భాషందం, భువనందం, బ్రతుకందం

Wednesday, May 09, 2007

ఆటల పిచ్చి

ఎ కులమూ మీదంటే,
ఫుట్‌బాల్ కులము నవ్వింది,
రొనాల్డో, రొనాల్డిఞొ మా కులమే లెమ్మంది

ఈ పాటికి మీకు అర్థమవ్వాల్సిన విషయం ఏమిటంటే, నాకు ఆటల పిచ్చి. సజ్జబంతులాట జట్టు ఫీనిక్స్ సూర్యులు ఒ ఐదు పాయింట్లు వెనక బడి ఉంటే నాకు దుఃఖం ముంచుకొస్తుంది. ఇక అందులోనూ ఫుట్‌బాల్ అంటే ఒ మతం, రొనాల్డిఞొ దేవుడు.

ఫుట్‌బాల
జీవితంలో కర్మ గుడిసెటిదై, జీవితంలో విరక్తి కలిగినప్పుడు, సానుకూల దృక్పదంతో ఆలోచించడం చాలా అవసరం. అలాంటప్పుడు "ఉద్యోగం లేక పోతే లేదు, కనీసం రెండు కాళ్ళయితే ఉన్నాయి, పోయి కాలుబంతులాట ఆడుకుందాం" అని సంతోష పడి. దగ్గరలో ఉన్న ఆట మైదానానికి వెళ్ళి ఒ నలుగురు అమీగోలతో ఒ రెండు గంటలు ఆడితే ఉంటుంది చూడూ. రాత్రి వచ్చే వళ్ళు నెప్పులు, పిర్ర నెప్పులు, స్వల్ప జ్వరం కూడా మంచి గానే అనిపిస్తాయి. నిన్ననే ముగ్గురు మీద ముగ్గురు ఫుట్‌బాల ఆడి ఒ నాలుగు గోలులు వేసాలెండి. మంచి హైలో ఉంది బండి.

హాకీ
నేను క్రిత జన్మలో లెక్కలు రాని దద్దమ్మనై ఉంటా. దేవుడు ఈ జన్మలో ఎం కావాలి నీకు అని అడిగినప్పుడు నేను లెక్కలు బాగా చెయ్యగలగాలి అని నోరు జారినట్టుంటా. సౌమ్య గారు చెప్పినట్టు లెక్కలు రాళ్ళు (Mathematics Rocks) అనుకోండి, కాని ఈసారి నాకు బుద్దొచ్చింది.
వచ్చే సారి బ్రహ్మదేవుడు అడిగినప్పుడు, ఏ కెనడా లోనో, స్వీడన్ లోనో, రష్యా లోనో హాకీ (అంటే ఐస్ హాకీ ) ఆటగాడిలా పుట్టాలని కోరుకుంటా. వేరే దేశాలలో పుడితే మన ఆంజనేలుసామిని, బెజవాడ దుర్గమ్మని మిస్ అవుతామనుకోండి కాని పది జన్మలకోసారి పర్వలేదు.
ఉద్యోగం రాగానే ఒ NHL ఆటకు వెళ్ళాలి. మళ్ళి సారి కెనడా వెళ్ళినప్పుడు మా చిన్నతిరుపతి Hockey Hall of Fame కి తప్పని సరిగా వెళ్ళాలి. అన్నట్టు ఎప్పటికైనా ఒ PHL జట్టుకి యాజమాన్యం వహించాలన్నది నా పెద్ద కల .

టెన్నిస్ మా మతంలో వేరే పెద్ద దేవుడు, రాఁజర్ ఫెడరర్. మా వూరి దేవత సానియమ్మ.
మిట్ట మధ్యాహ్నం ఎండలో తోడు ఎవరూ లేక పోయినా, టెన్నిస్ కోర్టులకు వెళ్ళి సర్వీస్ శాధన చేసిన రోజులూ లేక పోలేవు.

బాస్కట్‌బాల్
ఇందాక చెప్పాగా, ఫీనిక్స్ సూర్యులు రాయి (Phoenix Suns Rock). స్టీవ్ నెఁష్ గురించి చెప్పలేం, మీ అంతట మీరు చూసి అబ్బుర పడవలసిందే. ఈ సారి NBA చాంపియన్ షిప్ నెగ్గక పోతే అస్సలు బాగుండదు.
ఒకసారి నేనాడిన బాస్కట్‌బాల్ పోటిలో మా జట్టుకు బంగారు పతకం వచ్చింది. నా జీవితంలో ఆటలలో వచ్చిన ఒకే ఒక పతకం అది. నాలుగు జట్లే పాల్గోన్నాయనుకోండి.

అమెరికన్ ఫుట్‌బాల్
ఆట ఆడడానికి చెండాలంగా ఉన్నా, చూడడానికి సూపరు.
అది టాం బ్రెఁడి యెక్క పేట్రియట్స్, పెటన్ మాఁనింగ్ యెక్క కోల్ట్‌స్ తో ఆడుతుంటే చూసి తరిచాలి ఎవరైనా.
కాలేజీ ఫుట్‌బాల్ అంటారా, నేటి అమెరికా సంసృతి యొక్క అతి గొప్ప అంశం అన్నా అతిసయోక్తి కాదు. మన కాలేజి మన చిరకాల శత్రు కాలేజి తో ఆడుతుంటే ఆ మజాయే వేరు.

సాహస క్రీడలు (Adventure Sports)
వీటికి వేరే సొంత టపా అవసరం. స్కీయింగ్, సర్ఫింగ్ లాంటివి ఈ కోవకు చెందినవి. ఎప్పుడూ అడలేదు కానీ త్వరలో పాల్గోనాలని ఆశ.

మారతాన్ పరుగులు
వీటికి కూడా వేరే టాపా అవసరం. ఒక సారి బెంగుళూరులో సగం మారతాన్ పరిగెట్టా. చాలా మంచి అనుభవం, అవకాశం ఉంటే మీరు కూడా తప్పక వెళ్ళగలరు.

శీతాకాల ఒలింపిక్స్
వీటికి కూడా వేరే టపా అవసరం, వీటి గురించి ఎప్పుడో ఎక్కడో వ్రాసా.

మంచి ఆటలు వేరే ఇంకా ఉన్నాయనుకోండి కాని చెప్పల్సిన వాటన్నిటి గురించి చెప్పాసా.

2 comments:

  1. రాకేశ్వరా! రాకాన్ (rock on!)
    అవునూ మీరు ఎక్కడో అట్లాంటాలో చదువుకున్నట్టు గుర్తు, NHL, ice hockey లకి అంతలా ఎలా అభిమానులయ్యారు?

    ReplyDelete
  2. @ Post

    మీ మతానికి మా మతానికి అస్సలు పదేట్టు లేదు ;)

    SOCCER లో chelsea

    NBA --- Lakers , నేను బాస్కెట్ బాల్ కాలేజ్ తరుఫున స్టేట్ లెవల్ లో ఆడా .... సూపర్ స్పోర్ట్ ....... :)

    ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం