మీ అంతర్జాల సంచారిణీ, మీ ఇష్టం. మీకేమో తెలుగిష్టం.
కాబట్టి మీ అం.సం. కి మీకు తెలుగులో వలలు చూపించమని చెప్పండి. అప్పుడు మీకు తెలుగు వెర్షన్ ఉన్న సైట్లు తెలుగులో వస్తాయి. గూగుల్ వంటివి.
Internet Explorer 7 తెరవండి.
Tools కి వెళ్ళండి.
Internet Options పై వత్తండి.
అందులో General Tab లో Appearance వర్గంలో Languages పై వత్తండి.
అందు Add... నొక్కండి.
పట్టీలో Telugu [te-IN] మీద వత్తి OK వత్తండి.
వెనక్కి వచ్చిన తరువాత Telugu [te-IN] మీద మూషికం వత్తి Move Up బొత్తాన్ని వత్తండి.
OK వత్తండి. ఆ కిటికీ మూసుకుంటుంది.
దాని మాతృ కిటికీలో కూడా OK వత్తండి.
ఇప్పుడు మన గూగులమ్మ ఇంటికి వెళ్ళండి.
ఠ ఢఁ ....
తెలుగులో గూగండి !
త.రా : హలో.. ఎంటి చదివి టపుక్కున జారుకుంటున్నారు ? వ్రాసింది చదివి ఓహో అనుకుంటానికి కాదు. ఇప్పుడే IE లో సెట్టింగ్సు మార్చండి. లేకపోతే నేను బాధపడతాను !
తత్. త. రా : దీని గురించి వీవెన్ గారు ఎప్పుడో వ్రాసారని ఇప్పుడే గమనించాను! ఆయనైతే బొమ్మలు కూడా పెట్టారు! కానీ నాకెందుకో మంటనక్క గూగుల్ ని తెలుగులో చూపించదు. కాని ఐయ్యి చూపిస్తుంది !
అదేంటండీ.. మంటనక్కలో గూగుల్.కో.ఇన్ ఓపెన్ చేసి తెలుగు మీద నొక్కితే నాకు తెలుగులోనే చూపిస్తోందే మరీ...
ReplyDeleteచంద్రా గారు,
ReplyDeleteGoogle (iGoogle కాదు) classic home అంటే www.google.com కి వెళితే, ఇంతకు ముందు ఆంగ్లంలో వచ్చేది. ఇప్పుడు అది తెలుగులో వస్తుంది IE లో by defaultచ అంటే కో.ఇన్ కి వెళ్ళక్కరలేకుండానే.
కాని మంటనక్కలో నేను బాషాభీష్టాలు మార్చినా అది గూగుల్.కాం ని ఆంగ్లంలోనే చూపిస్తుంది.