Somewhere I took a turn
and ran into a mirror.
Shattered pieces of glass
now surround me.
I think I am bleeding
but I know not where.
It really does not hurt or
I just pretend not to care.
The wounds may last
they may haunt me
as time goes past.
I look at the pieces
see myself in bits,
some of them smile
they say I am just fine.
Then there are those
that tell me I am fragile
I can break like them.
Or they seem to tell me
broken already I am.
I just gather the pieces
trying to fix what it reflects
The image is too vague
to be a puzzle to solve
The reflections too many
to be a piece of art.
Mirrors once shattered
can not be unbroken
Pain once experienced
can not be truly forgotten.
-------------------------------------------
వెళ్ళే వెళ్ళే దారిలో
కాలానికి కథనానికీ కంటి చూపు కరువైంది.
మేలుకొని చూస్తే,
చుట్టూ అద్దం ముక్కలు.
ముక్క ముక్కకో కథ
కథలన్నీ కలిపితే నా జీవితం.
దేహం పై గాయాలు కనిపించేవేగాని
అనిపించేవేవి కావు.
గాయాలు చెప్పే కథ ఒకటి
అద్దంలో నుండి నడిచింది నేనేనని.
కారే రక్తం చెప్పే కథ వేరు
కనిపించే గాయాలు ఎప్పటికైనా అనిపించేవేనని.
ఇతరుల కోసం దుఃఖించే మనసుదో ముక్క
బాధ్యత నేర్చని మేధస్సుదో ముక్క
దురాచారాని లోంగనందుకో దర్పణం
జడిసి జంకినందుకో దర్పణం
ముక్కలన్నీ కలిపితే
అవి నన్ను నిజంగా చూపించేనా
చూపించినా నే చూడగలనా
విరిగిన అద్ధం సరే
విరిగిన మనసు అతికేనా
ఇంకో రోజుతో ఇంకో వ్యక్తి ఉదయించేనా
ఒక సారి కరిగిన ఉక్కు
పదిమంది ఇంటికి పునాదిగా నిలిచేనా ?
-------------------------------------------
Please leave your comments on both the English and Telugu versions.
రెండు రూపాల మీదా మీ అభిప్రాయం వ్యక్తం చేయగలరు.
సెబాషో!
ReplyDeleteఆంగ్ల పద్యం ఛాలా ఛాలా బావుంది - రూపకాలంకారాన్ని భలే పట్టుగా నడిపించావు.
తెలుగు పద్యం పరవాలేదు. కొంచెం సానబెడితే ఇంకా మెరుస్తుంది. మొదటి చరణంలో రెండో వరుస "కాలానికి కదనానికీ కంటి చూపు కరువైంది" అద్భుతం - కానీ నా అనుమానం నీక్కావలసిన అర్థం ఇది కాదేమోనని. కదనం అంటే యుద్ధం. నీకక్కడ అద్దానికి పర్యాయపదం కావాలి అనుకుంటున్నా. నా ఊహ తప్పుకావచ్చు.
ఆంగ్ల పద్యం మాత్రం .. ఫెంటాస్టిక్.
ఆంగ్లంలో రాసిన కవితలో:
ReplyDeleteభావానికి పరిమితులు లేవు. ఈ కవిత రాయడం వెనుక మీ ఆలోచనలు ఏమిటయి ఉండవచ్చో ఎన్నోరకాలుగా ఊహించవచ్చు. ఈ కవితకు ప్రేరణ మీ వ్యక్తిగతజీవితంలోని చిన్న సంఘటన కావొచ్చు లేదా ఇప్పటి ఇరాక్ పరిస్థితికి కారణమైన అమెరికా అధ్యక్షుని నిర్వాకం కావచ్చు, లేదా తృణీకరింపబడిన ప్రేమజీవి తన మనస్సును కూడదీసుకోవటం కావచ్చు, వరదల్లో సర్వం కోల్పోయినవాడు మళ్లీ జీవితం నిర్మించుకోవడానికి తనకు తనే చెప్పుకునే ధైర్యవచనం కావచ్చు, మరేదైనా కావచ్చుననిపించింది.
తెలుగులో రాసిన కవిత:
ఆంగ్లానికి యథాతథానువాదం అయుంటుందని చదివాను. అలా కానట్టుంది. దీనికి మరిన్ని కోణాలున్నాయనిపిస్తుంది. ఎత్తుగడ అంతబాగలేదు. చివరి చరణాలు చాలా బాగా వచ్చాయి. ఇది నా అభిప్రాయం.
మీ ప్రయత్నం మాత్రం చాలా గొప్పది. ఈ కవితలంత గొప్పది. అభినందనలు.
కొత్త పాళీ గారికి, రానారె గారికి కృతజ్ఞతలు.
ReplyDeleteఅనుకున్నదే జరిగింది.
నా తెలుగు నా ఆంగ్లం కంటే బాగుండదని తెలుసు, కాని తెలుగు కవిత ఆంగ్ల కవిత కంటే బాగుండాలని ఆశించా..
ఏదో ఒక రోజు, ఏదోక రోజు, నా తెలుగు రాతలు ఆంగ్ల రాతలను మించుతాయి ... అప్పటి వరకూ కొన్ని తెలుగు కవితలు పుస్తకాలు చదవడం చేయాలి.
కవితల విషయంలో కొత్తపాళీగారి అభిప్రాయమే నాది కూడా.
ReplyDelete>>> ఏదో ఒక రోజు, ఏదోక రోజు, నా తెలుగు రాతలు ఆంగ్ల రాతలను మించుతాయి ... అప్పటి వరకూ కొన్ని తెలుగు కవితలు పుస్తకాలు చదవడం చేయాలి.
ఇది రాసి రెండేళ్ళ పైనే అవుతోంది. ఆ రోజు ఇంకా వచ్చిందా లేదా? (:P) అయినా తెలుగుభాష కోసం చంధస్సు నేర్చుకునే ప్రయత్నం తాటికల్లు కోసం కొబ్బరిచెట్టెక్కడం లాంటిదని నా అభిప్రాయం. అలాగే తెలుగుభాష కోసం ప్రస్తుత కవిత్వం చదవడం కన్నా, పసలపూడి కథల్లాంటి ఇంటిపేర్ల కేటలాగుల్నీ అంపశయ్యలాంటి కుళ్ళు కషాయాల్నీ దిగమింగడం కన్నా, తిన్నగా కొందరు పాతకాపుల్ని సాయమడగడం మిన్న అని నేనంటాను. పానుగంటి లక్ష్మీనరసింహారావు "సాక్షి వ్యాసాలు", శ్రీపాద కథలూ, మల్లాది కథలూ, మధురాంతకం కథలూ, చలం "మ్యూజింగ్స్"... ఇవి మంచి సాయమందిస్తాయి. (మల్లాది వచనం అప్పుడప్పుడూ కళ్ళు బైర్లు కమ్మించేంత కఠినంగా వుంటుంది; కానీ అలవాటు పడగా పడగా బావుంటుంది. ఇక శ్రీపాదైతే బాధే లేదు. పాటలా వుంటుంది.) ఈ మధ్యనే దేవులపల్లి కృష్ణశాస్త్రి వచనం (రేడియో వ్యాసాలు), భుజంగరాయశర్మగారి వచనం చాలా బాగుంటాయని విన్నాను. ప్రయత్నించాలి.
నేను ఎదుటివారిని ఇంసల్టీ చేయాలంటే, వాళ్ళ అభిరుచులను ఎక్కిరిస్తాను. ఈ పద్ధతి ఎంత బాగా పనిచేస్తుందో నాకు ఇప్పుడే తెలిసివచ్చింది.
ReplyDeleteకోనసీమనుండి వచ్చి కూడా మీరు పసలపూడి కథలను తీసిపారేయడం ...
(sorry for the ellipsis). సాక్షి వ్యాసాలు చాలా చోట్ల ప్రయత్నించాను కాని, దొరకలేదు!
అయినా మంచి కవిత్వం కోసం కథల పుస్తకాలు చదవడం, కొబ్బరికల్లు కోసం తాడి చెట్టు ఎక్కినట్టుండదు? మత్తెక్కేటప్పుడు ఏ కల్లైతేనేంటి అంటారా? :)
మంచి కవితల పుస్తకాలను సూచిస్తే బాగుంటుంది. వేటూరి పాట సంకలనం వంటివి. వేటూరి పంటచేలో పాలకంకీ నవ్వింది వంటి పాట ఒకటి వ్రాయాలని ఆశ.
నాకు కథలు చదివే దమ్ములేదు. అందుకే ఈ మధ్యన కథలు చదవడం బాగా తగ్గించాను. మల్లాది చదవలేదు గాని, (అయినా నాకు మల్లాది అంటే మల్లాది చంద్రశేఖర శర్మ గుర్తుకువస్తారు) శ్రీపాద చదివాను.
నాకు ఆ అందమైన పల్లెటూరి చిత్రాలు అల్లే కవితలైనా పాటలైనా సూచించగలిగితే ధన్యుడను. ఇంట్లో చదవకుండా పెట్టివున్నా చాలా కథల పుస్తకాలు వున్నాయి!
-
ఇంతకీ అసలు ప్రశ్నకు వద్దాం. రెండేళ్ళలో నా తెలుగు కవిత బాగుపడ్డది కానీ, ఆశించినంతగా అని చెప్పలేను.
నా కవితా సామర్థ్యం ఇంతేనేమో అని సరిపెట్టుకుందామంటే, మధ్యలో ఈ భాషాసమస్య ఒక్కటి. రెండు భాషల మధ్యలో ఇఱుక్కుపోవడం వల్ల నా సామార్థ్యం పూర్తిగా బయటపడట్లేదేమో అనిపిస్తుంది.
ఇంగ్లీషువాళ్ళు అనేడట్టు - కీప్ వాచింగ్ దిస్ స్పేస్ :)
ఏమైనా బాగుపడితే పడవచ్చు.
>>> నేను ఎదుటివారిని ఇంసల్టీ చేయాలంటే, వాళ్ళ అభిరుచులను ఎక్కిరిస్తాను.
ReplyDelete:P దొరికిపోయాను. నేనది చేస్తా అప్పుడప్పుడూ. కానీ ఈ సందర్భంలో మాత్రం మీ అభిరుచుల్ని వెక్కిరించడం కన్నా, మీరు నమ్మినా నమ్మకపోయినా, ఆయా పుస్తకాలు భాషని కూడబెట్టడానికి ఏ మాత్రం ఉపయోగపడవన్నది చెప్పడమే నా ఉద్దేశ్యం. పసలపూడి కథలు నిజంగా నాకు నచ్చలేదెందుకో.
>>> మత్తెక్కేటప్పుడు ఏ కల్లైతేనేంటి అంటారా? :)
అంతేకదా మరీ. మత్తెక్కేటప్పుడు వచనమైతే ఏంటి, కవిత్వమైతే ఏంటి. పై రచయితల్ని వాళ్ళ కథల గురించిగాక వచనాన్ని దృష్టిలో పెట్టుకుని సిఫారసు చేసాను. శ్రీపాద వచనంలోను (ముఖ్యంగా "అనుభవాలూ జ్ఞాపకాలూను"లో), చలం వచనంలోనూ (ముఖ్యంగా "మ్యూజింగ్స్"లో) కవిత్వాంశ కనిపిస్తుంది నాకు.
మూణ్ణెల్ల క్రితం విశాలాంధ్రాకి వెళ్ళినపుడు సాక్షి వ్యాసాలు ప్రచురణలోనే వున్నాయి. ఈసారెళ్ళినప్పుడు చూస్తాను. వుంటే మైల్ చేస్తాను.
>>> నాకు ఆ అందమైన పల్లెటూరి చిత్రాలు అల్లే కవితలైనా పాటలైనా సూచించగలిగితే ధన్యుడను. ఇంట్లో చదవకుండా పెట్టివున్నా చాలా కథల పుస్తకాలు వున్నాయి!
హ్మ్... ఆలోచించా గానీ, ఏం తట్టలేదు. నాకు కవిత్వంతో పరిచయం తిలక్‌తో మొదలై తిలక్‌తోనే ఆగిపోయింది ఎందుకో. మిగతావి ఒకటీ అరా అప్పుడూ ఇప్పుడూ చదవటమూ ఆనందించటమూ చేస్తుంటా గానీ ఏవీ అలా నాతో వుండిపోలేదు. ఏ ఆటంకమూ కలగకపోతే, అన్యాసక్తులు దృష్టి మళ్ళించకపోతే, తొందర్లోనే ఈ దిశగా ఓ బృహత్ ప్రయత్నం ప్రారంభించదలచాను.
"రెండు భాషల మధ్యలో ఇఱుక్కుపోవడం వల్ల నా సామార్థ్యం పూర్తిగా బయటపడట్లేదేమో" అనుకోవడం ఖచ్చితంగా మీ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేసుకోవడమే. భాషలు మహా అయితే ఉడుపులంతే. నియో "మాట్రిక్స్" సినిమా చివర్లో తన చుట్టూ ప్రపంచమంతా మాట్రిక్స్‌తో ప్రోగ్రామైవుందని గ్రహించగలిగినట్టు మనమూ మన చుట్టూ ప్రపంచం కవిత్వంతో నిండివుందని అవగతం చేసుకోగలిగితే చాలు, కవులమైపోయినట్టే. ఆ స్థితి వస్తే భాష చాలా చిన్న విషయం. బట్టలకొక్కెం నుంచి మన వంటికి వీలైన చొక్కాని తీసి తొడుక్కోవడమంత చిన్న విషయం.
>>> ఇంగ్లీషువాళ్ళు అనేడట్టు - కీప్ వాచింగ్ దిస్ స్పేస్ :)
Now, iamgine Robert DeNiro saying this to Ben Stiller: "I WILL BE WATCHING YOU" :)