భాషందం, భువనందం, బ్రతుకందం

Monday, June 11, 2007

బిల్లు మాఁవ పాసైపోయాడండోయ్ ...

మనూరి తలుపుల బిల్లయ్య మామ ఆఖరికి హార్వార్డు నుండి పట్టా పొందనే పొందాడు.

నేను ఇప్పుడే MSN లో బిల్ గేట్స్ కి హార్వార్డు ఆనరరీ పట్టా ఇవ్వడం గురించి చదివాను.
ఆయన యువతరానికి ఇచ్చిన సలహా, మార్గదర్శకత్వం నాకు చాలాబాగా నచ్చాయి.

ఎవరైనా అంత లక్షీతనయునుడు అంతటి సరస్వతీతనయులకు ఏమి చెబుతాడని ఊహిస్తాం ?
బాగా డబ్బులెలా సంపాదిచాలా అని కదా ?
ఊహుం,
అతను ప్రపంచ జనాలకి సేవ చేయమని చెప్పాడు !
డబ్బు ఎక్కువ్వయ్యే సరికి జగత్తులోని అసలు నిజం (సోషలిజం) తెలిసొస్తుంది!
నాకైతే అయని మాటలు విన్నాక డబ్బు మీద ఆశ అమితంగా తగ్గిపోయింది.
ఇంకతూ ఎఁవన్నారో ఇక్కడ చదవండి.

"When you consider what those of us here ... have been given - in talent, privilege, and opportunity - there is almost no limit to what the world has a right to expect from us,"
ఎగ్‌జాక్‌ట్‌లీ మై సెంటిమెంట్స్ మాఁవా. వందనం బిల్లు మాఁవ అభివందనం.

అందరూ శిఖరాన్ని అధిరోహించడానికి ప్రయత్నిస్తుంటారు గాని, పర్వతశిఖరాన్ని అదిరోహించిన తరువాత, భూమికి ఎంత దూరమయ్యామో అన్న బాధ ఒంటరితనం మాత్రమే మిగులుతాయనుకుంట!

1 comment:

  1. సంపాదించగలిగే శక్తి ఉండి సంపాదించకపోతే స్వార్ధపరునివనిపించుకుంటావు రాకేశ్వరా!! మీరు మంచివారైతే ఆ ధనంతో లోకానికి సేవచేస్తారు కదా. అదే బిల్ గేట్స్ నాకిది చాలని అనుకుని ఉంటే ఆఫికాలో మలేరియా, ఎయిడ్స్ వంటి వాటిని పోరాడటానికి ఎవరు ముందుకు వచ్చేవాళ్లు. లేమితో బతకడానికి శీలం కావాలి. కలిమితో బతకడానికి ఇంకా పెద్ద శీలం కావాలి. డబ్బు రక్తం లాంటిది మన శరీరానికి చాలా అవసరం. అలా అని రక్తం తయారు చెయ్యటానికి ఎవరూ బతకడం లేదు కదా? ఆశ ఎల్లవేళల మంచిది వ్యామోహం చెడ్డది. డబ్బు సంపాదించాలనుకోవటం చాలా మంచి ఆశ. ఆ సంపాదించటానికి బ్యాంకుకైనా కన్నమేస్తాననటం వ్యామోహం. ఇక నా సుత్తి ఇంతటితో ఆపేస్తా.

    ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం