భాషందం, భువనందం, బ్రతుకందం

Monday, June 04, 2007

మా శ్యాంగాడి ప్రేమ

మా శ్యాంగాడు రెండేళ్ళ క్రితం ఒక అమ్మాయిని ప్రేమించాడు.
ప్రేమించాడు అంటే, ఇప్పుడు ప్రేమించట్లేదా అని అడగవచ్చు మీరు. వాడి మాటల్లో చెప్పాలంటే, ప్రేమ పుట్టడమేగాని, పోవడం ఉండదంటాడు. అలాగైతే, ఇప్పటికీ ప్రేమిస్తున్నాడా? వాడి దృష్టిలో ఐతే అవును. కాని ఆ అమ్మాయి వేరెవరితోనో పెళ్ళికి 'ఊఁ' అనేసింది. అలాంటోళ్ళను ప్రేమించి ఏం లాభం ?

కాని మన వాడు ప్రేమించినదానిని పొందలేక, పొందలేనిదానిని ప్రేమించడం మానలేక, మద్యలో గిల్‌గిల్‌గిల్ కొట్టుకోంటున్నాడు. అలాని 'జాలిపడదాం పాపం' అంటే, మనోడు వేరే చాలా మంది అమ్మాయల మీద మనసు పారేసుకున్నాడు, ఎదో హృకాపీ పేస్టు చేస్తున్నంత తేలికగా! కాని వాడిని నిల దీసి అడిగితే, వేరే ప్రేమలన్ని ఈ అమ్మాయిని మరచిపోవడానికే అంటాడు. కాని అది ఎంత వరకూ నిజమొ ఎవరికీ తెలియదు, వాడికి సైతం !

ఇంతకూ ఇవాళ ఎమైందంటే,
మనోడి పాత ప్రామ నంచి సరికొత్త ఉత్తరం వచ్చింది. ఉత్తరం తెరుస్తూనే వాడి మనసు గిల్‌గిల్‌గిల్ కొట్టుకొని ఆగింది. చూడబోతే, ఆ అమ్మాయి మనోడికి కొన్ని ఫోటోలు కూడా పంపిందండోయ్. మొన్నే ఇంగ్లాండ్‌లో విహారయాత్రకి వెళ్ళిందంట. మనోడు మొదటి రెండు చిత్రాలు చూసి మనసులో, "నాకు నువ్వున్న ఫోటో కావాలి, ఈ పురాతన కోటలు నేనేంచేసుకోను?" అనుకున్నాడు.

చూస్తే నాలుగో చిత్రంలో ఆ అమ్మాయి ఉండనే ఉంది. మనోడు దానిని చూసాడు, మనసు నీరుకారిపోయింది. హృదయం కృంగిపోయింది. పాత భావాలన్ని భూకంపంలా గుండెను కదిపివేసాయి.జీవితంలో ఎంత అందాన్ని మరియు దాని నుండి వచ్చే ఆనందాన్ని కోల్పోయానో అనుకున్నాడు. రెండు క్షణాలు, ఆత్మహత్య చాలా తీయ్యని విముక్తి ద్వారంలా అనిపించింది.

ఈ ఫోటో చూడకుండా ఉండాల్సిందే అనుకున్నాడు. కాని తనకు తెలియకుండానే, దాన్ని తెరచి, మళ్ళి చూస్తున్నాడు. ఇలా ఐతే బ్రతికుండడం కష్టం!

శ్యాంగాడు చచ్చిపోయాడు రెండేళ్ళ క్రితం, ఆ అమ్మాయిని వదులుకున్నప్పుడే! కాని వాడి ఆత్మ ఇవాళ వచ్చినట్టు తిరిగి వస్తూ ఉంటుంది. ప్రస్తుతానికి శ్యాంగాడి ఆత్మ వెళ్ళి పోయినట్టుంది! మళ్ళి సారి మైయిల్ వచ్చినప్పుడు మళ్ళీ తిరిగోస్తా! ఎమో ఎవరికి తెలుసు విధి వంకర్లు తిరిగినప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ నాకు దోరుకుతుందేమొ? ఆ అమ్మయికి కూడా నేనంటే ఇష్టమేనేమో? నా మనస్సులో ఎముందో తెలియక ఆమెంత క్షోభ అనుభవించి, చివరకు ఆశ వదులుకుందో? ఎం జరిగుతుందో ఎవరికి తెలిసు. ఆశ ఉన్నంత వరకూ, అంటే ఎప్పటికీ, నేను ఇక్కడే నీ అంతరంగాల్లోనే తిరుగుతూ ఉంటా...

త.రా. : ఈ కధలో వ్యక్తులు, ఆత్మలు, ఆల్టర్ఈగోలు, మనోభావాలు, ఉత్తరాలు, చిత్రాలు కేవలం కల్పితాలు మాత్రమే. మీ లేదా నా జీవితానికి పోలిక ఉండడం, కేవలం కాకతాళీయం మాత్రమే!

6 comments:

  1. Oi, achei teu blog pelo google tá bem interessante gostei desse post. Quando der dá uma passada pelo meu blog, é sobre camisetas personalizadas, mostra passo a passo como criar uma camiseta personalizada bem maneira. Até mais.

    ReplyDelete
  2. మీలో రచయిత నిద్రలేచాడు బ్రదర్! "విధి వంకర్లు తిరిగినప్పుడు"... హహ్హహ్హ! నిజంగానే, ఒకసారి అలా పడ్డామంటే 'అందని ద్రాక్ష పుల్లన' అనుకొని మనసును మూసెయ్యటం అసాధ్యం. ఇంపాసిబులంత అసాధ్యమన్నమాట.

    ReplyDelete
  3. హ హా...భలే వుంది ఈ కధ.ఆత్మలు,ఉత్తరాలు...బాగా చెప్పారు.

    ReplyDelete
  4. చాల బాగుంది. మీ కధ. గీతాంజలి-2 సినిమా చుసినట్టు అనిపించింది చదువుతున్న కాశేపును.

    ReplyDelete
  5. It happens often that we keep waiting for the right time to express our feeling for someone,
    but the right time may have passed long time ago or maybe there was no right time ever.

    ReplyDelete
  6. katha meede anukuntaa!!, anubavistey kaani telidu konni feelings maree deep gaa!
    :- )

    good post!

    ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం