భాషందం, భువనందం, బ్రతుకందం

Wednesday, November 18, 2009

'మాడ'ష్టీ - నిజమా? కలా?

మాడష్టీ అనే మాడు పదం నన్ను చాలా టీజు చేసింది అనడం ఏ మాత్రం హైపరుబోల్ కాదు.

అసులు ఏంటి ఈ మాడష్టీ అనేది? ఎలా వుంటుంది? సంతలో అమ్ముతారా? ష్టాకు మార్కెట్టులో అమ్ముతారా? కొనవచ్చా కొనలేమా? నీలా వుందా నాలా వుందా? నీలో వుందా నాలో వుందా? నిజమా? కలా?తలచుకుంటే మాడ పేలిపోతుండి కృష్ణా!

అసలు అందం అంటే ఏఁవిటి? అద'లది' నిజమా కలా? నీలో వుందా నాలో వుందా?
'తెల్ల'వాళ్ళు తేల్చి చెప్పారు, బ్యూటీ వుండి బిహోల్డరు కళ్ళలోనని.
'మన'వాళ్ళు కూడా తేల్చి చెప్పేవుంటారు, కానీ నాకు సంస్కృత శ్లోకాలు పెద్దగా గుర్తుండవు, పెద్దగా గుర్తులేవూ కాబట్టి, ఇప్పుడేమీ ఉదహరించలేను కానీ.. నాకైతే మనవాళ్ళు ‘లోకోః భిన్నాభిప్రాయః’ అని ఉద్బోధించివుంటారని అనిపిస్తుంది.


* * *

గరికపాటి నరసింహారావు గారు చెప్పడం ప్రకారమైతే ప్రపంచం నీలోవుంది, నువ్వు దాన్ని ఎలా చూస్తే అలా వుందని వ్యాసుడు, ఓషో, రవిశంకర్ గురుజీ అన్నారఁట. ఆయనైతే దానికి సంస్కృత శ్లోకాలు కూడా చెబుతారు.

ఓషో అంటే గుర్తుకువచ్చింది. ఓషో అంటే గుర్తుకు వచ్చేది సామాన్య ప్రజానీకానికి విచ్ఛలవిడి శృంగార వైభోగాలఁట. మొన్ననే తెలిసివచ్చింది. ఎవరినో భగవాన్ రజనీశ్ తెలుసా అంటే, అతనా నగ్నాశ్రమాన్ని పెట్టాడంటగా అన్నారు. వెల్.. అవన్నీ నాకు తెలియదు గానీ, ఓషో కొన్ని మంచి పాయింటులు లేవనెత్తాడని నా నమ్మకం - ఆయన గుఱించి తెలిసిన కూస్తా కాస్తాలో. మాంచి పాయింటులు లేవనెత్తే ఎవరికైనా మంచి కాలం కలసిరావడం తప్పనిసరి కాదని చాలా మంది అభిప్రాయం.

అభిప్రాయమంటే గుర్తుకువచ్చింది.
ఓషో మీద మీకో అభిప్రాయం వుంటే, అది ఓషో గుఱించి కంటే, మీ గుఱించే ఎక్కువ చెబుతుందఁట.
అంటే ఒకరికి ఓషోలో మహా గొప్ప తత్త్వవేత్త కనబడితే, మఱి కొందఱికి ఆయన మంచి పాయింటులు లేవనెత్తాడని అనిపిస్తే, ఇంకొందఱికి ఆయన బూతుని మతం చేసి సొమ్ము చేసుకున్న ఠక్కరి అనిపించవచ్చు, ఇంకొందరికి దేశ బహిష్కరణ చేయవలసివచ్చేటంతటి తీవ్రవాది అనిపించవచ్చు (అమెరికా ప్రభుత్వం లాగ).

ఇంత మందికి ఇన్ని విభిన్న అభిప్రాయాలున్న వారిమీద అభిప్రాయం ఎవరి గుఱించి ఎక్కువ సమాచారం ఇస్తుందన్నది ఇప్పటికే తెలియవస్తుందనుకుంట.

శివోఽహం

ఓషో లాంటోడే శివుఁడు. ఓషో ప్రకారం ఆయనే శివుఁడు. (ఇక్కడ కూడా ఎవరి అభిప్రాయాలు వారివి).

శివుఁడి మీద కూడా ఎవరి అభిప్రాయాలు వారివి. లోకంలో చూడబోతే అన్నిటి మీదా భిన్నాభిప్రాయాలు వున్నట్టు కనబడుతుంది. భిన్నాభిప్రాయాలు వుండడం మీద తప్ప. మార్పు దక్క అన్నీ మారతాయిఁట. దానీ తస్సాగొయ్య. అలాగే భిన్నాభిప్రాయం మీద దక్క అన్నిటిఁ మీదా లోకులకు భిన్నాభిప్రాయాలుఁట.

శివుణ్ణినేనే అన్నదాని మీద కూడా భిన్నాభిప్రాయాలు. నేనేశివుణ్ణి అన్నదాని మీద కూడా భిన్నాభిప్రాయాలు. ఈ భిన్నాభిప్రాయల ప్రపంచంలో, చెడు అభిప్రాయాల బాధ్యత ఎవరు వహించాలి? అభిప్రాయం మోసేవాడిదా, దానికి ఆధారమైన వాడిదా, లేదా ప్రభుత్వానిదా?

* * *

గొప్పవారందరికీ ఇదే చిక్కువుంటుంది. ఉదా- శివుఁడు, ఓషో, రాజశేఖర రెడ్డి, కత్తి మహేశ్ కుమార్.

శివుఁడు గుఱించి మనకైతే పర్వాలేదు మంచి అభిప్రాయం వుంది గాని. పాశ్చాత్య దేశాల్లో ఆయని గ్రాండ్ కాంసెప్టుని వారు అర్థంచేసుకోలేకపోతున్నారు. అతనిని నకారాత్మక భావాలతో అసోసియేట్ చేస్తున్నారు.

ఓషో గుఱించి చెప్పనక్కఱలేదు.

రాజశేఖర రెడ్డి అంటారా, పోయినోళ్ళు అందరూ మంచివాళ్లు అని మనం గుర్తు పెట్టుకుందాం, లేకపోతే భిన్నాభిప్రాయాల వరద రావచ్చు. ఈయన పోయినప్పుడు ఈనాడు వాడిలా నేనూ ఎంతో కలతచెందాను గానీ, (నేను వార్తలకై నమ్ముకున్న ఏకైక స్రవంతి అది! ) అంతకు ముందు నాకు ఈయన పద్ధతులు పెద్దగా నచ్చేవి కావు, ఖజానా కాళీ చేసే తత్త్వం అని నా నమ్మకం. కానీ నిన్ననే ఒకతను రాజానగరం నుండి మావూరొచ్చి, “రాజశేఖర రెడ్డి వుంటే ఈ పాటికి చేలు కలకలలాడతావుండేవండి, ఇలా వుండేయేటండి అసలు” అన్నాడు. లోకోః భిన్నాభిప్రాయః అనుకొని సరిపెట్టుకున్నాను నేను.

* * *

అలానే ఇప్పుడు కత్తిగారి సంగతికి వద్దాము.

ఈయననే ఎందకు ఎంచుకున్నానంటే, అందరికీ తెలిసిన పేరు, పేరు వాడుకున్నా తప్పుగా భావించని విశాలహృదయుడు. ఇతర ప్రముఖ బ్లాగర్లు వివాధాలలో చిక్కుకున్నా, వాటిని గుఱించి సరిగా తెలియక ఈయనని ఎంచుకోవడం జరిగింది (ఈనాడు ఆ కథనాలను ప్రచురించినగాని, వాటిని నేను చదవుట జరుగలేదు).

ఈయనని గుఱించి చాలా మంది బ్లాగర్లను అడిగాను. వారిలో చాలా మంది, పెద్ద అన్నీ ఆయనకే తెలిసినట్టు వ్రాస్తాడు, అందుకే నాకు నచ్చుతుంది/నచ్చదు అంటారు. అదే తత్త్వం కొందఱికి నచ్చడం కొందరికి నచ్చకపోవడం జరుగుతుందే! ఈ విషయం నాకెప్పుడూ అర్థంకాదు. అంటే ఈయనకు మాడెష్టీ లేనట్టా? అసలు ఏంటి ఈ మాడష్టీ?

నేను ఒక అభిప్రాయం వ్రాసాననుకోండి. ఉదా- "హిట్లరు చేసింది ఏమంత పెద్ద తప్పుకాదు, అతను ప్రేరేపించబడ్డాడు, ఒక దేశ ప్రజ అతనికి వత్తాసు పలికింది"... దానికి నేను ఈరెంటిలో ఏదైనా జతచేయవచ్చుఁ
(చాయిస్ ఎ) దీనిని మీరు అంగీకరించకపోతే మీరు మూర్ఖులు
(చాయిస్ బి) ఇది నా అభిప్రాయం మాత్రమే.

ఇప్పుడు చాయిస్ ఎ ఉంచితే అతనికి మాడష్టీ లేనట్టు, చాయిస్ బి వుంచితే అతను మాడెష్టోడూ అని అర్థమా? ఇక్కడి అసలు విషయం హిట్లరుని మంచి వాడు అనడం (నా సహవాసి ఒకడు నిజంగా హిట్లరు గుఱించి అన్నమాటలవి) అలా అన్నవాడు మాడెష్టోడు అయితేనేం కాకపోతేనేం?

* * *

నేను ఒక టపా వ్రాసాను. ఆ మాటకు వస్తే, ఎవరైనా ఏదైనా టపా వ్రాసారు, దాని క్రిందఁ, “ఇది నా అభిప్రాయం మాత్రమే”, అని పెడితే వాడు మాడెష్టోడు లేదా కన్విక్షణులేనోడూ అని అనాలా?ఎవరైనా వ్రాసేవి వారి అభిప్రాయాలేగా, నేను మీ అభిప్రాయాలూ, మీరు నా అభిప్రాయాలూ వ్రాయముగా?

పోనీ అభిప్రాయాలతోఁబాటూ నేను ఉదాహరణలూ, పలువురి పెద్దల అభిప్రాయాలు కూడా ఊటంకించాననుకోండి. అవి కూడా 'నా' దృష్టిలో మంచి అభిప్రాయాలు, 'నా' దృష్టిలో మంచి ఉదాహరణలే అవుతాయి గానీ, మీ దృష్టిలో కాకపోవచ్చునుగా. ఇది నా అభిప్రాయం మాత్రమే అన్న ఉత్త పుణ్యానికి అతని మీద సదాభిప్రాయం ఏర్పరచుకోవచ్చా. ఆ మాత్రం దానికి నేను నా బ్లాగు శీర్షికని నా అభిప్రాయం మాత్రమే అని మార్చి ఏదైనా వ్రాయవచ్చాఁ అని.

* * *

నాణానికి ఇంకో ప్రక్క చూద్దాం. నా స్వానుభావంలో ఏం జరిగిందంటే, నన్ను వివిధ పర్యాయాలు చాలా మాడెష్టోడు అబ్బే అస్సలు చాలా ప్రౌడెష్టోడు అనీ అన్నరు. రెండు సార్లూ నేను చాలా ఖంగుతిన్నాను. ఏదీ నా నెత్తి మీదఁ వ్రాసుందా, ప్రొద్దుట అద్దం చూసుకోవడం మరచానే అనుకునేవాడిని.

అసలు చెప్పాలంటే నేను చాలా గొప్పోణ్ణి. (ఇది పూర్తి నిజం కాదు, ఎందుకంటే నేను అసలుకి చాలా చాలా గొప్పోణ్ణి అంటారు అందరూ).
ఇప్పుడు పై మాటన్నాక నేను మాడెష్టోడినా కాదా? చాలా చాలా గొప్పవాడినైన నేను, ఉత్త గొప్పోణ్ణి అన్నందుకు మాడెష్టోడి నౌతాను, లేదు నా గొప్పని నేను చెప్పుకోవడం అమాడెష్టత్వం అవుతుందా. అంతెందుకు అమెరికాలో జాబింటర్వూకి వెళ్ళి నేనూ మీరూ మన భారతీయ సాంప్రదాయ మాడెష్టత్వం చూపితే వాడు మనకి మహాద్వారం చూపిస్తాడు.

* * *

ఇప్పుడు మాడెష్టిత్వంతో వచ్చిన ఇంకో చిక్కు. మాడెష్టత్వం మంచి లక్షణం అయినప్పుడు నేను మాడెష్టు అని చెప్పుకోవడం అమాడెష్టిత్వం అవుతుందా? అనడం ప్రక్కన పెట్టండి, ప్రదర్శిస్తే?

"నేను గొప్పవాడిని, కానీ నేను మాడెష్టువాడిని కాను". సరేఁ, బాగుంది, మాడెష్టు కాదని మాడెష్టుగా చెప్పుకున్నాడు బాగుంది వీడి పద్ధతి.

* * *

మొత్తానికి మిమ్మల్ని మాడెష్టు అని కొందరు. గర్విష్టు అని ఇతరులూ నంటే, అది వారిలోనే వుందని పిస్తుంది. మిమ్మల్ని మాడెష్టు అనడం వారి మాడెష్టీ, మిమ్మల్ని గర్విష్టు అనడం వారి గర్విష్టీ!

అంతెందుకు మీరు గొప్ప అన్నభావం వారిలో లేనప్పుడు మీరు గొప్పలు చెప్పుకుంటున్నారని వారికి ఎలా అనిపిస్తుంది? నేను , అంటే అహం, అంటే శివుఁడు, అంటే బ్రహ్మ, గొప్ప వాడినని మీకు తెలుసు కానీ మీరు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు, అందుకే మీకు కోపం వస్తుంది.

* * *

ఉదా – గీతలో కృష్ణుడు (కొందరి అభిప్రాయంలో భగవంతుడు), "నేను" అనడానికీ "భగవంతుడు" అనడానికీ పెద్ద తేడా చూపించడు, ఛందస్సులో ఏం సరిపోతే అది వాడుతుంటాడు అనిపిస్తుంది. ఇది చూసి నన్నో గూదోడు (మా తమ్ముడౌతాడు వరసకు కాబట్టి అభిప్రాయాలు జాగ్రత్త) "భగవద్గీతలో కృష్ణుడు డబ్బాకొట్టుకున్నట్టుంటుంది" అని అన్నాడు.
వెల్.. దాని పేరే అది కదా మరి భగవత్ గీత (జస్త్వసంధి షష్టీతత్పురుష సమాసం). చెప్పేవాడు భగవంతుడు కాబట్టి, కృష్ణుని ‘డబ్బా’నే అవుతుంది?

కృష్ణుడు అలా నేను అంటే భగవంతుడు అనకపోతే ఇక భగవద్గీతకు విలువేంటి?
కృష్ణుడు బోధించేది మనలోని బ్రహ్మతత్త్వాన్ని వెదికితీయమని.
ఆయనే "అబ్బే లేదండి నాదేఁవుంది, ఎదో రథం నుడుపుకునే అనస్కిల్డు లేబరుని" అని మాడెష్టీ చూపితే, ఇక బ్రహ్మత్వానికి ఆధారం ఏది?
కాలః కలయతామ్’అహం’ అనక పోతే అది అద్వైతం ఎలా అవుతుంది ?

కాబట్టి నేను శివుణ్ణి మహేశ్వరుణ్ణి నేను ఎంత డబ్బా కొట్టుకున్నా అది తక్కువే. మీరూ అలానే భావించండి.
"అతడంతే అంతా అతడికే తెలిసినట్టు చెబుతాడు" అని కృష్ణుణ్ణి కూడా విమర్శించేవుంటారు పురజనులు. తత్త్వం తెలియని వారి వ్యాఖ్యల గుఱించి జంకవద్దు! మీలో శివత్వాన్ని చూడనప్పడు ప్రక్కవాడిలో ఎలా చూడగలరు?

* * *

ఇవి ఈ ముదనష్టపు మాడెష్టీ తెచ్చిన చిక్కులు. ఒకటా రెండా!

11 comments:

 1. modesty lo intha vundani ippude telisindandi.

  ReplyDelete
 2. కొంతమంది బ్లాగర్లతో నేనీ బాధలు పడ్డాను.
  నేను మాడస్టీగా ఉండాలని వాళ్ళు పొగరుగా చెబుతారు. హి.హి..హీ...
  I don't care them.
  చాల బాగా వ్రాసారు - అభినందనలు !

  ReplyDelete
 3. you are too modest to talk about you Sir.. ;-)

  ReplyDelete
 4. మీరు రాముడు, పౌండ్రక వాసుదేవుల గురించి మర్చిపోయినట్టున్నారు.
  మాడస్టీ ఉన్నంత మాత్రాన దేవుడు కాకుండా పోడు, అమాడస్టీ ఉన్నంత మాత్రాన దేవుడూ అయిపోడు! అసలు కిటుకు వేరే చోట ఉంది.

  ReplyDelete
 5. సంపూర్ణంగా తెలిస్తేనే మాట్లాడాలి అంటే భూప్రపంచంలోని ఏ మనిషీ ఏ విషయం గురించీ మాట్లాడలేడు.ఎప్పటికప్పుడు మనకు తెలిసిన జ్ఞానాన్ని moment of truth గా నమ్మకపోతే అభిప్రాయాలు ఏర్పడవు,కార్యోన్ముఖులం కాలేము.

  నేను రాసిన విషయాల్ని ఆక్షణంలో బలంగా నమ్ముతాను.అందుకే నా భావాలు కొందరికి "అంతా అతడికే తెలిసినట్టు చెబుతాడు" అనిపిస్తే అది నిజం మాత్రమే. అందులో నేను భాధపడటానికి వాళ్ళు నొచ్చుకోవటానికీ ఏమీ లేదు.

  ReplyDelete
 6. ఈ మోడెస్టీ గురించి పూర్తిగా అర్ధం అవ్వలేదు కానీ, అతి పొగడ్తలు, అతి విమర్శలు ఖచ్చితంగా చెడగొడతాయి. ఆ రెంటినీ పట్టించుకోకుండా ఉన్నారంటే గొప్పే.

  ReplyDelete
 7. @మహేష్: Moment of Truth అంటే అర్ధం వేరనుకుంటాను. మీ భావం Turth of the moment అనుకుంటున్నాను. ఇంతకీ ఏ అభిప్రాయమూ ఏర్పరరుచుకోకుండా కార్యాన్ముఖులం కాలేమా!?

  ReplyDelete
 8. @రేరాజు: నిజమే...its truth of the moment NOT moment of truth.

  నమ్మకాలూ,అభిప్రాయాలూ లేకుండా పనులుచెయ్యాలంటే మనస్ఫూర్తిగా ఖచ్చితంగా చెయ్యలేము. అందుకే చాలా మంది ఉద్యోగాలు అనుభవించి కాకుండా, తూతూమంత్రంగా చేస్తారు.మనసుపెట్టి పనిచెయ్యాలంటే మాత్రం కనీసం ఆక్షణంలోనైనా మనం దాన్ని నమ్మిఅభిప్రాయాలు ఏర్పరుచుకోవాలి.

  ReplyDelete
 9. The problem is, everyone thinks the same :-)

  ReplyDelete
 10. తుప్పూడగొట్టావుగా!
  నిరంతర అమాడెష్టీ ప్రాప్తిరస్తు!!

  ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం