా అన్నప్పుడు మీరు వెంటనే వారిని ఆ పని ఎలా సాధించారో అడిగి తెలుసు కోని వెంటనే బ్లాగండి. అప్పటి వరకూ నేనూ నా రూంమేట్ మా ఇంటి తాళంచెవి పంచుకోక తప్పదు.

సవాలు పదాలు (వీటికి తెలుగు పదాలు తెలిసిన చెప్ప ప్రార్థన)
Assumptions, elements, periodic table, electrons, protons, neutrons, roommate.

7 comments:

 1. Roommate కి సహవాసి అని వాడవచ్చనుకుంటా.

  ReplyDelete
 2. walkin through wallz ... yeah itz sure on my to-do list .... jeez ...

  కాక పోతే ఇంకొన్ని పద్ధతులు కూడా ఉండొచ్చేమో !!
  పద్ధతి మూడు ---
  Quantum Tunneling ద్వారా ఇది సాధ్యమే నేమో ??

  మీరు గోడ లోంచి మామూలు పరిస్థుతులల లో వెళ్ళ లేక పోవడానికి ముఖ్య కారణం లో మొదటిది , మీరు గోడ లోంచి వెళ్ళడానికి ప్రయత్నించినఫ్ఫుడు , మీ దేహం లోని outermost layer లో ఉన్న Atoms లోని electrons , గోడ outermost layer లో ఉన్న Atoms లోని electrons కి మధ్య repulsion ఏర్పడి మీరు వెనక్కి నెట్టి వేయ బడతారు , same pressure గోడ మీద కూడా పడుతుంది , కానీ గోడ మీకంటే గట్టిగా ఉండడం వల్ల (మీరు మరీ ఆర్నాల్డ్ స్కావజ్నెగ్గర్ కాదు గా ;)) దానీ మీద ప్రభావం తక్కువ .
  మీరు ఆ repulsive శక్తి ని అధిగమించడానికి మీ బలం అంతా కూడ దీసుకొని Justin Gatlin లా విపరీతమైన వేగం తో గోడ లోంచి వెళ్ళ డానికి ప్రయత్నిస్తే .. మొహం పచ్చడై కూర్చుంటుంది , కానీ మీరు కాంతి వేగం సాధిస్తే మాత్రం ఆ repulsive శక్తి ని అధిగమించి గోడ లోంచి ఈజీ గా వెళ్ళవచ్చు కాక పోతే ఇంత చేసినా మీరు గోడ లోంచి వెళ్ళ డానికి ప్రాబబిలిటి కేవలం పది లక్షల కోట్ల లో ఒక శాతం మాత్రమే . :)

  పద్ధతి నాలుగు --- మీరు Hulk సినిమా చూసారా ?? అందులో హీరో తండ్రి ఏ Matter properties అయినా absorb చేసే శక్తి ని పొందుతాడు , అలాంటి పద్ధతి try చేయొచ్చేమో !!


  మీరు పోస్టు లో ఒక దగ్గర కాలాన్ని వెనక్కు తిప్పడం అంటూ రాసారు , నాకో డౌటు , కాలాన్ని వెనక్కి తిప్పి గోడ కట్టక మునుపు మిమ్మల్ని అవతలకి చేర్చినా మీరు ఇంతకు మునుపు (కాలాన్ని వెనక్కు తిప్పారు గుర్తుపెట్టుకోండి ) అటు వైపు ఉన్నారు కాబట్టి , గోడ కట్టిన తరువత మీరు అటువైపు , ఇటు వైపు రెండు చోట్లా ఉంటారా?? (qwestion అర్ధం కాక పోతే వదిలేయండి , కొంచం కాంప్లెక్స్ గా ఉంది , నాకే అడగడం సరిగ్గా రావట్లేదు )

  ReplyDelete
 3. హ్హ హ్హ మి పోస్టూ, క్రిష్ గాఋఇ కామెంటూ భలే నవ్వు తెప్పించాయి. గోడలోంచి వేళ్ళాము అంటే విని వాళ్ళెదురుగా సీరియస్‌గా మొహం పెట్టి ఇవతలికి వచ్చాక నవ్వుకోవాలి గానీ మీ 20 సంవత్సరాల భౌతిక శాస్త్ర విజ్ఞానాన్ని దీనికోసమని వాడుకోవాలా?

  --ప్రసాద్
  http://blog.charasala.com

  ReplyDelete
 4. @ పోస్టు

  చరసాల గారి కమెంటు చూసి ఏంటి ఈయన ఇలా అంటున్నారా అనుకున్నాను ... తీరా చూస్తే అసలు విశయం అర్ధం అయ్యింది , పోస్టు లో ఇచ్చిన జాతీయవాది 2 బ్లాగ్ లింకు నేను రాత్రి చూళ్ళేదు ... వాకింగ్ త్రూ వాల్స్ అనే సరికి , ఉత్సాహం వచ్చేసి కామెంట్ రాసేసా ... ఇప్పుడే ఆ పోస్టు మొత్తం చదివా .... gawd.... it waz fukin crazy , I waz rollin on floor laughing my ass off ...

  రాకా గారు ఇప్పుడు ఇంకో పద్ధతి కూడా ఉంది ....

  పద్ధతి ఐదు ---- అంబానాధ్ దగ్గర దాని గురించి training తీసుకోవడం . lolz ..... ;)

  ReplyDelete
 5. ప్రసాద్ గారు చెప్పింది చాలా కరెక్ట్.

  ReplyDelete
 6. @ krishh
  బాగా ప్రయత్నించావు, మంచిది.
  55 పదాలలో చిన్న కథ బదులు 55 పదాలలో గోడలలో నుండి నడవడం అనే సంచిక మోదలు పెట్టవచ్చు మనం.
  కర్స పదాలు వాడవద్దు, తెలుగు బ్లాగలోకం చాలా formal ప్రపంచం. నాకు నీ వీసా మరియు admits గురించి మెయిల్ కొట్టు. నా జీమెల్ ఐడి rakesh var, (కాళి లేకుండ)

  @ ప్రసాద్ గారు, రాధిక గారు
  సైన్స్ వివరించలేని ప్రక్రియలు ప్రకృతిలో అనేకం. చూడగల అన్ని ప్రక్రియలను వివరించగల ఏ ఒక్క సిద్దాంతం శాస్త్రవేత్తలకు చిక్కట్లేదు.
  4 టన్నుల విమాలు ఎగరలేవన్నారు. సమాచరం గోడల్లో నుండి వెళ్ళలేవన్నారు. కాని ఇప్పుడన్ని సాధ్యం. సైన్సును నమ్మడానికి లేదు.

  ReplyDelete
 7. Assumptions, elements, periodic table, roommate.

  assumptions = voohalu
  elements = padardalu
  periodic table = ganana pattika
  roommate = saha nivasi

  NAAKU TELISI ELECTORNS,PROTONS,NUETRONS KI TELUGU PADALU LEVU.ENDUKANTE NENU TELUGU MEDIUM LO CHADIVANU.MEMU KUDA ENGILSH LO NE PALUKUTAMU.OK?

  PLZ VISIT MY BLOG WHEN U R FREE...
  WWW.BSAIKRISHNAFCA.BLOGSPOT.COM

  SAIKRISHNACA2011@GMAIL.COM

  ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం