తెలుగు వికీ ౩౦,౦౦౦ వేల వ్యాస పండుగను వికీపీడియన్లందరూ ఘనంగా జరుపుకుంటున్నారు. అభినందనలు...
ఈ సందర్భం లో ఒక చిన్న ఆట, ఆ ఆట నుండి తెవికీ అసలు సత్తా.
తెలుగు వికీ కి వెళ్ళి పక్క బారులో , యాదృచ్ఛిక పేజీ లంకె ఒత్తండి
మీకు ఖచ్చితంగా ఒక వూరి పేజీ వస్తుంది. మళ్ళీ అదే చోట నొక్కండి , ఇంకో వూరి పేజీ వస్తుంది.
అలా కొంత సేపు చెయ్యండి. మీకు ఊళ్ళ పేజీలు, సినిమాల పేజీలు, ఇతర మొలకలు రానంత వరకూ కొనసాగించండి. మీకు ఎన్ని క్లిక్కుల తరువాత ఒక 'మంచి వ్యాసం' (బాటు చేత నిర్మింపబడ్డ మొలక కానిది) వస్తే మీ స్కోరు అంతనమాట..
నేనిప్పుడే ఆడాను, నాకు ౩౭ వొత్తుల(క్లిక్కుల) తరువాత త్రిమతాలు వ్యాసం వచ్చింది. చాలా మంచి వ్యాసం, మీరు కూడా చదవాలి.
ఈ ప్రక్రియని ఒక మార్కావ్ ప్రాసెస్ గా పరిగణించవచ్చు. అలా పరిగణించి తెవికీ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. (మీకు లెక్కలు రాకపోతే ఇంజనీరింగ్ చదివే మీ అబ్బాయిని సంప్రదించండి, లేక నా మాట నమ్మి తిన్నగా లెక్కల తరువాతి సంగ్రహభాగానికి వెళ్ళండి)
గణితం
ముందుగా తెలుగు అంకెలు ,
౧౨౩౪౫౬౭౮౯౦ = 1234567890
తెవికిలో మొత్తం వ్యాసాల సంఖ్య = మొ
అందులో మంచి వ్యాసాల సంఖ్య = మం
కాబట్టి మీకు మంచి వ్యాసం వచ్చే అవకాశం,
ఞ = మం/మొ
చెడ్డ వ్యాసం వచ్చే అవకాశం
ఙ = (మొ - మం)/ మొ = ౧ – మం/మొ
కాబట్టి ,
ఞ + ఙ = ౧
మీకు మొదటి ఒత్తుడు లోనే మంచి వ్యాసం రావడానికి అవకాశం
అవకాశం(౧) = ఞ
అలానే రెండు ఒత్తులలో మంచి వ్యాసం రావడానికి అవకాశం
అ(౨) = (౧ – ఞ) ఞ = ఙ * ఞ
అలానే, ౩, ౪, ౫ .... ఒత్తులలో
అ(౩) = (౧ – ఞ) * (౧ – ఞ) * ఞ = ఙ౨ * ఞ
అ(౪) = (౧ – ఞ)౩ ఞ = ఙ౩ * ఞ
అ(౫) = (౧ – ఞ)౪ ఞ = ఙ౪ * ఞ
:
:
అ(న) = (౧ – ఞ)న-౧ ఞ = ఙన-౧ * ఞ , ( నవొవ ఒత్తులో మంచి వ్యాసం వచ్చే అవకాసం )
గుర్తుపెట్టుకోండి ఞ మంచి వ్యాసం వచ్చే అవకాశం, ఙ చెడ్డ వ్యాసం వచ్చే అవకాశం.
(ఇక్కడ శ్ర అంటే ఆంగ్ల గణితంలో Sigma అన్నమట, ఇది కూడికకు చిహ్నం)
(మరియు, డి/డిఙ derivative w.r.to ఙ )
(మరియు ౧ = 1)
అపేక్ష (న) = శ్ర(ణ = 0, అనంతం) ణ * అ(ణ)
అపేక్ష (న) = శ్ర(ణ = 0, అనంతం) ణ * ఙణ-౧ * ఞ
అపేక్ష (న) = ఞ * ( శ్ర(ణ = 0, అనంతం) ణ * ఙణ-౧ )
అపేక్ష (న) = ఞ * ( శ్ర(ణ = 0, అనంతం) డి/డిఙ ఙణ-౧ )
అపేక్ష (న) = ఞ * డి/డిఙ ( శ్ర(ణ = 0, అనంతం) ఙణ )
అపేక్ష (న) = ఞ * డి/డిఙ ( ౧ / (౧ - ఙ) )
అపేక్ష (న) = ఞ * (-౧) * (౧ - ఙ)-2 * (-౧)
అపేక్ష (న) = ఞ / ఞ2
అపేక్ష (న) = ౧ / ఞ
అపేక్ష (న) = మొత్తం / మంచి
సంగ్రహం:
కాబట్టి మీకు న వొవ వొత్తులో మంచి వ్యాసం వచ్చిందంటే , సగటున న వ్యాసాలకి ఒక మంచి వ్యాసం ఉన్నట్టు.
నేనిప్పుడే ఈ ఆట ఆడి చూసాను, నాకు ౩౭ ఒత్తుల తరువాత ఒక మంచి వ్యాసం వచ్చింది. కాబట్టి మన మొదటి అంచనా ప్రతి ముప్పై ఏడు వ్యాసాలకు ఒక మంచి వ్యాసం ఉందని అర్థం !
అంటే మెదటి అంచనా తెవికీ లో మొత్తం
౩౦,౦౦౦ / ౩౭ = ౮౧౦ మంచి వ్యాసాలున్నాయన మాట...
వచ్చినప్రయత్నం అపేక్ష(న) = శ్ర(౧, ప్రయత్నాలు) వచ్చినప్రయత్నం (న)
వచ్చినప్రయత్నం అపేక్ష(న) = అపేక్ష(న) ప్రయత్నం -> అనంతం
వచ్చినప్రయత్నం అపేక్ష(న) - అపేక్ష(న) = ఢం
సంభావనలు
౧) తెవికీ లో వ్యాసాల సంఖ్య ఈ ప్రయేగం జరిగేంత కాలం నికరంగా ఉంటుంది.
౨) ఈ ప్రయేగం జరిగేంత కాలం చెడు వ్యాసాలు మంచివిగా మారవు
౩) వ్యాసాలలో రెండు రాకాలు మాత్రమే, మంచీ చెడూ
౪) ఞ విలువ తక్కువకావడం వలన తక్కవ ప్రయత్నాలలోనే ఉత్తమమైన ఫలితాలు పొందవచ్చు.
విన్నపం
తెవికీ చాలా ఉత్తమమైన కార్యము. దానిలో (౩౦,౦౦౦ * ఙ) వ్యాసాలు ఈనాడు మొలకలైనా ఏనాటికైనా మహా వృక్షాలవుతాయి. ఆనాడు తెవికీ కల్పవనం అవుతుంది. ఈ టపాని ఒక స్వేతపత్రంలా స్వీకరించాలని మనవి. దేశవికీలలో తెవికీ లెస్సయ్యినా, దానికి మీ అవసరం ఇంకా చాలా ఉందని తెలుపడం ఈ టపా ముఖ్యోద్ధేశం.
నాకు ౧౦వ క్లిక్కుకి హనుమంతుడు వచ్చింది. నాకు కూడా ఇలాంటి గణణ ఒకటి చేయాలని ఉండేది. అందుకే కొన్ని రోజుల క్రితం సినిమా వ్యాసాలు మరికొన్ని చరిత్రకు సంబందించిన వ్యాసాలతో కొన్ని గణాంకాలు ఉన్న ఒక పెట్టె తయారు చేసాను. అందులో చూస్తే మీకు మొలకలు కాని వ్యాసాలు ఎన్నో ఒక అవగాహన వస్తుంది. తెవికీలో ప్రస్తుతం ఉన్న మొలకలు మంచి వ్యాసాలుగా మారటానికి ఇంకో 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువే పడుతుందని నా ఊహ.
ReplyDeleteతెవికీలో ప్రస్తుతం ఉన్న 2626 మంది సభ్యులలో సుమారు 50-60 మంది మాత్రమే 50 కంటే ఎక్కువ దిద్దుబాట్లు చేసి ఉంటారు. వీరిలో కూడా చాలామంది ప్రస్తుతం ఎటువంటి దిద్దుబాట్లు చేయటం లేదు. ఈ లెక్క ప్రకారం ప్రస్తుతం తెవికీలో ఉన్న వ్యాసాలన్నిటినీ ప్రస్తుతం దిద్దుబాట్లు చేస్తున్న సభ్యులు నిర్వహించాలంటే ఒక్కొక్క సభ్యుడు 600 కంటే ఎక్కువ పేజీలను నిర్వహించాలి. ఇది జరిగే పనేనా?
మీ లెక్కల ప్రకారం తెవికీలో యాదృచ్చిక పేజీపై ప్రతీ క్లిక్కుకీ మంచి వ్యాసం వచ్చే రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను.
రాక్ చేశావు బ్రదరూ! నిజమే అందుకే నేను కొత్త వ్యాసాల జోలికి పోకుండా ఉన్న వ్యాసాల మీద పడ్డాను!! ఈ మధ్య వికీపీడియాలో తిరుగుతున్నప్పటి నుండీ తెలివి బాగా పెరుగుతున్నట్లనిపిస్తుంది!!!
ReplyDeleteమరిన్ని గణాంకాలు:
ReplyDelete* 1,650 వ్యాసాలు కనీసం 10 లేదా అంతకంటే ఎక్కువ మార్పులు కలిగి ఉన్నాయి.
* 3,967 వ్యాసాలు 5 లేదా అంతకంటే ఎక్కువ మార్పులు కలిగి ఉన్నాయి.
* 2,397 వ్యాసాలు 2 KB లేదా అంతకంటే ఎక్కువ పరిమాణం కలిగి ఉన్నాయి.
* 3,978 వ్యాసాలు 1 KB లేదా అంతకంటే ఎక్కువ పరిమాణం కలిగి ఉన్నాయి.
ReplyDeleteమంచి అధ్యయనం. తెలుగు అంకెలు కాస్త చదవటానికి కష్టపెడుతున్నాయి కానీ కాస్త ఓపిగ్గా మళ్లీ చదువుతా. మీ అధ్యయనం నా అంచనాలకు దగ్గరగా ఉంది. మీరు ఈ వ్యాసాన్ని అనుమతిస్తే వికీపీడియాలోనే పెట్టాలని నా కోరిక.. అంతెందుకు మీరే వికీపీడియా నేంస్పేసులో పెట్టండి. తెవికీలో 60% మొలకలున్నాయి. వాటిలో మంచి వ్యాసాలు మునిగిపోకుండా గుర్తించి త్వరలోనే యాధృచ్చిక పేజీ లింకు పైనే మంచి వ్యాసాల లింకును పెట్టాలని నా ఆలోచన.
ReplyDeleteఓ ఇంకో విషయం! ప్రతి క్లిక్కుకూ మంచి వ్యాసం వికీపీడియాలో ఎన్నటికీ రాదు.. అది వికీ నైజం. కొత్త వ్యాసాలను సృష్టించటంపై పూర్తి నిషేధం విధించి ఉన్న వ్యాసాల మీద కృషి చేస్తే తప్ప. అలాంటి నిషేదాలు వికీ సంస్కృతికే విరుద్ధం. ఆంగ్ల వికీలో 35% దాకా మొలకలున్నాయి. 70% క్లిక్కుల్లో మంచి వ్యాసాం వస్తే మనం అద్భుత కృషి చేసినట్లే.
ReplyDeleteమీ బ్లాగు చూసి మళ్ళి నాకు డోకు వచ్చింది. నాకెలాగు తెలుసు తొలగించేస్తారమి.కాని ఉన్న విషయం రాయకుందా ఉండలేక పోయాను.. మాటలబాబు
ReplyDeleteమీ బ్లాగు చూసి మళ్ళి నాకు డోకు వచ్చింది. నాకెలాగు తెలుసు తొలగించేస్తారమి.కాని ఉన్న విషయం రాయకుందా ఉండలేక పోయాను.. మాటలబాబు
ReplyDeleteమీరు మంచి వ్యాసంగా ఎలాంటి వ్యాసాన్ని పరిగణించారో కొంచెం వివరంగా రాయండి. అప్పుడు అడే పద్ధతిలో నేనూ ప్రయత్నిస్తాను.
ReplyDeleteఇక్కడ ఇంకొక సంభావన కూడా పరిగణలోకి తీసుకోవాలి. అదేంటంటే యాధృచ్చిక పేజీ నిజంగానే యాధృచ్చికమని. ఖచ్చితంగా అధ్యనము చెయ్యలేదు కానీ ప్రారంభ పేజీని బట్టి యాధృచ్చికంగా ఎలాంటి వ్యాసాలు వచ్చేది కొంత వరకు అధారపడే అవకాశముందని కొన్ని వేల సార్లు యాధృచ్చిక పేజీని నొక్కిన అనుభముతో నాకనిపించింది (నిజమో కాదో) అందుకే ఈ పరీక్షను ప్రతిసారి మొదటి పేజీ నుండే ప్రారంభించాలి.
నేను మొదటి పేజీ నుండి బయలు దేరి 56 క్లిక్కుల్లో వి.వి.గిరి వ్యాసానికి, మరొక ప్రయత్నములో 22 క్లిక్కులకు కె.వి.రంగారెడ్డి వ్యాసానికి చేరాను!
కొంతకాలం క్రితం ఇదే తరహాలో కొంచెం భిన్నగా ఆంగ్ల వికీలో కొన్ని పరీక్షలు చేసినట్టు గుర్తు. అదేంటంటే ఒక 400, 500 సార్లు యాధృచ్చిక పేజీ నొక్కి వివిధ తరగతులలో ఎన్నెన్ని వ్యాసాలు వచ్చాయో రాసుకొవటం. ఉదాహరణకి 300 గ్రామాల పేజీలు, 100 సినిమా పేజీలు, 50 ఇతర మొలకలు అలా..అలా..
@ మాటలబాబు
ReplyDeleteమాటలబాబు అని పేరు పెట్టుకున్నందుకు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడడమేనా :)
మీరు సమయం వెచ్చించి రెండు సార్లు వ్యాఖ్యానించారు, నేను సంస్కారవంతుణ్ణి విశాల దృక్పదం కలవాడినీ కాబట్టి మీ వ్యాఖ్యానాలు అలానే ఉంచేస్తున్నాను. :)
లెక్కలు ఉన్న టపా బాగాలేదంటే, మీకు లెక్కలు రావేమో అనుకోవచ్చు జనాలు జాగ్రత్త :)
నాకిద్దరు సహవాసులుండేవారు, వారికి కూడా మట్లాడితే వాంతి వచ్చేది. దానికి కారణం మీ వ్యక్తిత్వంలో OCEAN model లోని O తక్కువ ఉండడం వల్ల. అది చెడేంకాదు, నలుగురూ నాలుగు రకాలు గా మరి లోకంలో. :)
మీ వ్యాఖ్యానాలు మాకు అమూల్యం, మీ అభిప్రాయాలు ఇలానే తెలుపుతూంటారని అశిస్తున్నాను :)
@ రవిగారు
ReplyDeleteనేను మంచి వ్యాసంగా పరిగణించడానికి అవి
౧) ఉత్త ఊరి పేజీలు అయి ఉండకూడదు.
౨) సినిమా పేజీ అయితే, పక్కనున్న పట్టీ తో బాటూ, కొంత టెక్స్టు ఉండాలి.
౩) మిగతా వ్యాసాలలో, మరీ రెండు లైన్లు మాత్రమే ఉన్నవి, లేద ఒక బొమ్మ మాత్రమే ఉన్నవి అయ్యిండకూడదు.
ఇంకో విషయం ఏమిటంటే, మీరు మీ అనాలెసిస్ కి వేరే నాణ్యతా నియమాలు వాడవచ్చు, నేను మంచి వ్యాసాలు ఎన్నున్నాయో తెలుసుకోవడానికి ఒక పద్ధతిని వివరించాను, అంతే.
రాకేశ్వర్ గారు, ఇదే నా మెదటి బ్లాగు పోష్ట్. మెదటి సారి రాసి క్లిక్ కొట్టినప్పుడు విషయం కనిపించలేదు. రెండొ సారి క్లిక్ కొట్టాను విషయం రెండు సార్లు పడింది.మీరు రాసింది ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. తెలుగు అంకెలు అరభిక అంకెలుగా మార్చాను అయినా ఫలితం శూన్యం. ఇంకొకటి అవ్వ వచ్చు నకు గణిత శస్త్రం తొ ప్రవేశం లేదు. అందువల్ల అర్థం అయ్యి ఉండకపోవచ్చు.
ReplyDeleteఇప్పటి వరకు నాకు బ్లాగు లేదు, నాకు ఎలాగు అంత సృజనాత్మక శక్తి లేదు కదా బ్లాగు చేయడం నావల్ల కాదు అని ఉపేక్షించాను. కాని మీ బ్లాగు చూశాక నాకో బ్లాగు లేదు, మీబ్లాగు చూసాక నేను కూదా ఒక బ్లాగు చేయ్యాలి అనే అలోచన కలిగింది. ఒక కుళ్ళు జోకు తొ బ్లాగు తయారు చేశాను. మీఅందరి సహాయం ఉంటే మీరందరి బ్లాగు లింకు పెట్టుకొంటాను.
ఇంతకి బ్లాగు లొ ఏమిరాయాలి ఏమి రాయకూడదు. చెప్పండి.
రాకేశ్వర ఏం నాయన ఏ మధ్య బ్లాగు రాయడం లేదు తీరిక లేదా ఆలోచలను రావడం లేదా? సరే ఏమైన నువ్వు నేర్పించిన ప్రక్క బారు లొ నొక్కే ఆట బాగుంది, ఖాళి దొరికినప్పుడల్లా ఆడుతున్నాను మంఛి ఆటా నేర్పించావు
ReplyDelete