భాషందం, భువనందం, బ్రతుకందం

Thursday, May 31, 2007

నేను వికీపీడియాను ఎందుకు చంపేసా

హీరోయిన్ : ఎంటి నువ్వు వికీపీడియాని బ్లాక్ చేసావా ?
హీరో : అవును
హీరోయిన్ : ఛీ! నువ్వసలు మనిషివేనా ? ఇంత ఘోరానికి ఎలా ఒడిగట్టావు ? నీలాంటి హంతకుడను ప్రేమించి నందుకు .. ఛిఛి.. నాకు మాటలు కూడా రావట్లేదు.
హీరో : ఆగు, అవును నేను హంతకుడనే! "హంతకుడు హంతకుడు" అంటూ అందరూ వేలెత్తి చూపడమేగాని ఎవరైనా "ఆ హత్య ఎందుకు చేసాడు" అని ప్రశ్నించారా?
హీరోయిన్ : ఎందుకు చేసావు?
హీరో : అప్పుడు నా వయస్సు నాలుగు ఆర్లు. భాధ్యత తెలిసీ తెలియని వయస్సు.
పెళ్ళి కాలేదు కాబట్టి ఎదోక ఉద్యోగంలో చేరమని నస పెట్టి ప్రేరేపంచే వారు కూడా లేదు. ఐదు నెలలనుండి కాళీగా తిరుగుతున్నా. పనీ పటా లేదు. మా నాన్న రూపయలలో సంపాదించిన డబ్బు నేను డాలర్లలో దెబ్బకు 'నలభై పాయింట్ ఆరు ఎనిమిది' రూపాయల చొప్పున తగలబెడుతూ ఉన్నా.
అలాంటి సమయంలో, ఈ వికీపీడియా నా అమాయకత్వాన్ని, నా పరిస్థితిని ఆసరాగా తీసుకొని నా చేత గంటలు గంటలు అన్ని రాకాలైన చెత్త విషయాలగురించి చదివింపజేసేది. అడ్డ మైన చెత్త చదివి మానసికంగా కృగిపోతున్న సమయంలో, నన్ను నేను కాపాడుకోవాలంటే ఇక వికీపీడియాని బ్లాక్ చేస్తేనేగాని వీలుపడదని తెలిసాక...
హీరోయిన్(ఏడుస్తూ) : హుఁ హుఁ . నువ్వు ఏ పరిస్ధుతుల్లో ఆ పని చేసావో తెలియక నిన్ను నానా మటలన్నాను, నన్ను క్షమించు.. భూఁ భూఁ.
హీరో (జాలిగా) : నీ తప్పేముంది ప్రియా, ఎదో తెలియక అన్నావు.
హీరోయిన్(కళ్ళు తుడుచుకుంటూ): ఇంతకూ ఎలా బ్లాక్ చేసావు?
హీరో : మంటనక్క పోడిగింత ఒకటుంది. దానికి సైట్ పేరు చెబితే అదే చూసుకుంటుంది. అందుకే అదే చేత్తో యూట్యుబ్ ని కూడా బ్లాక్ చేసా..
హీరోయిన్ : బ్లాగులని కూడా బ్లాక్ చేసావా ?
హీరో : ప్రస్తుతానికి వదిలేసా. కాని నా పనోడితనానికి అడ్డు వస్తే వాటిని కూడా వదిలేదిలేదు.
హీరోయిన్ : మరి తెలుగు వికీపీడియాని దిద్దడానికి ఉండదు కదా?
హీరో : ఆంగ్ల వికీ ని మాత్రమే ఆపా, కాబట్టి అన్య భాషాపీడియాలను ఆసించవచ్చు.
హీరోయిన్ : మరి గూగుల్ శోధన పుట నుండి వెళ్ళవచ్చనుకుంటగా ఆంగ్ల వికీకీ, యూట్యూబ్ కి?
హీరో : లేదు. అవన్ని శోధనలో లంకెలు లేకుండా వస్తాయి. ఇలా ...


హీరోయిన్ : వావ్ . నువ్వు ఎంత కూలో ... ఐ లవ్ యూ.
హీరో : పద డార్లింగ్ ఈ శుభ సందర్భంలో మనం ఎక్స్‌ప్లోరర్ తెరచి, ఫామిలీ గై వీడియోలు చూద్దాం, యూట్యూబ్ మీద.
హీరోయిన్ : కాని నువ్వు ఇప్పుడే బ్లాక్ చేసాన్నావుగా ?
హీరో : అది ఫైర్ఫాక్స్ లోనే కద డార్లింగ్. IE క్లిక్కు దూరానే ఉందిగా
(హీరో కెమరా వైపు తిరిగి కన్నుకోడుతూ..)
శుభం

3 comments:

  1. హ హ హ అహ
    చాలా బాగా రాశారు.

    ReplyDelete
  2. హహ్హ! నువ్వు ఎంత కూలో... కూలోడివి నువ్వు :)

    ReplyDelete
  3. నాకు ఈ బ్లాగు చదివిన వేంటనే డోకు(వాంతి) వచ్చింది. ఏమి వ్రాశారో నాకు అర్థం కాలేదుకాని నాకు డోకు వచ్చింది. మాటల బాబు

    ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం